https://oktelugu.com/

ఎస్బీఐ సంచలన నిర్ణయం.. ఇతర బ్యాంకుల కస్టమర్లకు శుభవార్త..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తకొత్త నిర్ణయాలను అమలులోకి తెస్తూ కస్టమర్లకు ప్రయోజనం ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. తాజగా ఎస్బీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ తీసుకున్న కొత్త నిర్ణయం ద్వారా ఆ బ్యాంక్ కస్టమర్లతో పాటు ఇతర బ్యాంకుల కస్టమర్లకు సైతం ప్రయోజనం చేకూరుతోంది. కొన్ని రోజుల క్రితం ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ ఐ మొబైల్ పే యాప్ ద్వారా ఇతర బ్యాంకు కస్టమర్లకు సైతం ప్రయోజనం కలిగేలా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 10, 2020 / 04:29 PM IST
    Follow us on


    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తకొత్త నిర్ణయాలను అమలులోకి తెస్తూ కస్టమర్లకు ప్రయోజనం ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. తాజగా ఎస్బీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ తీసుకున్న కొత్త నిర్ణయం ద్వారా ఆ బ్యాంక్ కస్టమర్లతో పాటు ఇతర బ్యాంకుల కస్టమర్లకు సైతం ప్రయోజనం చేకూరుతోంది. కొన్ని రోజుల క్రితం ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ ఐ మొబైల్ పే యాప్ ద్వారా ఇతర బ్యాంకు కస్టమర్లకు సైతం ప్రయోజనం కలిగేలా చేసిన సంగతి తెలిసిందే.

    Also Read: డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా.. చేయకూడని తప్పులివే..?

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం అదే విధంగా యోనో ఫ్లాట్ ఫామ్ ద్వారా ఇతర బ్యాంకులకు చెందిన కస్టమర్లు యోనోను ఉపయోగించి బ్యాంకు చెల్లింపులు చేసే విధంగా యోనో యాప్ లో మార్పులు చేర్పులు చేస్తోంది. డిజిటల్ పేమెంట్స్ లావాదేవీలలో ఎస్బీఐ కొత్త అడుగు వేస్తూ బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి కస్టమర్ కు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. దేశంలోని ప్రధాన బ్యాంకులు తమ యాప్ ల ద్వారా అన్ని రకాల చెల్లింపులు జరిగేలా మార్పులు చేస్తున్నాయి.

    Also Read: గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై మూడు ఆఫర్లు.. ఎలా పొందాలంటే..?

    అన్ని బ్యాంకులకు యూపీఐ చెల్లింపులు జరిగేలా చేస్తూ సులభతర లావాదేవీలను ప్రోత్సహించే దిశగా ఎస్బీఐ అడుగులు వేస్తోంది. మరో 30 రోజుల్లో దేశంలో అన్ని బ్యాంకుల ఖాతాదారులకు ఎస్బీఐ ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ సీఎస్ శెట్టి ఈ విషయాలను వెల్లడించారు. భవిష్యత్తులో ఇతర బ్యాంకులు సైతం ఈ దిశగా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు కూడా వాటి యాప్స్ లో ఫీచర్లను అప్ డేట్ చేసి కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా చేయనున్నాయని తెలుస్తోంది. కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తే డిజిటల్ పేమెంట్స్ చేసే ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.