Harish Shankar shocking comments: ‘ఓజీ’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి విడుదల కాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). ఎప్పుడో మూడేళ్ళ క్రితం , హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వం లో మొదలైన ఈ సినిమా , మధ్యలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల చాలా కాలం వరకు ఆగిపోయింది. అయితే ఉప ముఖ్యమంత్రి అయ్యాక , ఒక ఏడాది గ్యాప్ తీసుకొని , ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన షూటింగ్ మొత్తాన్ని గత ఏడాది పూర్తి చేసాడు పవన్ కళ్యాణ్. ఇక ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసి , ఎట్టకేలకు ఈ సినిమాని ఈనెల 26 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు విడుదలయ్యాయి. ఒక పాటకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రాగా, మరో పాటకు యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.
త్వరలోనే ఈ చిత్రం నుండి మూడవ పాట / లేదా టీజర్ విడుదల కాబోతుంది. ఇది కాసేపు పక్కన పెడితే, హరీష్ శంకర్ రీసెంట్ గానే ఈ సినిమా కోసం కొంతమంది క్రిటిక్స్ కలిసి కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాడు. ఇక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాదానాలు కొన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆయన మాట్లాడుతూ ‘ఇది ఫ్యాన్స్ కోసం మాత్రమే తీసిన సినిమా కాదు. అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేసి తీసిన చిత్రమిది. కేవలం ఫ్యాన్స్ కోసం సినిమాలు తీస్తే ఎవ్వరూ చూడరు. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా శ్రీలీల తో ఆయనకు ఉండే ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. గబ్బర్ సింగ్ లో కేవలం కొంత ఎమోషన్ ని మాత్రమే చూశారు . కానీ ఈ చిత్రం లో చాలా బలమైన ఎమోషన్స్ చూస్తారు ‘ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: ‘పెద్ది’ లోని ఇంటర్వెల్ సన్నివేశాన్ని లీక్ చేసేసిన రామ్ చరణ్.. కొంప ముంచేశాడుగా!
ఇకపోతే చాలా మంది ఈ చిత్రాన్ని తమిళ సూపర్ హిట్ ‘తేరి’ కి రీమేక్ అని అంటున్నారు, అందులో నిజమెంత అని అడిగిన ప్రశ్నకు హరీష్ శంకర్ సమాధానం చెప్తూ ‘గతంలో చాలా మంది ఎన్నో రీమేక్ సినిమాలు చేశారు. కానీ బహిరంగంగా ఇది రీమేక్ అని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ. కానీ నేను ‘గబ్బర్ సింగ్’ చిత్రం రీమేక్ కాబట్టి, నా పేరు పాడేటప్పుడు, మార్పులు చేర్పులు చేసింది హరీష్ శంకర్ అని వేసుకున్నాను. అలాంటి నేను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకవేళ రీమేక్ అయితే అలాగే వేస్తాను కదా, స్టోరీ, స్క్రీన్ ప్లే , డైరెక్షన్ హరీష్ శంకర్ అని ఎందుకు వేసుకుంటాను. తేరి చిత్రం లోనే గబ్బర్ సింగ్ కి సంబంధించిన అనేక సన్నివేశాలు రీ క్రియేట్ చేసి ఉంటుంది. అలాంటి సినిమాను నేనెందుకు రీమేక్ చేస్తాను’ అంటూ క్లారిటీ ఇచ్చాడు.
