spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. నగిరి లో ఏవో ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరై అటు నుంచి అటే చెన్నైకు వెళ్తున్నారు. చివరకు పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదు. అకస్మాత్తుగా ఆమె వైఖరి మారడంపై అనేక రకాలుగా చర్చ నడుస్తోంది. ఆమె రాజకీయాలకు దూరమవుతారు అనే చర్చ బలంగా వినిపిస్తోంది.

* చాలా రకాలుగా ప్రచారం..
గత ఎన్నికల ఫలితాల తరువాత మాజీ మంత్రి రోజాపై రకరకాలుగా ప్రచారం నడిచింది. ఆమె రాజకీయాలకు దూరమవుతారని కూడా టాక్ వచ్చింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. పార్టీలో చాలా యాక్టివ్ గా ఉంటూ కూటమి ప్రభుత్వంపై ఆమె విమర్శలు చేస్తూ వచ్చారు. మధ్య మధ్యలో పాత వాయిస్ కూడా వినిపించారు. కానీ సడన్ గా గత కొన్ని నెలలుగా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు, మీడియా ముందుకు రాకుండా దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం చెన్నైలో సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె నటించిన ఓ సినిమా విడుదలకు సిద్ధమైనట్లు కూడా సమాచారం.

* అకస్మాత్తుగా సైలెన్స్..
అయితే ఎంత బిజీగా ఉన్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు మాత్రం ఆమె హాజరవుతూ వచ్చేవారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు వెనుకడుగు వేసే వారు కాదు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సైలెంట్ అయిపోవడంపై వైసీపీ వర్గాల్లోనూ, నగిరి పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర చర్చ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో ఆమె క్రీడల శాఖ మంత్రిగా వ్యవహరించారు. అప్పట్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో ఓ 100 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విజిలెన్స్ విచారణ కూడా పూర్తయింది. రోజా అరెస్టు కూడా ఉంటుందని టాక్ నడిచింది. అయితే ఆ కేసుకు భయపడి రోజా పొలిటికల్ సైలెన్స్ పాటిస్తున్నారని.. ట్విట్టర్ పోస్టులకే పరిమితమవుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

* రాజకీయాలపై విముఖత..
రాజకీయాల పట్ల రోజా పూర్తిగా విముఖతతో ఉన్నారని ప్రచారం ఉంది. లేనిపోని వివాదాలు తెచ్చుకోవడం కంటే సినీ రంగంలో మళ్లీ నిలదొక్కుకోవడం మేలు అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో తాను సక్సెస్ అయిన సినిమాలు, టీవీ యాంకరింగ్, రియాలిటీ షోల ద్వారా మళ్లీ గ్లామర్ ఫీల్డ్ లో బిజీ అయిపోవాలని.. ఆర్థికంగా, వ్యక్తిగతంగా స్థిరపడాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...
Oktelugu Epaper
Exit mobile version