Homeఆంధ్రప్రదేశ్‌Pawan kalyan Konaseema : వైసీపీ ఎమ్మెల్సీ చేసిన హత్యను పక్కదోవ పట్టించడానికే కోనసీమ అల్లర్లు:...

Pawan kalyan Konaseema : వైసీపీ ఎమ్మెల్సీ చేసిన హత్యను పక్కదోవ పట్టించడానికే కోనసీమ అల్లర్లు: పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్

Pawan kalyan Konaseema : ఏపీని అట్టుడికిస్తున్న‘కోనసీమ’ వివాదంపై జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ఈ మొత్తం వివాదానికి అసలు కారణం వైసీపీనేనని అన్నారు. వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేలపై వాళ్లకు వాళ్లే సానుభూతి కోసం దాడులు చేసుకున్నారని పవన్ ఆరోపించారు. కులాల మధ్య గొడవలు రాజేసి రాజకీయంగా లబ్ధిపొందడానికే వైసీపీ ఈ ప్లాన్ చేసిందని ఆరోపించారు. అంతే కాదు.. కోనసీమ జిల్లా వివాదానికి ‘రెఫరెండమే’ పరిష్కారం అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

దేశం, ప్రపంచం మొత్తం కీర్తిస్తున్న అంబేద్కర్ ను ఒక జిల్లాకు పరిమితం చేయడం ఆయన స్థాయిని దిగజార్చడమేనని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సహా అన్ని దళితుల పథకాలకు వైసీపీ ప్రభుత్వం ఆయన పేరు పెట్టి గౌరవించవచ్చని తెలిపారు. ఇక దళితుల సాధికారిత చేస్తే అంబేద్కర్ కు గౌరవం ఇచ్చినట్టేనని అన్నారు. అవేవీ చేయకుండా అంబేద్కర్ ను రాజకీయంగా వాడుకోవడం ఏంటని పవన్ ప్రశ్నించారు.

కోనసీమలో కావాలనే సానుభూతి కోసం వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేసుకున్నారని.. అంత పెద్ద పోలీస్ వ్యవస్థ ఉండగా ఈ దాడులు చూస్తుంటే వైసీపీ కావాలనే చేసిన కుట్రగా తెలుస్తోందని పవన్ కళ్యాన్ ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు.. వైఫల్యాలను తెలియనీయకుండానే ఏపీలో కులాల మధ్యన చిచ్చుపెట్టారని పవన్ ఆరోపించారు. ‘కోనసీమ’కు ముందే ‘అంబేద్కర్’ పేరు పెడితే ఇంతటి వివాదం వచ్చేదా? అని పవన్ ప్రశ్నించారు. నెల తర్వాత జీవో ఇచ్చి.. మళ్లీ దానిపై అభ్యంతరాలకు నెల గడువు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అన్నమయ్య, సత్యసాయి, ఎన్టీఆర్ ల పేర్లు పెట్టినప్పుడే దీనికి పెడితే ఇంతటి ఉపద్రవం వచ్చేది కాదని.. ఇదంతా వైసీపీ ఆడుతున్న రాజకీయ గేమ్ అంటూ పవన్ ఆరోపించారు.

కోనసీమ వివాదాన్ని వైసీపీనే ప్రణాళికబద్దంగా చేసిందని పవన్ ఆరోపించారు. ఇలా గొడవలు జరిపి ఆ నెపాన్ని జనసేనపై నెడుతోందని.. పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పవన్ ప్రశ్నలతోనే ప్రజల ముందు నిజాలు ఉంచారు. ప్రజల మధ్య వైసీపీ చిచ్చుపెడుతోందని అన్నారు.

ఏపీలో కుల రాజకీయాలు నడుస్తున్నాయని.. కులాల మీదే వైసీపీ ఆటలు ఆడుతోందని.. ఇలా చేస్తే అసలు ఏపీలో అభివృద్ధి అన్నదే ఉండదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం వెళ్లాలి కానీ ఇలా కులాల గొడవల్లో తలదూర్చితే వారి భవిష్యత్ ఏమవుతుందని అన్నారు. యువతను సైతం పెడదోవపట్టిస్తున్నారని ఆరోపించారు.

వైసీపీ ఎమ్మెల్సీ చేసిన హత్యను పక్కదోవ పట్టించడానికే అల్లర్లను తెరపైకి తెచ్చారని.. ఈ సమయంలో అల్లర్లు జరగడానికి కారణం అదేనని పవన్ సంచలన ఆరోపణలు చేశారు. అమలాపురం ప్రజలు ఈ కుల గొడవలు,, వైసీపీ ఉచ్చులో పడిపోకుండా సంయమనం పాటించాలని సూచించారు.

LIVE: JanaSena Chief Sri Pawan Kalyan Press Meet || Dr. B.R. Ambedkar Konaseema District
కోనసీమ ఉద్రిక్తతలకు వైసీపీనే కారణం..|| Pawan Kalyan Blames YCP Govt over Amalapuram Incident
ఇది రావణకాష్టం ఎక్కడి దాకా వెళ్తుందో ఎవరికీ తెలియదు | Pawan Kalyan Reaction on Amalapuram Incident
కోనసీమ ఎందుకు రగులుతుంది ? || Analysis on Konaseema District Name Change Issue || View Point

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

3 COMMENTS

Comments are closed.

Exit mobile version