Homeఆంధ్రప్రదేశ్‌సిట్‌ ఏర్పాటుపై అధికారుల్లో ఖంగారు

సిట్‌ ఏర్పాటుపై అధికారుల్లో ఖంగారు

గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అన్ని నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయడం పట్ల అత్యున్నతస్థాయి అధికారులు పలువురు ఖంగారు పడుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా దీనిని వేసినప్పటికీ ఆచరణలో ఎక్కువగా బలి కావలసింది తామే అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపక్ష నేతగా ఈ దర్యాప్తును `రాజకీయ కక్ష సాధింపు’ చర్యగా చూపు ప్రజలలో సానుభూతి పొందే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. పైగా నేరుగా ఆయన ప్రమేయాన్ని నిరూపించడం కూడా కష్టం అవుతుంది. ప్రతి ఉత్తరువుపై సంతకాలు చేసిన అధికారులే చివరకు బాధ్యులుగా ఉండవలసి వచ్చే పరిస్థితి ఉంది.

వై ఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రస్తుతం నడుస్తున్న సిబిఐ కేసులలో గతంలో వై ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిబంధనల ప్రకారమే సంతకాలు చేసినప్పటికీ పలువురు ఉన్నత అధికారులు ఇప్పటికి కోర్ట్ చుట్టూ తిరగవలసి వస్తుండటం గమనార్హం. కేసును బలహీనం కావించడం కోసం జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులు తమను ఈ కేసులలో ఇరికించారని అంటూ వారిలో కొందరు వాపోతున్నారు.

‘ఎవరో తీసుకున్న నిర్ణయాలకు మేము బలికావాల్సి వస్తోంది. ప్రభుత్వంలో పనిచేయడం ఇబ్బందికరంగా మారిపోతోంది.’ అరటూ ఉన్నతస్థాయి అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, చివరకు భూ లావాదేవీలపై లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

సిట్‌కు కేవలం దర్యాప్తు బాధ్యతలే కాకుండా, లా అరడ్‌ ఆర్డర్‌ అధికారులకు ఉన్న అధికారాలను కూడా కట్టబెట్టడం చర్చకు దారితీస్తోంది. ఈ బృందం ఐదేళ్ల కాలంనాటి అన్ని నిర్ణయాలకు సంబరధించిన ఫైళ్లను కూడా అధ్యయనం చేయనుంది.

సాధారణంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా… వాటిపై సంతకాలు చేసేది, వాటిని అమలు చేసేది అధికారులే. దీంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మంత్రులు, ముఖ్యమంత్రి విధాన నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారని, వాటికి సంబంధించిన ఉత్తర్వులు మాత్రం తామే ఇవ్వాల్సి ఉరటుందని వాపోతున్నారు.

కొన్ని సందర్భాల్లో ప్రాథమిక స్థాయి పత్రాలపై మంత్రుల సంతకాలు ఉన్నా, చివరి దశలో మాత్రం తామే సంతకాలు చేస్తామని చెబుతున్నారు. అందువల్లనే సిట్‌ దర్యాప్తులో తాము చేసిన సరతకాల ఫైళ్లే ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉంటుందన్న ఆందోళన అధికారవర్గాల్లో నెలకొంది.

అధికారులతో సంబంధం లేకుండానే కొన్ని నిర్ణయాలను నేరుగా మంత్రివర్గ సమావేశంలో తీసుకుంటారని, ప్రతిపాదనలు కూడా సంబంధిత మంత్రి నేరుగా మంత్రి వర్గంలోనే చేస్తారని. ఇలా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్న తరువాత అధికారులు వాటిని అమలు చేయడం మినహా చేసేదేమి ఉండదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

తాజా సిట్‌ నిబంధనల ప్రకారం మరోవైపు అత్యున్నతస్థాయి అధికారులు సంతకాలు చేసిన ఫైళ్లను పరిశీలించిన అనంతరం, డిఐజి స్థాయి అధికారి వారిని ప్రశ్నించాల్సి ఉందని, ఆచరణలో ఇది ఎలా సాధ్యమవుతుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ స్థాయి అధికారులకు హాజరు నోటీసు ఇవ్వడం ఎంతవరకు అమలు సాధ్యమన్నది కూడా ప్రశ్నిస్తున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular