https://oktelugu.com/

Maruti Swift: స్విప్ట్ ఇప్పుడు కొత్త తరహాలో.. త్వరలో లాంచ్? ఫీచర్స్ ఇలా ఉన్నాయి..

మారుతి స్విప్ట్ నుంచి 4వ జనరేషన్ కారు త్వరలో భారత్ మార్కెట్లోకి రానుంది. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పటికే దీనిని జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించారు.

Written By:
  • Srinivas
  • , Updated On : December 1, 2023 / 03:49 PM IST

    Maruti Swift

    Follow us on

    Maruti Swift: మారుతి కంపెనీ నుంచి కొత్త కారు వస్తుందంటే వినియోగదారులకు ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే అన్ని వర్గాల వారిని దృష్టిలో ఉంచుకొని ఈ కంపెనీ ఆకర్షణీయమైన మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటి వరకు మారుతి కంపెనీ నుంచి రిలీజ్ అయినా వ్యాగన్ ఆర్, బాలెనో తదితర కార్లు ఆకట్టుకున్నాయి. ఇక స్విప్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది ఇళ్లల్లో స్విప్ట్ కచ్చితంగా కనిపిస్తుంది. సరసమైన ధరతో పాటు మంచి ఫీచర్స్ కలిగిన స్విప్ట్ ను ఎక్కువ మంది సొంతం చేసుకున్నారు. అయితే ఈ మోడల్ ను ఇప్పుడు అధునీకరించి కొత్త తరహాలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

    మారుతి స్విప్ట్ నుంచి 4వ జనరేషన్ కారు త్వరలో భారత్ మార్కెట్లోకి రానుంది. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పటికే దీనిని జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించారు. అక్కడ మంచి రెస్పాన్స్ రావడంతో త్వరలో భారత్ లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కొత్త తరం స్విఫ్ట్ కు మెరుగైన హంగులు తీర్చిదిద్దారు. పవర్ ఫుల్ పవర్ ట్రెయిన్ తో పాటు వృత్తాకార గ్రిల్ , స్టైలిష్ ఎల్ ఈడీ ల్యాంపులు, డేట టైం రన్నింగ్ లైట్స్ ఉంటాయి. టెయిల్ గేట్, బపర్ లోనూ చాలా మార్పులు చేశారు.

    దీని స్పెషిఫికేషన్ విషయానికొస్తే 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. 9 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇనిస్ట్రుమెంట్ క్లస్టర్, పుష్ బటన్ తో పాటు క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ చేంజ్ సిస్టమ్ ను అమర్చారు. ఇప్పటి వరకు మారుతి నుంచి రిలీజ్ అయిన బాలెనో, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారాలకు తీసిపోని విధంగా కొత్త తరం స్విప్ట్ లో బెస్ట్ ఫీచర్స్ ఉంటాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

    2024లో ఈ మోడల్ ను రిలీజ్ చేస్తారని చెబుతున్నా.. అధికారికంగా మాత్రం ప్రకటించడం లేదు. దీంతో వనియోగదారులు దీని విడుదల విషయంలో అనుమానాలు పెంచుకుంటున్నారు. ఇప్పటి వరకు స్విప్ట్ ను కొనుగోలు చేసిన వారు 4వ జనరేషన్ స్విప్ట్ కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. అయితే ఫీచర్స్ మాత్రం ఆకట్టుకోవడం దీనిపై మనసు పారేసుకుంటున్నారు. మరోవైపు ధర విషయంలోక్లారిటీ ఇవ్వకపోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.