Home Blog Page 97

'శ్రీ మంతుడు' సినిమాలో నమ్రత చేసిన ఆ మార్పు వల్లే సినిమా అంత పెద్ద హిట్ అయిందా..?

Srimanthudu Movie Success
Srimanthudu Movie Success

Srimanthudu Movie Success: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…కెరియర్ మొదట్లో ఆయన చేసిన సినిమాలు అతని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. అందుకే ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు ఎక్కడ తడబడకుండా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట సాధించబోయే విజయాలు మరొక వ్యక్తిగా మారబోతున్నాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘వారణాసి’ సినిమా మీదనే భారీ ఆశాలైతే పెట్టుకున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ఈ సినిమాకి సంబంధించిన తీవ్రమైన కసరతులైతే చేస్తున్నారు. ఎలాగైనా సరే సినిమాని అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో రాజమౌళి ముందుకు సాగుతున్నాడు.

తను అనుకున్నట్టుగానే ఈ మూవీ భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు ఎంటైర్ కెరియర్ లో చేసిన సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాల్లో శ్రీమంతుడు సినిమా ఒకటి…

ఇది నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డును కూడా బ్రేక్ చేసింది. అలాంటి శ్రీమంతుడు సినిమా సూపర్ సక్సెస్ అవ్వడానికి మహేష్ బాబు భార్య అయిన నమ్రత కూడా ఒక కారణమనే విషయం మనలో చాలామందికి తెలియదు. అయితే ఈ సినిమా కథని మొదట కొరటాల శివ నమ్రత కు చెప్పినప్పుడు ఆమె అందులో కొన్ని మార్పులు చేర్పులు చెప్పిందట. కొరటాల దానిని మార్పులు చేర్పులు చేసి మరి మహేష్ బాబు దగ్గరికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది.

ఇక హీరో ఫాదర్ కి తన ఊరికి సంబంధించిన సన్నివేశాలు ఎలా ఉంటే బాగుంటుంది అనేది నమ్రత డిసైడ్ చేసిందట. దానివల్ల ఈ సినిమా మీద వెయిటేజ్ అయితే ఎక్కువగా పెరిగిందని ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు చాలా వరకు ఎగ్జైట్ ఫీల్ అయ్యారు అంటూ చాలామంది చెబుతున్నారు. మొత్తానికైతే మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా సక్సెస్ ను సాధించడంలో కీలకపాత్ర వహించిందనేది వాస్తవం…

అల్లు అర్జున్ ను స్టార్ హీరోను చేసిన ఈ ముగ్గురు డైరెక్టర్లను పట్టించుకోవడం లేదా..?

Allu Arjun
Allu Arjun

Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ని మొదలుపెట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక ఇప్పటివరకు ఆయన డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లో ఫ్యాన్స్ లకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్క సినిమాలో తన స్టెప్పులతో కుర్రాలను ఉర్రూతలూగించిన ఘనత కూడా తనకే దక్కుతుంది. ఇక అలాంటి అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇంతకుముందు చేసిన పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఒక్కసారిగా టాప్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక ఇప్పుడు రాబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది…ఇక కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా అల్లు అర్జున్ కి ఒక ముగ్గురు దర్శకులు చాలా వరకు హెల్ప్ చేశారు. వాళ్ల వల్లే ఆయన టాప్ హీరోగా మారడనే విషయం చాలా మందికి తెలీదు. ఇంతకీ వాళ్ళు ఎవరు అంటే ఒకరు సుకుమార్ కాగా, మరొకరు పూరి జగన్నాథ్ కావడం విశేషం…

ఇక వీళ్ళతో పాటుగా త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి లాంటి వారు కూడా అలీ అర్జున్ తో చాలా మంచి సినిమాలు చేసి తనను టాప్ హీరోగా మార్చారు. అతనికి భారీ సక్సెస్ లను కట్టబెట్టిన ఘనత కూడా వాళ్ళకే దక్కుతుంది… ఇక రీసెంట్ గా సుకుమార్ తో పుష్ప సినిమా చేశాడు. ఇక త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

కానీ పూరి జగన్నాధ్, సురేందర్ రెడ్డి లను మాత్రం అల్లు అర్జున్ అసలు పట్టించుకోవడం లేదు. వీళ్ళు ఒకప్పుడు టాప్ హీరోలుగా కొనసాగారు. వాళ్ళతో సినిమా చేయడానికి అల్లు అర్జున్ చాలా రోజులపాటు వెయిట్ చేశాడు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. అతను టాప్ హీరోగా మారిపోయాడు కాబట్టి ఈ దర్శకులకు సినిమాలు ఇవ్వడానికి చాలా వరకు భయపడిపోతున్నాడు.

కారణం ఏంటంటే వాళ్ళు ఫామ్ లో లేరు. కాబట్టి సక్సెస్ ఫుల్ సినిమాలను చేస్తారా? లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. అందువల్లే ఆయన వాళ్లతో సినిమా చేసి రిస్క్ చేయాలనుకోవడం లేదు. దానికోసమే ఎవరు ఏమనుకున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళని పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది…

కాజల్ అందాలు.. ఆనందాలు

Kajal Aggarwal birthday
Kajal Aggarwal birthday

ఎన్టీఆర్ డ్రాగన్ తో హిట్ కొడితే రామ్ చరణ్ ను బీట్ చేస్తాడా..?

NTR Fans Anger
NTR Fans Anger

NTR Dragon Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేస్తున్న సినిమాల్లో ప్రతి సినిమా కూడా తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసి పెట్టినవే కావడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన మార్కును చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభాస్, అల్లుఅర్జున్ లాంటి నటులు ఇప్పటికే భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళుతుంటే రాంచరణ్ ఎన్టీఆర్ లాంటి వారు మాత్రం పూర్తిగా డీలాపడిపోతున్నారు. ఇక ఎలాగైనా సరే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం తమ స్టామినా ను చూపించాల్సిన అవసరమైతే ఉంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కి తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా లేదు. కాబట్టి ఆయన ఎలాగైనా సరే ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసినట్టుగా తెలుస్తుంది… ఇక ప్రస్తుతం ఆయన మొదట రామ్ చరణ్ రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు ఈ సినిమా భార్య కలెక్షన్స్ ను కొల్లగొడుతుందని అందరు అనుకున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ అయి 15 రోజులు దాటినా కూడా ఇప్పటివరకు భారీ కలెక్షన్స్ ను అందుకోలేకపోయింది.

కారణమేదైనా కూడా ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఔట్ పుట్ రాలేదని అందువల్లే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని సాధించలేక పోయిందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం… సినిమాలను రిపీటెడ్ గా చూసే ఆడియన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తాయి.

లేకపోతే మాత్రం ఒకసారి మాత్రమే ఆ సినిమాను చూసి వదిలేస్తే సినిమాకి అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ వచ్చే అవకాశాలు లేవని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు… ఇక పెద్ది సినిమాకి భారీ కలెక్షన్స్ రాకపోవడం తో జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధిస్తే రామ్ చరణ్ ను బీట్ చేసే అవకాశమైతే దొరికింది.

ఇప్పటికే డ్రాగన్ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంటే మాత్రం ఈజీగా 1000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టే అవకాశామైతే ఉందని ప్రతి ఒక్కరు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…

భారత్ ను తిడుతూ.. మోదీని పొగుడుతూ.. భారత్‌–అమెరికా సంబంధాల్లో కొత్త అధ్యాయం..

Donald Trump
Donald Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీని దేశాన్ని పెద్ద యుద్ధాలు, ప్రపంచ సంఘర్షణల నుండి దూరంగా ఉంచిన నాయకుడిగా ప్రశంసించారు. భారత్‌ ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా, ప్రపంచ వేదికపై మరింత ప్రభావవంతమైన పాత్ర పోషిస్తోందని గుర్తించారు. మోడీ 12 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉండటం ద్వారా స్థిరత్వాన్ని తీసుకొచ్చారని, ఆయనలో శాంతి బాహ్యంగా కనిపించినా అంతర్గతంగా దృఢమైన వ్యక్తిత్వం ఉందని వ్యాఖ్యానించారు. ఇది భారత నిరంతర వృద్ధి, వ్యూహాత్మక స్వాతంత్య్రం వైపు సాగుతున్న ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది.

వాణిజ్య వ్యవహారాలపై ట్రంప్‌ కఠిన వైఖరి..
గతంలో భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందాలు అమెరికాకు అనుకూలంగా లేవని, భారత్‌ ప్రయోజనం పొందిందని ట్రంప్‌ సూటిగా వ్యాఖ్యానించారు. అయితే, ఈ పరిస్థితిని భారత్‌ తప్పుగా చూడకుండా, అమెరికా మాజీ రాజకీయ నాయకులను తెలివి తక్కువ అని విమర్శించారు. గతంలో ఏర్పడిన అసమతుల్య వాణిజ్య వ్యవస్థకు భారత్‌ కాకుండా అమెరికా వైపు నుంచి బాధ్యత ఉందని స్పష్టం చేశారు. తాజాగా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఇప్పుడు సమాన స్థాయిలో, న్యాయబద్ధంగా నడుస్తున్నాయని ఆయన సూచించారు. గత అసమతుల్యత నుంచి ప్రస్తుత న్యాయమైన వ్యవహారాల వైపు మార్పు రెండు దేశాల సంబంధాలలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని సూచిస్తోంది.

మోడీ స్థిరత్వం, దృఢత్వం…
ట్రంప్‌ మోదీని శాంతి కనిపించినా దృఢమైన వ్యక్తిగా అభివర్ణించడం చర్చనీయాంశం. భారత్‌ గతంలో వివిధ నాయకులతో తరచూ మార్పులు చూసింది. ఇప్పుడు మోదీ నాయకత్వంలో దీర్ఘకాలిక స్థిరత్వం వచ్చింది. ఇది భారత్‌ సార్వభౌమ సామర్థ్యాల నిర్మాణం, విదేశాంగ విధానంలో సమతుల్య విధానం ఫలితంగా చూడవచ్చు. భారత్‌ ఇప్పుడు అమెరికాతో సమాన భాగస్వామిగా చర్చలు జరపగల సామర్థ్యం సాధించిందని చెబుతాయి. గతంలో ‘‘ప్రయోజనం పొందింది’’ అని చెప్పినా, ఇప్పుడు ‘‘న్యాయమైన వ్యాపారం’’ అని అంగీకరించడం భారత వృద్ధికి నిదర్శనం.

భారత్‌–అమెరికా భవిష్యత్‌ సంబంధాలు..
ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రశంస, విమర్శల మిశ్రమం. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలు ఇకపై ఒకరిపై ఒకరు ఆధారపడకుండా, పరస్పర లాభదాయకంగా ఉండాలనే అవసరాన్ని హైలైట్‌ చేస్తుంది. భారత్‌ యొక్క ఆర్థిక వృద్ధి, జనాభా బలం, వ్యూహాత్మక స్వాతంత్య్రం ఇప్పుడు అమెరికాకు కూడా ముఖ్యమైనవిగా మారాయి. గతంలో అసమతుల్యంగా ఉన్న వాణిజ్యం నుంచి ఇప్పుడు సమాన స్థాయిలోని భాగస్వామ్యం వైపు మార్పు వచ్చింది. ఇది భారత గ్లోబల్‌ స్థానం బలపడుతున్నట్లు చెబుతుంది. ట్రంప్‌ మోడీని ‘‘గొప్ప నాయకుడు’’ అని పదే పదే ప్రశంసించడం ఈ మార్పుకు సాక్ష్యం.

భారత్‌ ఇప్పుడు కేవలం వాణిజ్య భాగస్వామి కాదు ప్రపంచ సమస్యల పరిష్కారంలో కీలకం. ట్రంప్‌ వ్యాఖ్యలు ఈ వాస్తవాన్ని అమెరికా వైపు నుంచి∙గుర్తించినట్లు చెబుతాయి. రెండు దేశాల మధ్య సంబంధాలు ఇకపై మరింత బలమైన, సమతుల్యమైన దిశగా సాగే అవకాశం ఉంది.

రెండేళ్లు అలాంటి ఫుడ్ తిన్నా.. అందుకే ఇంత చిక్కిపోయా.. సమంత ఏమోషనల్ కామెంట్స్..

Maa Inti Bangaram 13 Days Collections
Maa Inti Bangaram 13 Days Collections

Samantha Emotional Comments: కొంతకాలం గ్యాప్ తర్వాత సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు కూడా భారీ రేంజ్ లో వచ్చాయి. అయితే ఈ చిత్రానికి ఇంతమంది ఓపెనింగ్స్ రావడానికి సమంత బ్రాండ్ ఇమేజ్, ప్రమోషనల్ కంటెంట్ తో పాటు, ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా ప్రధాన కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. విడుదలకు ముందు ఆమె ఆ రేంజ్ లో ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఒక్క రోజులో ఆమె దాదాపుగా 40 కి పైగా ఇంటర్వ్యూస్ ఇచ్చింది అంటేనే అర్థం చేసుకోవచ్చు , ప్రొమోషన్స్ కోసం ఆమె ఎంత కష్టపడింది అనేది చెప్పడానికి. అయితే ఒక ఇంటర్వ్యూ లో ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన కొన్ని మాటలు అభిమానులను em అయ్యేలా చేసింది .

ఆమె మాట్లాడుతూ ‘నేను అనారోగ్యంగా ఉన్న రోజుల్లో , ప్రతీ రోజు ఒకే రకమైన ఆహరం తీసుకునేదాన్ని. ఆ కారణం చేత నేను చాలా చిక్కిపోయాను. అందరూ నన్ను ఏంటి ఇంత చిక్కిపోయావు?, అసలు ఆహరం తీసుకుంటున్నావా అని అడిగేవారు. కానీ వాస్తవానికి ఆ సమయం లో నాకు ఆహరం తీసుకొని స్థితిలో ఉన్నాను, ఏ ఫుడ్ తీసుకున్నా నా కడుపుకి పడేది కాదు. మయోసిటిస్ తిరగబడేది. ఆ తర్వాత కొన్నాళ్ళకు డాక్టర్లు షుగర్ , డైరీ లేని ఐస్ క్రీం తినేందుకు డాక్టర్లు అనుమతిని ఇచ్చారు. ఇప్పుడు నా ఆరోగ్యం కాస్త కుదుట పడింది’ అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మయోసిటిస్ సోకినప్పుడు సమంత నిజంగా నరకాన్ని ప్రత్యక్షంగా చూసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఒక మహిళ అయ్యుండి అంతటి నరకాన్ని భరించి, ధైర్యం దాంతో పోరాడి , నేడు ఈ స్థాయిలో నిలబడడం అనేది సాధారణమైన విషయం అయితే కాదు. ప్రతీ మహిళ కూడా సమంత ని ఆదర్శంగా తీసుకోవాలి , కష్టాలు ఎదురైనప్పుడు వెనకడుగు వేయకూడదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈ సందర్భంగా కామెంట్స్ చేస్తూ , సమంత ని పొగడ్తల వర్షం లో ముంచెత్తారు. అలాంటి కష్టసమయం లో తనకు తన స్నేహితులు , రాజ్ నిడిమోరు వంటి వారు బలంగా వెన్నుముక లాగా నిలబడడం కూడా సమంత కోలుకునేందుకు దోహదపడింది అంటున్నారు నెటిజెన్స్.

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవారు... ఈ తప్పులు చేయకండి.. నష్టపోతారు...

Fixed Deposit Mistakes
Fixed Deposit Mistakes

Fixed Deposit Mistakes: మధ్యతరగతి ప్రజలకు అత్యంత సురక్షితమైన, నమ్మకమైన పెట్టుబడి మార్గం ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD). కష్టపడి సంపాదించిన డబ్బును భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవడానికి చాలామంది దీనినే ఎంచుకుంటారు. అయితే, ఈ ఎఫ్‌డీలు చేసేటప్పుడు అవగాహన లేకపోవడం వల్ల చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ, రావాల్సిన దానికంటే తక్కువ లాభాన్ని పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, ఎఫ్‌డీలు చేసేటప్పుడు జరిగే తప్పులు, వాటికి ఉన్న సులభమైన పరిష్కారాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సులభమైన మార్గమేదంటే?

చాలామంది తమకు ఏ బ్యాంకులో ఖాతా (Account) ఉంటే, అదే బ్యాంకులో కళ్ళు మూసుకుని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేస్తుంటారు. ఇతర బ్యాంకులు ఎంత వడ్డీ ఇస్తున్నాయనే విషయాన్ని అస్సలు పట్టించుకోరు. మార్కెట్లో పెద్ద పెద్ద ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే.. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కొత్త తరం బ్యాంకులు ఎఫ్‌డీలపై చాలా ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తుంటాయి. ఇలాంటి వాటిపై అవగాహన లేకపోవడం వల్ల ఇతర బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి చూడకపోవడం వల్ల చేతికి వచ్చే లాభాన్ని కోల్పోతున్నారు.

బ్యాంకుల్లో మనం దాచుకునే సొమ్ముకు DICGC (డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్) ద్వారా బీమా రక్షణ ఉంటుంది. కానీ దీనికి ఒక పరిమితి ఉంది. ఒకే బ్యాంకులో ఒక వ్యక్తి చేసే డిపాజిట్ (అసలు + వడ్డీ కలిపి) రూ. 5 లక్షల వరకు మాత్రమే సురక్షితం. ఒకవేళ బ్యాంకు ఏదైనా ఆర్థిక సంక్షోభంలో పడితే, ఐదు లక్షల కంటే ఎక్కువ ఉన్న మొత్తానికి బీమా వర్తించదు. అందుకే పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నప్పుడు దాన్ని ఒకే బ్యాంకులో కాకుండా, వేర్వేరు బ్యాంకుల్లో రూ. 5 లక్షల లోపు చొప్పున విభజించి డిపాజిట్ చేయడం సురక్షితం.

‘స్టేబుల్ మనీ’యాప్ తో సొల్యూషన్..
పైన చెప్పుకున్న ఇబ్బందులన్నింటికీ ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో కూడిన ‘స్టేబుల్ మనీ’ (Stable Money) యాప్ ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చూపుతోంది. ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే, దేశంలోని ప్రముఖ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ల ఎఫ్‌డీ రేట్లన్నీ ఒకే చోట మనకు కనిపిస్తాయి. దీనివల్ల ఏ బ్యాంకులో ఎంత వడ్డీ వస్తుందో సులభంగా పోల్చి చూసుకోవచ్చు.

ఖాతా లేకపోయినా ఎఫ్‌డీ చేసుకోవచ్చు
సాధారణంగా ఏదైనా బ్యాంకులో ఎఫ్‌డీ చేయాలంటే అక్కడ సేవింగ్స్ ఖాతా ఉండాలి. కేవైసీ (KYC) ప్రక్రియ పూర్తి చేయాలి. కానీ ‘స్టేబుల్ మనీ’ యాప్ ద్వారా ఆ అవసరం లేదు. మీకు ఆయా బ్యాంకుల్లో అకౌంట్ లేకపోయినా సరే, నేరుగా ఈ యాప్ ద్వారానే ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. డిజిటల్ కేవైసీ ద్వారా నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. కష్టార్జితాన్ని పొదుపు చేసుకునేటప్పుడు స్మార్ట్‌గా ఆలోచించడం అవసరం. ఒకే బ్యాంకుకు పరిమితం కాకుండా, రిస్క్ లేకుండా ఎక్కువ వడ్డీని ఇచ్చే మార్గాలను ఎంచుకోవాలి. వేర్వేరు బ్యాంకుల్లో డబ్బును విభజించి పెట్టుబడి పెట్టడం ద్వారా అటు ఐదు లక్షల బీమా రక్షణను పొందవచ్చు, ఇటు అత్యధిక లాభాలనూ అందుకోవచ్చు.

ఆర్జీవీ - జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మిస్ అయిన సినిమా...ఇది చేసి ఉంటే తారక్ నెంబర్ వన్ హీరో అయ్యేవాడా..?

RGV Junior NTR Movie
RGV Junior NTR Movie

RGV Junior NTR Movie: శివ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… మొదటి సినిమాతోనే టాప్ డైరెక్టర్ గా మారాడు. అతని నుంచి వచ్చిన సినిమాలు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని విశేషంగా అలరిస్తున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అప్పట్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపించారు. చిరంజీవి కూడా అతనితో సినిమా చేయడని ఇంట్రెస్ట్ చూపించినప్పటికి చిరంజీవితో సినిమా స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసి అతను బాలీవుడ్ వెళ్ళిపోయాడు. దాంతో అప్పటినుంచి ఇప్పటివరకు చిరంజీవికి అతనికి పెద్దగా మాటలైతే లేవు. ఇక వీళ్లిద్దరి విషయం పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమా చేసిన తర్వాత రాంగోపాల్ వర్మ తనతో ఒక సినిమా చేయాలని అనుకున్నాడట. ఇక ఎన్టీఆర్ సైతం వర్మ కాంబినేషన్లో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. అయితే ఆ సినిమా కథ ఒక గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో సాగుతుందట. అయినప్పటికి వర్మ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి అన్ని కసరతులు చేసుకున్నాడు.

ఇక అఫిషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది అనుకున్న సందర్భంలోనే ఆ కథకి ఎన్టీఆర్ సెట్ అవ్వడేమో అనే ఉద్దేశ్యంతో వర్మ ఎన్టీఆర్ ను పక్కనపెట్టి బాలీవుడ్ లో వేరే హీరోతో ఆ కథని సినిమాగా చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా వర్మ కొన్ని సందర్భాలు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాడు.

దానివల్ల అవతల హీరోల ఇమేజ్ డామేజ్ అయ్యే పరిస్థితి కూడా ఉందని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఆర్జీవీ – ఎన్టీఆర్ కాంబినేషన్ వర్కౌట్ అయి ఉంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నెంబర్ వన్ హీరోగా మారిపోయేవాడు అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇక్కడ సక్సెస్ చాలా కీలకం. కాబట్టి ఎవరు ఎక్కువ సక్సెస్ లను సాధిస్తే వాళ్లు టాప్ పొజిషన్లో కొనసాగుతుంటారు.

వరుస సక్సెస్ లను సాధించిన కూడా ఇప్పుడు ఆయనకు అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే రావడం లేదు. అందువల్లే ఆయన స్టార్ హీరోలతో పోటీపడే స్థాయిలో ఉండలేక వెనకబడి పోతున్నాడు. వాళ్ళందరికి పోటీ ఇవ్వడానికి సతమతమవుతున్నాడు…

అనిల్ రావిపూడి ఆ హీరోలతో చేయాలనుకున్న మూవీని వెంకటేష్ - కళ్యాణ్ రామ్ లతో చేస్తున్నాడా..?

Venkatesh Kalyan Ram Film
Venkatesh Kalyan Ram Film

Venkatesh Kalyan Ram Film: హిట్ మిషన్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి…ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కసరత్తులు చేస్తున్నాడు. వెంకటేష్ కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి చేస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంవత్సరానికి ఒక సినిమా చొప్పున అనిల్ రావిపూడి చాలా మంచి సినిమాలను చేసుకుంటూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించడంలో అనిల్ రావిపూడి కి చాలా మంచి క్రేజ్ ఉంది. ఆయన పేరు చూసి చాలా మంది థియేటర్ కి వచ్చే సినిమాలు చూస్తున్నారు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక వెంకటేష్ అనిల్ రావిపూడిలదిచాలా బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు వీళ్ళ కాంబినేషన్లో నాలుగు సినిమాలు వస్తే నాలుగు సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి.

కాబట్టి ఈ సినిమాతో మరోసారి తను ఐదో సక్సెస్ ని కూడా తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే అనిల్ రావిపూడి మొదట ఈ కథ రాసుకున్నప్పుడు వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను కాకుండా వేరే హీరోలను అనుకున్నారట. ఊపిరి సినిమాలో నాగార్జున, కార్తీ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది.

కాబట్టి ఈ సినిమాలో కూడా వాళ్ళిద్దరితోనే చేయించాలని అనుకున్నాడట. ఇక నాగార్జున తో సినిమా చేసి అతనికి సక్సెస్ ను సాధించి పెడితే అనిల్ రావిపూడి సీనియర్ హీరోలందరికి సక్సెస్ లను అందించిన వాడు అవుతాడు. కాబట్టి నాగార్జునతో ఈ మూవీ ప్లాన్ చేశారట.

నాగార్జున ఇంతకు ముందు సినిమాలో బిజీగా ఉండడం వల్ల వాళ్ళిద్దరిని పక్కనపెట్టి నాగార్జున ప్లేస్ లో వెంకటేష్ ని తీసుకొని కార్తీ ప్లేస్ లో తనకి మొదటి సినిమా ఆఫర్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా జూన్ 22వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుంది…

మన్మోహన్‌ హయాంలో ఇండియా ఎక్కడ.? ఇప్పుడు మోడీ హయాంలో ఇండియా ఇక్కడ..

Modi India GDP Growth
Modi India GDP Growth

Modi India GDP Growth: 2004–2014 మధ్య మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వ కాలంలో భారత్‌ ఆర్థికంగా వేగవంతమైన వృద్ధిని సాధించింది. సగటు వార్షిక జీడీపీ వృద్ధి రేటు సుమారు 7.7% నుంచి 8.1 శాతం వరకు ఉండేది. ఆ సమయంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ సుమారు 2 ట్రిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండేది. ప్రపంచ ఆర్థిక ర్యాంకింగ్‌లో 10వ లేదా 11వ స్థానంలో ఉండేది. ఇండో–యుఎస్‌ న్యూక్లియర్‌ ఒప్పందం వంటి దౌత్యపరమైన ముందడుగులు వేశారు. అయితే, రెండో పర్యాయంలో విధాన పక్షపాతం, అవినీతి ఆరోపణలు, ఆర్థిక మందగమనం వంటి సవాళ్లు ఎదురయ్యాయి. ప్రపంచం భారత్‌ను ఉద్భవిస్తున్న ఆర్థిక శక్తిగా చూసినప్పటికీ, నిర్ణయాలు తీసుకోవడంలో సంకోచం, ప్రపంచ వేదికపై ప్రభావం తక్కువగా ఉండేది.

మోదీ వచ్చాక జూమ్‌..
2014 నుంచి నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ ద్విగుణీకృతం అయింది. 2026 నాటికి నామమాత్రపు జీడీపీ సుమారు 4.15 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ప్రపంచ ర్యాంకింగ్‌లో 6వ స్థానం చేరుకుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7.7 శాతంగా నమోదైంది.

ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో వేగం..
డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (యూపీఐ, డిజిటల్‌ ఇండియా), తయారీ రంగ విస్తరణ (మేక్‌ ఇన్‌ ఇండియా), మౌలిక సదుపాయాల విస్తరణ వంటి సంస్కరణలు ఆర్థిక వ్యవస్థను మరింత స్థిరంగా, స్వయం సమృద్ధిగా మార్చాయి. మన్మోహన్‌ కాలంలో సాధించిన వృద్ధి రేటు సగటున ఎక్కువగా ఉన్నప్పటికీ, మోడీ కాలంలో నిర్మాణాత్మక సంస్కరణలు, కోవిడ్‌ తర్వాత రికవరీ, దీర్ఘకాలిక సామర్థ్య నిర్మాణం జరిగాయి. ఇప్పుడు భారత్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన ఆధారంగా మారింది.

విదేశాంగ విధానంలో పెద్ద మార్పు..
మన్మోహన్‌ కాలంలో విదేశాంగ విధానం మరింత నియంత్రితంగా, అమెరికాతో సన్నిహిత సంబంధాలపై దృష్టి పెట్టింది. అయితే, ప్రపంచ వేదికపై భారత్‌ ప్రభావం పరిమితంగా ఉండేది. మోడీ హయాంలో భారత్‌ ‘‘మల్టీ–అలైన్‌మెంట్‌’’ విధానాన్ని అనుసరించి పశ్చిమ దేశాలు, రష్యా, గ్లోబల్‌ సౌత్‌ మధ్య సమతుల్యంగా వంతెనగా నిలబడింది. క్వాడ్‌(QUAD) బలోపేతం, జీ20 అధ్యక్షత, వ్యాక్సిన్‌ దౌత్యం, మధ్యప్రాచ్య దేశాలతో దగ్గరి సంబంధాలు, రష్యాతో శక్తి సహకారం ఇవన్నీ భారత్‌ను ప్రపంచ దౌత్యంలో కీలక ఆటగాడిగా మార్చాయి. ఇప్పుడు ప్రపంచ శక్తులు భారత్‌ లేకుండా పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా మారింది. గతంలో ఇతరులు నిర్ణయించిన విధిని ఇప్పుడు భారత్‌ ప్రభావితం చేస్తోంది.

సార్వభౌమ సామర్థ్యాల నిర్మాణం..
మన్మోహన్‌ కాలంలో ఆర్థిక వృద్ధి ఉన్నప్పటికీ, మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ వ్యవస్థ, రక్షణ ఉత్పత్తి సామర్థ్యం పరిమితంగా ఉండేవి. మోడీ కాలంలో ‘‘ఆత్మనిర్భర భారత్‌’’ దిశగా రక్షణ ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు (రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు), డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విపరీతంగా విస్తరించాయి. ఎఫ్‌డీఐ ప్రవాహం పెరిగింది, ఎగుమతులు పెరిగాయి. ఇది భారత్‌ను బాహ్య ఒత్తిళ్లకు తక్కువగా లోబడేలా చేసింది.

జీ8 యుగం వైపు భారత్‌ ..
మన్మోహన్‌ కాలంలో భారత్‌ ఉద్భవిస్తున్న శక్తిగా ఉండగా, మోడీ కాలంలో అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన ఆధారంగా, దౌత్యపరంగా సమతుల్య శక్తిగా మారింది. 7.7 శాతం వృద్ధి రేటు, బలమైన మల్టీ–అలైన్‌మెంట్, సార్వభౌమ సామర్థ్యాలు ఇవన్నీ కలిసి భారత్‌ను జీ7లో చేర్చి జీ8గా మార్చాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతంలో మన్మోహన్‌సింగ్‌ జీ7, ఇతర అంతర్జాతీయ సదస్సులకు వెళ్లినప్పుడు వెనుక వరుసలో నిలబెట్టేవారు. మాట్లాడే అవకాశం అరుదుగా వచ్చేది. కానీ మోదీ వచ్చాక పరిస్థితులు మారాయి. తాజాగా అన్ని సమేశాలకు ఆహ్వానం అందుతోంది. అదే సమయంలో సభ్యవత్వం లేకపోయినా మోదీని ముందువరుసలో నిలబెడుతున్నారు. మోదీని కలుసుకోవడానికి, కరచాలనానికి అంతర్జాతీయ నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఆలింగనం చేసుకుంటున్నారు.

గతంలో ఇతరులు నిర్ణయించిన విధిని ఇప్పుడు భారత్‌ లేకుండా సాధ్యం కాదు. ఇది కేవలం ఒక ప్రభుత్వం యొక్క విజయం కాదు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆర్థిక, దౌత్య, సామర్థ్య నిర్మాణ ప్రక్రియ ఫలితం. భారత్‌ ఇప్పుడు ప్రపంచ వేదికపై తన స్థానాన్ని బలపరచుకుంటోంది.

చదువుతో పాటు నైపుణ్యం..ఆదాయం.. ఏపీ కీలక నిర్ణయం..

AP Higher Education Board
AP Higher Education Board

AP Higher Education Board: ఉన్నత విద్యను ఉపాధితో అనుసంధానం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబెడెడ్ డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు పెయిడ్ ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థులు చదువుతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను సంపాదించేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది. ఇందులో భాగంగా ఒక్కో విద్యార్థికి రూ. 6,900 చొప్పున ఏడాది పాటు రూ.15,000 అందుకోనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎంబెడెడ్ మూడేళ్ల డిగ్రీ కోర్సు చదివే విద్యార్థులకు ఏడాది పాటు పెయిడ్ ఇంటర్న్ షిప్ అందించనున్నారు.ఇందులో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలోలో ప్రభుత్వం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ కొత్త విధానంలో తొలి రెండేళ్లు సాధారణ అకడమిక్ బోధన కొనసాగుతుంది. సబ్జెక్టు పరిజ్ఞానం, ప్రాథమిక నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ అందిస్తారు. అనంతరం మూడో ఏడాదిలో పరిశ్రమలతో అనుసంధానమైన ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా స్కిల్ కౌన్సిళ్లు సూచించిన పరిశ్రమలు, సంస్థల్లో విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కు పంపించనున్నారు. అక్కడ వారు ప్రత్యక్షంగా పని చేస్తూ అనుభవాన్ని పొందడమే కాకుండా, పరిశ్రమల పనితీరు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోగలుగుతారు. దీంతో చదువు పూర్తయ్యే నాటికే ఉద్యోగాలకు అవసరమైన అనుభవం కూడా వారికి లభించనుంది.

ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులకు నెలకు రూ.6,900 నుంచి రూ.15,000 వరకు స్టైపెండ్ అందించనున్నారు. ఇది విద్యార్థులకు ఆర్థికంగా కొంత తోడ్పాటు అందించడంతో పాటు, వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ప్రోత్సాహంగా నిలవనుంది. పరిశ్రమల్లో పనిచేస్తూనే ఆదాయం పొందే అవకాశం ఉండటంతో విద్యార్థుల్లో ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా, రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యామండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్దేలా కోర్సుల రూపకల్పన చేయనుంది.

ఈ విధానం ద్వారా విద్యార్థులు చదువు పూర్తయ్యే నాటికే ఉద్యోగ అవకాశాలకు మరింత దగ్గరవుతారని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవడంతో పాటు, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం ఉందని చెబుతున్నారు.

కాపులు కూటమిని విడిచిపెట్టగలరా?!

Kapu Politics AP
Kapu Politics AP

Kapu Politics AP: ఏపీ రాజకీయాలు ఎప్పుడు కాపులు చుట్టూనే తిరుగుతుంటాయి. అయితే ఇప్పుడు ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది. కాపులను తమ వైపు టర్న్ చేసుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు మెజారిటీ కాపులు కూటమికి అండగా ఉన్నారు. వారిని తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అది అంత ఈజీ కాదు. అయితే అదే పనిగా ప్రయత్నం చేస్తోంది. మరోవైపు గోదావరి జిల్లాలో కాపు సదస్సులు నిర్వహిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి అండగా నిలిచిన వారికి రాజకీయంగా తాము అండగా నిలబడతామని చెబుతున్నారు. అయితే ఈ కాపు సమావేశాలు రాజకీయ ప్రేరేపితం అన్న టాక్ కూడా ఉంది. కొన్ని రాజకీయ పార్టీల స్పాన్సర్ షిప్ తోనే ఈ సమావేశాల నిర్వహణ జరుగుతుందన్నది ఒక అనుమానం. ఆపై బహిరంగ రహస్యం కూడా.

* విసిగి వేసారి పోయిన కాపులు..
అయితే తమ చుట్టూ జరిగే రాజకీయం కాపులకు తెలియంది కాదు. దశాబ్దాలుగా ఇది జరుగుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాపు నేత వంగవీటి మోహన్ రంగా దారుణ హత్యకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఆయన హత్య జరిగింది. టిడిపి మూల్యం చెల్లించుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రంగా హత్య కేసు విచారణ జరిగి నిందితుల అరెస్టు జరుగుతుందని చాలా ఊహించారు. కానీ అటువంటి పరిస్థితి లేదు. అరెస్టు జరగలేదు సరి కదా దానికోసం ఎటువంటి ప్రయత్నాలు కూడా జరగలేదు. అది మొదలు ఎన్నో ఎన్నికలు వచ్చాయి. కాపులతోపాటు మోహన్ రంగా ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అంటే ఎన్నికల కథా వస్తువుగా కాపులను తీసుకున్నారన్నమాట ఏపీ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు.

* వర్కౌట్ కాని సదస్సులు..
మొన్ననే గోదావరి జిల్లాలో ఒక సదస్సు పెట్టారు కాపుల తో. పట్టుమని పదివేల మంది కూడా రాలేదు. శ్రీకాకుళంలో సైతం కాపుల సభ పెట్టారు. తూర్పు కాపుల పేరిట ఒక ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పట్టుమని వెయ్యి మంది కూడా రాలేదు. ఒక్క మాట నిజం కాపులు విసిగి వేసారి పోయారు. అంతెందుకు 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన కంచాల ఉద్యమం చేపట్టమన్నాడు. దీపాలు వెలిగించమన్నాడు. అన్ని చేశారు. కానీ జగన్ అధికారంలోకి వస్తే ఉద్యమాన్ని మూసేశాడు. ఆయనది సైతం రాజకీయ ప్రేరేపిత ఉద్యమం అని తేలిపోయింది. అందుకే ఎందుకు వచ్చింది ఈ బాధ.. ఏ ప్రభుత్వం మంచి చేస్తే ఆ ప్రభుత్వానికి జై కొడతాం అన్నట్టు మెజారిటీ కాపుల అభిప్రాయంగా మారింది. అంతే తప్ప రాజకీయ ప్రేరేపిత కుల సదస్సులకు కాలం చెల్లిపోయింది. చంద్రబాబు విషయంలో కాపులను దూరం చేస్తామంటే మధ్యలో పవన్ ఉన్నారన్న విషయాన్ని గ్రహించుకుంటే మంచిది.

హార్థిక్ పాండ్యా, రిషబ్ పంత్.. కోట్ల ఆటగాళ్లు.. చివరికి ఇలా అయ్యారు..

IPL 2027
IPL 2027

IPL 2027: ఐపీఎల్ లో కొంతమంది ఆటగాళ్ల మీద కోట్ల వర్షం కురిసింది. వారికి ఆయా జట్ల యాజమాన్యాలు పోటీపడి కనక వర్షం కురిపించాయి. వారి మీద భారీ అంచనాలు పెట్టుకున్నాయి. కానీ, వాటిని నిలబెట్టుకోవడంలో వారు విఫలమయ్యారు. దీంతో యాజమాన్యాలు ఒకటి, రెండు అవకాశాలు ఇచ్చాయి. ఆ అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీంతో మేనేజ్మెంట్లు పొమ్మనలేక పొగబెట్టాయి. ఫలితంగా ఆ ప్లేయర్లు బయటికి రావాల్సిన పరిస్థితి.

ఐపీఎల్ 2027 ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఇప్పటికే కొన్ని జట్ల సారధులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏకంగా తమ సారథ్యం వహిస్తున్న జట్లనుంచి బయటకు రావాలని బలంగా నిర్ణయించుకున్నారు. ఆ జాబితాలో హార్థిక్ పాండ్యా.. రిషబ్ పంత్ ఉన్నారు. హార్దిక్ ముంబై జట్టుకు.. రిషబ్ లక్నో జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. గత రెండు సీజన్లుగా వీరిద్దరూ అంతగా ఆయా జట్ల మీద ప్రభావం చూపించలేకపోయారు. మీరు మాత్రమే కాకుండా చెన్నై జట్టు సారథి రుతురాజ్ గైక్వాడ్ కూడా విఫల సారధి జాబితాలో ఉన్నాడు.

లక్నో జట్టుకు ఆశించిన స్థాయిలో విజయాలు అందించలేకపోవడంతో.. 27 కోట్ల పంత్ తన స్థాయిని తగ్గించుకున్నాడు. ఏకంగా 15 కోట్లకు ఢిల్లీ జట్టుకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పంత్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా వేగంగా అడుగులు వేస్తున్న సమాచారం. 27 కోట్ల ఆటగాడు సరిగ్గా ఆడ లేకపోవడంతో విఫల సారథిగా మిగిలిపోయాడు.

అత్యంత విజయవంతమైన గుజరాత్ జట్టు నుంచి ముంబైకి మారిపోయాడు హార్దిక్. 2024లో అతడు ముంబై జట్టుకు నాయకుడిగా వచ్చాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా ముంబై జట్టు అతని నాయకత్వంలో గొప్పగా ఎదగ లేక పోయింది. మైదానంలో వ్యూహాత్మకంగా పాండ్యా నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. అందువల్లే అతడిని మేనేజ్మెంట్ పక్కకు తప్పించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అతడి స్థానంలో జైస్వాల్ మీద కన్ను వేసినట్టు సమాచారం. జైస్వాల్ కూడా ముంబై జట్టుకు ఆడాలని అనుకుంటున్నాడు.. అయితే వచ్చే ఐపీఎల్ సీజన్ కు సంబంధించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో ఎన్ని వాస్తవ రూపం దాల్చుతాయో తేలాల్సి ఉంది.

లోక్‌సభలో 2/3 మెజార్టీ కోసం బీజేపీ వ్యూహం... రెబల్సే పావులు!

BJP strategy
BJP strategy

BJP strategy: ఇండీ కూటమి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌ బిల్లులకు వ్యతిరేకంగా నిలబడటంతో బీజేపీ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చింది. సాధారణ మెజార్టీతో సరిపోదని, లోక్‌సభలో 2/3 మెజార్టీ సాధించి బిల్లులను స్వతంత్రంగా ఆమోదించుకోవాలని నిర్ణయించింది. ఈ లక్ష్యం సాధించడానికి ప్రతిపక్షాల నుంచి ఎంపీలను ఆకర్షించే ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి.

ప్రస్తుత బలా బలాలు..
ప్రస్తుతం 540 సభ్యులున్న లోక్‌సభలో ఎన్‌డీఏకు 293 ఎంపీలు ఉన్నారు. రాజ్యాంగ సవరణలకు సంబంధించిన బిల్లుల ఆమోదానికి మొత్తం సభ్యుల్లో 2/3 మంది(అంటే 360 మంది) మద్దతు అవసరం. ప్రస్తుత సంఖ్యతో ఎన్‌డీఏకు ఇంకా 67 మంది ఎంపీలు కొరత ఉంది. ఈ అంతరాన్ని తగ్గించడానికి బీజేపీ ప్రతిపక్షాల్లోని అసంతృప్త ఎంపీలపై దృష్టి పెట్టింది.

బెంగాల్, మహారాష్ట్రలో కసరత్తు..
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నుంచి 20 మంది ఎంపీలు, మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం) నుంచి 6 మంది ఎంపీలు ఎన్డీఏ వైపు మళ్లేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అసంతృప్తి, స్థానిక రాజకీయ సమీకరణలు, వ్యక్తిగత ఆకాంక్షలు ఈ మార్పులకు కారణమవుతున్నాయి. ఈ 26 మంది ఎంపీలు ఎన్డీఏలో చేరితే సంఖ్య 319కి చేరుతుంది. ఇంకా 41 మంది ఎంపీలు కావాల్సి ఉంటుంది. ఇది చిన్న సంఖ్య కాదు కానీ, రాష్ట్రాల వారీగా చూస్తే అసాధ్యం కాదు.

ఎస్‌పీ ఎంపీలపై దృష్టి..
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి 37 మంది ఎంపీలు ఉన్నారు. అఖిలేశ్‌ యాదవ్, డింపుల్‌ యాదవ్‌ సహా ఈ బృందం ఉంది. ఇక్కడ కొంతమంది ఎంపీలు బయటికి రావచ్చనే ప్రచారం బలంగా ఉంది. ఎస్‌పీలో అంతర్గత అసంతృప్తి, టికెట్‌ పంపకాలు, స్థానిక నాయకత్వ వివాదాలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. 10–15 మంది ఎంపీలు కూడా మద్దతు ఇచ్చినా లేదా చేరినా ఎన్‌డీఏలో చేరినా బలం 330–335కి చేరుతుంది. మిగిలిన అంతరం చాలా తక్కువగా మారుతుంది.

రాజకీయ పరిణామాలు ఏమిటి?
2/3 మెజార్టీ వచ్చినట్లయితే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌ వంటి సున్నితమైన బిల్లులను ఎన్‌డీఏ స్వేచ్ఛగా ముందుకు తీసుకెళ్లవచ్చు. ప్రతిపక్షాల మద్దతు అవసరం ఉండదు. టీఎంసీఈ, శివసేన (ఉద్ధవ్‌), ఎస్‌పీలో విభజన ఏర్పడితే వాటి సంఘటన బలహీనపడుతుంది. రాష్ట్ర రాజకీయాలపై కూడా ప్రభావం పడుతుంది.

నైతిక, చట్టపరమైన ప్రశ్నలు..
రెబల్స్‌ను ఆకర్షించడం రాజకీయంగా సాధారణం అయినప్పటికీ, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉందని విమర్శలు వస్తాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను మార్చడం ఓటర్ల నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. దక్షిణ రాష్ట్రాలు డీలిమిటేషన్‌పై ఆందోళన చెందుతున్న సమయంలో ఈ మెజార్టీ వచ్చినట్లయితే ఉత్తర–దక్షిణ విభజన మరింత తీవ్రమవుతుంది.

ఎన్డీఏ ప్రస్తుతం చేస్తున్న కసరత్తు విజయవంతమైతే లోక్‌సభలో శక్తి సమతుల్యత పూర్తిగా మారిపోతుంది. అయితే ఇది సులభమైన పని కాదు. ప్రతిపక్షాల్లోని అసంతృప్తిని ఎంతవరకు మూలధనం చేసుకోగలుగుతుందనేది బీజేపీ విజయానికి కీలకం. రాబోయే వారాల్లో ఈ రాజకీయ నాటకం ఎలా ముగుస్తుందో చూడాలి. ఈ వ్యూహం ఫలించినా, విఫలమైనా భారత రాజకీయాల్లో నంబర్‌:ఏమ్‌ ఎప్పుడూ కీలకంగానే ఉంటుంది.

చంద్రబాబు రంగంలోకి.. మారిన సీన్

Chandrababu
Chandrababu

Chandrababu: వాడు రంగంలోకి దిగనంతవరకే.. పవర్ ఫుల్ డైలాగ్ ఇది సినిమాల్లో. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును చూస్తే అదే అర్థం అవుతోంది. గత కొద్ది రోజులుగా ఏపీని సాయి కృష్ణ అదృశ్యం మిస్టరీ కుదిపేస్తోంది. దీనిని ఒక రాజకీయ అంశంగా మార్చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. లా అండ్ ఆర్డర్ తో కూడుకున్నది ఈ వ్యవహారం. కేసుల విచారణలో భాగంగా పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అటు తరువాత ఆ యువకుడి ఆచూకీ లేదు. ఇటువంటి సమయంలో కుమారుడి కోసం ఆరాటపడుతున్న ఆ తల్లిని, కుటుంబ సభ్యులను అక్కున చేర్చుకోవాలి. వారి వైపు న్యాయం జరిగేలా చూడాలి. ఇప్పుడు చంద్రబాబు చేసింది అదే. బాధిత కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడారు. తప్పకుండా తప్పు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆ తల్లిని ఓదార్చారు. దీంతో ఆ కుటుంబం మనసు నిండా ఉన్న బాధ కొంతవరకు తీరింది.

* కాపు అనే మాట హైలెట్..
ఇదే విషయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. అంతకుముందు ఆ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయమని అడిగే కంటే.. ఆ యువకుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వాడని… కూటమికి కాపులు ఓట్లు వేస్తే వారే బాధితులు అవుతున్నారని.. లాకప్ డెత్ చేసేసారని.. కనీసం మృతదేహం అయిన ఇప్పించాలని ఏవేవో మాటలు అనేశారు. దీనిని పరిశీలించకుండానే జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆ కుర్రాడు చేసిన నేరాలను ప్రస్తావిస్తూ అవి చిన్న చిన్నవి అంటూ.. ఆ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఆయన సైతం కూటమి ప్రభుత్వంపై బురదజల్లేసారు. ఏదో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఆ యువకుడు సాయికృష్ణను అరెస్టు చేయించి ఇబ్బంది పెట్టారు అన్నట్టు మాట్లాడారు. కానీ చంద్రబాబు ఆలోచన మాత్రం అలా లేదు. ఆయన తన చతురతతో పాటు బాధిత కుటుంబం పై చూపిన శ్రద్ధ, మానవీయ కోణం మరువరానిది. ఈ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకున్నారో.. ఆ కుటుంబ సభ్యులే సంతృప్తికరంగా.. సీఎం చంద్రబాబు చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు.

* చంద్రబాబు రావడంతో మారిన సీన్..
గత మూడు రోజులుగా ఏపీని కుదిపేసింది సాయి కృష్ణ అదృశ్యం ఎపిసోడ్. ఇది పూర్తిగా పోలీస్ శాఖ పరిధిలోనిది. పైగా సాయి కృష్ణ పై అనేక కేసులు ఉన్నాయి. సాధారణంగా ఈ కేసుల దర్యాప్తులో భాగంగా పోలీస్ విచారణ అనేది కామన్. అయితే దానిని రాజకీయ దూర దృష్టితో చూసేసారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అదృశ్యమైంది కాపు యువకుడు కాబట్టి ఇదో రాజకీయ అస్త్రం అవుతుందని భావించారు. ఒక మరక చల్లే ప్రయత్నం చేశారు. అప్పుడు చంద్రబాబు రాష్ట్రంలో లేరు. సింగపూర్ లో ఉన్నారు. అక్కడి నుంచి రాష్ట్రానికి నేరుగా వచ్చి ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డిజిపితో పాటు ఉన్నతాధికారులతో చర్చించారు. కృష్ణలంకలో సాయి కృష్ణ నివాసానికి స్థానిక ఎమ్మెల్యేను పంపించారు. ఆ కుటుంబ సభ్యులను సచివాలయానికి తీసుకొచ్చి వారి సమస్యను విన్నారు. అసలేం జరిగింది? అనే విషయాన్ని ఆరా తీశారు. సాయి కృష్ణ ను అరెస్ట్ చేసిన సీఐ ను సస్పెండ్ చేశారు. క్రిమినల్ కేసును కూడా నమోదు చేశారు. ఎస్పీ స్థాయి అధికారితో దర్యాప్తు చేపడుతున్నారు. సాయి కృష్ణ తల్లిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. మీరు అనుమానిస్తున్నట్టు అన్యాయం జరిగి ఉంటే న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం కాపు సామాజిక వర్గం అన్న విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు మాత్రం పరిష్కార మార్గం చూపిస్తానన్నారు. దీంతో నిన్నటి వరకు తమకు అన్యాయం జరిగిందన్న బాధతో ఉన్న ఆ బాధ్యత కుటుంబం కొంత తేలికపడింది. చంద్రబాబుతో కలిసిన తరువాత కొంత స్వాంతన చేకూరింది. మాకు ఈ కులాలు వద్దు.. రాజకీయాలు వద్దు.. కావాల్సింది న్యాయం.. తెలియాల్సింది వాస్తవం అన్నట్టు.. బాధిత కుటుంబం చెప్పడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశలు నీరు గారి పోయాయి.

షర్మిల పొలిటికల్ సైలెన్స్..!

YS Sharmila
YS Sharmila

YS Sharmila: కాంగ్రెస్ పార్టీలో షర్మిల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. మొన్న రాజ్యసభ పదవి దక్కకపోవడం నుంచి షర్మిల సైలెన్స్ గా ఉన్నారు. పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ఆమె ఆలోచన మారినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హై కమాండ్ రాజ్యసభ పదవి ఇస్తామని చెప్పి మాట తప్పింది. దీని వెనుక పెద్ద రాజకీయం నడిచినట్టు షర్మిల అనుమానిస్తున్నారు. ఇప్పుడు పదవి ఇవ్వలేదు సరి కదా భవిష్యత్తులో తనను పక్కన పెట్టేస్తే పరిస్థితి ఏంటన్న ఆలోచనకు వచ్చారు. అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. వ్యూహాత్మకంగా కొన్ని రోజులు రాజకీయంగా మౌనముద్రలోకి వెళ్లాలని ఆమె భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. జాతీయ రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్ వైఖరి మారింది. ఆ పార్టీ ఆలోచన మారుతోంది. కేవలం ఏపీ కోసం కాంగ్రెస్ ఆలోచించే పరిస్థితుల్లో లేదు. జాతీయస్థాయి పరిణామాలతో ఏపీలో వ్యవహరిస్తే తన పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని షర్మిల ఒక అంచనాకు వచ్చారు. అందుకే తాత్కాలికంగా కొద్ది రోజులపాటు రాజకీయాలకు దూరం కావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

* కాంగ్రెస్ కొత్త ఆలోచన..
దేశవ్యాప్తంగా బలం పెంచుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. దూరమైన వర్గాలను దగ్గరకు చేర్చుకోవాలని చూస్తోంది. మరోవైపు బిజెపి చేతిలో దెబ్బతిన్న ఒక్కో పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తుంది. మొన్ననే బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ సాయాన్ని వెతుక్కుంటూ వచ్చారు. అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తానన్న ప్రతిపాదన కూడా తీసుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇంకోవైపు బిజెపి బారిన పడ్డ చాలా ప్రాంతీయ పార్టీలు.. జాతీయస్థాయిలో అండ కోసం కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తున్నట్లు స్పష్టమౌతోంది. ఈ తరుణంలో ఏదో ఒక రోజు జగన్ సైతం కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతారన్న విశ్లేషణలు ఉన్నాయి.

* అప్పటి పరిస్థితులకు తగ్గట్టు..
2029 సార్వత్రిక ఎన్నికల నాటికి పూర్తిగా పొలిటికల్ సీన్ మారనుంది. వచ్చే ఏడాది కీలకమైన రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కానీ బిజెపికి వ్యతిరేక ఫలితాలు వస్తే మాత్రం ట్రెండ్ మారుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్టు బిగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ కు దగ్గర కాక తప్పదు. షర్మిల లో కూడా అదే అనుమానం. జాతీయస్థాయిలో అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని దగ్గరకు తీసుకుంటే తన పరిస్థితి ఏంటనే ఆందోళన ఆమెలో ఉంది. పైగా కర్ణాటక నుంచి రాజ్యసభ పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నది ఒక అనుమానం. పైగా ఏపీ పార్టీ పగ్గాలు అందుకొని రెండు సంవత్సరాలకు పైగా దాటుతోంది. ఈ క్రమంలో తనను పదవి నుంచి తీసేస్తే సామాన్య కార్యకర్తగా కొనసాగలేని పరిస్థితి. పోనీ ఏఐసీసీలోకి తీసుకున్నా.. ఎటువంటి పవర్ పాలిటిక్స్ చేయలేరు. అందుకే కొద్ది రోజులపాటు సైలెంట్ రాజకీయాలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో