America against India : భారత్ ని ఇరికించాలని ఎందుకింతగా అమెరికా తాపత్రయ పడుతుంది?

భారత్ ని ఇరికించాలని ఎందుకింతగా అమెరికా తాపత్రయ పడుతుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : December 1, 2023 4:13 pm

America against India : గురుపక్వంత్ సింగ్ పన్ను.. ఖలిస్తానీ ఉగ్రవాదిగా భారత్ ప్రకటించింది. ఇతడికి అమెరికా, కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉంది. సిక్ ఫర్ జస్టిస్ అనే సంస్థను నడుపుతున్నాడు. న్యూఢిల్లీ ఎయిర్ పోర్టును పేల్చేస్తామని బెదిరిస్తున్నాడు. నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ఎవరూ ప్రయాణించకుండా చేస్తానన్నారు. ఎర్రకోటపై ఖలీస్తానీ జెండా ఎగురవేస్తే లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటిస్తాడు.

ఇంతటి ఉగ్రవాదికి అమెరికా ఎందుకు వెన్నుదన్నుగా నిలుస్తుందో అర్థం కావడం లేదు. పాకిస్తాన్ తో వీళ్లకు కనెక్షన్ ఉన్నాయి. అసలు ఖలీస్తానీకి రాజధాని అయిన లాహోర్ ను ఇందులో చేర్చకపోవడంతో దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని అర్థమవుతోంది. పాకిస్తాన్ ప్రోద్బలంతోనే అంతర్జాతీయంగా భారత్ పై కుట్ర సాగుతోందని తెలుస్తోంది.

పన్నుకు అమెరికా ఇంతగా ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకు అన్నది తెలియడం లేదు. అమెరికా కోర్టులో పన్నుకు వ్యతిరేకంగా భారత్ కుట్ర పన్నింది అని పిటీషన్ వేయడంతో అమెరికా ద్వంద్వ నీతి బయటపడింది.

భారత్ ని ఇరికించాలని ఎందుకింతగా అమెరికా తాపత్రయ పడుతుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.