Samsung Galaxy M47 5G Launch: Samsung మొబైల్ కొనాలని అనుకునేవారికి ఇది శుభవార్తే.. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న తన సక్సెస్‌ఫుల్ M సిరీస్ నుంచి సరికొత్త ఫోన్‌ను లాంచ్ చేయడానికి ఈ కంపెనీ రెడీ అయింది. శామ్‌సంగ్ గెలాక్సీ M47 5G (Samsung Galaxy M47 5G) పేరుతో రాబోతున్న ఈ సరికొత్త ఫోన్‌కు సంబంధించిన అఫీషియల్ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో దీనికి సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్ కూడా లైవ్‌లోకి వచ్చింది. దీంతో ఈఫోన్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందిలో ఉంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
శామ్‌సంగ్ కంపెనీ గత మోడల్స్‌కు భిన్నంగా ఈసారి ఈ ఫోన్‌కు Next Level Monster అనే ట్యాగ్‌లైన్‌ను ఇచ్చింది. అమెజాన్ లోఉన్న టీజర్ ప్రకారం .. గెలాక్సీ M47 5G లుక్ చాలా ప్రీమియంగా ఉండబోతోంది. ముఖ్యంగా డీప్ మెరూన్ కలర్ వేరియంట్ హైలైట్‌గా నిలవనుంది. బ్యాక్ ప్యానెల్ పూర్తిగా డార్క్ మ్యాట్ ఫినిషింగ్‌తో ఉంటూ, కెమెరా మాడ్యూల్ చుట్టూ మెటాలిక్ రెడ్ యాక్సెంట్స్‌తో డిజైన్ చేశారు. ఈసారి ట్రెండీగా ఉండే బాక్సీ ఫ్రేమ్, ఫ్లాట్ బ్యాక్ డిజైన్‌ను తీసుకొచ్చింది. కుడివైపు పవర్ బటన్‌కు ఇంటిగ్రేట్ చేసిన సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇందులో ఉండనుంది.
ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉండనుంది. ఇది గేమింగ్‌కు, మల్టీటాస్కింగ్‌కు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ Super AMOLED స్క్రీన్‌ను ఇచ్చే అవకాశం ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుండడం వల్ల స్క్రోలింగ్, వీడియోలు చూడడం చాలా స్మూత్‌గా ఉంటుంది.
Galaxy M47 ఫోన్ వెనుక భాగంలో సరికొత్త పిల్ షేప్డ్ కెమెరా ఐలాండ్ ఉండబోతోంది. ఇందులో 50MP ప్రాథమిక కెమెరా , 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మ్యాక్రో సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరా ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ తో రన్ కానున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
ఈ కొత్త ఫోన్ లో 6,000 mAh బ్యాటరీ వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. బేస్ వేరియంట్ 8GB రామ్ + 128GB స్టోరేజ్‌తో ప్రారంభం కానుంది. అయితే జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో దీని అఫీషియల్ లాంచ్ డేట్ ప్రకటించి, మార్కెట్లోకి తీసుకురానున్నారు.ఇది మిడ్-రేంజ్ విభాగంలో గట్టి పోటీని ఇచ్చేలా కనిపిస్తోంది. భారతదేశంలో దీని ధర సుమారుగా రూ. 20,000 నుండి రూ. 25,000 లోపు ఉండే అవకాశం ఉంది. అమెజాన్ ఇండియాతో పాటు శామ్‌సంగ్ అఫీషియల్ వెబ్‌సైట్లలో ఇది సేల్‌కు రానుంది.
