https://oktelugu.com/

టీపీసీసీ అధ్యక్ష పదవిపై వీడని ఉత్కంఠ.. పదుల సంఖ్యలో ఆవావహులు..

తెలంగాణలో ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెప్ పార్టీ ఘోర పరాజయం పాలయింది. దీంతో మనోవేదనకు గురైర ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో తెలంగాణలో ఆ పార్టీ పగ్గాలు చేపట్టేదెవరోనన్న ఉత్కంఠ ఇంకా వీడలేదు. కాగా మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొందరు ఆశావహులు పీసీసీ పోస్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యవహారా ఇన్ చార్జిగా ఉన్న మానిక్కం ఠాగూర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 10, 2020 7:34 pm
    Follow us on

    Telangana Congress

    తెలంగాణలో ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెప్ పార్టీ ఘోర పరాజయం పాలయింది. దీంతో మనోవేదనకు గురైర ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో తెలంగాణలో ఆ పార్టీ పగ్గాలు చేపట్టేదెవరోనన్న ఉత్కంఠ ఇంకా వీడలేదు. కాగా మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొందరు ఆశావహులు పీసీసీ పోస్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యవహారా ఇన్ చార్జిగా ఉన్న మానిక్కం ఠాగూర్ కు టీపీసీసీ అధ్యక్షుడి కోసం వడివడిగా మంతనాలు జరుపుతున్నారు.

    Also Read: బీజేపీ వైపు తెలంగాణ ఉద్యోగ సంఘాల చూపు..!?

    దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ లేనంత ఎదురు దెబ్బ తగిలింది. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలోకి చేరింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండు చోట్ల మాత్రమే విజయం దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పార్టీ అధ్యక్షడు నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ పగ్గాలను విడిచిపెట్టారు. తెలంగాణలో టీఆర్ఎష్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఉండేది. కానీ బీజేపీ బలం పుంజుకోవడంతో కాంగ్రెస్ వెనుకబడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకొచ్చే నాయకుడి కోసం పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది.

    టీపీసీసీ పోస్టు కోసం ఇప్పటికే సీనియర్ నేత వీహెచ్ తాను అర్హుడునని ప్రకటించాడు. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ తమ ప్రయత్నాల్లో మునిగిపోయారు. అయితే తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న మానిక్కం ఠాగూర్ ఎవరికి అధ్యక్ష పదవి ఇవ్వాలనే విషయంపై గత రెండు రోజులుగా తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. ఈ పదవి కోసం పదుల సంఖ్యలో పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

    Also Read: నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక.. టీఆర్ఎస్ నుంచి బరిలో దిగేది ఎవరు?

    ఇక పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై ఠాగూర్ అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. ఎక్కువ శాతం నేతలు ఎవరికి వారే గొప్ప నాయకుడని చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ ను గట్టెక్కించాలంటే రేవంత్ రెడ్డి పేరును పలువురు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. దూకుడు, పదునైన వ్యాఖ్యలతో బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకుంది. ఇదే తరహాలో రేవంత్ రెడ్డి దూకుడు స్వభావంతో పార్టీ పటిష్టత పెరుగుతుందని అంటున్నారు. అయితే సీనియర్ నాయకులు మాత్రం రేవంత్ రెడ్డి పేరు ఎత్తడం లేదు. దీంతో మానిక్కం ఠాగూర్ చివరికి ఎవరికి అవకాశం ఇస్తాడో చూడాలి..

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్