Home Blog Page 8617

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పృద్వి రాజ్


పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మేఘన, ల‌క్కి హీరోయిన్స్‌. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ప్రస్తుతం ఈ చిత్రం నుండి నటుడు పృద్విరాజ్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా నిర్మాత రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ…
“మా హీరో పవన్‌ తేజ్‌ కొణిదెలకి “ఈ కథలో పాత్రలు కల్పితం” మొదటి సినిమా అయినా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ లా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. దర్శకుడు అభిరామ్‌ మేకింగ్ ఫ్రెష్ గా ఉంది. ‘జెస్సీ’ కి సినిమాటోగ్రాఫర్‌ సునీల్‌ కుమార్‌ విజువల్స్‌, ‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘కల్కి’ చిత్రాలకు డైలాగ్స్‌ రాసిన తాజుద్దీన్‌ సయ్యద్‌ మాటలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలవనున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము. ఈ మూవీలో నటుడు పృద్వి రాజ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. అతని పాత్ర సినిమాకు హైలెట్ కానుంది. ఈ సందర్భంగా పృద్వి లుక్ ను విడుదల చెయ్యడం జరిగింది. ఈ మూవీ నుండి ఇదివరకు విడుదలైన పోస్టర్స్ కు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. సినిమా బాగా వస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ మూవీ ఆడియన్స్ ను అలరించబోతోందని తెలిపారు.

Siddi Idhani Latest Photos

Tridha Chowdary Latest Photo Stills

Dhanya Balakrishnan Glamorous Pics

వైసిపిలో కల్లోలం రేపుతున్న `కొత్త సీఎం’ ట్వీట్!


ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ సుస్థిరతకు ఎటువంటి ఢోకా లేదు. పైగా ఆయనను ముఖ్యమంత్రి పదవి నుండి మార్చవలసిన అవసరం కూడా ఆ పార్టీకి లేదు. అయితే త్వరలో రాష్ట్రంలో మహిళా ముఖ్యమంత్రి వస్తున్నట్లు, అది కూడా ఆ పార్టీ వర్గాల నుండే ట్వీట్ రావడం అధికార పార్టీలో కల్లోలం రేపుతున్నది.

అధికారిక పార్టీకి చెందిన నాయకుడు ఒకరు తన ట్విట్టర్ ఖాతాలో ‘రాష్ట్రానికి త్వరలో మహిళా ముఖ్యమంత్రి రానున్నారు’ అంటూ ట్వీట్ చేసి కొద్ది సేపటికే దాన్ని తొలగించారట. అయితే అప్పటికే కొందరు ఆయన ట్విట్టర్ ఫాలోవర్లు దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఇతర ఖాతాల్లో షేర్ చేయడంతో ఆ విషయం ఇప్పుడు పార్టీలో దావానలంలా వ్యాపించింది. పార్టీలో అన్ని స్థాయిలలో ఆ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆ నాయకుడు పార్టీలో చాలా కాలంగా ఉండడమే కాకుండా పార్టీలో కీలకనేతలతో సత్సంబంధాలు కలిగి ఉండటంతో పార్టీలో ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతోంది. ఈ ట్విట్టర్‌లో నాయకుడు చేసిన ట్వీట్‌లో పేర్కొన్న మహిళా ముఖ్యమంత్రి ఎవరు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పరిస్థితి ఏంటి అనే విషయంలో తీవ్ర ఆసక్తి వ్యక్తం అవుతున్నది.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గత వారం రోజులుగా చేస్తున్న ఆరోపణలు సైతం వీరి చర్చలో భాగమతుండడం గమనార్హం. అరబ్ దేశానికి చెందిన కంపెనీ త్వరలో సీఎం జగన్‌ను తమకు అప్పగించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉందని బోండా ఉమా వంటి టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు.

ఆ కంపెనీ తరఫున అరబ్ దేశం జగన్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే గత జనవరిలో కుదిరిన ఒప్పందం ప్రకారం అప్పగించాల్సి వస్తుందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఇంత వరకూ వైసిపి సీనియర్ నాయకులు ఎవరూ ఖండించక పోవడం గమనార్హం. పైగా, ఈ ట్వీట్ ను కూడా ఎవ్వరు ఖండించకపోవడంతో ఈ విషయం వైసిపి నాయకులలో గందరగోళం సృష్టిస్తున్నది.

అంతేగాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై న్యాయ స్థానాలు విచారిస్తున్న అక్రమ ఆస్తుల కేసులు కూడా త్వరలో విచారణ పూర్తయి తీర్పు వచ్చే అవకాశం ఉందని టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. దీంతో మొత్తం మీద పార్టీలో ఏదో జరుగుతోందని వైసీపీ నేతలు కలవరం చెందుతున్నట్లు కనిపిస్తున్నది.

ఇక పార్టీ నేత ట్విట్టర్‌లో పేర్కొన్నట్లు మహిళా ముఖ్యమంత్రి ఎవరన్న అంశం కూడా చర్చకు వస్తోంది. దీంతో కొందరు వైఎస్ భారతి అంటూ అభిప్రాయపడుతుండగా మరి కొందరు షర్మిల అంటూ వాదిస్తున్నారు. ఇద్దరిలో ఒకరు ఖాయమని చర్చలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాది సంబరాలు చేసుకునే అవకాశం వస్తుందా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

సిట్‌ ఏర్పాటుపై అధికారుల్లో ఖంగారు

గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అన్ని నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయడం పట్ల అత్యున్నతస్థాయి అధికారులు పలువురు ఖంగారు పడుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా దీనిని వేసినప్పటికీ ఆచరణలో ఎక్కువగా బలి కావలసింది తామే అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపక్ష నేతగా ఈ దర్యాప్తును `రాజకీయ కక్ష సాధింపు’ చర్యగా చూపు ప్రజలలో సానుభూతి పొందే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. పైగా నేరుగా ఆయన ప్రమేయాన్ని నిరూపించడం కూడా కష్టం అవుతుంది. ప్రతి ఉత్తరువుపై సంతకాలు చేసిన అధికారులే చివరకు బాధ్యులుగా ఉండవలసి వచ్చే పరిస్థితి ఉంది.

వై ఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రస్తుతం నడుస్తున్న సిబిఐ కేసులలో గతంలో వై ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిబంధనల ప్రకారమే సంతకాలు చేసినప్పటికీ పలువురు ఉన్నత అధికారులు ఇప్పటికి కోర్ట్ చుట్టూ తిరగవలసి వస్తుండటం గమనార్హం. కేసును బలహీనం కావించడం కోసం జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులు తమను ఈ కేసులలో ఇరికించారని అంటూ వారిలో కొందరు వాపోతున్నారు.

‘ఎవరో తీసుకున్న నిర్ణయాలకు మేము బలికావాల్సి వస్తోంది. ప్రభుత్వంలో పనిచేయడం ఇబ్బందికరంగా మారిపోతోంది.’ అరటూ ఉన్నతస్థాయి అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, చివరకు భూ లావాదేవీలపై లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

సిట్‌కు కేవలం దర్యాప్తు బాధ్యతలే కాకుండా, లా అరడ్‌ ఆర్డర్‌ అధికారులకు ఉన్న అధికారాలను కూడా కట్టబెట్టడం చర్చకు దారితీస్తోంది. ఈ బృందం ఐదేళ్ల కాలంనాటి అన్ని నిర్ణయాలకు సంబరధించిన ఫైళ్లను కూడా అధ్యయనం చేయనుంది.

సాధారణంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా… వాటిపై సంతకాలు చేసేది, వాటిని అమలు చేసేది అధికారులే. దీంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మంత్రులు, ముఖ్యమంత్రి విధాన నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారని, వాటికి సంబంధించిన ఉత్తర్వులు మాత్రం తామే ఇవ్వాల్సి ఉరటుందని వాపోతున్నారు.

కొన్ని సందర్భాల్లో ప్రాథమిక స్థాయి పత్రాలపై మంత్రుల సంతకాలు ఉన్నా, చివరి దశలో మాత్రం తామే సంతకాలు చేస్తామని చెబుతున్నారు. అందువల్లనే సిట్‌ దర్యాప్తులో తాము చేసిన సరతకాల ఫైళ్లే ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉంటుందన్న ఆందోళన అధికారవర్గాల్లో నెలకొంది.

అధికారులతో సంబంధం లేకుండానే కొన్ని నిర్ణయాలను నేరుగా మంత్రివర్గ సమావేశంలో తీసుకుంటారని, ప్రతిపాదనలు కూడా సంబంధిత మంత్రి నేరుగా మంత్రి వర్గంలోనే చేస్తారని. ఇలా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్న తరువాత అధికారులు వాటిని అమలు చేయడం మినహా చేసేదేమి ఉండదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

తాజా సిట్‌ నిబంధనల ప్రకారం మరోవైపు అత్యున్నతస్థాయి అధికారులు సంతకాలు చేసిన ఫైళ్లను పరిశీలించిన అనంతరం, డిఐజి స్థాయి అధికారి వారిని ప్రశ్నించాల్సి ఉందని, ఆచరణలో ఇది ఎలా సాధ్యమవుతుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ స్థాయి అధికారులకు హాజరు నోటీసు ఇవ్వడం ఎంతవరకు అమలు సాధ్యమన్నది కూడా ప్రశ్నిస్తున్నారు.

26వేల మంది విద్యార్థులతో ట్రంప్ కి ఘన స్వాగతం


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటనలో భాగంగా ఈ రోజు (ఫిబ్రవరి 24)న మొదటిగా సబర్మతి ఆశ్రయాన్ని సందర్శించి, ఆ తర్వాత మోతేరా స్టేడియం లో ఏర్పాటు చేసిన “నమస్తే ట్రంప్” (కెమ్ ఛో ట్రంప్) కార్యక్రమంలో పాల్గొని సాయంత్రానికి ఆగ్రాకు చేరుకొని తాజ్ మహల్ ని సందర్శించనున్నారు.

అయితే గుజరాత్ పర్యటన అనంతరం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి ఖేరియా విమానాశ్రయం ఆ తర్వాత తాజ్ మహల్ కి బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో ఖేరియా విమానాశ్రయం నుండి తాజ్ మహల్ వరకు దూరం 15 కిలోమీటర్లు. ఈ మార్గం మధ్యలో జాతీయ జండాలు పట్టుకున్న పాఠశాల పిల్లలు ట్రంప్ కి ఘన స్వాగతం చెప్పడానికి ప్రణాళికలు రూపొందించారు. పాఠశాల పిల్లలను అజిత్‌నగర్ గేట్ నుండి శిల్‌పగ్రామ్ వరకు రహదారికి ఇరువైపులా దాదాపు 26 వేల మంది పిల్లలను నిలబెట్టడానికి ప్రణాళికలు పూర్తి చేశారు. ట్రంప్ రిసెప్షన్‌లో భాగంగా ఈ 26వేల మంది పిల్లలు సుమారు ఐదు గంటలు నిలబడాల్సి ఉంటుంది. ట్రంప్ వచ్చి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యేవరకు అంటే మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఏడు గంటలకు అక్కడే ఉండాలి. ఈ ఐదు గంటలు పిల్లలు శబ్దం చేయకూడదు. గందరగోళ వాతావరణాన్ని సృష్టిచకూడదు. దింతో ఈ ఐదు గంటలు పిల్లలకు ఎంతోకొంత శారీరక బడలిక, మానసిక విసుగు కలిగే అవకాశాలు ఉన్నాయి.

అలాగే ట్రంప్ ప్రయాణించే మార్గం మధ్యలో, ఆ సమయంలో దుకాణాలు మూసివేయాలి, వసతి గృహాలు, హోటళ్లు తెరవకూడదు,
ఉదయం 9 గంటల నుండే ఎటువంటి వాహనం అనుమతించబడటం లేదు. ఒక్క వాహనం కూడా ఆ పరిసర ప్రాంతాలలో పార్కింగ్ చేయడానికి అనుమానతించబడదు. ఈ ఐదు గంటలు ఖేరియా విమానాశ్రయం నుండి తాజ్ మహల్ వరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు.

వ్యర్ధాలతో విద్యుత్ ఉత్పత్తి!

చెత్త నుండి విద్యుత్ ను ఉత్పత్తి చేయడానికి సిద్ధపడిన ‘బయో ఎనర్జీ ‘ ప్లాంట్ బోయిన్ పల్లి మార్కెటులో సిద్దమైనది. ప్రస్తుతం ఈ ప్లాంట్ 10 టన్నుల చెత్తతో నిర్మించి ప్రయోగ దశలో ఉంచారు. ప్రస్తుతం ట్రయల్ లో భాగంగా రెండు నుండి మూడు భాగాల చెత్తను ఇంధనంగా మార్చుతున్నారు.దీన్ని పూర్తి స్థాయికి తీసుకెళ్లే పనిలో భాగంగా సాంకేతిక సిబ్భంది పరీక్షలు చేస్తున్నారని కూరగాయల మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ తెలిపారు.

నెల రెండు నెలల్లో ఈ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని, ఇదే సమయంలో ఇంధన వనరుగా మార్చిన తర్వాత మిగిలిన మలినాలను కంపోస్ట్ ఎరువుగా మార్చుతారాని తెలిపారు.

స్వచ్ఛభారత్ తో పాటు ఇంధన వనరులను పరిరక్షించుకొనే క్రమంలో ఇక్కడ బయో ఎనర్జీ ప్లాంట్ ను ఏర్పాటు చేసాం అని ప్రత్యేక ఉన్నతశ్రేని కార్యదర్శి, బోయిన్ పల్లి హోల్ సేల్ మార్కెట్ తెలిపింది…

Ruhani Sharma at Hit Pre Release Event

Anushka at Hit Pre Release Event

కోరిక తీర్చలేదని త్రిషపై నిర్మాత ఫైర్

లేటు వయస్సులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తూ త్రిష వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఇటీవల కొంత గ్యాప్ తీసుకున్న త్రిష మళ్లీ బడా హీరోలు నటిస్తున్న సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని బీజీగా మారింది. త్రిషకు తెలుగు, తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా త్రిష చేసిన పనికి ఓ నిర్మాత ఫైర్ అవుతున్నాడు. త్రిషతో ‘పరమపదం విలయవత్తు’ మూవీని తమిళంలో నిర్మించాడు. ఈ మూవీ ప్రమోషన్లో పాల్గొనాలని త్రిషను కోరాడు. అయితే ఆమె మాటమాత్రం చెప్పకుండా ప్రమోషన్లో పాల్గొనేలేదని దర్శక, నిర్మాతలు అసహనం వ్యక్తం చేశారు.

త్రిష నటించిన పరమపదం విలయట్టు మూవీ ఏడాదిగా రిలీజుకు నోచుకోలేదు. త్రిష లేడి ఓరియంటెడ్ పాత్రలో నటించింది. ఈ మూవీని ఫిబ్రవరి 28న రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేసింది. ఇందులో భాగంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రమోషన్లో త్రిషను పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఆమె వస్తారని ఏర్పాటు చేసుకున్న వారికి త్రిష షాక్ ఇచ్చింది. ఆమె హాజరుకాకపోవడంతో నిర్మాతలు టి.శివ, సురేష్ కమాచిలు బహిరంగగానే అసహనం వ్యక్తం చేశారు.

ఎంత పెద్ద స్టార్లయినా తమ సినిమాల ప్రమోషన్లకు హాజరు కావాల్సిందేనని నిర్మాతలు అంటున్నారు. వాళ్ల సినిమాల ప్రమోషన్లకు కూడా వారు హాజరుకాకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏడాది కాలంగా చిత్ర రిలీజు కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సినిమా రిలీజు కాకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వాపోయారు. తమది న్యాయమైన కోరిక అని చెబుతున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరుకాకపోయిన మిగతా కార్యక్రమాల్లో త్రిష పాల్గొంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. త్రిష హాజరుకాకోతే ఆమె పారితోషకంలో కోత విధించనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

‘అరణ్య’లో విష్ణు విశాల్ ఎలిఫెంట్ ఫ్రెండ్ లుక్

హ్యాండ్సం హీరో రానా దగ్గుబాటి తెలుగు, హిందీ, ఇతర భాషల్లో వరుస హిట్లతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆయన నెగటివ్ రోల్లో నటించగా ఇటీవల విడుదలైన బాలీవుడ్ ఫిల్మ్ ‘హౌస్ ఫుల్ 4’ బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇప్పుడు ఆయన ‘హాథీ మేరే సాథీ’ అనే బహుళ భాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలుగులో ఆ సినిమా ‘అరణ్య’ పేరుతో రిలీజ్ అవుతోంది. దేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల విడుదల చేసిన రానా ఫాస్ట్ లుక్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో మనకు తెలుసు. అడవి మనిషిలా కనిపిస్తున్న రానా అందర్నీ ఆకట్టుకున్నారు.


ఈ చిత్రంలో తమిళ యువ నటుడు విష్ణు విశాల్ కూడా ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇదివరకే ఆయన ఫస్ట్ లుక్ కూడా విడుదలై ఆకట్టుకుంది. తాజాగా చిత్ర బృందం విష్ణు విశాల్ మరో లుక్ ను విడుదల చేసింది. అందులో ఆయన ఒక ఏనుగుపై పడుకొని కనిపిస్తున్నారు. ఈ ఎలిఫెంట్ ఫ్రెండ్ లుక్ లో ఆయన క్యూట్ గా ఉన్నారు. ఆయన పాత్ర ప్రేక్షకులకు బాగా అలరిస్తుందని నిర్మాతలు చెబుతున్నారు.

ఏప్రిల్ 2న ‘అరణ్య’ రిలీజ్ అవుతోంది. హిందీలో ‘హాథీ మేరే సాథీ’, తమిళంలో ‘కాండన్’ పేరుతో వస్తోంది. ఎంతో లావిష్ గా తయారవుతున్న ఈ సినిమాని ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేస్తున్నారు. పర్యావరణం, అడవుల నరికివేత వంటి సమస్యల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది.

జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్ ఇతర ప్రధాన పాత్రధారులు. శంతను మొయిత్రా సంగీతం అందిస్తుండగా, ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రఫీని సమకూరుస్తున్నా

Hit Movie Pre Release Event Photos

ట్రంప్ భారత్ పర్యటన.. లైవ్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ రోజు, రేపు (ఫిబ్రవరి 24, 25 వ తేదీలలో) భారత్ లో పర్యటించనున్నారు. ఆయనకు ఘన స్వాగతం తెలిపేందుకు కేంద్రం భారీ ఏర్పాట్ల చేసింది. అలాగే అందుకు సంబంధించిన అన్ని భద్రతా ఏర్పాట్లను భారత్ – అమెరికా దేశాలు పూర్తి చేశాయి. ట్రంప్, అమెరికా నుండి బయలుదేరిన దగ్గర్నుండి మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టె వరకు భారీ భద్రత ఏర్పాట్లు నడుమ, మినిట్ టు మినిట్ ప్రోటోకాల్ తో, పక్కా షెడ్యూల్ తో సర్వం సిద్ధం చేసుకున్నాయి.

https://youtu.be/WUmXDqyzq7c

ట్రంప్ తో డాన్స్ చేయిస్తానంటున్న గాయకుడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండ్రోజులపాటు భారత్ లో పర్యటించనున్నారు. ఈమేరకు ఫిబ్రవరి 24, 25తేదిల్లో ట్రంప్ పర్యటన ఖారారైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇరుదేశాల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే భారత పర్యటనలో అమెరికా అధ్యక్షుడిచే స్టెప్పులేయిస్తానని గాయకుడు ఖైలాష్ ఖేర్ అంటున్నాడు.

ఈనెల 24 నుంచి ట్రంప్ గుజరాత్ లోని అహ్మాదాబాద్ కు చేరుకొని నమస్తే మోడీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సర్దార్ వల్లభాయ్ స్టేడియలో అమెరికాలో నిర్వహించిన హౌడీ మోడీ కార్యక్రమాన్ని మించిపోయేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సీని కళాకారులు ఆడిపాడనున్నారు. ప్రముఖ గాయకుడు ఖైలాష్ ఖేర్ ఈ కార్యక్రమంలో పాటలను పాడనున్నాడు. ట్రంప్ పర్యటనపై ఆయన స్పందిస్తూ వీలైతే తన పాటకు ట్రంప్ చేత డాన్స్ చేయిస్తానంటూ సరదాగా వ్యాఖ్యనించారు.

అనంతరం ట్రంప్ కుటుంబం ఆగ్రాలోని తాజ్ మహాల్ ను సందర్శించనుంది. 25న ఢిల్లీ చేరుకోనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన డిన్నర్ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొననున్నారు. ఈ డిన్నర్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పటికే ఆహ్వానం అందింది. ట్రంప్ పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. ట్రంప్ తిరిగి అమెరికా వెళ్లే వరకు కట్టుదిట్టమైన భద్రత కొనసాగనుంది.

‘పలాస 1978’ విడుదల తేదీ ఖరారు

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’ . తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. డైరెక్టర్ కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ విడుదలకు ముందే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదలవుతున్న ఈ చిత్రం సెన్సార్ బోర్డ్ మెంబెర్స్ ప్రశంసలు పొందింది.

ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ : ” సెన్సార్ బోర్డ్ ఎక్కువ కట్స్ సూచించడం తో రివైజ్ కమీటీ కి వెళ్ళాం. అక్కడ” పలాస 1978″ చూసిన బృందం ఈ సినిమా ను ప్రశంసించారు. వారికి నా ధన్య వాదాలు. ఇప్పటికే, ఈ సినిమా ప్రివ్యూ చూసిన వారు ఇస్తున్న స్పందన నాకు మరింత బలాన్ని ఇచ్చింది. తెలుగు సినిమా లలో “పలాస 1978″ భిన్న మైనది అని ఖచ్చితంగా చెప్పగలను. రైటర్ ఉన్న నన్ను దర్శకుడిగా అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ కి థాంక్స్. ఈ సినిమా కు కథ నుండి రిలీజ్ వరకూ మాకు అండ గా నిలిచిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి చాలా థాంక్స్. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవడం చాలా ఆనందం గా ఉంది” అన్నారు.

విజయవాడ, గుంటూరు ల్లో జరిపిన ప్రమోషన్స్ టూర్స్ కి విశేష స్పందన వచ్చింది. రఘు కుంచె మ్యూజిక్ అందించడమే కాకుండా ఇక కీలక పాత్ర ను పోషించారు. శ్రీకాకుళం జానపదం నుండి తీసుకున్న’ నీ పక్కన పడ్డాదిరో చూడర పిల్లా..నాది నక్కీ లీసు గొలుసు’ పాట సోషల్ మీడియా లో విశేష ఆదరణ పొందుతుంది. ఈ సినిమా చూసి బాగా నచ్చి” మీడియా 9 మనోజ్” రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ ని ఫ్యాన్సీ రేట్స్ కి సొంతం చేసుకున్నారు. మార్చ్ 6 న గ్రాండ్ గా విడుదల కానుంది.

నెహ్రూ కుటుంబం చేతిలో కాంగ్రెస్ భవిష్యత్తు

కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు పై రకరకాల కధనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత చాలామంది కాంగ్రెస్ ఉనికిని ప్రశ్నించటం మొదలుపెట్టారు. వరసగా మహారాష్ట్ర, హర్యానా ల్లో ఓటమి , ఝార్ఖండ్ లో ముందుగానే ఝార్ఖండ్ ముక్తి మోర్చా కి పీఠం ఇవ్వటానికి ఒప్పందం చేసుకొని జూనియర్ పార్టనర్ గా సెటిల్ కావటం, ఢిల్లీ ఎన్నికల్లో పూర్తిగా బొక్కబోర్లా పడటం ఈ ఆలోచనకు కారణమయ్యింది. దీనికి తోడు రాహుల్ గాంధీ నాయకుడుగా అన్నిరంగాల్లో విఫలంగావటం , ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఏరోజైనా జైలుకు వెళ్తాడానే వార్తలు , సోనియా గాంధీ ఆరోగ్య కారణాలతో చురుకుగా లేకపోవటం ఓ విధంగా పార్టీ సంక్షోభంలో ఉందనే చెప్పాలి. ఒకవేళ వచ్చే నాలుగేళ్లలో బీజేపీ పై వ్యతిరేకత పెరిగినా దాన్ని అందిపుచ్చుకునే సత్తా కాంగ్రెస్ కి లేదనేది ప్రస్తుత పరిస్థితులు సూచనలు ఇస్తున్నాయి.

ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకునే సత్తా కాంగ్రెస్ కి లేదా? అసలు కాంగ్రెస్ భవిష్యత్తు అంధకార బంధురమేనా ? మొదటి ప్రశ్నకి గట్టిగానే వుంది అని చెప్పొచ్చు. అలాగే రెండో ప్రశ్నకి కాదనే చెప్పొచ్చు. దానికి సహేతుకమైన కారణాలే వున్నాయి. భారత్ సువిశాల, వైవిధ్య భరిత, పలు సంస్కృతుల సమూహం. ఏ ఒక్క పార్టీ గుత్తాధిపత్యం సాధించలేదు. బీజేపీ కి ఎన్ని సానుకూల అంశాలున్నాయో అన్ని ప్రతికూల అంశాలు కూడా వున్నాయి. అలాగే కాంగ్రెస్ కి ఎన్ని ప్రతికూల అంశాలు వున్నాయో అన్ని సానుకూల అంశాలు కూడా వున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం.

ఒకటి, ఘనమైన వారసత్వం. దానితో ప్రతి రాష్ట్రం లో కొంత ఓటు బ్యాంకు ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఉంటుంది. అయితే ఢిల్లీ ఎన్నికల్లో అదికూడా లేకుండా పోవటం ఆశ్చర్యం. రెండోది, బీజేపీ వ్యతిరేక ఓటు దేశంలో బలంగా ఉండటం. అది అనేక బీజేపీయేతర పార్టీల మధ్య చీలిపోయి వుంది. దేశవ్యాప్తంగా బీజేపీ తర్వాత ఎక్కువమంది నాయకులు కూడా ఇప్పటికీ కాంగ్రెస్ కే వున్నారు. మూడోది, దేశవ్యాప్తంగా మేధావులు, ఉదారవాదులు ఇప్పటికీ కాంగ్రెస్ కే అండగా వున్నారు.జాతీయ ప్రచార సాధనాల్లో కూడా బీజేపీ తో దాదాపు సమానంగా కాంగ్రెస్ కి సానుభూతిపరులు వున్నారు. నాలుగు, పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో వుంది. అందులో హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ మరియు పంజాబ్ లో స్వంతగానే అధికారంలో వుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబై కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం చేతుల్లోనే వుంది. మరి ఇన్ని అనుకూల పరిస్థితులు వుండికూడా కాంగ్రెసుపై పరిశీలకులకు నమ్మకం ఎందుకు లేదు?

కాంగ్రెస్ కి పట్టుకున్న గ్రహణం , కాంతి రెండూ నెహ్రూ కుటుంబమే. అనేక సందర్భాల్లో నెహ్రు కుటుంబ ప్రతిష్టే కాంగ్రెస్ ని కాపాడింది. కానీ ఇప్పుడు అదే ప్రతిబంధకం అయ్యింది. 2014 తర్వాత నెహ్రూ కుటుంబం దశ దిశ రివర్స్ గేర్ లో నడుస్తుంది. ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత అది వేగం పుంజుకుంది. ఈ రివర్స్ గేర్ ని ఆపే అవకాశం వుందా? ఖచ్చితంగా వుంది. దానికి కావాల్సిందల్లా నెహ్రూ కుటుంబం విశాలంగా పార్టీ ప్రయోజనాల్ని దృష్టిపెట్టుకొని కొన్ని చర్యలు చేపట్టాలి. వాళ్ళ మీద వున్న రివర్స్ ట్రెండ్ ని సానుకూలంగా మార్చుకోవాలంటే ప్రజలకు తిరిగి విశ్వాసం కలిగించే టట్లు గా ప్రవర్తించాలి. అందుకు ఒక్కటే మార్గం. పార్టీని ప్రజాస్వామీకరించటం. ఇప్పటికే శశి థరూర్ , సందీప్ దీక్షిత్ లాంటి వాళ్ళు దీనిపై అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తపరిచారు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు దీన్ని అందిపుచ్చుకొని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ని ప్రాతినిధ్య ఎన్నికద్వారా పూరించాలి. అప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. నిజం చెప్పాలంటే ఈ సారికి నెహ్రూ కుటుంబం పోటీ నుంచి తప్పుకుంటే ప్రజలకు నూతనోత్సాహం వస్తుంది. అంతేగాని రాహుల్ గాంధీ స్థానంలో ప్రియాంక గాంధీని తీసుకొస్తే కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఒక్కసారి నెహ్రు కుటుంబం లేకుండా ఎన్నికలు జరిగితే మోడీకి చెప్పటానికి పదునైన అస్త్రం ఉండదు. ఇన్నాళ్లనుంచి నెహ్రూ కుటుంబమే మోడీకి ప్రచారాస్త్రం. అందుకని ఈ ప్రయోగం బీజేపీ వ్యతిరేక ప్రజానీకం లో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. లేకపోతే ఈ బంగారు అవకాశం జారవిడుచుకున్నవాళ్లవుతారు. ఇప్పటికే ఆప్ ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాజకీయాల్లో నాలుగు సంవత్సరాలు చాలా ఎక్కువ. నెహ్రూ కుటుంబం పార్టీ శ్రేయస్సు రీత్యా పదవుల్ని పక్కనపెట్టి అంతర్గత ప్రజాస్వామ్యం వైపు పయనిస్తుందని ఆశిద్దాం.