https://oktelugu.com/

నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక.. టీఆర్ఎస్ నుంచి బరిలో దిగేది ఎవరు?

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కొల్పోయి బొక్కాబొర్లా పడింది. ఈ ఎన్నికను టీఆర్ఎస్ గుణపాఠంగా తీసుకొని నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో గులాబీ బాస్ ఉన్నారు. దీంతో నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారడం ఖాయంగా కన్పిస్తోంది. Also Read: కేసీఆర్, మోడీకి మళ్లీ విధేయుడవుతారా..? నాగార్జున్ సాగర్లో బీజేపీ ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతోంది. ఇతర […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 10, 2020 7:35 pm
    TRS party
    Follow us on

    Kamareddy TRS

    దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కొల్పోయి బొక్కాబొర్లా పడింది. ఈ ఎన్నికను టీఆర్ఎస్ గుణపాఠంగా తీసుకొని నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో గులాబీ బాస్ ఉన్నారు. దీంతో నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారడం ఖాయంగా కన్పిస్తోంది.

    Also Read: కేసీఆర్, మోడీకి మళ్లీ విధేయుడవుతారా..?

    నాగార్జున్ సాగర్లో బీజేపీ ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతోంది. ఇతర పార్టీల నేతలను ఆ పార్టీలో చేర్చుకుంటోంది. దుబ్బాక ఫలితాన్నే నాగార్జున్ సాగర్లోనూ రిపీట్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈమేరకు కాంగ్రెస్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి గాలం వేస్తోంది. ఇదికానీ పక్షంలో ఈ స్థానంలో యాదవ్ వర్గానికి చెందిన నేతను బరిలో దింపాలని యత్నిస్తోంది.

    దుబ్బాక.. గ్రేటర్ ఫలితాల నేపథ్యంలో టీఆర్ఎస్ అలర్టయింది. దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థికి సానుభూతి పవనాలు కలిసి రాకపోగా వ్యతిరేకత వచ్చింది. దీంతో నాగార్జున్ సాగర్లో టీఆర్ఎస్ సెంటిమెంట్ ను పక్కన పెట్టి ప్రజల మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే నాగార్జున్ సాగర్లోని అన్ని మండలాల్లో క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ సర్వే చేపడుతోంది.

    నాగార్జున్ సాగర్లో నోముల నర్సింహాయ్య కుమారుడు నోముల భగత్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఆయన కొద్దినెలలుగా క్షేత్రస్థాయిలో యాక్టివ్ గా తిరుగుతున్నాడు. అలాగే నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి గత అసెంబ్లీలో ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపగా అధిష్టానం నోముల నర్సింహాయ్యకు అవకాశం కల్పించింది. దీంతో ఈసారి ఆయనకే సీటు ఇచ్చే అంశాన్ని కూడా టీఆర్ఎస్ ఆలోచిస్తుంది.

    Also Read: బీజేపీ వైపు తెలంగాణ ఉద్యోగ సంఘాల చూపు..!?

    వీరితపాటు స్థానిక టీఆర్‌ఎస్‌ నేత కోటిరెడ్డి.. ఎన్ఆర్ఐ గడ్డంపల్లి రవీందర్‌రెడ్డిలు నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి టీఆర్ఎస్ చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

    ఇదిలా ఉంటే ఈ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ వీరిలో ఎవరీ అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతారనేది ఆసక్తికరంగా మారింది. దుబ్బాకలో సానుభూతి సెంటిమెంట్ వర్కౌట్ కాకపోవడంతో సీఎం కేసీఆర్ నాగార్జున్ సాగర్ సీటుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్