Homeక్రీడలుIndia vs pakistan : మాకు అంత సీన్ ఎక్కడిది భయ్యా... భారత్ ను ఓడించడం...

India vs pakistan : మాకు అంత సీన్ ఎక్కడిది భయ్యా… భారత్ ను ఓడించడం పాకిస్తాన్ వల్ల కానే కాదు..

అద్భుతం జరగలేదు. పాకిస్తాన్ కోరుకున్నట్టుగా టీమిండియా ఓడిపోలేదు. ఈసారి టీమిండియా గొప్పగా ఆడింది. బౌలింగ్ కు సహకరించే మైదానం మీద పరుగులు భారీగానే రాబట్టింది. తద్వారా పాకిస్తాన్ జట్టు ఎదుట భారీ టార్గెట్ విధించింది .

ఎప్పటి మాదిరిగానే ఈ టార్గెట్ ఫినిష్ చేయడంలో పాకిస్తాన్ తడబడింది. అంతేకాదు కేవలం 114 పరుగులకు మాత్రమే ఆల్ అవుట్ అయింది. భారత చేసిన 175 పరుగుల లక్ష్యానికి కొండంత దూరంలో నిలిచిపోయింది. ఏకంగా 61 పరుగుల తేడాతో దారుణమైన ఓటమిని మూట కట్టుకుంది . ఇటీవల స్వదేశంలో జరిగిన మూడు t20 మ్యాచ్ల సిరీస్లో ఆస్ట్రేలియాపై ఏక ఛత్రాధిపత్యాన్ని ప్రదర్శించిన పాకిస్తాన్ జట్టు.. భారత జట్టు విషయానికి వచ్చేసరికి మరొకసారి తలవంచింది.

2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది. ఆసియా కప్ లో అయితే ఏకంగా మూడుసార్లు ఓటమిపాలైంది. ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో మరో ఓటమిని నమోదు చేసింది పాకిస్తాన్ జట్టు. పాకిస్తాన్ జట్టు ఓడిపోయిన తర్వాత ఆ దేశపు అభిమానులు తీవ్రస్థాయిలో నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒక అభిమాని మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

“మా జట్టుకు అంత సీన్ లేదు. ఈ మ్యాచ్ చూసిన తర్వాత నాకు అనిపించింది. ఈసారి మా వాళ్ళు కాస్త బెటర్గా ఆడతారు అనుకున్నాను. ఓటమి తప్పించుకొని.. గెలుపును సొంతం చేసుకుంటారు అనుకున్నాను. కానీ అదేమీ జరగలేదు. బుమ్రా ను ఎదురుకోలేకపోయారు. హార్దిక్ పాండ్యా ను తట్టుకోలేకపోయారు. ఇషాన్ కిషన్ ను అడ్డుకోలేక పోయారు. ఇంకా చెప్పాలంటే.. మా వాళ్లు టీమ్ ఇండియాకు సరెండర్ అవుతూనే ఉన్నారు. ఈసారి కూడా అదే జరిగింది. ఇప్పట్లో మా వాళ్లు భారత జట్టును ఓడించలేరు. ఇదే ఆట తీరు కొనసాగిస్తే మాత్రం. టీమ్ ఇండియాను ఎప్పటికీ పాకిస్తాన్ జట్టు నిలువరించలేదు. భారత జట్టు చేతిలో ఓడిపోయిన తర్వాత ఇబ్బందిగా ఉంది. ఈ ఓటమి మాకు అలవాటయింది. భారత జట్టుతో మ్యాచ్ అనగానే మైదానంలోకి రావడం.. మా ఆటగాళ్ల చెత్త ప్రదర్శన చూసి ఇంటికి వెళ్లిపోవడం పరిపాటిగా మారిందని” పాకిస్తాన్ అభిమాని నిర్వేదం వ్యక్తం చేశాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version