Home Blog Page 8622

చిరు మూవీలో బన్నీకి దక్కిన అవకాశం?

మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి-152 మూవీ చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ ప్రారంభమైనప్పటి నుంచి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిరంజీవి ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అదేవిధంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఫ్యాష్ బ్యాక్లో నక్సలైట్ పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరిగింది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతుండటం ఈ మూవీపై ఎఫెక్ట్ పడింది. దీంతో ఈ మూవీ నుంచి రాంచరణ్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఈ మూవీలో రాంచరణ్ కీలక పాత్రలో దాదాపు 30నిమిషాలు కనిపించేలా దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేశాడు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో రాంచరణ్ బీజీగా ఉండటంతో ఈ మూవీ కూడా ఆలస్యం అవకాశం ఏర్పడింది. ఈ మూవీని త్వరగా తీసుకొచ్చేందుకు రాంచరణ్ ఈ మూవీని తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఆఫర్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ వద్దకు వెళ్లింది. రాంచరణ్ చేయాల్సిన పాత్రలో అల్లు అర్జున్ అయితే బాగుంటుందని కొరటాల శివ భావిస్తున్నారట. ఈ మూవీలో నటించేందుకు అల్లు అర్జున్ ఎంతో ఉత్సాహాన్ని చూపుతున్నట్లు తెలుస్తోంది.  చిరంజీవికి జోడీగా త్రిష రెండోసారి నటిస్తుంది. మణిశర్మ ఈ మూవీకి అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నాడు.

ఇటీవల అల్లు అర్జున్ నటించిన ‘అల..వైకుంఠపురములో’ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. తెలుగుతోపాటు మళయాళం, యూకేలోనూ ‘అల.. వైకుంఠపురములో’ భారీ కలెక్షన్లు రాబట్టింది. ఓ వైపు ఈ సక్సస్ ఎంజాయ్ చేస్తుండగానో మరోవైపు చిరంజీవిలో మూవీలో స్పెషల్ రోల్ ఆఫర్ దక్కింది. ఈ వార్తే నిజమైతే మాత్రం తెరపై చిరంజీవితో కలిసి అల్లు అర్జున్ రఫ్పాడించడం ఖాయంగా కన్పిస్తోంది. ఈ మూవీని రాంచరణ్ కొణిదల ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మిస్తున్నాడు. చిరు-152 మూవీకి ‘ఆచార్య’ అనే టైటిల్ ఖారారైనట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్లో తెరపై వస్తుండటంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల విగ్రహావిష్కరణ

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల జయంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఫిబ్రవరి 20న హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలోని విజయ నిర్మల స్వగృహంలో ఉదయం 9గంటలకు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతోపాటు సూపర్ స్టార్ కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

విజయ నిర్మల నటిగానే కాకుండా పలు సినిమాలకు దర్శకత్వం, నిర్మాత బాధ్యతలను నిర్వహించారు. తెలుగు, తమిళం, మళయాళ భాషల్లో 44చిత్రాలను తెరకెక్కించారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం చేసిన మహిళా డైరెక్టర్ గా విజయ నిర్మల గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్నారు. నటిగా ఎన్నో అవార్డులను దక్కించుకున్న ఆమె దర్శకురాలిగా, నిర్మాతగా రాణించారు. సినీ రంగానికి ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది.

విజయనిర్మల దురదృష్టవశాత్తు గతేడాది జూన్ 27న గుండెపోటుకు గురయ్యారు. ఆసుప్రతిలో చికిత్స చేస్తుండగా పరిస్థితి విషమించడంతో మృతిచెందిన విషయం తెల్సిందే. దీంతో ఆమె అభిమానులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఈనెల 20న విజయ నిర్మల జయంతి నేపథ్యంలో ఆమె విగ్రహాష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

వెటరన్ బ్యూటీతో రాజశేఖర్ రోమాన్స్

‘మా’ వైస్ ప్రెసిడెంట్ పదవీకి రాజీనామా చేసిన హీరో రాజశేఖర్ ఇక సినిమాలపై ఫోకస్ పెట్టాడు. దర్శకుడు వీరభద్రం చౌదరి తెరకెక్కించే ఈ మూవీలో రాజశేఖర్ నటిస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర చాలా హుందాగా, గ్లామరస్ గా ఉండనుంది. సీనియర్ హీరోయిన్ అయితేనే ఆ పాత్ర న్యాయం చేస్తుందని దర్శకుడు వీరభద్రం వెటరన్ బ్యూటీ శ్రియను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శ్రియ గ్లామర్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. దీంతో తొలిసారి రాజశేఖర్ పక్కన శ్రియ నటించనుంది.

చాలా రోజుల తర్వాత రాజశేఖర్ నుంచి వచ్చిన ‘గరుడవేగం’ భారీ విజయం సాధించింది. దీని తర్వాత వచ్చిన ‘కల్కి’ మూవీ అనుకున్నంత విజయం సాధించకపోవడంతో రాజశేఖర్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా వీరభద్రం చౌదరి ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కథను రాజేశేఖర్ కోసం సిద్ధం చేయగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లలో మూవీ తెరకెక్కుతుంది. వీరభద్రం చౌదరి ‘అహ నా పెళ్ళంట’, ‘పూలరంగడు’ మంచి సినిమాలతో సక్సస్ అందుకున్నాడు. నాగార్జున తీసిన ‘భాయ్’, ఆదితో తీసిన ‘చుట్టాలబ్బాయి’ మూవీలు అనుకున్నంత విజయాలు సాధించకపోవడంతో కొద్దిగా గ్యాప్ తీసుకున్నాడు. ఈసారి ఎలాగైన విజయం కొట్టాలని హీరో రాజశేఖర్ తో కలిసి పని చేస్తున్నాడు.

రాజశేఖర్ ఇటీవల కాలంలో సినిమాలకంటే వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు. కారు యాక్సిండెంట్, మా వైస్ ప్రెసిడెంట్ పదవీకి రాజీనామా వంటి ఇష్యూలతో ఇబ్బందిపడ్డారు. ఈ నేపథ్యంలోనే తిరిగి సినిమాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో నటిస్తూ భారీ విజయం అందుకుని సినిమాల్లో బీజీగా కావాలని భావిస్తున్నాడు. ఈ సినిమా విజయానికి శాయశక్తుల కృషి చేస్తున్నాడు. యంగ్రీ యంగ్ మేన్ కు శ్రియ గ్లామర్ తోడవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అదేవిధంగా శ్రియ దర్శకుడు బొయపాటి-బాలయ్య కాంబినేషన్లో మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. శ్రియ గ్లామర్ రాజశేఖర్ మూవీకి కలిసి వస్తుందో లేదో చూడాలి.

ఇన్ స్టాగ్రామ్ లో స‌మంత‌ భావోద్వేగభరిత పోస్ట్

సమంత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి, జూబ్లీహిల్స్ లో ప్రీ స్కూల్ పెట్టడానికి సన్నాహాలు చేస్తునట్టు గతంలో వ్యాఖ్యలు వినపడ్డాయి. ఎట్టకేలకు సమంత ఈ వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చింది.

అయితే ఈ ప్రీ స్కూల్ కు సంబంధించిన పనులు పూర్తవుతున్నాయని ఇన్ స్టాగ్రామ్ లో సమంత పోస్ట్ చేసింది. ఈ స్కూల్ కు “ఏకం లెర్నింగ్” అని పేరు పెడుతున్నట్లు తెలియచేసింది. తాము ఈ స్కూల్ కోసం ఏడాదిగా కష్టపడుతున్నామని, ఇప్పటికి ఈ స్కూల్ పనులు పూర్తి కావచ్చాయని భావోద్వేగంతో పోస్ట్ పెట్టడం జరిగింది.ప్రస్తుతం సమంత వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది.

కాంగ్రెస్ కు చేరిన 400 కోట్లు వయా టీడీపీ


తెలుగు రాష్ట్రాలలో ఇటీవల జరిపిన దాడులలో రూ 2,000 కోట్ల మేరకు హవాలా లావాదేవీలు బైటపడిన్నట్లు ఆదాయపన్ను శాఖ గత వారం చేసిన ప్రకటన రాజకీయ ప్రకంపనాలు పుట్టిస్తున్నది. తాజాగా నాటి అధికార పక్షం టిడిపి నుండి కాంగ్రెస్ కు రూ 400 కోట్లు చేరినట్లు వెల్లడైనది. ఈ విషయమై ఆదాయపన్ను శాఖ నేరుగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ కోశాధికారి అహ్మద్ పటేల్ నే తమ ముందు హాజరుకమ్మనమని నోటీసు జారీచేసింది.

మొదటి నోటీసుకు స్పందించక పోవడంతో రెండోసారి ఈ నెల 18న హాజరు కావాలని మరోసారి నోటీసు ఇచ్చింది. లేనిపక్షంలో అరెస్ట్ చేయవలసి వస్తుందని పరోక్షంగా హెచ్చరించింది. దానితో ఖంగారు పడిన అహ్మద్ పటేల్ శ్వాససంబంధ వ్యాధితో బాధపడుతున్నాను అంటూ ఫరిదాబాద్‌లోని మెట్రో ఆసుపత్రిలో చేరాను. కాబట్టి ఇప్పటికిప్పుడు విచారణకు హాజరు కాలేనంటూ సందేశం పంపారు.

తెలుగుదేశం హయాంలో అమరావతిలో భారీ నిర్మాణం పనులు చేపట్టిన ఒక సంస్థ నుంచి దాదాపు రూ 400 కోట్లు అధికార పార్టీ నాయకుల ద్వారా కర్నాటకలోని బెంగళూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడి ద్వారా ఢిల్లీలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి చేరాయని కొంత కాలం క్రితం ఐటీ, ఈడీ పత్రికా ముఖంగా వెళ్లడించిన సంగతి తెలిసిందే.

ఈ హవాలా వ్యవహారంతో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సంబంధం ఉందనే వార్తలు రావటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ఇటీవల చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ నివాసంపై దాడి చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. దాదాపు రూ 2,000 కోట్ల లావాదేవీలకు సంబంధించిన రికార్డులు ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు వార్తలొచ్చాయి.

ఈ నేపథ్యంలో ఆదాయం పన్ను శాఖ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్‌ను విచారణకు పిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అహ్మద్ పటేల్ హవాలా నిధులకు సంబంధించిన వివరాలను ఉన్నది ఉన్నట్టు వెల్లడించే పక్షంలో కొందరు ఆంధ్రా, అలాగే పలువురు జాతీయ నాయకులు ఇబ్బందుల్లో పడడం ఖాయం.

రాజ్ భవన్ కు చేరిన శాసన మండలి వివాదం

ప్రభుత్వం ప్రతిష్టాకరంగా భావిస్తున్న బిల్లులను సెలెక్ట్ కమిటీకి నివేదించాలని తనకున్న విశేష అధికారాలను ఉపయోగించుకొని చైర్మన్ ఎం.ఎ.షరీఫ్‌ నిర్ణయించడంతో ఒక వంక శాసనమండలి రద్దు పక్రియను వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టగా, తాజాగా సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయమని చైర్మన్ ఇచ్చిన ఆదేశాన్ని మండలి కార్యదర్శి తిరస్కరించడంతో ఏర్పడిన రాజ్యాంగ సంక్షోభం ఇప్పుడు రాజ్ భవన్ కు చేరింది.

రాజధాని బిల్లులపై సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు అంశంలో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో శాసనమండలి చైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ని కలసి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తున్నారని.. తనకు సహకరించకపోగా ప్రభుత్వానికి… మండలికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడానికి కారకులయ్యారని ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం మండలికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఇన్‌చార్జి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని చైర్మన్ కోరారు. ఆ స్థానంలో విజయరాజును నియమించాలని విజ్ఞప్తి చేశారు.

చట్ట సభ చైర్మన్‌ సభ నిర్వహణకు సంబంధించిన అంశాల్లో గవర్నర్‌ను కలవడం ఇదే ప్రధమం. అసెంబ్లీ కార్యదర్శి నియామకంలో గవర్నర్‌కు కూడా పాత్ర ఉండడంతో షరీఫ్‌ నేరుగా ఆయన్నే కలిసి పరిస్థితిని నివేదించారు.

మండలి సమావేశాల్లో రాజధాని బిల్లులు చర్చకు వచ్చిన నాటినుంచి ఇప్పటివరకూ చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తూ ఛైర్మన్‌ నాలుగు పేజీల వినతిపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. తాను కార్యదర్శికి జారీ చేసిన ఆదేశాల ప్రతులు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన నోట్‌ ఫైల్‌ను కూడా ఇచ్చారు. చట్టసభల నిర్వహణలో రాజ్యాంగ సంప్రదాయాలకు సంబంధించి ప్రమాణంగా పాటించే కౌల్‌ అండ్‌ షక్దర్‌ పుస్తకంలో తన అధికారాల గురించి ఇచ్చిన వివరణను కూడా చైర్మన్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

రాజధాని బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతూ తానిచ్చిన ఆదేశాలను ప్రశ్నిస్తూ మండలిలో సభా నాయకుడిగా ఉన్న రెవెన్యూ మంత్రి (ఉపముఖ్యమంత్రి పిల్లి సుభా్‌షచంద్రబోస్‌) పంపిన లేఖ.. చైర్మన్‌ అధికారాలను ధిక్కరించడమేనని పేర్కొంటూ దానిపై కౌల్‌ అండ్‌ షక్దర్‌ ప్రస్తావనను ఆయన ఉటంకించారు.

‘సభాపతి రూలింగ్‌ ఎవరూ ప్రశ్నించరానిది. దానిని ఏ రూపంలో ప్రశ్నించినా ధిక్కారమే అవుతుంది. సభలో ప్రకటించినా లేదా ఫైలుపై రాసినా సభాపతి ఆదేశం పాటించాల్సిందే. తన నిర్ణయానికి కారణాలను కూడా సభాపతి వివరించాల్సిన అవసరం లేదు’ అని కౌల్‌ అండ్‌ షక్దర్‌ పేర్కొన్నట్లు తెలిపారు.

సభకు వచ్చిన రాజధాని బిల్లులు సభామోదం పొందలేదని, సభలో ఏకాభిప్రాయం సాధించడానికి అనేక ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో తనకు సంక్రమించిన అధికారాల కింద ఆ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించానని చైర్మన్‌ గవర్నర్ కు స్పష్టం చేశారు.

‘కమిటీ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ సభానాయకుడిగా ఉన్న మంత్రి నాకు లేఖ రాశారు. కార్యదర్శికి రాయలేదు. అయినా ఆ లేఖను ఉటంకిస్తూ మండలి కార్యదర్శి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ఫైలును నాకు పంపడంలో తన విధిని విస్మరించారు’ అంటూ కార్యదర్శి వ్యవహారాలను తూర్పురాబట్టారు. దానితో ఈ మొత్తం వివాదం కొత్తరూపు సంతరించుకొని అవకాశం ఏర్పడుతున్నది.

వామ్మో..ఇదేం పరుగు..మూడవ స్థానానికి ఉసేన్ బోల్ట్

కర్ణాటకలో సంప్రదాయ క్రీడ “కంబల” రేస్ లో మొన్నటికి మొన్న శ్రీనివాస్ గౌడ అనే యువకుడు 100మీటర్లను కేవలం9.55సెకన్లోనే పరుగుత్తిన విషయం తెలిసిందే.. అయితే ఇదే రేస్ లో మరో కొత్త ప్రపంచ రికార్డ్ నెలకొలిపి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాడు నిశాంత్ అనే కుర్రాడు. శ్రీనివాస్ కన్నా 4సెకన్ల తక్కవ సమయంలో 100మీటర్లు పరుగెత్తిన నిశాంత్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయాడు. 100మీటర్లను కేవలం9.51సెకన్లోనే పరుగుత్తి వరల్డ్ రికార్డు సృష్టించాడు.

ప్రపంచలో పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ కి 100మీటర్లు కవర్ చేయడానకి 9.58సెకన్లు పట్టిన విషయం తెలిసిందే. అయితే మొన్న శ్రీనివాస్ గౌడ్, నిన్న నిశాంత్ లు మరో రెండు కొత్త రికార్డులు సృష్టించారు. అందుకుగాను వారికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీనివాస్ గౌడకు ఇచ్చిన ఆఫర్ లాగా కేంద్రక్రీడాశాఖ మంత్రి నిశాంత్ కు కూడా ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

జంతు హక్కుల కార్యకర్తల ఒత్తిడితో కొన్నేళ్ల క్రితం కర్నాటకలో “కంబల” పోటీలపై నిషేధం కొనసాగింది. అయితే సిద్దరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రత్యేక చట్టం చేసి కంబాలా పోటీలకు అనుమతిచ్చారు.

‘కనులు కనులను దోచాయంటే’ ట్రయిలర్ రిలీజ్

‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రీతూ వర్మ.. మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే సినిమా హిట్ గా నిలిచింది కానీ ఈ అమ్మడికి తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు దక్కలేదు. దాంతో తమిళ .. మలయాళ సినిమా ఇండస్ట్రీలపై దృష్టిపెట్టింది.

ఈ నేపథ్యంలోనే మలయాళంలో దుల్కర్ కథానాయకుడిగా నటిస్తున్న‘కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లైయడిత్తాల్‌’ సినిమాలో నటిస్తోంది. ఇదే సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్‌కు ‘కనులు కనులను దోచాయంటే’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈనెల 28న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటీకే ఈ సినిమా నుండి టీజర్, పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు ట్రయిలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

వైరల్: రతన్ టాటా పోస్ట్ చేసిన వీడియో

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా పారిశుధ్య ప్రాముఖ్యతను చాటే.. ఒక వీడియో ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో లో ఒక విద్యార్థి స్పీచ్ ఉంది. అందులో తన తండ్రి గూర్చి మాట్లాడుతూ ఆయన చేసే పనిని గొప్పగా వర్ణిస్తూ చెప్పాడు. తన తండ్రి పని చేయడం మానేస్తే మనదేశం లో ఎక్కడిపనులు అక్కడ నిలిచిపోతాయని, ఎవరు కూడా వారి వారి విధులు నిర్వర్తించలేరని చెప్పే అద్భుతమైన వీడియో ఒక్కసారి వీక్షించండి.

‘డ్రైవింగ్ లైసెన్స్’ కోసం రామ్ చరణ్, వెంకటేష్ పాట్లు

 

గత ఏడాది రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించిన మలయాళ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్ గురించి అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా రీమేక్ రైట్స్ రామ్ చరణ్ దక్కించుకున్న విషయం కూడా అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు గాను కథనాయకుడిగా విక్టరీ వెంకటేష్ ను సంప్రదిస్తున్నట్లు సమాచారం.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ రీమేక్ సినిమాలలో నటించిన క్రెడిట్ ఎవరికైనా ఉందా అంటే అది వెంకటేష్ కే అని చెప్పుకోవాలి..ఈ పది సంవత్సరాలలో బాడీగార్డ్, మసాలా, దృశ్యం, గోపాల గోపాల, గురు వంటి రీమేక్ చిత్రాలలో వెంకటేష్ నటించారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న నారప్ప సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారు.

తండ్రి చిరంజీవి సినిమాలకి నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు పూర్తి స్థాయి నిర్మాతగా మారాలి అనుకుంటున్నాడు. ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్ చిత్రం అతనిని బాగా ఆకట్టుకుంది. చూసిన వెంటనే..హుటాహుటిన ఈ చిత్ర రీమేక్ రైట్స్ కొనుగోలు చేసారు.

ఇప్పుడు ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని రామ్ చరణ్ ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా కథకి వెంకటేష్ సరిగ్గా సరిపోతాడని రామ్ చరణ్ భావించాడు. అందుకే వెంటకేష్ ను సంప్రదించి చక చక సినిమా పనులు ప్రారంభించాలని రామ్ చరణ్ ప్రయత్నిస్తున్నాడు.

తెలంగాణ పట్టణ ప్రగతి అభినందనీయం

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పట్టణ ప్రగతి కార్యక్రమం అభినందించదగ్గది. ఇంతకుముందు తీసుకున్న పల్లె ప్రగతి కి కొనసాగింపుగానే ఈ కార్యక్రమం తీసుకోవటం జరిగింది. రాజకీయాలు ఎప్పుడూ వుండేవే . కానీ ప్రజలకు తక్షణం ఉపయోగపడేవి పౌర సౌకర్యాలు. నిన్నటి ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ గెలిచాడంటే కేవలం పౌర సౌకర్యాలపై ప్రజలు సంతృప్తి చెందారు కాబట్టే గెలిచాడు. నిజానికి ఇది పార్టీల ప్రధాన ఎజెండా కావాలి. నూటికి 90 శాతం ప్రజలు కోరుకునేది పౌర సౌకర్యాల మెరుగుదల. అవి సమకూరిన తర్వాత మిగతా వాటిగురించి ప్రజలు ఆలోచిస్తారు. ఈ విషయంలో కెసిఆర్ వీటిపై ఫోకస్ చేయటం ఖచ్చితంగా అభినందనీయం.

ఈ నెల 16 వ తేదీన తెలంగాణ మంత్రివర్గం ఈ విషయాలపై చర్చించి కార్యాచరణ పధకాన్ని ప్రకటించింది. దీనికి కొనసాగింపుగా ఈరోజు ప్రగతి భవన్ లో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల చైర్మన్లు, అధ్యక్షుల తో ముఖ్యమంత్రి కెసిఆర్ సవివరంగా చర్చించటం హర్షణీయం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వ మంచి పనుల్లో మణిపూసలు గా నిలిచిపోవటం ఖాయం. నిర్దిష్ట కార్యాచరణలో భాగంగా చేయాల్సిన పనులు మార్గదర్శకం చేయటం జరిగింది. అందులో కొన్ని పరిశుభ్రత, పచ్చదనం, మంచినీటి సరఫరా , రహదారుల అభివృద్ధి , ప్రభుత్వ స్థలాల గుర్తింపు, కేటాయింపు, శ్మశానాల కోసం స్థలాల గుర్తింపు, డంప్ యార్డులు, క్రీడా ప్రాంగణాలు, పబ్లిక్ టాయిలెట్లు , వెజ్ , నాన్ – వెజ్ మార్కెట్ స్థలాల గుర్తింపు,విద్యుత్తు స్థంబాల సమీక్ష, పరిశుధ్యపనుల కోసం వాహనాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాండంత లిస్టు ని తయారు చేసారు. దీనికి నిధులు కూడా కేటాయించారు. అందుకే ఈ కార్యక్రమం ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైనదని చెప్పొచ్చు.

ఇదేదో ఎన్నికలకోసం చేస్తున్నది కాదు. వాస్తవానికి ఎన్నికలు అయిపోయిన తర్వాత చేస్తున్నది. కెసిఆర్ కి ప్రాధాన్యతా అంశాల్లో ఈ కార్యక్రమాలు ఉండటం ముదావహం. ఏదో మొక్కుబడిగా చెప్పటం కాకుండా సీరియస్ గా తీసుకొని అమలుచేయడం విశేషం. సమస్యల్లా అదే నిబద్దత కింద క్యాడర్లో కూడా ఉండకపోవటం. కాకపోతే కెసిఆర్ అంటే భయంతో కొంతమేరకైనా అమలుచేస్తారని ఆశిద్దాం. దీనికోసం వార్డుల్లోని ప్రజలు పెద్దఎత్తున కదలాలి. నాయకులు ముందుగా పత్రికల్లో ప్రచారం కల్పించి ఎక్కువమంది పాల్గొనేటట్లు చేయాలి. ఏ కార్యక్రమమైనా ప్రజలు పాల్గొంటే విజయవంతమవుతుంది. ఈ కార్యక్రమం తీసుకున్నందుకు కెసిఆర్ ని మనసారా మరొక్కసారి అభినందిద్దాం.

ముంబై దాడుల్లో పట్టుబడ్డ కసాబ్.. ఒక హిందువా..?

ముంబై మాజీ పోలీసు కమిషనర్ రాకేశ్ మరియా తన కొత్త పుస్తకం “లెట్ మీ సే ఇట్ నౌ”లో కసబ్ ని గూర్చి ఒక ఆసక్తిరక విషయాన్ని పేర్కొన్నారు. ముంబై 26/11 దాడుల కేసులో ప్రధాన సూత్రధారి మరియు పట్టుబడ్డ లష్కర్-ఎ-తైబా కి చెందిన కసాబ్ బెంగళూరు కు చెందిన సమీర్ చౌదరిగా మరణించేవాడని అదే అతని ప్లాన్ అని అన్నారు.

ఒకవేళ 26/11 దాడులు ప్రణాళిక ప్రకారం జరిగి ఉంటే, కసాబ్, చౌదరి వలె చనిపోయేవాడని” అదే అతని ప్లాన్ అని మాజీ పోలీసు కమిషనర్ రాకేశ్ మరియా తెలపడం ఆసక్తికరంగా ఉంది. అదే జరిగి ఉన్నట్లయితే హిందూ ఉగ్రవాదులు ముంబైపై ఎలా దాడి చేశారని తాటికాయంత అక్షరాలతో వార్తాపత్రికలలో రాసేవారని, పెద్ద పెద్ద టీవీ జర్నలిస్టులు తన కుటుంబం మరియు పొరుగువారిని ఇంటర్వ్యూ చేయడానికి బెంగళూరుకు ఒక బీలైన్ తయారుచేసేవారు. కానీ అది ఆ విధంగా జరగలేదు మరియు అతను పాకిస్తాన్లోని ఫరీద్కోట్ కు చెందిన అజ్మల్ అమీర్ కసాబ్ ”అని మరియా తన పుస్తకంలో రాశారు.

అయితే కసాబ్ హిందువా..? అనే అనుమానం రావడానికి కారణం.. తన కుడి చేయి మణికట్టు మీద ఎరుపు రంగు దారం ధరించి ఉన్నట్లు గుర్తించారు – అది పవిత్రమైన హిందూ దారం అని నమ్ముతారు. 26/11 దాడులను “హిందూ టెర్రర్” గా నిందించడానికి నేరస్తులు యోచిస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది. ముంబై దాడులు ముమ్మాటికీ “హిందూ టెర్రర్” కాదని అనేమంది హిందువులు వాదిస్తున్నారు.

కెసిఆర్ బీజేపీ కి పరోక్షంగా సాయం ?

కెసిఆర్ తెలంగాణ కి తిరుగులేని నాయకుడు. ఇప్పట్లో తన అధికారాన్ని సవాలు చేసే రాజకీయ ప్రత్యర్థి లేడు. అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని స్థానిక సంస్థల ఎన్నికల దాకా అన్నింటిలో తెరాస తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది ఒక్క లోక్ సభ ఎన్నికలు తప్ప. ఇంకా నాలుగు సంవత్సరాలు ఎటువంటి ఎన్నికలూ లేవు. కేవలం కొన్ని మునిసిపల్ కార్పొరేషన్ల లోనే ఎన్నికల వాతావరణం ఉంటుంది. ఇంతటి సానుకూల వాతావరణం చాలా తక్కువమందికి, చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది. ఒకవిధంగా ఇది కెసిఆర్ కి కలిసొచ్చిన కాలమని చెప్పాలి.

ఒవైసీఇంతటి మంచి వాతావరణాన్ని అలాగే కొనసాగించటం ఎవరైనా కోరుకుంటారు. కానీ కెసిఆర్ కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నట్లుగా వుంది.  తో స్నేహం కొంపముంచేటట్లు వుంది. మొదట్లో దీన్ని ఎవరూ అంత సీరియస్ గా తీసుకోలేదు. కేవలం కొన్ని ముస్లిం ఓట్లకోసం రహస్య ఒప్పందం ఉండేది. తర్వాత ఆ బంధం మెల్లి మెల్లిగా బలపడసాగింది. ఇప్పటివరకు ఎన్నికల్లో మజ్లీస్ పార్టీతో బహిరంగ ఒప్పందం లేదు. అయితే చీకటి ఒప్పందం తో ఇరువురూ కొన్ని నియోజక వర్గాల్లో బలహీనమైన అభ్యర్థులను నిలబెడుతూ ఒకరికొకరు సాయ పడుతున్నారు. ఇది ఇప్పటివరకూ పెద్ద ఇష్యూగా ప్రజలముందుకి రాలేదు. కానీ పరిస్థితుల్లో క్రమేపీ మార్పువస్తున్నట్లు కనబడుతుంది. అందరూ అనుకోవచ్చు ఇది ఎన్నికల్లో ప్రతిబింబించటం లేదుకదా అని. రాజకీయాల్లో మార్పులు అతివేగంగా మారిన సందర్భాలు చరిత్రలో అనేకం వున్నాయి. దీనికి సూచనలు మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ లో సూచాయగా కనిపించాయి.

అయితే అది కూడా రాష్ట్రం మొత్తం ప్రభావం చూపలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆదిశగా పయనించవచ్చని అనిపిస్తుంది. ఒకటి, ఒవైసీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హిందూ-ముస్లిం విభజన రాజకీయాల్లో తలమునకలై వుండటంతో క్రమేపీ ఆ ప్రభావం తెలంగాణ ఓటర్ల మీద పడే అవకాశం వుంది. అదే జరిగితే కెసిఆర్ కి నష్టం జరుగుతుంది. ఎందుకంటే కొత్తగా ముస్లిం ఓటర్లు కెసిఆర్ వైపు మొగ్గుచూపేదేమీ లేదు. ఇప్పటికే వాళ్ళందరూ కెసిఆర్ వైపు వున్నారు. కానీ హిందూ ఓటర్లలో కొంత భాగం పునరాలోచనలో పడటం ఖాయం. దీనికి సిఏఏ పై కెసిఆర్ వైఖరి అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. వచ్చే అసెంబ్లీ లో సిఏఏ కి వ్యతిరేకంగా తీర్మానం చేస్తే బీజేపీ కి కొత్త ఆయుధం ఇచ్చినట్లవుతుంది. ఇప్పటికే ఒవైసీ తో స్నేహం పై ప్రజల్లో అనుమానాలున్నా ఇటువంటి తీర్మానాలతో బీజేపీ చెబుతున్నట్లు కెసిఆర్ ఒవైసీ గుప్పెట్లో వున్నాడని నమ్మే ప్రజానీకం పెరుగుతుంది. ఇది బీజేపీ కి సానుకూల అంశంగా మారొచ్చు.

ఒవైసీ పార్టీ మజ్లీస్ చరిత్ర తెలిస్తే హిందువుల్లో , లౌకికవాదుల్లో కోపం పెరగటం ఖాయం. నిజాం పాలనలో రజాకార్లు గ్రామాలపై పడి ఏ విధంగా హిందువులపై అకృత్యాలు చేసారో అందరికీ తెలిసిందే. ఆ రజాకార్ల వారసత్వమే మజ్లీస్ పార్టీ . 75 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘోరాల్ని ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు , వాళ్ళ పెద్దలు చెప్పినవి విన్నవాళ్ళు తెలంగాణాలో గణనీయంగా వున్నారు. ఇప్పుడు జరిగే పరిణామాలు చరిత్రను మరొక్కసారి గుర్తుకు తెచ్చే ప్రమాదముంది. ఆచి తూచి అడుగులు వేసే కెసిఆర్ ఈసారి ఇంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకున్నాడో తెలియదు. వాస్తవానికి మునిసిపల్ ఎన్నికలముందే ముస్లిం మతపెద్దల్ని తీసుకొని ఒవైసీ కెసిఆర్ ని కలిసినా ఎన్నికలయ్యేవరకు దీనిపై మాట్లాడని కెసిఆర్ ఇప్పుడు వడి వడిగా అడుగులేయటం వెనక రెండు కారణాలుండొచ్చు. ఒకటి, ఇప్పట్లో ఎన్నికల భయం లేకపోవటం. రెండు, తాను కట్టిస్తున్న యాదగిరి స్వామి ఆలయం హిందువుల్లో తనపై విశ్వాసాన్ని వుంచుతుందనే నమ్మకం. అలాగే ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం దేశంలో బీజేపీయేతర పార్టీలకు నాయకత్వం వహించాలనే కుతూహలం లోలోపల బలంగా ఉండటం. ఏది ఏమైనా ఈ నిర్ణయం తెలంగాణాలో అనుకోకుండా బీజేపీ కి కలిసివచ్చిన అదృష్టమని చెప్పాలి. ఈ నిర్ణయంతో తెలంగాణాలో తెరాస కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగటం ఖాయం. కాంగ్రెస్ స్థానంలో బీజేపీ బలపడటం ఖాయంగా కనిపిస్తుంది. కెసిఆర్ పరోక్షంగా కాంగ్రెస్ ని దెబ్బతీసి బీజేపీ ని ప్రత్యామ్నాయంగా తెలంగాణలో ముందుకుతీసుకొచ్చినట్లయ్యింది. అయితే బీజేపీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవటం దాని సామర్ద్యాన్నిబట్టి వుంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో.

వేసవికి సై అంటున్న సినిమాలు..ప్రేక్షకులకు పండగే

మన తెలుగులో ఈ వేసవికి బడా హీరోల సినిమాలు పెద్ద సంఖ్యలోనే రిలీజ్ అవుతున్నాయి. అందులో పెద్ద సినిమాలు..వఖీల్ సాబ్ తో పవన్ కళ్యాణ్, వీరప్ప తో విక్టరీ వెంకటేష్ మరియు వీ తో నాని..వీరికి ఏమాత్రం తీసిపోని కుర్ర హీరోలు అరణ్య తో రానా, సోలో బ్రతుకు సో బెటర్ తో సాయి ధర్మ తేజ్, లవ్ స్టోరీ తో నాగ చైతన్య… ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు.

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలకి సిద్ధమ్మయారు అన్న సంగతి తెలిసిందే..ఈయన వఖీల్ సాబ్ సినిమా వేసవిలో తమ ఫ్యాన్స్ ముందుకు రాబోతుంది. పవన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..చాల రోజుల తరువాత సినిమా తీయటం..అది వేసవిలో రిలీజ్ అవటంతో..కచ్చితంగా హిట్ పడుతుంది అనే వార్తలు చాలా వినిపిస్తున్నాయి.

విక్టరీ వెంకటేష్ ‘ఎఫ్ 2’ మరియు ‘వెంకీమామ’ సినిమాలు ప్రేక్షకులని బాగా అలరించాయి. ఇప్పుడు వెంకటేష్ నటిస్తున్న విర్రప్ప కథ చారిత్రాత్మకంగా ఉండబోతుంది అని తెలుస్తుంది. వెంకటేష్ లోని కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూస్తాం అంటున్నారు సినీప్రముఖులు.

సినీఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దీ రోజులోనే న్యాచురల్ స్టార్ అనే పేరుని సంపాదించుకున్న హీరో నాని కూడా తన సినిమాతో సై అంటున్నాడు.

తక్కువ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధర్మ తేజ్ కూడా సోలో బ్రతుకు సో బెటర్ సినిమాతో తన ఫ్యాన్స్ ని ఖుషి చేయటానికి చాల కష్టపడుతున్నాడు అనే విషయం తెలుస్తుంది. ‘మజిలీ’ మరియు ‘వెంకీమామ’ లాంటి హిట్ సినిమాలు చేసిన హీరో నాగ చైతన్య ఇప్పుడు మళ్ళీ ఇంకో రొమాంటిక్ ఫిలింతో సిద్ధం అవుతున్నాడు.

ఇవన్నీ ఇలా ఉంటె బాహుబలి సినిమాతో అన్ని భాషల ప్రజలను ఆకట్టుకున్న రానా దగ్గుబాటి ఇప్పుడు అరణ్య సినిమాతో తెలుగు, తమిళ, హిందీ భాషలలో చిత్రాన్ని రిలీజ్ చేయటానికి సన్నద్ధం అవుతున్నాడు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే కెజీయఫ్2, పాన్ ఇండియా మూవీ గా తెరకేక్కుతుంది. కెజీయఫ్1 ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది. దీనికి సీక్వల్ గా రెండొవ భాగం విడుదల అవుతుంది.

ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేయటానికి హీరోలు వచ్చేస్తున్నారు. ఒక సినిమాని మించి మరొకటి ఉండబోతుంది కాబట్టి ఈ వేసవంతా ప్రేక్షకులకు పండగే.

స్టీఫెన్ ను ఆంధ్ర తీసుకురావటంలో జగన్ ప్లాన్ ఇదేనా..?

స్టీఫెన్ రవీంద్ర తెలంగాణాకి చెందిన ఒక ఐపీఎస్ అధికారి, కానీ ఇప్పుడు ఆంధ్రాలో మొత్తం ఇతని గురించే చర్చ. అసలు ఎవరు ఈ స్టీఫెన్ రవీంద్ర, ఎందుకు ఇతని పేరు ఆంధ్ర అంతా మారుమోగుతోంది.

ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్టీఫెన్ రవీంద్రని ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించాలనే ప్రతిపాదన చేసేంత వరకు ఎవరికీ ఇతని గురించి పెద్దగా తెలియలేదు.

రాష్ట్రంలో ఉన్న ఏ సీనియర్ ఐపీఎస్ అధికారినైన ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించే అధికారం జగన్ కి ఉంది. కానీ, పక్క రాష్ట్రంలో ఉన్న ఒక అధికారీనే ప్రత్యేకంగా కావాలని పట్టుబట్టటం వెనుక ఏదో మర్మం దాగి ఉందని అర్ధం అవుతుంది. ఈ విషయంపై జగన్ ప్రత్యేకంగా కెసిఆర్ ను కలిసి, స్టీఫెన్ రవీంద్రను ఏపీకి పంపాల్సిందిగా కోరారు. ఒక రాష్ట్రానికి కేటాయించిన ఐపీఎస్ అధికారులను..అందులోనూ ఐజీ హోదాలో ఉన్న అధికారులను వేరే రాష్ట్రానికి తరలించే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. దీనికి కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం. దీని కోసం జగన్ కేంద్రానికి లేఖ కూడా రాసారు..కానీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఒక రాష్ట్రానికి కేటాయించిన అధికారిని వేరే రాష్ట్రానికి పంపటానికి చట్టం ఒప్పుకోదు..ఏవైనా బలమైన కారణాలు ఉంటె తప్ప. ఉదా: ప్రాణహాని లాంటివి.

జగన్ మొన్న ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో ఈ విషయంమై చర్చించారంటూ..కథనాలు వచ్చాయి. జగన్ విన్నపానికి అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించారట. ఇంకేముంది స్టీఫెన్ రాకకు సర్వం సిద్ధం అయినట్లుగానే కనిపిస్తుంది.

స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేకంగా కావాలి అనటానికి అతనికి ఉన్న ట్రాక్ రికార్డు కారణం అయ్యుండొచ్చు. స్టీఫెన్ రవీంద్ర 1999 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన అధికారి. ఈయనకి 2005 లో పోలీస్ మెడల్ అఫ్ గాల్లంట్రీ, 2010 లో ప్రైమ్ మినిస్టర్ పోలీస్ మెడల్ ఫర్ లైఫ్ సేవింగ్, 2016 లో ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ లాంటి ఉన్నతమైన అవార్డులు వచ్చాయి. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఏ అధికారి సేవలనైనా నాయకులు ఇష్టపడతారు. ఇవి అన్ని బయటికి కనిపించే అంశాలు కానీ ఎవరికీ తెలియని కొన్నికొత్త కోణాలు స్టీఫెన్ రవీంద్ర, జగన్ ల మధ్య ఉన్నాయి.

అవేంటంటే..

*స్టీఫెన్ రవీంద్ర హైదరాబాద్ నిజాం కళాశాలలో చదువుకున్నాడు.

*మొదటిసారి వరంగల్ ఎస్పీ గా తన విధులు నిర్వహించాడు.

*దివంగత ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డికి స్టీఫెన్ రవీంద్ర సెక్యూరిటీ ఇంచార్జ్ గా పని చేసారు. మార్చి 25, 2008 నుంచి జులై 30, 2009 దాకా..దాదాపు సంవత్సరం కంటే పైగా వై ఎస్ దగ్గర పని చేసారు.

*2019 లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్ కేసుకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) కు నేతృత్వం వహించారు.

ఇవి అన్ని మాములు విషయాలే..ఇందులో దాగి ఉన్న ఇంకో కోణం చూద్దాం..

*స్టీఫెన్ రవీంద్ర హైదరాబాద్ నిజాం కళాశాలలో చదువుకున్నారు. అదే సమయంలో వై ఎస్ జగన్ కూడా నిజాం కళాశాలలో చదువుకున్నాడు. ఇద్దరి వయసు ఒకటే..అంటే విద్యా సంవత్సరం కూడా ఒకటే అవుతుంది. జగన్ కి అప్పటినుంచే స్టీఫెన్ రవీంద్ర పరిచయం అయ్యుండొచ్చు.

*మొదటిసారి వరంగల్ ఎస్పీ గా తన విధులు నిర్వహించాడు. అప్పుడు వరంగల్ రేంజ్ డిఐజీగా గౌతమ్ సావాన్గ్ తన విధులు నిర్వహిస్తున్నాడు. స్టీఫెన్ రవీంద్ర, గౌతమ్ సావాన్గ్ కింద విధులు నిర్వహిస్తూ..మెరుగైన శిక్షణ తీసుకున్నాడంట. వారి ఇద్దరి మంచి సాంగిత్యం ఉండి ఉండవచ్చు.

జగన్ కి స్టీఫెన్ రవీంద్ర నమ్మకస్థుడు గనుక 2019 లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్ కేసు విచారణను స్టీఫెన్ రవీంద్రకి అప్పగించాలిసిందిగా జగన్ కెసిఆర్ ను కోరి ఉండవచ్చు. అప్పటికే జగన్ కి కెసిఆర్ కి మంచి స్నేహం ఉండటం వాళ్ళ కెసిఆర్ కూడా స్టీఫెన్ కు కేసు బాధ్యతలు అప్పగించారు.

*జగన్ ప్రమాణ స్వీకారం చేయకుండానే స్టీఫెన్ రవీంద్రను ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించాలి అనుకున్నారంటే…పెద్ద పథకమే వేసినట్టుగా ఉంది కదా..రాష్ట్ర డీజీపీ గా గౌతమ్ సావాన్గ్ కి బాధ్యతలు ఇచ్చి, ఇంటలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్రను నియమించి..గురు శిష్యులతో రాష్ట్రాన్ని గుప్పెట్లో పెట్టుకోటానికి జగన్ మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది. ఇంకొద్ది రోజుల్లో స్టీఫెన్ రవీంద్ర ఇంటలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. మున్ముందు జగన్ వీరితో తన పధకం ఎలా నెరవేరుస్తాడో వేచి చూడాలి.

అవ్వ తాతల కొరకు మూడో విడత ‘వైస్సార్ కంటివెలుగు’


2020 అక్టోబర్ 10న బడి పిల్లల కోసం ప్రారంభించిన వైస్సార్ కంటి వెలుగు మూడోవ దశను ఈ రోజు కర్నూలులో అవ్వ తాతల కొరకు ప్రారంభించారు ఏపీ సీఎం జగన్. ఏపీలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది అవ్వాతాతలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసమైన వారికి కంటి ఆద్దాలను కూడా ఉచితంగా ఇవ్వనున్నారు. అలాగే అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రాథమిక, సెకండరీ స్క్రీనింగ్‌ కంటి పరీక్షలను ప్రారంభించి జూలై 31వ తేదీ నాటికి పూర్తి చేస్తారు.

సెకండరీ స్క్రీనింగ్‌ పూర్తయిన తర్వాత వాలంటీర్ల ద్వారా కళ్ల జోళ్లను అందజేయనున్నారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 1 నుంచి శస్త్రచికిత్సలు చేయిస్తారు. ఇప్పటికే కంటి వెలుగు పథకం ద్వారా ప్రభుత్వం రెండు విడతలుగా పాఠశాలల్లో 66 లక్షల మంది పిల్లలకు కంటి పరీక్షలు చేసింది. 4.36 లక్షల మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించింది.. ఇప్పుడు మూడో విడత ప్రారంభించారు.

Kriti Garg Latest Photos