Virat Kohli: కోహ్లీకి షాకిచ్చిన బీసీసీఐ.. టీ20వరల్డ్ కప్ పై కీలక నిర్ణయం…

2024 టి20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఆడిన కూడా ఎంత వరకు ఇంపాక్ట్ చూపిస్తాడు అనే విషయం మీద క్లారిటీ లేదు అందుకే సీనియర్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లను బీసీసీఐ టి20 ఫార్మాట్ కి దూరం పెట్టనున్నట్టుగా చాలా వార్తలు వస్తున్నాయి.

Written By: Gopi, Updated On : December 1, 2023 4:25 pm

Virat Kohli

Follow us on

Virat Kohli: ఇండియన్ క్రికెట్ టీం పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఎప్పుడైతే ఇండియా వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్ గా మిగిలిందో ఇక అప్పట్నుంచి ఇండియన్ టీం లో వరుసగా మార్పులు,చేర్పులు చేస్తూ వస్తున్నారు ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా లో ఆడుతున్న t20 సిరీస్ కి కూడా బీసీసీఐ అనూహ్యంగా సూర్య కుమార్ యాదవ్ ని కెప్టెన్ గా చేసి ఆడిస్తుంది. ఇక ఈ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాతో ఆడబోయే మూడు ఫార్మాట్ల లో మూడు సీరీస్ ల కోసం ముగ్గురు కెప్టెన్లను ఎంపిక చేసి అందరికి షాక్ ఇచ్చింది.ఇక ఇదే క్రమంలో రోహిత్ శర్మ కూడా టి20 ఫార్మాట్ కి గుడ్ బై చెప్పబోతున్నాడు అనే వార్తలు కూడా పుష్కలంగా వస్తున్నాయి.

అయితే 2024 టి20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఆడిన కూడా ఎంత వరకు ఇంపాక్ట్ చూపిస్తాడు అనే విషయం మీద క్లారిటీ లేదు అందుకే సీనియర్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లను బీసీసీఐ టి20 ఫార్మాట్ కి దూరం పెట్టనున్నట్టుగా చాలా వార్తలు వస్తున్నాయి.ఇక ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు తెలియజేస్తున్న సమాచారం ప్రకారం తెలుస్తున్న విషయం ఏంటంటే విరాట్ కోహ్లీకి టి20 వరల్డ్ కప్ లో చోటు దక్కే అవకాశం లేదు అన్నట్టుగా పలు మీడియా సంస్థలు పలు రకాల కథనాలను వెలువరిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ టీం లో యంగ్ ప్లేయర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం అలాగే ఐపీఎల్ లో చాలామంది ప్లేయర్లు వాళ్ళ అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ ఇండియన్ టీం లో ఛాన్స్ కోసం ఎదురుచూస్తూ ఉండడం ఇక ఇదే క్రమం లో కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్లను పక్కన పెడితేనే మంచిది అని పలువురు క్రికెట్ మేధావులు సైతం భావిస్తున్నారు.

ఇక ఇవన్నీ గమనించిన బీసీసీఐ వీళ్ళ మీద ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే క్రమంలో ఇండియన్ టీం లో ఏం జరగబోతుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఇప్పటికే ఈ సంవత్సరం డబ్ల్యూటీసి ఫైనల్ లో ఓడిపోయిన ఇండియన్ టీం వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఓడిపోయి ఇండియన్ క్రికెట్ అభిమానుల్లో తీవ్ర నిరాశను మిగిల్చింది.
వచ్చే సంవత్సరం జరిగే టి 20 వరల్డ్ కప్ లో ఇండియన్ టీం తమ సత్తా చాటి ఎలాగైనా టి20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవాలని ఆశతో ముందడుగు వేస్తుంది. అందుకే దానికి సంబంధించిన సర్వం సిద్ధం చేస్తూ ఇప్పటినుంచే పోటీని రసవత్తరం చేసే ప్రయత్నం అయితే చేస్తుంది.

అందుకే బీసీసీఐ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా అందులో సీనియర్ ప్లేయర్లు అయినా కోహ్లీ మీద భారీ ఎఫెక్ట్ పడబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే యంగ్ ప్లేయర్లు అయిన యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్ ఇద్దరూ కూడా తనదైన రీతిలో పర్ఫామెన్స్ ఇవ్వడంతో విరాట్ కోహ్లీకి అవకాశాలు లేకుండా పోతున్నాయి అయితే ఈ విషయం మీద బీసీసీఐ మరొకసారి ఆలోచించి తన పూర్తి నిర్ణయాన్ని తెలియజేసే అవకాశం అయితే ఉంది…