Homeటాప్ స్టోరీస్cat love story : అనగనగా ఒక మగ పిల్లి.. ఆడ పిల్లిని చూసి మనసు...

cat love story : అనగనగా ఒక మగ పిల్లి.. ఆడ పిల్లిని చూసి మనసు పడింది.. సీన్ కట్ చేస్తే రెండు కుటుంబాలు, పోలీసులు..

cat love story : పిట్టల మధ్య పోరును పిల్లి తీర్చిందని చిన్నప్పుడు చదువుకున్నాం కదా.. ఈ ఆధునిక కాలంలో రెండు పిల్లుల మధ్య ఏర్పడిన బంధం నిజంగానే పోరుకు దారితీసింది. అది కాస్త పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. చివరికి పోలీసులు తమదైన శైలిలో తీర్పు చెప్పడంతో.. రెండు పిల్లుల కథ.. సినిమా కథను మించిపోయింది. అది బెంగళూరు.. శేషాద్రిపురం జయ భీమ నగర్. ఈ ప్రాంతంలో రెండు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఓ కుటుంబం […]

cat love story : పిట్టల మధ్య పోరును పిల్లి తీర్చిందని చిన్నప్పుడు చదువుకున్నాం కదా.. ఈ ఆధునిక కాలంలో రెండు పిల్లుల మధ్య ఏర్పడిన బంధం నిజంగానే పోరుకు దారితీసింది. అది కాస్త పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. చివరికి పోలీసులు తమదైన శైలిలో తీర్పు చెప్పడంతో.. రెండు పిల్లుల కథ.. సినిమా కథను మించిపోయింది.

అది బెంగళూరు.. శేషాద్రిపురం జయ భీమ నగర్. ఈ ప్రాంతంలో రెండు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఓ కుటుంబం వారు మగ పిల్లిని పెంచుకుంటున్నారు. మరో కుటుంబం వారు ఆడ పిల్లిని సాకుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ మగపిల్లి ఒకరోజు ఆడ పిల్లిని చూసింది. చూడగానే ఊరుకోదు కదా.. దానిలో మగతనం సెగలు కక్కింది. ఆడ పిల్లి మీద మనసు పడింది. ఇంకేముంది ఓ శుభ ముహూర్తంలో ఆడ పిల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తానికి అవి రెండు అమ్మ నాన్న ఆట ఆడుకున్నాయి. సీన్ కట్ చేస్తే ఆడపిల్లి గర్భం దాల్చింది..

గర్భం దాల్చిన ఆడ పిల్లికి మగ పిల్లి తనకు పెట్టిన ఆహార పదార్థాలను తీసుకొచ్చేది. ఆడ పిల్లి వాటిని సంతృప్తిగా తినేది. ఈ లోగానే ఆడ పిల్లి ప్రసవించింది. నాలుగు పిల్లలను పెట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆడ పిల్లిని చూసుకోవడమే కష్టంగా ఉందనుకున్న ఆ కుటుంబానికి.. మరో నాలుగు పిల్లలు తోడు కావడంతో తట్టుకోలేకపోయింది. దీంతో ఆ మగపిల్లి కుటుంబం మీద దూషణకు దిగింది..

“మీ మగ పిల్లి వల్లే మా ఆడపిల్లి గర్భం దాల్చింది. నాలుగు పిల్లలను కనింది. ఆ నాలుగు పిల్లలను సాకే బాధ్యత మీదే” అంటూ ఆ ఆడపిల్లి ని పెంచుకుంటున్న కుటుంబం.. దూషణకు దిగింది. అంతేకాదు ఆడ పిల్లిని, దాని పిల్లలను వారి ఇంట్లో పడేసింది. దీంతో మగ పిల్లిని పెంచుకుంటున్న కుటుంబ సభ్యులు దూషణకు దిగారు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. చెరి 2 పిల్లి పిల్లలను ఇచ్చి సాదుకోమన్నారు. మొత్తానికి మగ పిల్లి, ఆడపిల్లి వల్ల జరిగిన రగడను పోలీసులు ఈ విధంగా తీర్చారు. దీంతో కథ సుఖాంతమైంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper