Home Blog Page 8626

కొడుకు సినిమా కోసం బాలకృష్ణ అంత పని చేశాడా?

నటవిశ్వరూపం నందమూరి బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞ సినిమా అరంగేట్రంపై తెగ తపన పడుతున్నాడట. దానికోసం బాలకృష్ణ మోక్షజ్ఞని ఎలా అయినా ఒక మంచి హీరోగా తీర్చిదిద్దలనే పనిలో పడ్డాడు. తన కొడుకుకి అమెరికాలోని ప్రఖ్యాతి గాంచిన లీ స్ట్రాస్బెర్గ్ ఫిలిం అండ్ థియేటర్ ఇంస్టిట్యూటులో కోచింగ్ ఇప్పించాలి అని నిర్ణయించుకున్నాడు. మోక్షజ్ఞకు వివిధరకాల నటన కళలను నేర్పించాలనే ఉద్దేశంతో తన తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నాడు.

అయితే నటనను నేర్చుకోవటం కోసం అంత దూరం పంపించాలా.. అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. తాత ఎన్టీర్ గొప్ప నటుడు, బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు.. వీళ్ళు ఎవరు నటించటం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు.. కానీ ఇప్పడు మోక్షజ్ఞని శిక్షణ కోసం విదేశాలకు పంపుతుంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే మోక్షజ్ఞకి ఇన్ని రోజులు నటన రాదా.. అని జనాలు గుసగుసలు అడుకుంటున్నారు.

ఇది ఇలా ఉంటె ఇంకో కొత్త వాదన కూడా తెరపైకి వచ్చింది.. అదేంటంటే.. మోక్షజ్ఞని జూ.ఎన్టీర్ కి ధీటుగా తయారుచేయాలని బాలకృష్ణ ప్రయత్నిస్తునాడట. నందమూరి వంశంలో..అప్పట్లో ఎన్టీర్.. ఇప్పుడు బాలకృష్ణ, జూ. ఎన్టీర్ మాత్రమే చెప్పుకోతగ్గ నటులుగా జనాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే బాలకృష్ణ వయసు అయిపోతుంది.. కొన్ని సంవత్సరాలలో అతను సినిమాలు చేయటం ఆపేస్తాడు. ఇక మిగిలింది జూ. ఎన్టీర్ ఒక్కడే… తనని మినహాయించి నందమూరి వంశంలో వేరే ఎవరికీ ప్రజలలో అంత ఆదరణ లభించలేదు.

ఇప్పుడు బాలకృష్ణకి ఇదే పెద్ద సమస్య అయిందట. తన కొడుకు సినిమా అరంగేట్రం చేస్తే ప్రజలు జూ. ఎన్టీర్ ని ఆదరించినంత ఆదరిస్తారా..లేదా.. అనే భయం పట్టుకుందట. దీనిని అధిగమించాలంటే మోక్షజ్ఞను జూ. ఎన్టీర్ కన్న విలక్షణమైన నటుడిగా తయారుచేయాలి.. అందుకోసమే మోక్షజ్ఞను విదేశాలకు పంపి మరీ శిక్షణ ఇస్తున్నారనే వార్తలు జనాలలో చక్కర్లు కొడుతున్నాయి.

నవీన్ చంద్ర ‘నేను లేని నా ప్రేమ‌క‌థ‌’ ఫస్ట్ లుక్

డిఫరెంట్ రోల్స్ తో తెలుగు ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర ఒక కొత్తరకం ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ వాలంటైన్స్ డే స్సెషల్ గా ‘ నేను లేని నా ప్రేమకథ’ ఫస్ట్ లుక్ ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు లాంఛ్ చేసారు. ఒక విభిన్నమైన ప్రేమకథగా ప్రేక్షకులు ముందుకు త్వరలో రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇంప్రెసివ్ గా ఉందని దిల్ రాజు అభినందించారు.

చిత్రాన్ని ఎమ్ ఎస్ సుబ్బల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణ‌లో త్రిషాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్ కందుకూరి నిర్మాత‌గా సురేష్ ద‌ర్శ‌క‌త్వం లో రూపోందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్టో ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతున్న
ఈ సినిమాలో న‌వీన్ చంద్ర స‌ర‌స‌న గాయ‌త్రి ఆర్ సురేష్ హీరోయిన్ గా చేస్తుంది. క్రిష్ సిద్దిప‌ల్లి, అదితి లు మ‌రో ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రంల ప్ర‌ముఖ న‌టుడు రాజార‌వీంద్ర కీల‌క పాత్ర‌లో న‌టించారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత క‌ళ్యాణ్ కందుకూరి మాట్లాడుతూ..
‘దిల్ రాజు గారు మా సినిమా ఫస్ట్ లుక్ ని లాంఛ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రేమకథ లు తెరపై చాలా కనిపించినా ఈ ప్రేమకథ అందించే ఎక్స్ పీరియన్స్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చూసిన ప్ర‌తిఓక్క‌రూ వారి వారి ప్రేమ క‌థ‌కి కి ద‌గ్గ‌ర‌వుతారు. న‌వీన్ చంద్ర‌, హీరోయిన్ గాయ‌త్రి ఆర్ సురేష్ వారి పాత్ర‌ల్లో ఇమిడిపోయి న‌టించారు. ఈ సినిమాకి జువిన్ సింగ్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకొని దిల్ రాజు  గారు అభినందించారు’ అన్నారు.

వాలెంటైన్స్ డే స్పెషల్: టాలీవుడ్ సక్సెస్ లవ్ స్టోరీస్

ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం ఇది అందరికీ తెలిసిందే.. ప్రేమించుకునే వారికి ఈ రోజు ఎంతో ముఖ్యమైన రోజు. ఇప్పటికే ప్రేమలో ఉన్న వ్యక్తులు తమ ప్రియురాలితో సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తుండగా, మరి కొందరు ప్రేమను వ్యక్తపరచడానికి తపన పడుతుంటారు.

అయితే ప్రేమ విషయానికి వస్తే మన తెలుగు తారలు తక్కువ ఏమి కాదు… తెలుగు పరిశ్రమలో చాలా సక్సెస్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. వీరు వివాహం చేసుకోవడమే కాకుండా సంతోషంగా జీవించడంలో విజయవంతమయ్యారు.

వారిలో కొందరు రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని, విష్ణు మరియు అనేక ఇతర యువ తారలు తమ ప్రియురాలిని వివాహం చేసుకున్నారు. నాగార్జున, మహేష్ బాబు, రాజశేఖర్ మరెందరో పెద్ద తారలు తమతో స్క్రీన్ పైన జోడి కట్టిన తరాలనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

టాలీవుడ్ సక్సెస్ లవ్ స్టోరీస్….

https://www.youtube.com/watch?v=VlFF0pgxsYY

‘అల’పై కన్నేసిన కండల వీరుడు

అల్లు అర్జున్ తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ భారీ విజయం సాధించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అలవైకుంఠములో’ అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. తెలుగు, మలళయాళంతోపాటు ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది. టాలీవుడ్లో హిట్టయిన ప్రతీ మూవీ బాలీవుడ్లో రీమేక్ అవడం షారా మామూలుగా మారింది. దీంతో ఈ మూవీని కూడా నిర్మాత అల్లు అరవింద్ బాలీవుడ్లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ హక్కులను దక్కించుకునేందుకు సల్మాన్ భాయ్ ప్రయ్నతాలు చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే అల్లు అరవింద్ తానే ఈ మూవీని బాలీవుడ్లో నిర్మించాలని భావిస్తున్నాడు. అయితే ఈ మూవీలో సల్మాన్ నటిస్తాడని ప్రచారం జరుగుతుంది.

సంక్రాంతి కానుకగా వచ్చిన ‘అలవైకుంఠపురములో’ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరునికెవ్వరు’, రజనీకాంత్ నటించిన ‘దర్బార్’ మూవీలను తట్టుకొని నిలబడింది. రోజురోజుకు పాజిటివ్ టాక్ పెంచుకొని దాదాపు 200కోట్లు కలెక్షన్లు రాబట్టిందని అంచనా. అదేవిధంగా తెలుగులో నాన్ బహుబలి రికార్డును ఈ మూవీ పేరిట లిఖించుకుంది. అదేవిధంగా యూఎస్ లోనూ 3మిలియన్ ప్లస్ వ్యూస్ తో భారీ కలెక్షన్లు సాధించింది. దీంతో బాలీవుడ్ దృష్టి ఈ మూవీపై పడింది. ఇప్పటికే తెలుగులో భారీ విజయం సాధించిన మూవీలు బాలీవుడ్ లోనూ సూపర్ సక్సస్ సాధించాయి. త్వరలోనే ‘అలవైకుంఠపురములో’ మూవీ బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది.

ఇప్పటికే తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ బాలీవుడ్లో ‘కబీర్ సింగ్’గా రీమేకై కలెక్షన్ల సునామీ సృష్టించింది. అలాగే నాని నటించి ‘జెర్సీ’మూవీ కూడా ఇటీవలే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. లారెన్స్ ‘కాంచన’ మూవీ కూడా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీలో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ‘అలవైకుంఠపురములో’ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ మూవీని హిందీలోనూ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తాడని తెలుస్తోంది.

మురిగిపోయిన మండలి బిల్లు.. రద్దైన రాజధాని బిల్లు!

ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ పేరు మార్పు బిల్లులకు శాసనమండలి మోకాలడ్డడంతో ఆర్డినెన్స్‌ తీసుకు రావడం ద్వారా వెంటనే రాజధాని మార్పు పక్రియను వేగవంతం చేయాలనీ ప్రభుత్వంలో కసరత్తు జరుగుతున్నది. దీనిలో భాగంగానే చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ఉభయ సభలను ప్రొరోగ్‌ వెంటనే సిఆర్‌డిఎ, విభజన బిల్లులపై ఆర్డినెన్సులు తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే ఈ విషయమై ప్రభుత్వంలోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈ బిల్లులు ఇప్పటికే కోర్టులో ఉన్నాయని, వాటిపై ఆర్డినెన్స్‌ తేవడం అనేది అంత తేలికైన విషయం కాదని పలువురు ఎమ్మెల్సీలు చెబుతున్నారు. అయితే సెలెక్టు కమిటీకి పంపి 14 రోజులు దాటిపోవడంతో ఇంతవరకూ ప్రకటన రాలేదని, దీంతో కమిటీకి విలువలేదని, బిల్లులు ఆమోదం పొందినట్లేనని రెవెన్యూ మంత్రి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ చెప్పడం గమనార్హం.

సెలెక్టు కమిటీపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం బిల్లులు సెలెక్టు కమిటీకి వెళ్లాయని వివరించారు. కమిటీ అభిప్రాయం వ్యక్తంచేసిన తరువాత తాము వాదనలు వింటామని కోర్టు తెలిపింది.

వికేంద్రీకరణ బిల్లు, సిఆర్‌డిఎ బిల్లు అసలు సెలెక్టు కమిటీకి వెళ్లలేదని మంత్రులు ప్రకటనలు చేస్తుండగా, వెళ్లాయని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలపడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. ఒకవేళ వీటిపై ఆర్డినెన్స్‌ ఇచ్చినా అది కోర్టు పరిధిలోనే ఉంటుందని టిడిపి సీనియర్‌ సభ్యులు యనమల రామకృష్ణుడు స్పష్టం చేస్తున్నారు.

బిల్లులు సెలెక్టు కమిటీకి వెళ్లాయని ఒకసారి చెప్పి, మరోసారి కాలం చెల్లిపోయిందని చెబుతున్నారని, మరలా ఆర్డినెన్స్‌ అనేది అర్థంలేని విషయమని, ఈ వ్యవహారంలో ప్రభుత్వం స్పష్టమైన అభిప్రాయం చెప్పలేకపోతోందని అధికార పక్షం నేతలోనే అసహనం వ్యక్తం అవుతున్నది. ఒకవేళ బిల్లు ఆమోదం పొందిందని చెబితే అసెంబ్లీ సెక్రటరీపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆర్డినెన్స్‌ వ్యవహారం అధికారపక్షంలో కలకలం రేపుతున్నది.

మరోవంక, సెలెక్టు కమిటీ విషయంలో వెంటనే కమిటీల వివరాలను ప్రకటిస్తూ నోటిఫికేషన్‌ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని మండలి చైర్మన్‌ ఆదేశించారు. సాంకేతిక కారణాలు చూపుతూ కమిటీల ఫైలును చైర్మన్‌కు పంపిన నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. వెంటనే ప్రకటన విడుదల చేయాలని సూచించారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఛైర్మన్‌ హెచ్చరించినట్లు తెలిసింది.

వేలెంటైన్స్ డే స్పెషల్: 14 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్

రాయల్ పిక్చర్స్ పతాకంపై నోయెల్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న‌ చిత్రం `14`. లక్ష్మిశ్రీనివాస్ ద‌ర్శకత్వంలో సుబ్బారావ్ రాయన, శివకృష్ణ నిచ్చెన మెట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. వైవిద్యభరితమైన ఈ చిత్రంలో రతన్, విశాఖ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ ఆచార్య, మహేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 14 వేలెంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని బిగ్ బాస్ విన్నర్ `రాహుల్ సిప్లిగంజ్` విడుదల చేశారు. ఈ సందర్భంగా.

రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ… “ఈ మోషన్ పోస్టర్ చాలా కొత్తగా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది. ఈ పోస్టర్ లాగే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అనుకుంటున్నాను. నోయల్ కి `కుమారి 21ఎఫ్` సినిమాకన్నా ఎక్కువ పేరు రావాలని ఆశిస్తున్నాను. టీమ్ అంద‌రికీ నా బెస్ట్ విషెస్‌“ అన్నారు.

దర్శకుడు లక్ష్మిశ్రీనివాస్ మాట్లాడుతూ – “కొత్త పాయింట్ ని ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాం. త‌ప్ప‌కుండా మా చిత్రం మంచి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

నోయెల్ సీన్, రతన్, వైశాఖ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ ఆచార్య, మహేష్ తదితరులు నటిస్తున్నారు.

నితిన్ కాబోయే భార్య ఎలా ఉందో చూశారా…

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో ఒకరైన నితిన్ ఈ సమ్మర్ లో ఫ్యామిలీ మ్యాన్ అవ్వబోతున్నాడు. నితిన్ లండన్‌లో చదువుతున్న సమయంలో షాలినితో ప్రేమలో పడ్డడట. ఇరుపక్షాల తల్లిదండ్రుల సమ్మతితో రేపు (ఫిబ్రవరి 15న) హైదరాబాద్ లోని నితిన్ నివాసంలో నిశ్చితార్థ జరగనుంది. ఏప్రిల్ 16 న హిందూ ఆచారాల ప్రకారం దుబాయ్‌లోని పాలాజ్జో వెర్సాస్ హోటల్‌లో ఈ వివాహం జరగబోతోంది.

నితిన్ చేసుకోబోయే అమ్మాయి ఎలావుంటుందో అని అటు ఫాన్స్ ఇటు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈరోజు షాలిని యొక్క ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటో చుసిన వారంతా అమ్మాయి చాల బాగుంది నితిన్ కి బెస్ట్ జోడి అంటున్నారు.

ప్రస్తుతం నితిన్ భీష్మ సినిమా చేస్తున్నారు. ఈ నెల ఫిబ్ర‌వ‌రి 21న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.

చంద్రబాబు మెడకు చుట్టుకున్న ఐటీ ఉచ్చు

టీడీపీ హయాంలో చంద్రబాబు పాలనలో లొసుగులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఒకవైపు అమరావతిలో మనీల్యాండరింగ్ బాగోతం టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతుండగా.. మరోవైపు తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి చిట్టా బయటకు వస్తుంది. తాజాగా ఐటీ దాడుల్లో 2వేల కోట్ల బాగోతం బయటపడ్డది.

హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, కడప పుణే వంటి 40 చోట్ల గత ఆరు రోజులుగా చంద్రబాబు పిఏ పై జరుగుతున్న ఐటీ సోదాలలో విస్తు గొలిపే విషయాలు బయట పడుతున్నాయి. భారీ నగదు కుంభకోణం, అధిక స్థాయిలో భూముల కొనుగోలు, కాంట్రాక్టర్ల విషయంలో బోగస్ టెండర్లు, వాటికి సంబంధించిన నోటీసులు వంటి అనేక కోణాలలో ఐటీ సోదాలు నిర్వహించి ఇప్పటికే కీలక పాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా తెలిపారు.

గతంలో మంత్రి ఉపసంఘం నివేదిక మరియు సిబిఐ ఇచ్చిన ఆధారాలతో టీడీపీపై కేసు పెట్టడం జరిగింది. 797మంది తెల్లరేషన్ కార్డు ఉన్న పేదల పేర్ల పై వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఉన్నట్లు సిబిఐ గుర్తించి, తగిన నివేదికను ఆధారాలతో సహా ఈడీకి అందజేసిన విషయం తెలిసిందే..

2014 జూన్ నుంచి డిశంబర్ మధ్య కాలంలో కృష్ణా, గుంటూరు జిల్లాలలో దాదాపు 4వేల ఎకరాల భూ కుంభకోణం జరిగినట్టు మంత్రి వర్గం నిగ్గుతేల్చింది. అందులో తెల్లరేషన్ కార్డు దారులు దాదాపు 760 ఎకరాల స్థలం కొనుగోలు చేసినట్లు ఏసిబిఐ ఆధారాలు స్వీకరించింది.

సైరా దర్శకుడికి నో చెప్పిన ‘మెగా’ హీరో?

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టు ‘సైరా’ను దర్శకుడు సురేందర్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో తెలుగులో భారీ విజయం సాధించింది. అయితే మిగతా భాషల్లో ‘సైరా’ అనుకున్నంత ఫలితాన్ని సాధించలేదు. భారీ బడ్జెట్ తో ‘బహుబలి’ మూవీ రేంజ్లో కలెక్షన్లు రాబడుతుందనకున్నా అది జరగలేదు. అయితే సైరా నర్సింహారెడ్డి జీవితగాథను తెరకెక్కించడంలో సురేందర్ రెడ్డి, మెగాస్టార్ ఇద్దరు సక్సస్ అయ్యారు. అయితే దర్శకుడు సురేందర్ రెడ్డితో నటించేందుకు ఓ మెగా హీరో నో అన్నాడనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

‘సైరా’ తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి మరో పాన్ ఇండియా మూవీని తెరకెక్కించేందుకు కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ కథను ప్రభాస్ దగ్గరికి తీసుకెళ్లాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ బీజీగా ఉండటంతో రెండేళ్ల సమయం పట్టేలా ఉంది. దీంతో ఈ మూవీలో నటించాలని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని కోరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇటీవల సురేందర్ రెడ్డి నిర్మాత రాంచరణ్ కు ‘సైరా’ విషయంలో గొడవ జరిగిందని, దీంతో సురేందర్ రెడ్డి దర్శక-నిర్మాత మండలిలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమోగానీ తెలియదుగానీ వరుణ్ తేజ్ ఈ కారణంగానే సురేందర్ రెడ్డి మూవీ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి, రాంచరణ్ చాలా సన్నిహితంగా ఉంటాడు. రాంచరణ్ తో కలిసి ‘ధృవ’ మూవీని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీలో సురేందర్ పనితనం నచ్చి మెగాస్టార్ ‘సైరా’ మూవీకి దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఈ మూవీలో తెలుగులో భారీ కలెక్షన్లు రాబట్టిన హిందీలో నిరాశ పరిచింది. ఈ మూవీ విషయంలో రాంచరణ్, మెగాస్టార్ హ్యాపీగానే ఉన్నారు. కావాలనే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పలువురు అంటున్నారు. అయితే సురేందర్ ప్యాన్ ఇండియా మూవీలో వరుణ్ తేజ్ నటిస్తారా? లేదా అనేది మాత్రం త్వరలోనే తేలనుంది.

వాలెంటైన్స్ డే ఎలా మొదలైంది..? దీని చరిత్ర ఏంటి.. ?

 

అసలు ఈ వాలెంటైన్స్ డే ఎలా మొదలైంది ? దీని చరిత్ర ఏంటి ? ఇది తెలియాలి అంటే మనం ఒకసారి రోమన్ కాలం నాటికి వెళ్ళాల్సిందే… చరిత్ర ప్రకారం వాలెంటైన్స్ డే అనేది రోమన్ కాలం నుండి ఉన్నదని చెబుతారు. ఆ కాలంలో యుద్ధ సమయంలో పురుషులు ఎవరు స్త్రీలని వివాహం చేసుకోకూడదు అనే నిబంధన ఉండేది. ఈ నిబంధనను అప్పటి చక్రవర్తి క్లాయూడీఎస్ 2 ఆమోదించడం జరిగింది.

కానీ, వాలెంటైన్ అనే మత గురువు ప్రేమికులకు రహస్యంగా పెళ్లిళ్లు జరిపించేవారు. ఎప్పుడైతే రాజుకు ఈ విషయం తెలిసిందో వాలెంటైన్ ని జైలులో నిర్బంధించారు. జైల్లో ఉండగా వాలెంటైన్ ఆ జైలు అధికారి కుమార్తెతో స్నేహం చేసాడు.

అయితే జైలు అధికారి కుమార్తెకు కళ్ళు లేవు, ఆమెకు కళ్ళు తెప్పించడానికి వాలెంటైన్ చనిపోయాడని చరిత్ర చెప్తుంది. వాలెంటైన్ చనిపోయే ముందు ఆమెకు ఒక ఉత్తరం రాసాడు అందులో ” మీ వాలెంటైన్ నుండి ” అని సంతకం చేసి ఉంటుంది. ఈ సంఘటన ఫిబ్రవరి 14 వ తేదీన జరిగింది.

ఈ విధం గా వాలెంటైన్, ప్రేమికుల కోసం జైలుకి వెళ్లి, స్నేహం కోసం చనిపోవడంతో అతనికి గుర్తుగా హెన్రి VII అనే ఇంగ్లాండ్ కు చెందిన రాజు, ఫిబ్రవరి 14 వ తేదీని సెలవు దినంగా ప్రకటించి, ఈ రోజుని వాలెంటైన్స్ డే గా జరుపుకోమని అధికారికంగా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజుగా జరుపుకుంటున్నారు.

భీష్మా సింగిల్ ఆంథెమ్ మెంటలే వీడీయో సాంగ్

నితిన్ మరియు రష్మిక మండనా నటించిన సినిమా భీష్మా, ఈ సినిమాని ఛలో దర్శకుడు వెంకీ కుడుములు తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా సినిమాకు సంబందించిన సింగిల్ ఆంథెమ్ వీడీయో సాంగ్ రిలీజ్ చేశారు

గుడ్ న్యూస్ చెప్పిన నయనతార..

దక్షిణాదిన లేడి సూపర్ స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న నయనతార నిర్మాతలకు, అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కెరీర్ తొలినాళ్లలో నయనతార గ్లామర్ పాత్రలు చేస్తూ అభిమానులను అలరించించింది. అయితే గత కొంతకాలంగా నయనతార పెళ్లి, ప్రేమ వ్యవహారాలు అనే టాపిక్ రావడంతో ఆమె గ్లామర్ షో తగ్గించింది. బికీనీలు, పొట్టి డ్రెస్సులకు దూరంగా ఉంటూ సంప్రదాయ పాత్రల్లో, లేడి ఓరియెంటెడ్ పాత్రల్లోనే కనిపించిది. అయితే తాజాగా నయనతార నిర్మాతలకు బంపర్ ఆఫ్ ఇచ్చిందని తెలుస్తోంది. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ముద్దు సన్నివేశాల్లో నటించడంతోపాటు బికినీ వేసేందుకు కూడా రెడీ అని చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సౌత్ ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్ గా నయనతార కొనసాగుతోంది. ఆమె నటించిన సినిమాలన్నీ బంపర్ హిట్టుగా నిలుస్తున్నాయి. దీంతో ఆమెను బుక్ చేసుకునేందుకు నిర్మాతలు ఎగబడుతుంటారు. అయితే నయనతార సినిమా ప్రమోషన్లలో పాల్గొనకపోవడంతో ఆమెపై చాలా రుమర్లు వస్తుంటాయి. గత కొద్దిరోజులుగా నిర్మాతలు కూడా ఈ విషయంలో ఆమెపై గుస్సగా ఉంటున్నారు. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు తగ్గుతూ వస్తున్నాయి. అంతేకాకుండా గత కొద్దిరోజులుగా నయనతార గ్లామర్ షోను తగ్గించి కేవలం నటపరమైన సినిమాలకే ప్రాధాన్యమిస్తూ సినిమాలను చేస్తున్నారు.

తాజాగా నయనతార గ్లామర్ షోకు ఒకే చెప్పడంతో నిర్మాతలతోపాటు ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. గత కొన్నాళ్లుగా నటనపరమైన సినిమాలే చేసిన నయనతారను మళ్లీ గ్లామరస్ గా చూడాలని కుర్రకారు ఉవ్విళ్లిరుతున్నారు. ఇన్నాళ్లు చీరలు, చీడిదార్లతో అలరించిన నయన్ ఇక బికీనీలు, పొట్టి దుస్తులతో అలరించబోతుంది. ఆఫర్లు తగ్గుతున్నాయని గమనించిన నయన్ ఇలా నిర్మాతలకు ఆఫర్ ప్రకటించిన మళ్లీ సినిమాలను లైన్లో పెడుతూ తన క్రేజ్ తగ్గకుండా చూసుకుంటుంది. ఎంతైనా నయనతార నయా నిర్ణయం ఆమెకు బాగా కలిసొచ్చేలా కన్పిస్తుంది.

కరోనా దెబ్బతో.. భారత అర్ధిక వ్యవస్థ కుదేల్


తెలుగులో ఒక సామెత ఉండేది.. ఏమిటంటే..”ఎంకి పెళ్ళి, సుబ్బి చావుకొచ్చిందట” ప్రస్తుతం మన భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి కూడా ఇలానే ఉంది. కరోనా వైరస్ చైనాలో పుట్టి, ప్రపంచంలో దాదాపు 23 దేశాలకు పాకింది. అయితే చైనాలో ఉన్నంత ప్రభావం మన దేశంలో లేదు. కానీ, చైనాలో వచ్చిన ఆర్థిక సంక్షోభం మన దేశాన్ని ప్రభావితం చేయొచ్చు. ఇప్పటికే ఈ కరోనా దెబ్బతో చైనా 15లక్షల కోట్ల మేర నష్టపోయిందని ఒక అంచన.

 

ప్రస్తుతం చైనా వృద్ధి రేట్ 6.1 శాతం, కరోనా దెబ్బతో 2 శాతం తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. 2002-03 మధ్య కాలంలో సార్స్ ప్రభలినప్పుడు చైనా వృద్ధిరేటు 1శాతం కంటే ఎక్కువగానే తగ్గింది. ఇటీవల కరోనా వైరస్ అంతకంటే ఎక్కువేగానే.. ప్రబలింది కాబట్టి చైనా ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారే అవకాశాలు లేకపోలేదు.

 

ఇక మనదేశం విషయానికి వస్తే.. చైనా కి భారత్ కి మధ్య వర్తకం విలువ 87 బిలియన్ డాలర్లు. దాదాపు 17 శాతం ఉత్పత్తులు చైనా నుంచే భారత్ కి వస్తాయి. ఫార్మా మెడిసిన్స్ కి సంబందించిన ముడి సరుకు, సోలార్ ఎనెర్జీకి సంబంధించిన పానెల్స్, మోడ్యూల్స్, ఆటోమొబైల్ కంపోనెంట్స్, స్మార్ట్ ఫోన్లు ఇలా అనేక రకమైన చైనా వస్తువులు భారత్ కి దిగుమతి అవుతున్నాయి. కరోనా దెబ్బతో చైనా, ఈ ఉత్పత్తికి చెందిన అనేక కంపెనీలు మూతపడ్డాయి. కరోనా కంట్రోల్ అయ్యి, ఆ కంపనీలు తెరువబడి, ఉత్పత్తి మొదలుపెట్టి భారత్ కి దిగుమతి చేయాలంటే.. ఎక్కువ సమయమే పడుతుంది. కాబట్టి భారత్ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఒక పక్క జగన్ తో..మరో పక్క పవన్ తో బీజేపీ మాస్టర్ ప్లాన్

రోజు రోజుకి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏపీలో అధికారం చేజిక్కిచ్చుకోటానికి బీజేపీ పెద్ద ప్రణాళికనే సిద్ధం చేసినట్లుగా అనిపిస్తుంది. ఇటీవల కాలంలోనే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని మునిసిపల్ ఎలక్షన్స్ కి వెళ్లాలనే నిర్ణయం తీసుకుంది. అయితే జనసేనతో కలిసి అధికారంలోకి వెళ్లగలమో లేదో.. అని లోలోపల మధనపడుతూనే..బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది.

దేశ వ్యప్తంగా క్రమంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది . పార్లమెంటులో పూర్తిస్థాయి బలం ఉన్నా.. అసెంబ్లీ స్థానాలలో మాత్రం అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపలేకపోతుంది. చాల రాష్ట్రాలలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలదే హవా..వాటిని అధిగమించలంటే..బీజేపీకి కష్టమైన పనే. ఈ మధ్య విడుదల అయిన అన్ని అసెంబ్లీ ఫలితాలలో.. ఏవీ కూడా బీజేపీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. మహారాష్ట్రలో శివసేన హ్యాండ్ ఇవ్వటంతో..అధికారానికి దూరం అయ్యింది. హరియానాలో జేజేపీ సహాయంతో అతికష్టం మీద అధికారం చేజిక్కిచ్చుకుంది. ఢిల్లీలో అయితే ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బకి బీజేపీ దుకాణం కట్టేసాల అయ్యింది. ఇలా వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలకు స్వస్తి చెప్పలనీ..అన్ని రాష్ట్రాలలో పకడ్బందీ ప్రణాళికని రచిస్తోంది.

ఇందులో భాగంగానే ఏపీలో ఉన్న రెండు ముఖ్య పార్టీలను తన వైపు తిప్పుకుంది. జనసేనతో పొత్తు పెట్టుకుని..ఇప్పుడు వైసీపీతో రహస్య మంతనాలు జరుపుతుంది. సీఎం జగన్ మొన్న హుటాహుటిన ఢిల్లీ వెళ్లి మోడీని కలిశారు…మరల ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లి అమిత్ షా ని కలవనున్నారు. ఇప్పడు జగన్ ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. జగన్, బీజేపీ నాయకత్వంతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు అనే జనలలో కూడా గుసగుసలు. ఇలాంటి వార్తలు పుట్టటానికి గల కారణం జగన్, మోడీ ప్రభుత్వంపై సానుకూలంగా స్పందించటమే..అవసరమైన అన్ని విషయాలలో బీజేపీకి మద్దతుగా నిలుస్తూనే ఉన్నాడు. బీజేపీ కూడా జగన్ పై ఇదే ధోరణి ప్రదర్శిస్తుంది. దీనితో జగన్ మోడీలు తేర వెనుక రహస్య ఒప్పందాలు చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలా జనసేనని, వైసీపీని ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో బలపడాలనే ప్రయత్నంలో ఉంది. ఈ విధంగా అధికారంలో ఉన్న వైసీపీతోను, ప్రజల్లో ఎదుగుతున్న జనసేనతోను కలిసి అధికారంలోకి రావాలనుకుంటుందనే వార్త ప్రజల్లో చక్కర్లు కొడుతుంది.

Kiara Advani Beautiful Pics

కాంగ్రెస్ లో చిచ్చు రేపుతున్న ఢిల్లీ పరాజయం!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైనా ఘోర పరాజయం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతున్నది. పార్టీ అధినాయకత్వం తీరు మారాలంటూ బహిరంగంగానే విమర్శలు చెలరేగుతున్నాయి. తాజాగా పార్టీ సీనియర్ నేతలు, మాజీ కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, జైరాం రమేశ్‌లు ఆ జాబితాలో చేరారు.

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తీవ్ర నిరాశకు గురి చేసిందని సింధియా అంటూ, పార్టీలో సమూల మార్పు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మరో నేత జై రాం రమేశ్ అయితే మరో అడుగు ముందుకు వేసి పార్టీ అధికారం కోల్పోయి ఆరేళ్లయినా తమలో కొంతమంది తాము ఇంకా మంత్రులమేనన్న రీతిలో ప్రవర్తిస్తున్నారంటూ పార్టీ నేతలకు చురకలు వేశారు.

‘కాంగ్రెస్ నేతలు పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం ఉనికిని కోల్పోతాం. మన తలబిరుసుతనం పోవాలి. అధికారానికి దూరమై ఆరేళ్లయినా మనలో కొంతమంది తాము ఇంకా మంత్రులమేనన్న రీతిలో ప్రవర్తిస్తున్నారు’ అని రమేశ్ ఘాటుగా స్పందించారు. పార్టీ నాయకత్వం, పని తీరు మారాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే జ్యోతిరాదిత్య సింధియా 70 స్థానాల్లో 62 స్థానాలను గెలుచుకున్న అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీనిఅభినందిస్తూ, ఢిల్లీ ప్రజలు మరో సారి మీబృందంపై విశ్వాసముంచారని చెప్పారు.

కాగా, ఫలితాలు తనకు తీవ్ర నిరాశ కలిగించాయని అంటూ కాంగ్రెస్‌కు కొత్త తీరు అవసరముంది. కాలం మారింది.. దేశం కూడా మారింది. మనం ప్రజలకు చేరువ కావాలి. లోక్‌సభ ఎన్నికల తర్వాత మనం కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశాం’ అని గాంధీ కుటుంబానికి సన్నిహాయ్తుడైన సింధియా పేర్కొన్నారు.

ఢిల్లీలో కాంగ్రెస్ పతనం దివంగత మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ హయాంలోనే మొదలైందంటూ పార్టీ ఢిల్లీ ఇన్‌చార్జి పిసి చాకో చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మిలింద్ దేవర తప్పు బట్టారు. షీలా దీక్షిత్ గొప్ప నాయకురాలు, సమర్థవంతమైన పరిపాలకురాలని, ఆమె చనిపోయిన తర్వాత ఆమెను నిందించడం దురదృష్టకరమని దేవర అన్నారు.

పార్టీ ఘోర పరాజయానికి నేనుసైతం బాధ్యత వహించాలి అంటూ ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిష్ట ముఖర్జీ ట్వీట్ చేశారు. ఎన్నికలన్న తరువాత గెలుపు ఓటమిలు సహజమేననీ.. అయితే, బీజేపీకి చావుదెబ్బ తగలడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

బీజేపీని వ్యతిరేకించే అనేకమంది ఆప్‌కు లేదా కాంగ్రెస్‌కు ఓటు వేశారంటూ ఆ పార్టీ ఎంపీ ప్రతాప్‌సింగ్ బజ్వా పేర్కొన్నారు. ‘రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో ఒకటి మాత్రం చెప్పగలం.. నాయకత్వ లోపం కూడా ఇందుకు కారణమని చెప్పొచ్చు.. ప్రజలకు ఆ నాయకుడిపై నమ్మకం ఉంటే తప్పక గెలిపిస్తారు’ అని బజ్వా వివరించారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ. చిదంబరం మాట్లాడుతూ ఢిల్లీలో 15 ఏళ్లపాటు షీలా దీక్షిత్ హయాంలో చేసిన అభివృద్ధిని వివరించడంలో వైఫల్యం చెందామనీ పేర్కొన్నారు.

ట్రంప్ కు మురికి వాడలు కనిపించకుండా అడ్డుగోడలు!

దేశం మొత్తానికి ఆదర్శంగా గుజరాత్ రాష్ట్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుష్కరకాలం పాటు ప్రధానిగా ఉన్న సమయంలో తీర్చిదిద్దరని ఒక వంక బిజెపి ప్రచారం చేస్తుంటుంది. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ వస్తున్నారంటే అక్కడున్న బీజేపీ ప్రభుత్వం ఖంగారు పడుతున్నది.

రాష్ట్ర రాజధాని గాంధీనగర్ పరిసరాలలోనే మురికి కాలువలు, మురికివాడలు చూసి ఆయనిక్కడ మోదీ అభివృద్ధి నమూనా ఇదే అని పెదవి విరుస్తారో అనుకొంటూ హడావుడిగా అవి కనిపించకుండా చేస్తున్నారు.

ట్రంప్‌ పర్యటించే మార్గంలోని మురికివాడలు ఆయనకు కనిపించకుండా అడ్డుగోడ నిర్మాణం చేపడుతున్నారు. ఈ మేరకు అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఒక్కో గోడ ఎత్తును కనీసం ఆరు నుంచి ఏడు అడుగుల వరకు పెంచుతున్నారు. సుమారు రూ. 50 కోట్ల వ్యయంతో ఈ పనులు చకచకా జరుగుతున్నాయి.

గాంధీనగర్‌ విమానాశ్రయం నుంచి ఆర్థిక రాజధాని అహ్మదాబాద్‌ మధ్య ఉండే సర్దార్‌ వల్లభ్‌ భారు పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ట్రంప్‌, మోడీలు రోడ్‌ షో నిర్వహించనున్నారు. విమానాశ్రయాన్ని దాటి బయటికి వచ్చాక.. అహ్మదాబాద్‌ వైపు వెళ్లే మార్గానికి ఒక వైపున పెద్ద సంఖ్యలో మురికివాడలు ఉంటాయి. వాటిని దేవ్‌ శరణ్‌ లేదా శరణి ఆవాస్‌ అని పిలుస్తారు. ఇపుడు ఈ మురికివాడలు కనిపించకుండా అడ్డుగోడ కడుతున్నారు.

గోడ వెనుక ఏమున్నదో తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నంతో… ముందు భాగమంతా రంగులు, మొక్కలతో అలంకరించబోతున్నారు. దీనికోసం సుమారు 2500 మొక్కలను సిద్ధం చేస్తున్నారు.

2002లో హైదరాబాద్‌కు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ వచ్చినపుడు ఇక్కడ ఉన్న బిచ్చగాళ్లను వెతికి మరీ భాగ్యనగరం బయటకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరిమారు. అలాగే రెండేండ్ల క్రితం ట్రంప్‌ కూతురు ఇవాంకా హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ సర్కారు అదే ఫార్ములాను అమలుచేసింది