
చికెన్ తినడాన్ని ఇష్టపడేవాళ్లు బ్రాయిలర్ కోడితో తయారు చేసిన చికెన్ కంటే నాటు కోడితో తయారు చేసిన చికెన్ నే ఎక్కువగా ఇష్టపడతారు. నాటుకోళ్లలో వేర్వేరు కోళ్లు ఉండగా ఆ కోళ్లలో కడక్‌నాథ్ కోళ్లతో తయారు చేసిన చికెన్ ఎంతో రుచిగా ఉంటుంది. కడక్ నాథ్ కోళ్లు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి. ఈ కోడి మాంసం కిలో ఏకంగా 1,200 రూపాయలు కావడం గమనార్హం. అయితే ధర ఎక్కువైనా మాంసం ఎంతో రుచిగా ఉంటుంది కాబట్టి ఈ కోడి మాంసానికి మంచి డిమాండ్ ఉంది.
Also Read: బియ్యపుపిండితో ముగ్గు వేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?
హైదరాబాద్ మార్కెట్ లో ఈ కోళ్ల మాంసం 1,000 రూపాయల నుంచి 1,200 రూపాయల వరకు పలుకుతోంది. మటన్ ఖరీదు కంటే ఎక్కువే అయినా ఒకసారి ఈ కోడి మాంసం తింటే మళ్లీమళ్లీ తినాలని అనిపించేంత రుచిగా ఉంటుంది. అతి తక్కువ కొవ్వు ఉండే కడక్ నాథ్ కోళ్ల చికెన్ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. మాంసాహార ప్రియులు కడక్ నాథ్ చికెన్ కోసం వెయ్యి రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు.
Also Read: కిడ్నీల్లో రాళ్ళతో బాధ పడుతున్నారా.. తినకూడని ఆహారాలివే..?
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలలో మాత్రమే కడక్‌నాథ్ జాతి కోళ్లు లభ్యమవుతాయి. కడక్‌నాథ్ కోళ్ల గుడ్లు ముదురు కాఫీరంగులో మరియు పింక్ కలర్‌లో ఉంటాయి. ఈ కోడి గుడ్ల ధర సాధారణ గుడ్ల ధరలతో పోలిస్తే ఎక్కువగానే ఉంటుంది. ధర కాస్త ఎక్కువే అయినా చికెన్ ప్రియులు కడక్ నాథ్ కోడి మాంసం రుచిగా ఉండటం వల్ల ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
హైదరాబాద్ నగరంలోని కొంతమంది వ్యాపారులు మాత్రమే ఈ ప్రత్యేక జాతి కోడి మాంసాన్ని విక్రయిస్తున్నారు. జలుబు సమస్యతో బాధ పడేవాళ్లు కడక్ నాథ్ కోడి చికెన్ ను తింటే ఆ సమస్య దూరమవుతుంది. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఈ కోళ్ల మాంసం లభ్యమవుతోంది.