Homeఆంధ్రప్రదేశ్‌Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ – ఉత్తర ఒడిస్సా తీరాల సమీపంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాబోయే రెండు రోజుల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది. అయితే ఏపీపై చాలా తక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాకపోయినా.. ఉత్తరాంధ్రకు మాత్రమే ఈ ప్రభావం ఉండనుంది.

పిడుగులతో కూడిన వాన..
అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అంచనా. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది.

రుతుపవనాల విస్తరణ..
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు మళ్లీ విస్తరిస్తున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటిస్తోంది. దీంతోపాటు ఉపరితల ఆవర్తనాల ప్రభావం ప్రారంభం కానుంది. అదే జరిగితే వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ఆశాజనకంగా పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. జూన్లో కనీస స్థాయిలో వర్షాలు పడలేదు. జూలైలో సైతం వర్షాల జాడలేదు. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. వాటి విస్తరణ కూడా ఆశాజనకంగా లేదు. అయితే ఇప్పుడు రుతుపవనాలు మరోసారి విస్తరించిన నేపథ్యంలో.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలతో వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రైతులు ఖరీఫ్ పై ఆశలు పెట్టుకున్నారు. మరి వరుణ దేవుడు ఎంతవరకు సహకరిస్తాడో చూడాలి..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

TDP MLA: మారుతున్న టిడిపి ఎమ్మెల్యే వైఖరి.. ఏంటి కథ?!

TDP MLA: తెలుగుదేశం పార్టీకి వీర విధేయులైన నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ కష్టకాలంలో సైతం వెన్నంటి నడిచిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో బోండా ఉమామహేశ్వరరావు ఒకరు. విజయవాడకు చెందిన...

Newtons Third Law: న్యూటన్స్ థర్డ్ లా మూవీ ట్రైలర్ రివ్యూ..

Newtons Third Law: సమంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడు. ఆ మూవీని కల్ట్ క్లాసికల్...

Corona alert in AP: ఏపీలో కరోనా అలెర్ట్.. ఒక్క రోజులోనే పది!

Corona alert in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వేరియంట్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో పది కేసులు నమోదు కావడం గమనార్హం....

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...
Oktelugu Epaper
Exit mobile version