Home Blog Page 8623

Rashmika at Bheeshma Pre Release Event

హర్భజన్ సింగ్ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్

తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేసిన ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్ తన సుదీర్ఘ క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్దం అయ్యారు. పలు కంపెనీలను ప్రమోట్ చేయడం కోసం కెమెరా ముందుకు వచ్చిన హర్భజన్ సింగ్ ఈసారి ‘ఫ్రెండ్ షిప్` సినిమాలో హీరోగా న‌టిస్తున్నారు. త‌మిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మ‌రియ‌నేస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జెపిఆర్ & స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నట్టు తెలిపింది చిత్ర యూనిట్.

ఈ చిత్రాన్ని పలు భార‌తీయ‌ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాలోని ఇతర నటీనటులు. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్ల‌డించనున్నారు. వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి ఏడాది సమ్మర్ స్పెష‌ల్‌గా విడుద‌ల‌చేయ‌నుంది చిత్ర యూనిట్‌.

Bheeshma Movie Pre Release Event Photos

రాంచరణ్ కు దక్కిన ‘డ్రైవింగ్ లైసెన్స్’

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, నిర్మాతగా విజయం సాధిస్తున్నాడు. ఓ వైపు తన సినిమాలను చేస్తూనే మరోవైపు సినిమాలను నిర్మిస్తూ దూసుకుపోతున్నాడు. తాను స్థాపించిన కొణిదల ప్రొడక్షన్లో తండ్రితో కలిసి ఖైదీ-150, సైరా వంటి బ్లాక్ బ్లస్టర్ మూవీని నిర్మించాడు. ఇటీవలే మలయాళం సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ రీమేక్ హక్కుల్ని దక్కించుకున్నాడు. తాజాగా మరో మళయాళ మూవీ ‘డ్రైవింగ్ లైసెన్స్’ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

రాంచరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్లో బీజీగా ఉన్నాడు. అంతేకాకుండా కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్-152వ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో రాంచరణ్ తండ్రితో కలిసి నటించనున్నాడు. చిరంజీవి యంగ్ క్యారెక్టర్లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. తాజాగా దక్కించుకున్న ‘లూసీఫర్’ మూవీని కూడా తండ్రి కోసమే దక్కించుకున్నాడు. ఈ మూవీలోనూ చిరంజీవే హీరోగా నటించనున్నాడు. ‘లూసీఫర్’ మూవీని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ‘లూసీఫర్’ కథను తెలుగు నెటివిటీకి అనుగుణంగా మార్పు చేస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా దక్కించుకున్న ‘డ్రైవింగ్ లైసెన్స్’ మళయాళంలో మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇప్పటివరకు కేవలం మెగాస్టార్ తోనే సినిమాలు చేసిన రాంచరణ్ తాజాగా మరో హీరోతో ‘డ్రైవింగ్ లైసెన్స్’ నిర్మించనున్నాడు. అయితే మెగా కాంపౌండ్ కు చెందిన హీరోతోనే ఈ మూవీని తీయనున్నట్లు ప్రచారం జరగుతుంది. మొత్తం మీద ‘డ్రైవింగ్ లైసెన్స్’ లో నటించే మెగా హీరో ఎవరా? అనే ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ మూవీపై రాంచరణ్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

గీత ఆర్ట్స్ బ్యానర్లో మహేష్ మూవీ?

 

సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా నిర్మాత అల్లు అరవింద్ కలయికలో త్వరలోనే ఈ మూవీ రాబోతుంది. గీత ఆర్ట్స్ బ్యానర్లో మహేష్ బాబుతో మూవీ చేసేందుకు అల్లు అరవింద్ సన్నహాలు చేస్తున్నాడు. సూపర్ స్టార్, మెగా నిర్మాత కలయికలో వచ్చే మూవీని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

కేజీఎఫ్ మూవీతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అగ్ర దర్శకుడిగా మారాడు. కేజీఎఫ్ మూవీ విడుదలైన అన్ని భాషల్లో బాక్సీఫీస్ రికార్డులు సృష్టించింది. ప్రశాంత్ నీల్ ఇటీవల మహేష్ బాబుకు ఓ కథను విన్పించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మెగా నిర్మాత అల్లు అరవింద్ వద్దకు ఈ కథను తీసుకెళ్లగా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సూపర్ స్టార్ మెగా కాంపౌండ్లో పని చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అల్లు అరవింద్ మహేష్ బాబుతో సినిమా తీసేందుకు ప్రయ్నతాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కించున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్-2 మూవీ షూటింగ్లో బీజీగా ఉన్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. అదేవిధంగా మహేష్ బాబు వంశీ పైడిపల్లితో మూవీ చేయనున్నాడు. ఈ రెండు మూవీలు పూర్తయ్యేనాటికి గీత ఆర్ట్స్ బానర్లో మహేష్ మూవీ ప్రారంభం కానునుందని సమాచారం. గీత ఆర్ట్స్ బ్యానర్లో సూపర్ స్టార్ మూవీ చేయనున్నారని తెలియడంతో ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తి కలుగుతుంది.

బిజెపి తో పవన్ కళ్యాణ్ కటీఫా?

పవన్ కళ్యాణ్ మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు. ఈసారి బీజేపీ పై బాణాలు సంధించాడు. బీజేపీ తో కలిసి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు. అప్పుడే బీజేపీ కి షరతులు మొదలయ్యాయి. అలా అయితే బీజేపీ తో కటీఫ్, కానీ బీజేపీ అలా చెయ్యదు. బీజేపీ అలాచెయ్యదని నమ్మకమున్నప్పుడు మొదటి ప్రకటన ఎందుకు? చిన్నపిల్లలు మొరాం చేసినట్లుగా వుంది. రాజకీయాల్లో ఒకసారి అభిప్రాయం ఏర్పడితే పోగొట్టుకోవటం చాలా కష్టం. ఇప్పటికే తనకు పరిపక్వత లేదు, సీఎం స్టఫ్ కాదని పరిశీలకులు మాట్లాడుకుంటున్నారు. అటువంటప్పుడు ఆ అభిప్రాయాన్ని పోగొట్టుకోవాలంటే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ మరొక్కసారి పప్పులో కాలేసినట్లు కనబడుతుంది. అదేంటో చూద్దాం.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత జనాల్లో ఉండటానికి ప్రయత్నం చేయటం శుభపరిణామం. చాలామంది అనుకున్నట్లు గా కాకుండా ఎక్కువకాలం రాజకీయాల్లో ఉండటం హర్షించదగ్గ పరిణామం. ఇటీవలే తిరిగి సినిమాల్లో నటించాలని నిర్ణయించడంపై వివాదం చెలరేగినా మేధావులు , ప్రజలు తన వివరణపై అనుకూలంగా స్పందించారు. అంతవరకూ బాగానేవుంది. అలాగే ఇటీవల జరిగిన ఇంకో పరిణామం పవన్ కళ్యాణ్ బీజేపీ తో పొత్తుపెట్టుకోవటం. ఇది కూడా ఊహించని పరిణామమే అయినా తన భవిష్యత్తు, తన పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఒక జాతీయపార్టీతో పొత్తుపెట్టుకోవటం వలన వచ్చే నాలుగు సంవత్సరాలు ఎన్నికలవరకు పార్టీని నడపటానికి ఈ వ్యూహాత్మక పొత్తు ఉపయోగపడుతుందని భావించారు.

కొన్ని లోపాలున్నా అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన ఎత్తుగడలు స్థూలంగా వివాదాస్పదం కాలేదని చెప్పొచ్చు. బీజేపీ తో పొత్తు తో మూడో ప్రత్యామ్నాయంగా వచ్చే ఎన్నికలనాటికి ఎదిగే అవకాశం ఉందని కూడా పరిశీలకులు భావించారు. అన్నీ సాఫీగా సాగుతున్న సమయంలో ఆవేశానికి పోయి అనర్ధాలు కొని తెచ్చుకోవటం పవన్ కి అవసరమా? ఎంత సర్దిపుచ్చుకొని తనమీద అభిమానంతో సమర్ధించేవాళ్లకు కూడా ఒక్కోసారి చిరాకు తెప్పించటం పవన్ కళ్యాణ్ కే చెల్లింది. బీజేపీ తో పొత్తుపెట్టుకున్నప్పుడు మాట్లాడిన మాటలు ఆయన అభిమానులు, ప్రజలు మరిచిపోలేదు. అసలు నేను మొదట్నుంచీ బీజేపీ అభిమానినే అన్నట్లు మాట్లాడి ఎటువంటి షరతులు లేకుండా బీజేపీ కి మద్దత్తిస్తున్నట్లు చెప్పటం ఇంకా అందరికీ గుర్తే వుంది. అటువంటిది నిన్న అమరావతి లో మాట్లాడుతూ బీజేపీ కనక వైస్సార్సీపీ తో పొత్తు పెట్టుకుంటే నేను బీజేపీ తో కటీఫ్ చేసుకోవటం ఖాయమనే రీతిలో మాట్లాడటం అందరికీ ఆశ్చర్యమేసింది. అదేసమయంలో బీజేపీ ఆపని చేయదనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేయటం జరిగింది. రైతులు వేసిన ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పాలిగానీ బెదిరించినట్లు, బ్లాక్ మెయిల్ చేసినట్లు సమాధానం వుండకూడదు. రైతులకు రాజధాని ఒక్కటే సమస్య . అందులో వాళ్ళను తప్పుపట్టాల్సినది ఏమీలేదు. వాళ్ళ భవిష్యత్తు అంధకార బంధురంగా ఉండటంతో అనుమానాలు నివృత్తి చేసుకోవటం కోసం బీజేపీ-వైస్సార్సీపీ పొత్తుపై ప్రశ్నించారు. కానీ సమాధానం చెప్పేటప్పుడు దానివలన వచ్చే పర్యవసానాలు ఆలోచించుకొని మాట్లాడాలి. కేవలం బీజేపీ అటువంటి పొత్తు పెట్టుకోదని నా నమ్మకం అని చెప్పి ఉంటే బాగుండేది. దానితో ఆగకుండా అలా జరిగితే నేను తప్పుకుంటానని చెప్పటం ప్రజల్లో చులకనభావం ఏర్పడే అవకాశం వుంది. ఎందుకంటే బీజేపీ తో జతకట్టిందే మొన్న, అదీ ఎటువంటి షరతులు లేకుండా అని కూడా నొక్కి వక్కాణించి ఇప్పుడు వేరేగా మాట్లాడితే విమర్శలకు తావిచ్చినట్లయ్యింది.

జగన్ పార్టీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని టీడీపీ బి టీం గా ప్రచారం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అది వాస్తవం కాక పోవచ్చు. అయినా అటువంటి అభిప్రాయం బలపడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతయినా వుంది. ఇప్పటి సమాజంలో నిజాయితీగా ఉండటమే కాదు నిజాయితీగా వున్నట్లు ప్రజలు అనుకునేటట్లు కూడా ప్రవర్తించాల్సి ఉంటుంది. నిన్నటి సంఘటన అలాగా లేదు. కేవలం రాజధాని విషయంలో బీజేపీ పై ఒత్తిడి పెంచటానికే ఈ ఒప్పందం చేసుకున్నారని వైస్సార్సీపీ ప్రచారం చేయటానికి ఊతం ఇచ్చేలా వుంది. రాజధాని రైతులను సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో తీవ్ర వ్యాఖ్యలు చేస్తే అది మొదటికే మోసం వస్తుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజధానికి ఇన్ని ఎకరాలు అవసరం ఉండదని ఆరోజే చెప్పాననటం తన దూరదృష్టికి నిదర్శనంగా హర్షించే అవకాశం వుంది. అమరావతి రైతుల తరఫున మాట్లాడటం, రెండు కులాల ఘర్షణగా సమస్యని మార్చారని చెణుకులు విసరటం, బీజేపీ లో ఈ సమస్యపై గందరగోళం నెలకొందని వ్యాఖ్యానించటం లాంటి వి తను కూడా ప్రస్తుత రాజకీయాలపై చక్కగానే విశ్లేషిస్తున్నాడనే అభిప్రాయం, తన ఆలోచనల్లో పరిణితి వచ్చిందని ప్రజలు భావించేటట్లుగా వున్నాయి. కానీ వున్నట్లుండి ఊహాగానాలపై ఆధారపడి అలాగయితే బీజేపీ పొత్తునుంచి వైదొలుగుతానని చెప్పటం మిగతా పాజిటివ్ ఒపీనియన్ నుంచి ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మరల్చింది. బీజేపీ అధిష్టానం లో కూడా ఈ ప్రకటన వల్ల వ్యతిరేక భావం ఏర్పడే అవకాశం వుంది. బీజేపీ తో పొత్తు పెట్టుకోకముందే సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని వుండాల్సింది. ఒకసారి పొత్తుపెట్టుకున్న తర్వాత ఎదో ఒక విషయంలోనో , ఊహాగానాలపై ఆధారపడో సంచలన ప్రకటనలు ఇవ్వకూడదు. దానివలన మంచి జరగకపోగా చెడు జరిగే అవకాశాలు ఎక్కువ. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గతానుభవం నుంచి గుణపాఠాలు నేర్చుకుంటే మంచిది. లేకపోతే వచ్చే ఎన్నికలనాటికి ఎదురు దెబ్బలే తగులుతాయి. తస్మాత్ జాగ్రత్త.

నిర్భయ దోషులకు పక్కా ఉరి.. కోర్ట్ సంచలన తీర్పు

ఎన్నో వాయిదాల నడుమ నడుస్తున్న నిర్భయ దోషుల ఉరి వచ్చే నెల 3న ఖరారు చేసినట్లు పాటియాలా కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. మార్చి 3న నలుగురు ఉరి తీయాలని కోర్ట్ మరో కొత్త డెత్ వారెంట్ రిలీజ్ చేసింది.

ఎస్ఆర్ నగర్ లో ఘోరం..యువతిపై నుంచి వెళ్లిన కారు

హైదారబాద్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. రోడ్డు దాటుతున్న యువతిని బైక్‌ ఢీకొంది. దీంతో వెనుక నుంచి వస్తున్న కారు కింద పడడంతో.. ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్ధానికులు వెంటనే యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈ సంఘటన ఎస్ఆర్ నగర్‌లో జరిగింది. యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ధనుష్ ‘లోకల్ బాయ్’ రిలీజ్ డేట్

కథానాయకుడిగా ధనుష్‌ది విలక్షణ శైలి. ‘రఘువరన్ బీటెక్’లో సగటు మధ్యతరగతి యువకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘మారి’లో లోకల్ డాన్‌గానూ మెప్పించారు. ‘ధర్మయోగి’లో రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించి విజయం అందుకున్నారు. తమిళ ప్రాచీన యుద్ధవిద్య అడిమురై నేపథ్యంలో రూపొందిన ‘లోకల్ బాయ్’తో ఈ నెలాఖరున తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులోనూ ఆయన ద్విపాత్రాభినయం చేశారు. ‘ధర్మయోగి’ని తెలుగు ప్రేక్షకులకు అందించిన విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సీహెచ్‌ సతీష్‌కుమార్‌, ఈ ‘లోకల్ బాయ్’ను కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు.

ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘పటాస్’. ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకుడు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’, ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘ఎంత మంచివాడవురా’ సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మెహరీన్ ఈ సినిమాలో హీరోయిన్. స్నేహ మరో హీరోయిన్. ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘ఎవరు’ సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అద్భుత నటన కనబరిచిన నవీన్ చంద్ర విలన్ పాత్ర పోషించారు. తమిళంలో సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగులో ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సీహెచ్‌ సతీష్‌కుమార్‌ విడుదల చేస్తుస్తున్నారు.

నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ “మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా కోసం ధనుష్ మార్షల్ ఆర్ట్స్ లో స్పెషల్ ట్రయినింగ్ తీసుకున్నారు. ప్రాచీన యుద్ధవిద్య అడిమురై గొప్పదనం వివరించే చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. ఈ నెల 28న విడుదలవుతున్న సినిమాకు కూడా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. మెహరీన్, స్నేహ, నవీన్ చంద్ర, నాజర్… సినిమాలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటీనటులు ఎక్కువ. తెలుగు సినిమా చూసిన అనుభూతి ఈ సినిమా ఇస్తుంది. ధనుష్, ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘ధర్మ యోగి’ తెలుగులో మంచి విజయం సాధించింది. ఆ చిత్రాన్ని తెలుగులో మేమే విడుదల చేశాం. ఇప్పుడు ఈ సినిమానూ మేమే విడుదల చేస్తున్నాం. ఈ సినిమా కూడా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది” అని అన్నారు.

రాజ్యసభలోకి అడుగుపెట్టనున్న లేడీ టైగర్!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ పెద్దల సభలోకి అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్ లో ఉన్న రాజ్యసభ సభ్యుల పదవి కాలం మే నాటికీ ముగియనుంది. అయితే ఈసారి పార్టీ వాదనను బలంగా వినిపించే నాయకులని చట్ట సభలకు పంపాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఇందులో భాగంగానే ప్రియాంకను పంపాలని నిర్ణయించారు.

ప్రియాంక గాంధీ ఈ మధ్య కాలంలో పార్టీ వాదనను ప్రజల్లో బలంగా వినిపిస్తూ..బీజేపీని ఉతికేస్తున్నారు. రాహుల్ లొక్ సభలోనే ఉన్నాడు గనుక.. ప్రియాంకను పెద్దల సభకి పంపి..ఇద్దరితో బీజేపీపై ధ్వజమెత్తాలని కాంగ్రెస్ భావిస్తుంది. అందులోనూ పార్టీ అధ్యక్షురాలి కూతురు కనుక పార్టీలో తనంటే గౌరవం ఉంటుంది. వీటి అన్నిటిని పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నటు తెలుస్తుంది.

అయితే కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ మంత్రులు, ఎంపీలు లోక్ సభలో రాహుల్ గాంధీనే ఒక ఆట ఆడుకుంటారు . అలాంటప్పుడు ప్రియాంకని పంపి ఏదో చేయాలి అనుకుంటే..అది జరిగేపనే కాదు. ఏ పదవి లేదు కనుక ఈసారి పదవి ఇచ్చి పార్టీలో తనకంటూ ఏదో ఒక గుర్తింపు ఇవ్వాలని కాంగ్రెస్ ఉద్దెశం అయ్యుంటుందని ఎక్కువ శాతం ప్రజలు భావిస్తున్నారు.

మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్.. ?

ప‌వ‌న్ క‌ళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే.. గతంలో వీరిద్దరి కాంబినేష‌న్ లో వచ్చిన మూవీ ‘గ‌బ్బ‌ర్ సింగ్’ 2012లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే.. ‘గ‌బ్బ‌ర్ సింగ్’ త‌ర‌హాలోనే ‘పిఎస్ పికె 28’ కూడా పోలీస్ స్టోరీగానే తెర‌కెక్కుతోంద‌ని స‌మాచారం.మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం… ఈ సంవ‌త్స‌రం ఆగస్టు లోపు సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మ‌రోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప‌వ‌న్ క‌నిపిస్తార‌ని సమాచారం. టైటిల్ కూడా అంతే ఆశక్తికరంగా ఉంటుందట..!. త్వ‌ర‌లోనే ఈ అంశంపై మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

మహేష్ బాబు తన బయోపిక్ గురించి ఏమ్మన్నారో తెలుసా!

మహేష్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూ లో కొన్ని పర్సనల్ విషయాలను తెలిపారు. తనకి తన జీవితంలో మరిచిపోలేని సంఘటన ఒకటి ఉందని, తన తండ్రి 2001 లో రిలీజ్ అయిన మురారి సినిమా ను థియేటర్ లో చూసిన తరువాత తన భుజం మీద గర్వంగా చేయి వేసి  నడిచిన సంఘటను మర్చిపోలేనని తెలిపారు . ఈ ఇంటర్వ్యూ లో భాగంగా మహేష్ ను తన బయోపిక్ గురించి అడిగిన ప్రశ్నకు ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసారు… తన లైఫ్ చాలా సింపుల్ మరియు బోరింగ్ గా ఉంటున్నాడని దాన్ని బయోపిక్ గా తీయడం వృధా అని అన్నట్లుగా అన్నారని తెలిసింది…

నానితో పోటీకి సై అంటున్న కుర్ర హీరో

హీరో నానితో ఓ కుర్రహీరో పోటీకి సై అంటున్నాడు. హీరో నాని, సుధీర్ బాబు కలిసి నటించిన ‘వీ’ మూవీ ఉగాది పండుగ(మార్చి 25)న విడుదల కానుంది. ఈ మూవీ విడుదలరోజే కుమారి 21ఎఫ్ ఫ్రేం హీరో రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ రిలీజ్ అవుతుంది. ఉగాది రోజున వీరిద్దరు పోటీ సై అనడంతో సందడి నెలకొంది. పండుగ రోజు కావడంతో స్టార్ హీరోల పోటీ ఉంటుంది. కానీ ఈసారి స్టార్ హీరోలంతా సంక్రాంతికి, వేసవిని టార్గెట్ చేశారు. దీంతో ఉగాదికి పెద్ద హీరోల సినిమాలు రావడం లేదు. ఎవరులేని టైంలో సాలీడ్ హిట్టు కొడుతామనుకున్న ‘వి’ మూవీకి ‘ఒరేయ్ బుజ్జిగాడు’ షాక్ ఇచ్చాడు. తాము కూడా ఉగాదికే వస్తున్నామని ప్రకటించేశారు.

‘వీ’ మూవీలో నాని నెగిటిల్ షెడ్ ఉన్న పాత్రలో కన్పించబోతున్నాడు. ఇందులో సుధీర్ బాబు రక్షకుడిగా, నాని రాక్షసుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఫస్టు లుక్, ట్రైలర్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ‘వీ’ మూవీపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ మూవీని మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్నాడు. ఈమూవీలో ఆదితిరావు హైదరీ, నివేథా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరో నానికి ‘వీ’ మూవీ 25 చిత్రం కావడం విశేషం.

‘ఒరేయ్ బుజ్జిగా’ మూవీకి విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజ్ తరుణ్ హీరో కెకె.రాధాకృష్ణ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. మాళవికా నాయక్, హెబ్బా పటేల్ నటిస్తున్నారు. ఏప్రిల్ 3న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ ఉగాది రోజున పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు తెల్సింది. కేవలం రెండు సినిమాలే విడుదలవుతుండటంతో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. పండుగ వాతావరణంలో ఈ మూవీలకు పాజిటివ్ టాక్ వస్తే మరింత షేర్ దక్కించుకునే అవకాశం ఉంది. పెద్దగా పోటీలేకపోవడంతో ఈ మూవీలకు కలెక్షన్లు కలిసిచ్చేలా ఉన్నాయి.

పంచనామా ప్రకటనతో.. ఏపీ రాజకీయాలు రొచ్చు రొచ్చు!

Jagan-Chandrababu

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్‌ తో పాటు ఆ వ్యక్తికి చెందిన మరికొందరు బినామీల ఇళ్లపైనా ఈ నెల 6 నుండి 10 వరకు 40 చోట్ల జరిగిన దాడుల్లో రూ 2,000 కోట్ల మేర లెక్కల్లో చూపని అవాదేవీలను గుర్తించామని ఆదాయపన్ను అధికారులు ప్రకటించగానే ఏముంది చంద్రబాబు దొరికిపోయారు అంటూ వైసిపి నేతలు విమర్శలు ప్రారంభించారు.

పిఎ వద్దనే అంత మొత్తం దొరికితే, ఇక చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లపై దాడులు జరిపితే మరిన్ని మొత్తలు దొరుకుతావో అంటూ ప్రకటనలు జారీ చేశారు. వారిద్దరిని అరెస్ట్ చేసి, విచారణ జరపాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ దాడులకు సంబంధించి ఆదివారం వెలుగులోకి వచ్చిన పంచనామా నివేదికతో టిడిపి నేతలు ఎదురు దాడి ప్రారంభించారు.

దీని ప్రకారం శ్రీనివాస్‌ నివాసంలో దొరికింది కేవలం 2.63 లక్షల రూపాయలు మాత్రమే.దానిని కూడా ఆయనకు ఐటి శాఖ అధికారులు వెనక్కి ఇచ్చేశారు. వైసిపి నేతలు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం కుండా శ్రీనివాస్ డైరీలలో చంద్రబాబు ఆదాయ, వ్యయాల వివరాలున్నాయని, వాటిపై ఐటి అధికారులు మరింత దరీఫతు జరుపవలసి ఉన్నట్లు స్వయంగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఆ వివరాలతో చంద్రబాబు, లోకేష్ జైళ్లకు వెళ్ళక తప్పదంటూ వైసిపి నేతలు శాపనార్ధాలు పెడుతున్నారు.

ఇట్లా ఉండగా, ఈ దాడులు ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి బినామీలను దృష్టిలో ఉంచుకొని జరిగాయని, పట్టుబడ్డవి కూడా వారికి చెందినవే అనే మరో కొత్త కధనాన్ని టిడిపి నేతలు తెరపైకి తెస్తున్నారు. అందుకనే జనం దృష్టి మళ్లించడం కోసం కేసీఆర్ `ఆదేశం’ పైననే వైసిపి నేతలు చంద్రబాబుపై ఆరోపణల యుద్ధం ప్రారంభించారని అంటూ ధ్వజమెత్తుతున్నారు.

ఇలా ఉండగా, పంచనామా ప్రకటన పట్ల వైసిపి వర్గాలు ఒకింత ఖంగు తిన్నట్లు తెలుస్తున్నది. రూ 2,000 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించినట్టు. రూ 85 లక్షల నగదు. రూ 71 లక్షల విలువ చేసే బంగారం దొరికినట్టు సాక్షాత్తు ఐటిశాఖ కార్యదర్శి సురభి చేయడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక్కడేదో గూడుపుఠాణి జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ దర్యాఫ్తులోకి దింపాలని అధికారపక్షంలోని కొందరు నేతలు భావిస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా పంచనామా నివేదిక లీక్‌ కావడం, అది కూడా ప్రతిపక్షనేతకు నూరు శాతం క్లీన్‌చిట్‌ ఇచ్చినట్టుగా ఉండటంతో ఈ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా వ్యవహరించే ఒకరిద్దరు న్యాయనిపుణులతో పాటు, ఆర్థిక వ్యవహారాల విశ్లేష కులు కూడా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో దర్యాప్తు జరిపించాలని సూచించినట్లు తెలిసింది.

Ileana Latest Photo Shoot Stills

నిమ్మగడ్డ అప్రూవర్ గా మారడంతో జగన్ ఖంగారు!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గత వారం ఖంగారుగా ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి, కేంద్ర హోమ్ మంత్రిలతో భేటీ కావడానికి బైటకు చెప్పిన్నట్లు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను కావని, వ్యక్తిగత అంశాలను తెలుస్తున్నది. ముఖ్యంగా రస్‌ అల్‌ ఖైమా చెరసాలలో ఉన్న నిమ్మగడ్డ ప్ర‌సాద్ అప్రూవర్ గా మారారని తెలుస్తూ ఉండడంతో జగన్ ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు.

తాను పాల్ప‌డిన కుంభ‌కోణంలో అంతిమ లబ్దిదారుడు పేరు నిమ్మగడ్డ విడ‌మ‌రిచి చెప్పేశార‌ని ప్రచారం జరుగుతున్నది. దీంతో రస్ అల్ ఖైమా దేశం ఆ అంతిమ ల‌బ్ధిదారుడు భారీ స్కాంల‌కు పాల్ప‌డ‌టంలో నిష్టాతుడైన ఏ1గా గుర్తించి త‌మ‌కు అప్ప‌గించాల‌ని భారత్ ప్ర‌భుత్వాన్ని కోరింద‌ని కూడా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతున్నది.

ప్రధాని, హోమ్ మంత్రిలకు జగన్ సమర్పించిన వినతి పాత్రలను మీడియాకు విడుదల చేయక పోవడం గమనార్హం.
సాక్షి వాళ్లేమో కేంద్రం మెడ‌లు వంచి ప్ర‌త్యేక హోదా తెచ్చే దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని వ్రాస్తే, ఆంధ్ర‌జ్యోతి ఏమో వాళ్లిద్ద‌రూ మాట్లాడుకుంటే విన్న‌ట్టు జ‌గ‌న్‌ని మోడీ, అమిత్‌షాలు తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టార‌ని వ్రాయడం గమనార్హం.

అస‌లు విష‌యం మాత్రం ర‌స్ ఆల్‌ఖైమా జైలులో వున్న మ్యాట్రిక్స్ ప్ర‌సాద్ అన‌బ‌డే నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ కి మాత్ర‌మే తెలుసంటూ సోషల్ మీడియాలో కధనాలు వెలువడుతున్నాయి.