విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ, చిత్ర యూనిట్ బీజీగా ఉంది. విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్లలో తనపై పెళ్లిపై వచ్చిన ప్రశ్నపై ఆయన స్పందించారు. పెళ్లిపై తనకు నమ్మకం ఉందని.. అయితే ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపై ఉందని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. మరిన్ని సినిమాలు చేసే అభిమానులను అలరించడమే తన ధ్యేయమని చెప్పారు. ప్రస్తుతానికి ఐయమ్ సింగిల్ అంటూ చెబుతున్నాడు.
‘పెళ్లిచూపులు’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ మూవీతో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. ‘మహానటి’, టాక్సీవాలా, డీయర్ కామ్రేడ్, గీతాగోవిందం మూవీలతో వరుస విజయాలను అందుకున్నాడు. 2020లో వాలంటైన్స్ డే కానుకగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాపై విజయ దేవరకొండ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ మూవీలో విజయ్ సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లె లైట్, కేథరిన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఫస్టు లుక్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు కాంత్రి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కేఎస్.రామారావు నిర్మాత. గోపి సుందర్ ఈ సంగీతాన్ని అందిస్తున్నాడు.