Home Blog Page 8624

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ధనుష్‌

‘లవ్ ఫెయిల్యూర్’, ‘గురు’, గేమ్ ఓవర్స లాంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్లో మంచి స్ధానం సంపాయించిన  ‘వై నాట్’ స్థూడియోస్ నిర్మాణం లో పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ వున్న‌ హీరో ధనుష్ హీరోగా. పిజ్జా, జిగర్ తండా(చిక్కడు దొరకడు), పేట  సినిమాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో డి40(ధ‌నుష్‌-40) ని తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌ముఖ నిర్మాత‌ ఎస్. శశికాంత్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూరుస్తున్నారు.

భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, గీత‌ గోవిందం, టాక్సివాలా, ప్ర‌తిరోజుపండ‌గే లాంటి వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్ ని అందించిన  నిర్మాణ సంస్థ‌లు జిఏ2 పిక్చ‌ర్‌, యువి క్రియెష‌న్స్  ఇప్ప‌డు జిఏ2యువి ద్వారా ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తున్నారు. నిర్మాణ విలువ‌లు మినిమ‌మ్ గ్యారెంటి స‌బ్జ‌క్ట్స్ తో అత్య‌ధిక స‌క్స‌స్ రేట్ తో దూసుకుపోతున్న ఈ రెండు సంస్ధ‌లు ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌ట‌మే డి40 కున్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. ఈ చిత్రం యెక్క మెద‌టి లుక్‌, టీజ‌ర్ వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తారు.

ఎయిర్ ఫోర్స్ పైలట్ గా మారిన కంగనా

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తాజా మూవీ ‘తేజస్’. ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్కును చిత్రబృందం సోమవారం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఛాలెంజింగ్ రోల్స్ ను అవలీలగా చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను కంగనా మరోసారి ఫిదా చేసేందుకు రెడీ అయింది. ఈ మూవీలో కంగనా ఎయిర్ ఫోర్స్ పైలట్ గా నటిస్తుంది. ‘తేజస్’లో కంగనా ఫస్టు లుక్కు విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ స్టిల్ చూస్తే కంగానా ‘తేజస్’ యుద్ధ విమానాన్ని నడిపి అప్పుడే ల్యాండ్ చేసినట్టు కన్పిస్తుంది. ఫైలట్ యూనిఫాంలో ఠీవి నడుచుకుంటూ వస్తూ కన్పిస్తుంది. యూనిఫాంలో కంగనా ఫర్ఫెక్ట్ గా ఒదిగిపోయింది.

‘తేజస్’ మూవీని సర్వేశ్ మేవర అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఆర్ఎస్వీపీ ప్రొడక్షన్ పతాకంపై రోని స్క్రూవాలా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ తెరకెక్కించిన ‘ఉరి’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దేశ సైనికుల కథాంశంతో ‘ఉరి’ మూవీ తెరకెక్కి పలు అవార్డులను కూడా గెలుచుకుంది. కాగా ఎయిర్స్ ఫోర్స్ కథాంశంతో ‘తేజస్’ మూవీ తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని వచ్చే 2021 ఏప్రిల్ లో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.

ప్రస్తుతం కంగనా రనౌత్ ‘క్వీన్’, ‘మణికర్ణిక’ సినిమాల్లో నటిస్తూ బీజీగా ఉంది. వరుసగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీల్లో నటిస్తుంది. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా తెరకెక్కుతున్న ‘తలైవీ’ మూవీలో జయలలితగా నటిస్తుంది. వరుసగా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. బాలీవుడ్ హీరోలకు ధీటుగా తన సినిమాలతో కలెక్షన్లు రాబడుతూ కంగనా రనౌత్ బాలీవుడ్ క్వీన్ అనిపించుకుంటుంది.

తెలుగు ఇండస్ట్రీలో విజయ్ కెరీర్ ఫ్లాపేనా… ?

చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ పరిస్థితి ఇప్పుడు ఏ మాత్రం బాలేదనే చెప్పాలి… మొదట్లో సంచలన హీరోగా మారి, యువ ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ తరువాత మరో హిట్ సినిమాకు ఆమడ దూరంలో ఉన్నాడు.

అయితే గత మూడు సంవత్సరాలుగా సరైన హిట్ లేక పోవడంతో అతడు కిందా మీద పడటంతో పాటు గత శుక్రవారం విడుదలైన “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా అతడి కెరీర్ ను మరింత రిస్క్ లో పెట్టింది.

“వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా తనకు పూర్వ వైభవం వస్తుందని భావించిన విజయ్ కు చుక్కెదురైంది. ఈ సినిమా మొదటి రోజునే అట్టర్ ప్లాప్ సినిమాగా బిరుదు మూటకట్టుకుంది. యూఎస్ మార్కెట్లో అయితే అతడి కెరీర్ మరింత దిగజారిందనే చెప్పాలి.

గతంలో విడుదల అయిన “నోటా” సినిమా కన్నా తక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో విజయ్ దేవరకొండ మరోసారి ఆలోచనలో పడ్డాడు.

తేజను నమ్ముకున్న గోపిచంద్

యాక్షన్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు గోపిచంద్. దర్శకుడు తేజతో గోపిచంద్ తర్వాత మూవీ ఉండనుందని సమాచారం. గోపిచంద్ కోసం దర్శకుడు తేజ ఓ యాక్షన్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కథ నచ్చడంతో గోపిచంద్ తేజకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లలో జయం, నిజం మూవీ వచ్చాయి. ఈ మూవీలో విలన్ గా నటించిన గోపిచంద్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు.

అయితే గతకొంతకాలంగా గోపిచంద్ సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇటీవల గోపిచంద్ నటించిన ‘చాణక్య’ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో కొంత నిరాశకు గురయ్యాడు. ఆ తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ మూవీలో నటిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా ‘సీటీమార్’ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో గోపిచంద్ కబడ్డీ కోచ్ గా నటిస్తున్నాడు. గోపిచంద్ సరసన తమన్నా నటిస్తుంది. తమన్నా తెలంగాణ జట్టు కోచ్ గా నటిస్తుంది. ఆంధ్రా, తెలంగాణ జట్ల మధ్య జట్ల మధ్య జరిగే పోటీని ఆసక్తికరంగా సంపత్ నంది తెరకెక్కించాడు. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ మూవీకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.

‘సీటీమార్’ మూవీ షూటింగ్ పూర్తి కాగానే తేజ దర్శకత్వంలో గోపిచంద్ నటించనున్నట్లు సమాచారం. తనకు అచ్చివచ్చిన యాక్షన్ కథలతోనే బాక్సాఫీస్ హిట్టు అందుకోవాలని గోపిచంద్ చూస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు సంపత్ నందితో స్పోర్ట్స్ డ్రామాగా ‘సీటీమార్’ మూవీని లైన్లో పెట్టిన గోపిచంద్ ఆ తర్వాత మూవీలోనూ యాక్షన్ కథనే నమ్ముకున్నాడు. తేజ గోపిచంద్ కోసం ఓ పవర్ ఫుల్ యాక్షన్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ‘జయం’, ‘నిజం’ మూవీలో గోపిచంద్ లోని విలనిజాన్ని పరిచయం చేసిన తేజ తన తదుపరి మూవీలో హీరోయిజాన్ని ప్రేక్షకులకు చూపించనున్నాడు. వరుస మూవీలను లైన్లో పెడుతూ గోపిచంద్ బీజీగా మారుతున్నాడు. సరైన హిట్టుకోసం వెయిట్ చేస్తున్న గోపిచంద్ కు తేజ హిట్టు అందిస్తాడో? లేదో చూడాలి.

ఆ తప్పు చెయ్యను అంటున్న సమంత

సమంత జాను సినిమా దాదాపు 22 కోట్ల బడ్జెట్ బిజినెస్ చేస్తూ మూడొంతుల్లో ఒక వంతు షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇప్పటికే థియేటర్లు ఖాళీ అయిపోవడంతో మిగతా రెండొంతులు నష్టపోయినట్టేనన్న టాక్ వినిపిస్తోంది…

స్క్రిప్టు ఎంపికలో ఎలాంటి మిస్టేక్ చేయని సమంత ఎందుకని జాను తో బోల్తా పడింది. 96 చిత్రాన్ని ఆల్రెడీ చూసిన వాళ్ళు జాను సినిమా ని తిరిగి థియేటర్లలో చూడాలన్న ఆసక్తి కలుగలేదేమో..
పైగా జాను సినిమా సంక్రాంతి తరువాత రిలీజ్ అవ్వడంతో స్లో నేరేషన్ జాను డిజాస్టర్ కి కారణమైందన్న విమర్శలు వినిస్తున్నాయి. ఈ సినిమావళ్ల సమంతకు బ్రాండ్ వ్యాల్యూ మాత్రం అమాంతం పడిపోయింది… ఇలా తిరిగి జరగకుండా ఉంటుందని సమంత మాటల్లో అర్ధం చేసుకోవచ్చు…

అదిరిపోయిన కేజ్రీవాల్ స్పీచ్.. బెదిరిపోయిన బీజేపీ!


2020 ఢిల్లీ ఎన్నికలలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను 62 సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకోగా, బీజేపీకి 8 స్థానాలు లభించిన విషయం తెలిసిందే.. దింతో రాంలీల మైదనంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడోవసారి ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్, అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. అటు పాలనా పరమైన విధానం, ఇటు రాజకీయ విధి విధానాలను తెలియజేసారు.

ఈ సందర్బంగా ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి.. “ఆప్ విజయం ప్రజల విజయం అని, ఢిల్లీ ప్రజల పుత్రునిగా మూడొవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నాని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ని సుందర నగరంగా తీర్చి దిద్దడానికి కేంద్రం అండదండలు కావాలని కోరారు. అలాగే బీజేపీ సహాయంతో ప్రజలకు మరింత సేవ చేయాలనీ ఉందని కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధానిలో పాలన సజావుగా సాగేందుకు ప్రధాని మోదీ ఆశీస్సులు కోరుతున్నానని అన్నారు.

ఎన్నికలు ముగిసాయి, ప్రజల తీర్పు వచ్చింది కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఢిల్లీ వాసులకు సేవ చేయాలనీ ఆశిస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ‘ఎన్నికల సమయంలో నాపై వివిధ పార్టీలు చేసిన విమర్శలకు సంబంధించి వాటిని క్షమించాను’ అని అన్నారు. తన పాలనలో ఎవరి పట్ల ఎలాంటి వివక్ష లేదని, అందరి అభివృద్ధి కోసం తాను కృషి చేశానని కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్ ప్రజలను ప్రేమిస్తాడు. ఉచితంగానే ఆ ప్రేమను పంచుతాడు’ అని ఉచిత సేవలపై పలు రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.

ఈ విధంగా అటు ప్రజల మన్నలను పొందుకున్నారు, ఇటు బీజేపీని సున్నితంగా విమర్శించేస్తూ.. అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు ఢిల్లీ కొత్త సీఎం కేజ్రీవాల్.

Shraddha Das Latest Photos

చెర్రీ-బన్నీ మధ్య వార్ నడుస్తోందా?

సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైరవుతోన్నారు. సంక్రాంతి కానుకగా అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురములో’ రిలీజ్ అయింది. పాజిటిట్ టాక్ తెచ్చుకోవడంతో అల్లు అర్జున్ కెరీర్లో ‘అల.. వైకుంఠపురములో’ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ రిలీజ్ కు ముందు సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన రాంచరణ్ ‘అల.. వైకుంఠపురములో’ భారీ సక్సస్ తర్వాత ప్రశంసించకపోవడంతో బన్నీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. అయితే దీనికి కారణం వేరే వుందని వార్తలు విన్పిస్తున్నాయి.

తాజాగా రాంచరణ్ ‘జాను’ సినిమాను ప్రశంసిస్తూ పోస్టు పెట్టాడు. బాక్సాఫీస్ హిట్టందుకున్న ‘అల..వైకుంఠపురములో’ గురించి మాట్లాడలేదని బన్నీ ఫ్యాన్సు గుస్సగా ఉన్నారు. పలువురు సినీ ప్రముఖులు సినిమాను ప్రశంసించినా రాంచరణ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో ‘జాను’ సినిమా గురించి రాంచరణ్ సోషల్ మీడియాలో ప్రశంసిస్తూ పెట్టడంతో బన్నీ ఫ్యాన్స్ రాంచరణ్ ను ఫైరవుతున్నారు. గడిచిన కొంతకాలంగా పవన్ స్టార్ వర్సస్ అల్లు అర్జున్ ఫ్యాన్సీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పవర్ స్టార్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఈ మాటల యుద్ధం కొంతవరకు తగ్గింది. తాజాగా రాంచరణ్-అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో కోల్డ్ వార్ నడుస్తోంది.

అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ విజయంలో మెగా హీరోలెవరూ కనిపించడం లేదు. ఇటీవల అల్లు అరవింద్ ఆస్తుల పంపకం విషయంలో చిరంజీవి కలుగజేసుకోవడంతో మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కి కొంత గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య విబేధాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో రాంచరణ్ పై బన్నీ ఫ్యాన్స్ ఫైరవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంత వాస్తవముందోగానీ ఇటీవల కాలంలో మెగా హీరోల తీరు చూస్తే వీరిమధ్య ప్రొఫిషినల్ పోటీ తీవ్రంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. మరికొందు వీరి మధ్య ప్రొఫెషినల్ పోటీ తప్ప వారి కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేవని చెబుతున్నారు.

రాజధానిలో ఎన్ కౌంటర్

దేశరాజధాని ఢిల్లీలో ఈ రోజు తెల్లవారు జామున పోలీసులకు, క్రిమినల్స్ కి మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు నేరగాళ్లు చనిపోయారు. గతంలో నేరగాళ్లపై పలు నేరారోపణ కేసులు ఉన్నాయి. దింతో ఖురేషి, బహదూర్‌ల కోసం కరవాల్‌నగర్‌ మర్డర్‌ కేసు సహా పలు కేసుల్లో ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. చట్టం కళ్ళు కప్పి పోలీసులకు దొరకకుండ తిరుగుతున్న రాజా ఖురేష్, రమేష్ బహాదుర్ లను పోలీసులు మట్టుబెట్టారు.

హీరో శ్రీకాంత్ ఇంట విషాదం

Srikanth Sensational Comments
Srikanth

ప్రముఖ నటుడు శ్రీకాంత్ కు పితృవియోగం కలిగింది. గతకొంతకాలంగా శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు(70) అనారోగ్యంతో ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో శ్రీకాంత్ ఇంటా విషాదం నెలకొంది.

కృష్ణా జిల్లా మేకావారిపాలెంలో పరమేశ్వరరావు 1948 మార్చి 16న జన్మించారు. ఆ తర్వాత కర్ణాటకలోనని గంగావతి జిల్లా బసవపాలెంకు వలస వెళ్లారు. కొంతకాలంగా పరమేశ్వరరావు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. నాలుగునెలలుగా స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంలో పరమేశ్వరరావు తుదిశ్వాస విడిచారు. పరమేశ్వర్ రావుకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు.

శ్రీకాంత్ దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు. టాలీవుడ్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందరితో కలివిడిగా ఉండే శ్రీకాంత్ ఇంట్లో విషాదం నెలకొలడంతో పలువురు సీని ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకొని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 2గంటల తర్వాత మహాప్రస్థానంలో పరమేశ్వర్ రావు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

‘రావ‌ణ‌ లంక‌’ ఫస్ట్ లుక్ పోస్టర్

ఒక సినిమా ప్రేక్ష‌కుల ద‌గ్గ‌రికి తీసుకువెళ్లాలంటే దానికి టైటిల్ ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. ప్రేక్ష‌కుల నానుడిగా వుండే టైటిల్స్ ఎప్పూడూ ఇట్టే ఆక‌ట్టుకుంటాయి. కె సీరీస్ మూవి ఫ్యాక్ట‌రి బ్యాన‌ర్ లో క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో ముర‌శి శ‌ర్మ‌, దేవ్‌గిల్ ప్ర‌ధాన‌పాత్ర‌లో బి.ఎన్‌.ఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కిన చిత్రానికి టైటిల్ గా రావ‌ణ లంక అని ఖ‌రారు చేశారు. క్యాచి గా వుండే ఈ టైటిల్ అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రం లో క్రిష్‌, అష్మిత‌, త్రిష లు జంట‌గా న‌టించారు. స‌స్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా ఈ స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ఓక సాంగ్ మిన‌హ ష‌టింగ్ పూర్తిచేస‌కుని పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ చిత్రం యెక్క మెద‌టి లుక్ ని మ‌రియు మెష‌న్ పోస్ట‌ర్ ని ఈ రోజు విడుద‌ల చేశారు.

ద‌ర్శ‌కుడు బి.ఎన్‌.ఎస్ రాజు మాట్లాడుతూ.. చాలా రోజుల త‌రువాత తెలుగు సినిమా ఇండ‌స్ట్రికి స‌స్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా మా రావ‌ణ లంక చిత్రం రానుంద‌ని గ‌ర్వంగా చెప్తున్నాను. ఇలాంటి చిత్రాలకి స్క్రీన్‌ప్లే మెయిన్ పార్ట్ గా వుంటాయి. మా చిత్రం లో కూడా ప్ర‌తి ఒక్క‌రూ త‌ల తిప్ప‌కుండా చూస్తారు. ముర‌శి శ‌ర్మ గారు, దేవ్‌గిల్ గారు చాలా పెద్ద ఎస్పెట్ మాకు… అలాగే భ‌ద్రం, ర‌చ్చ‌ర‌వి కామెడి టైమింగ్ కూడా స్క్రీన్ మీద న‌వ్వుకుంటారు. అలాగే కొత్త వారైనా క్రిష్ చాలా బాగా చేశాడు. అష్మిత‌, త్రిష లు ఈ థ్రిల్లింగ్ మూవీకి గ్లామ‌ర్ అందించారు. ఉజ్జ‌ల్ అందించిన సంగీతానికి బిగ్‌బాస్ సీరీస్‌3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌మ‌రియు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి కుమారుడు కాల‌భైర‌వ వారి వాయిస్ తో ఆడియో కి క్రేజ్ తీసుకువ‌చ్చారు. అతి త్వ‌ర‌లో ఈ ఆడియో ని విడుద‌ల చేస్తాము. ఈ చిత్రం త‌ప్ప‌కుండా అంద‌ర్ని ఆక‌ట్ట‌కుంటుంది. అలాగే అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల చేస్తాము. అని అన్నారు

రికార్డు సృష్టించిన ‘సాహో’

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా సుజిత్ ద‌ర్శ‌కత్వం లో యు వి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి , ప్ర‌మెద్, విక్ర‌మ్ రెడ్డి లు నిర్మాత‌లుగా నిర్మించిన చిత్రం సాహో గ‌త ఏడాది అగ‌ష్టు లో విడుద‌ల‌య్యింది. ఈ చిత్రం జన‌వ‌రి 26న హింది టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ చేశారు.

గ‌త సంవ‌త్స‌రం లో డిసెంబ‌ర్ 8న నెట్‌ఫ్లిక్స్ ఒటిటి లో విడుద‌ల చేశారు. అయితే బ్రాడ్‌కాస్ట్ ఆడియ‌న్స్ రీసెర్చ్ కౌన్సిల్ వారు సాహో చిత్రం 128.20 ల‌క్ష‌ల మంది వ్యూవ‌ర్స్ ఇంప్రెష‌న్స్ వ‌చ్చాయ‌ని అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేశారు.

ఈ చిత్రం రీసెంట్ గా టెలికాస్ట్ అయిన కాలి కా క‌రిష్మా, పొలిస్ ఔర్ టైగ‌ర్‌, సింభా, కెజిఫ్ ఛాప్ట‌ర్‌1 చిత్రాల్ని అదిగ‌మించ‌టం ఈ చిత్రం యెక్క క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. అంతే కాకుండా ఈ చిత్రం కి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందిలో వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ తో యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ పాన్ ఇండియా సూప‌ర్‌స్టార్ గా భాహుబ‌లి-1, భాహుబ‌లి-2, సాహో చిత్రాల‌తో త‌న స్టామినా చాటాడు.. థియెట్రిక‌ల్ లోనే కాకుండా వ‌రల్డ్ టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ లో కూడా త‌న స‌త్తా ఛాటిన మ‌న తెలుగు స్టార్‌, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం లో చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే..

Rashmika Bheeshma Movie Interview Photos

పవన్ తర్వాతే చిరంజీవి!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నట్లు దర్శకుడు హరీష్ శంకర్ ప్రకటించారు. ప్రస్తుతం పవన్ పింక్ రీమేక్ షూటింగ్లో బీజీగా ఉన్నారు. ఈ మూవీలో తొలిసారి లాయర్ గా నటిస్తున్నాడు. పింక్ మూవీకి తెలుగు టైటిల్ ‘వకీల్ సాబ్’ ఖరారైనట్లు సమాచారం. ఈ మూవీ తర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కించే పిరియాడికల్ మూవీలో నటించనున్నాడు. ఈ రెండు మూవీల అనంతరం పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది.

గబ్బర్ సింగ్ తరహాలోనే కమర్షియల్ మూవీని తెరకెక్కించేందుకు కథను దర్శకుడు హరీష్ శంకర్ సిద్ధం చేసుకున్నాడు. ఈ కథ నచ్చడంతో పవన్ కల్యాణ్ హరీష్ శంకర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా పనులు ప్రారంభం కానున్నట్లు స్వయంగా దర్శకుడు హరీష్ శంకర్ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చిరంజీవి కోసం రాసుకున్న కథను విన్పించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీకి ‘ఆచార్య’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ మూవీలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అలాగే నిర్మాత రాంచరణ్ ఈ మూవీలో నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ తర్వాత చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్ లో నటిస్తారని తెలుస్తోంది. అప్పటివరకు దర్శకుడు హరీష్ శంకర్-పవన్ కల్యాణ్ కాంబినేషన్లలో వచ్చే మూవీ పూర్తి చేయాలని చూస్తున్నారు. దాదాపు ఈ మూవీలు ఒకే సమయానికి పూర్తయ్యే అవకాశం ఉండటంతో వీరిద్దరి కాంబినేషన్లలో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ తొలిసారి మెగాస్టార్ తో సినిమా చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మహిళలూ జిందాబాద్

ఆప్ విజయం వెనక మహిళలున్నారని సర్వేలు, పత్రికలూ ఘోషిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ తెలివిగల నాయకుడు. ఏమాత్రం స్మార్ట్ గా వున్న రాజకీయనాయకుడైనా మహిళలు ఎన్నికల్లో కీలకమని గ్రహిస్తున్నారు. ఇంతకుముందు అయిదేళ్లక్రితం నితీష్ కుమార్ బీహార్ ఎన్నికల్లో గెలవటానికి కూడా మహిళలే కారణమట. మద్యపాన నిషేధం వాగ్దానం చేసి దాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా ఉపయోగించటంతో బీహార్ లో మహిళలందరూ నితీష్ కుమార్ ని గెలిపించారు. అందుకే అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధాన్ని తీసుకొచ్చాడు. అంతెందుకు మోడీ 2019 విజయం వెనక కూడా మహిళలే వున్నారట. తను ప్రవేశపెట్టిన ఉజ్వల పధకంలో ఉచిత గ్యాస్ కనెక్షన్ మహిళలపేరుమీదే ఇచ్చాడంట. స్వచ్ఛ భారత్ ఉందనే వుంది మహిళల అభిమానాన్ని చూరగొనటానికి. ముమ్మూరు తలాక్ వాగ్దానంతో ముస్లిం మహిళలు కూడా గణనీయంగా మోడీ కి ఓటు వేశారంట . అదీ మహిళల శక్తి.
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే అరవింద్ కేజ్రీవాల్ విజయం వెనక సునీత కేజ్రీవాల్ పాత్ర కూడా ఉందనేది. వరసగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో , లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయింతర్వాత అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఆలోచించాడు ఎలా తిరిగిరావాలని. ఒకనాడు గెలవాలంటే గరీబీ హటావ్ , రోటి కపడా ఔర్ మకాన్ లాంటి ఆకర్షణీయమైన స్లోగన్లు ఇచ్చేవారు. ఇప్పుడు వాటిని ప్రజలు నమ్మటంలేదని గ్రహించారు. అందుకే మహిళా ఆకర్షిత పధకాలకు ప్రాధాన్యం పెరిగింది. ఇప్పటికే మొహల్లా క్లినిక్కులు, 200 యూనిట్ల కరెంటు ఉచితం, 20 వేల లీటర్ల మంచి నీళ్లు ఉచితం లాంటి పధకాలు, ప్రభుత్వ స్కూళ్లలో విద్య పై దృష్టి పెట్టిన కేజ్రీవాల్ గెలవాలంటే ఇవి చాలవని గ్రహించాడు. ఇంట్లో వాళ్ళ ఆవిడ సలహాలు కూడా తీసుకుంటాడని అంటారు. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరిగిన మున్సిపల్, లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోవటంతో డీలా పడిపోయిన ఆయనకు మహిళా జ్ఞానోదయమయ్యిందంట. అందుకే అద్భుతమైన ఐడియా వచ్చింది. ఢిల్లీలో రోజూ పనికోసం మహిళలు ఎంతో దూరం ప్రయాణం చేయటం తెలిసిందే. అందుకోసం ప్రతినెలా వాళ్ళ కొచ్చేదాంట్లో కొంతభాగం బస్సు ఛార్జీలకోసం ఖర్చుచేయక తప్పటంలేదు. ఆ బస్సు ప్రయాణాన్ని ఉచితం చేశాడు. అంతే ఒక్కసారి మహిళల్లో పెద్ద మార్పు వచ్చింది. వాళ్ళు దేశరాజకీయాలు, పౌరసత్వ చట్టాలు, షహీన్ బాగ్ నిరసనలు లాంటి అంశాలకు కాకుండా కేజ్రీవాల్ మాగోడు పట్టించుకున్నాడని, మా బతుకుల్లో వెలుగునింపాడనే భావనకు వచ్చారు. బీజేపీ దేశభక్తి కి ఆప్ ఉచితాలకి మధ్య ఆప్ వైపే మొగ్గారు. అరవింద్ కేజ్రీవాల్ ని మహిళలు నెత్తిన పెట్టుకున్నారు.

ఇప్పుడు ప్రతి రాజకీయపార్టీకి జ్ఞానోదయమయ్యిందంట. ఇక మహిళల ఆకర్షిత వాగ్దానాలు పోటెత్తుతాయంట. ఇప్పటివరకు గుజరాత్ మోడల్ ప్రచారం లో ఉంటే ఇప్పుడు ఢిల్లీ మోడల్ అందరికీ ఆదర్శం అవుతుందని అంటున్నారు. మరి మిగతా రాష్ట్రాల్లో కూడా బస్సు ప్రయాణాలు మహిళలకు ఉచితమవుతాయేమో చూడాలి. ఇటువంటి వాటిల్లో మన తెలుగు రాజకీయనాయకులు ముందువరసలో వుంటారు. ఆంధ్ర ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పథకంతో గట్టెక్కాలని అనుకోవటం వెనక మహిళా శక్తిని గుర్తించబట్టే. అయితే అది అంతగా క్లిక్ కాలేదు. మరీ ఎన్నికలకి జస్ట్ ముందు తీసుకొస్తే పెద్దగా పనిచేయలేదని అంచనా. జగన్ మోహన రెడ్డి అమ్మ ఒడి కూడా మహిళా ఆకర్షిత పథకమే. దానిమీద జగన్ ఆశలు పెట్టుకున్నాడు. కెసిఆర్ పెట్టిన కెసిఆర్ కిట్లు మహిళల్లో బాగా క్లిక్ అయ్యిందంట. ఇవన్నీ చూస్తుంటే మహిళలకు మహర్దశ పట్టుకుందని అనిపిస్తుందండోయ్. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి . దీనితోనన్నా లింగ సమానత్వ దిశగా సమాజం పయనిస్తుందని ఆశించొచ్చా? ఇంతకీ పార్లమెంటు, శాసన సభల్లో ప్రాతినిధ్యం ఎప్పుడు పెరుగుతుందో మరి? సగం సంగతి దేముడెరుక మూడింట ఒక వంతన్నా ప్రాతినిధ్యం పెరగాలి కదా. అంటే రాజకీయనాయకులు మహిళల్ని ఇంకా ఓటు బ్యాంకు గానే చూస్తున్నారన్నమాట. మహిళలూ తొందరపడి బుట్టలోపడకండి. మీకు కావాల్సింది తాయిలాలు కాదు సాధికారత , మరిచిపోకండి.

ఇవీ ఈవారం ముచ్చట్లు , తిరిగి వచ్చే వారం కలుద్దాం .

….. మీ రామ్

హీరో నితిన్ ఇంట పెళ్లిపనులు మొదలు..

హీరో నితిన్ త్వరలో వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నాడు. శాలిని అనే యువతిని పెళ్లి చేసుకొనేందుకు సిద్ధమవుతున్నాడు. దుబాయ్‌లో ఏప్రిల్ 16న జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్‌లో శాలిని మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు నితిన్. కాగా శనివారం హైదరాబాద్‌లోని నితిన్ ఇంట్లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలొ ‘పసుపు కుంకుమ’ కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసిన్ నితిన్ “పెళ్లిపనులు మొదలయ్యాయి. మ్యూజిక్ మొదలయ్యింది. మీ ఆశీర్వాదం కావాలి” అని పోస్ట్ చేశాడు. ఏప్రిల్ 15న నిశ్చితార్థం, 16న పెళ్లి జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. కాగా నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘భీష్మ’ ఫిబ్రవరి 21న విడుదలవుతోంది.

నయనతార ‘వసంతకాలం’ రిలీజ్ డేట్

లేడి సూపర్ స్టార్ నయనతార నటించగా ఘన విజయం సాధించిన ఓ సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ ను ‘వసంత కాలం’ పేరుతొ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్. 5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడ్ ముఖ్య పాత్రలు పోషించారు. యువ సంగీత సంచలనం యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ‘బిల్లా-2’ ఫేమ్ చక్రి తోలేటి దర్సకత్వం వహించారు.

‘5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై ఇంతకుముందు ‘ఏకవీర, వెంటాడు-వేటాడు” వంటి భారీ చిత్రాలు అందించిన యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. “టాప్ హీరోలకు తీసిపోని సూపర్ క్రేజ్ కలిగి, ఇటు మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా’లో మెప్పించి.. అటు సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘దర్బార్’లో జత కటైన నయనతార నటించిన హీరోయిన్ ఓరియంటడ్ చిత్రం ‘వసంతకాలం’ను నిర్మిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఈనెల 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. నయనతార నటన-గ్లామర్, యువన్ శంకర్ రాజా మ్యూజిక్, చక్రి తోలేటి దర్శకత్వం, భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడ్ తదితరుల పాత్రలు ‘వసంతకాలం’ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. సుస్పెస్న్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధించి.. నయనతార ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుతుందనే నమ్మకముంది.. అన్నారు!!