Homeఆంధ్రప్రదేశ్‌మోడీ జగన్ గంటకు పైగా దీని గురించే చర్చించుకున్నారంట..

మోడీ జగన్ గంటకు పైగా దీని గురించే చర్చించుకున్నారంట..

ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీ వెళ్లి మోడీని కలిసిన సంగతి అందరికి తెలిసిందే..అయితే వాళ్ళు ఏమి చర్చించుకున్నారు అన్న దానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న జగన్..దాదాపు గంట నలబై నిమిషాల పటు మోడీతో సమావేశం అయ్యారు. జగన్ మోడీకి పది అంశాలతో కూడిన నివేదిక అందచేసినట్లు వార్తలు వినిపించాయి.

అవేంటంటే..

  • రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం గురించి జగన్ మోడీకి వివరించారు.
  • హై కోర్టును కర్నూలుకు తరలించే విధంగా న్యాయశాఖకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరారు.
  • శాసన మండలి రద్దు విషయాన్ని జగన్ మోడీ దృష్టికి తీసుకెళ్లారు.
  • మహిళలకు అండగా నిలబడే దిశా చట్టాన్ని ఆమోదించే విధంగా హోం శాఖకు అదేశాలు జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసారు.
  • మార్చి 25వ తారీఖున 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమానికి రావాల్సిందిగా మోడీని ఆహ్వానించారు.
  • తూర్పు గోదావరి జిల్లాలోని 800 ఎకరాల ఉప్పు భూమిని ఇళ్ల పట్టాలకు కేటాయించాల్సిందిగా జగన్ మోడీని కోరారు.
  • రాష్ట్రం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చుపెట్టిన 3320 కోట్లు వెంటనే విడుదల చేయల్సిందిగా జగన్ విజ్ఞప్తి చేసారు.
  • రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే..ప్రత్యేక హోదా తప్పనిసరి అని మోడీని కోరారు.
  • రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన రెవిన్యూ లోటును భర్తీ చేయాలనీ జగన్ కోరారు.
  • గతంలో ఎన్నడు లేని విధంగా ఏపీకి అతి తక్కువ గ్రాంట్లు వచ్చాయని..పెండింగులో ఉన్న గ్రాంట్లను విడుదల చేయాలనీ విజ్ఞప్తి చేసారు.
  • కడప స్టీలు ప్లాంట్, రామాయపట్నం పోర్టుకి నిధులు మంజూరు చేయాల్సిందిగా జగన్ మోడీకి అభ్యర్ధన చేసారు.
  • కృష్ణా గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాల్సిందిగా జగన్ మోడీని కోరారు.
  • రాజధాని నిర్మాణం కోసం నిధులు మరియు వెనకబడిన జిల్లాల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాల్సిందిగా జగన్ మోడీని కోరారు.

ఈ అంశాలపై జగన్ మోడీతో సుదీర్ఘంగా గంటకు పైగా చర్చించి..సానుకూల స్పందన వస్తుందనే నమ్మకంతో ఏపీకి తిరుగుపయనం అయ్యారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular