Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్ వేర్ ఉండడంతో ఈ కంపెనీ తన సేల్స్ లో రాణిస్తోంది. అయితే ఇటీవల ఈ ఫోన్లపై భారీ ఆఫర్ ప్రకటించారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ Flipkart శాంసంగ్ మొబైల్ పై ఏకంగా రూ.18,000 వరకు తగ్గింపును చేశారు. ధర తక్కువ అయినప్పటికీ ఈ మొబైల్ లో ఉండే ఫీచర్లతో దీనిని కొనేందుకు ఎగబడుతున్నారు. ఇంతకీ ఇది ఏ ఫోన్? దీనిపై ఎంతవరకు తగ్గింపును ప్రకటించారు?
Samsung నుంచి Galaxy S25 మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.74,999తో విక్రయిస్తున్నారు. ప్రీమియం ఫోన్లు కొనేవారికి ఇది బెస్ట్ ఫోన్. అయినప్పటికీ దీనిపై ప్లిఫ్ కార్ట్ 24 వాతం ప్లాట్ డిస్కౌంట్ న ప్రకటించింది. దీంతో దీనిని ఇప్పుడు రూ.56,999కే పొందవచ్చు. శాంసంగ్ ప్రియులకు ఇది మంచి అవకాశం అని మొబైల్ కంపెనీలు పేర్కొంటున్నారు.
Samsung Galaxy S25 మొబైల్ లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6.2 అంగుళాల ఫుల్ హెచ్ డి ప్లస్ డైనమిక్ AMOLED డిస్ప్లే అందించారు. ఇది 120 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ తో పనిచేయడం వల్ల స్క్రోలింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. అలాగే ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉండడంతో వేగవంతమైన వర్క్ కోసం అనుకూలంగా ఉంటుంది. దీనితో పాటు ఇందులో 12 జీబీ ర్యామ్ ను ఉంచారు. ఫలితంగా మల్టీ టాస్కింగ్ గా యూస్ చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది.
ఈ మొబైల్ లో కెమెరా పనితీరు ఆకట్టుకుంటుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంచారు. అలాగే 12 ఎంపీ అల్ట్రా వైడ్ ఆప్టికల్ జూమ్ తో కూడిన 10 ఎంపీ టెలిఫోటో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్పీలు, వీడియో కాలింగ్ కోసం 12 ఎంపీ కెమెరా ఉంటుంది. కెమెరా మాత్రమే కాకుండా భారీ బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంది. ఇందులో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. దీనికి వైర్ లెస్ చార్జింగ్ కూడా సపోర్టుగా ఉంటుంది. వీటితో పాటు ఏఐ ఫీచర్లతో 7 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్ ను అందిస్తుంది.
Samsung Galaxy S25 ఫోన్ పై ప్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. SBI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరింత క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. అలాగే పాత ఫోన్ ఇస్తే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వర్తిస్తుంది. అంతేకాకుండా ప్రీమియం ఫ్లాగ్ ఫిఫ్ ఫోన్ కూడా తక్కువ ధరకు పొందవచ్చు.