Home Blog Page 8618

గర్వంతో కుటుంబాలు విచ్చిన్నం?

హాయ్ దోస్త్ , అప్పుడే వారాంతం వచ్చేసింది. మనం బద్దకించినా కాలం ఆగదు కదా. గత రెండు , మూడు రోజుల్నుంచీ ఏ టీవీ పెట్టినా ట్రంప్ ముచ్చట్లే. అసలే తుంటరి, అయితేనేం అమెరికాకు అధ్యక్షుడు. ఇంకేం మరి టీవీ లకు మంచి పని దొరికింది. వున్నదీ లేనిదీ కలిపి వంట వారుస్తున్నారు. అఫ్ కోర్సు ట్రంప్ కి కూడా అదే ఇష్టం. స్వయానా తనే ఎన్నో గాసిప్పులు పోగుచేస్తుంటాడు, అందుకే మీడియా కి ట్రంప్ పెద్ద ఎస్సెట్. మనం ఆ జోలికి పోవద్దు. ఏదైనా వారాంతానికి సరిపడే టాపిక్ మాట్లాడుకుందాం.

ఈవారం మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి ఆర్ ఎస్ ఎస్ నేత మోహన్ భగవత్ మాట్లాడుతూ భారతీయ కుటుంబ వ్యవస్థని బలపరుచుకోవాలని ఉద్ఘాటించాడు. అంతవరకూ బాగానే వుంది. ప్రాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఆసియా దేశాల్లో అందునా భారత్ లో కుటుంబ వ్యవస్థ సమాజంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందనే దాంట్లో ఎటువంటి సందేహంలేదు. అందుకు మన సంప్రదాయం , సంస్కృతి గురించి మనమంతా గర్వపడాలి కూడా. అంతవరకూ భగవత్ గారి అభిప్రాయంతో ఏకీభవిద్దాం. కానీ ఆతర్వాతే అసలు మసాలా జోడించాడు. అదేమిటంటే ఇటీవలి కాలంలో ఈ కుటుంబ వ్యవస్థ బలహీన పడుతుందని, విడాకులు తీసుకునే వాళ్ళ సంఖ్యా ఎక్కువవుతుందనీ సెలవిచ్చారు. దానితో కూడా మనం ఏకీభవించాలి. ఎందుకంటే అది అంకెల వాస్తవాల మీద ఆధారపడి వుంది కాబట్టి. చిక్కల్లా ఎక్కోడోచ్చిందంటే ఇలా కుటుంబ వ్యవస్థ బలహీనం కావటానికి , విడాకులు ఎక్కువ కావటానికి కారణం చదువుకున్న వాళ్లేనని . ఓకే, అదికూడా అంకెల్ని బట్టి వాస్తవమే కాబట్టి ఒప్పుకోక తప్పదు. మరి మీరడగొచ్చు ఇంకేంటి సమస్య అని? వస్తున్నా వస్తున్నా అసలు విషయానికి.

ఇలా జరగటానికి కారణం విద్యావంతుల్లో గర్వం పెరగటమని సెలవిచ్చారు! అవునా అని నోటి మీద వేలేసుకోవటం మనవంతయింది. మీకేమనిపిస్తుంది ? నిజమేనంటారా? అఫ్ కోర్స్ చదువుతో పాటు అధికాదాయం కూడా ఒక కారణమన్నారు. నిజమేననుకుందాము. మరి చదువులేని వాళ్ళ మాటేమిటి? వాళ్ళందరూ భార్య, పిల్లల్ని బాగా చూసుకుంటున్నారా? నా చిన్నప్పుడు మా ఊళ్ళోనే మా బంధువు ఒకాయన భార్యను గొడ్డును బాదినట్లు బాదేవాడు. అయినా కుటుంబం చక్కగానే వుంది! కారణం గర్వం లేకపోవటమేనంటారా భగవత్ గారూ? కుటుంబ వ్యవస్థ బలపడాలని కోరుకోవటం అభినందించదగ్గదైనా ఇందులో విద్యని, సంపదని తీసుకురావటంలో ఔచిత్యమేమిటో సెలవిస్తారా? విద్యతో బాటు మన సంప్రదాయాన్ని, సంస్కృతి ని అలవరచుకోమని, పాటించమని చెప్పటం దాని సారాంశమయితే అభినందిద్దాం. కానీ చదువుకోని వారు కుటుంబ వ్యవస్థని కాపాడుతున్నారు, చదువుకున్న వాళ్ళు చెడగొడుతున్నారనే అర్ధం ధ్వనించటం అశాస్త్రీయంగా వుంది మహాశయా .

భగవత్ గారు నాణేనికి ఒక వైపే చూస్తున్నట్లుంది. రెండో వైపు కూడా చూస్తే బాగుంటుంది. విద్య, వుద్యోగం వలన సాధికారతతో మహిళలు ఆలోచిస్తున్నారని ఎందుకు అనుకోకూడదు. భగవత్ గారు చెప్పిన వాళ్ళు కొంత శాతం ఉండొచ్చేమో గానీ ఎక్కువ మంది పురుషాధిక్యతను భరించలేకే తప్పనిపరిస్థితుల్లో బయటకు వస్తున్నారని ఎందుకు ఆలోచించరు? ఒకనాడు భర్త ఏమిచేసినా , పచ్చిగా పల్లెటూరు భాషలో చెప్పాలంటే ఎంతమందితో తిరిగినా భార్య గమ్మున నోరుమూసుకుని కూర్చునేది? భర్త తిట్టినా కొట్టినా పడివుండేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకొని అన్యోన్యంగా ఉన్నచోట్ల కుటుంబం మూడు పూవులు , ఆరు కాయలుగా ఉంటుంది. అలాకాకుండా ఇద్దరిలో ఏ ఒక్కరూ ఆధిపత్య ధోరణి ప్రదర్శించినా సమస్యలు వస్తున్నాయి. అయితే ఇక్కడే సహనం ఉండాలి. ఏ ఇద్దరి మనస్తత్వాలు ఒక్కటిగా వుండవు. స్వంత అన్నదమ్ములు, అక్కాచెల్లిళ్లలోనే తరతమ బేదాలున్నప్పుడు బయటినుంచి వాళ్ళు కుటుంబ వ్యవస్థలో ఎదగటానికి టైం పడుతుంది. సహనమే కుటుంబ వ్యవస్థకి శ్రీరామ రక్ష.

ఎక్కువభాగం వారసత్వంగా వచ్చిన పురుషాధిక్య సమాజ ధోరణుల వలనే పొరపచ్చాలు వస్తున్నాయని సామాజిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో వాస్తవముంది. తరతరాలుగా వున్న ఆచారాల్లో మహిళలకు సమాన హోదా లేదు. ఇది అన్ని సమాజాల్లో , అన్ని మతాల్లో కూడా చూస్తున్నాం. అందుకే యుగపురుషుల అవసరం ఎంతయినా వుంది. ఒక ఈశ్వర చంద్ర విద్యా సాగర్, ఒక రాజా రామమోహన్ రాయ్ , ఒక కందుకూరి వీరేశలింగం పంతులు సంఘ సంస్కర్తలుగా అవతరించారు. ఇంకా ముందుకెళ్తే ఒక గౌతమ బుద్ధుడు , ఒక మహావీరుడు, ఒక గురు నానక్ అవతరించారు. అలాగే యూరప్ లో వచ్చిన పునరుజ్జీవన ఉద్యమం క్రైస్తవ సమాజంలో పెనుమార్పులు తెచ్చింది. మహిళకు సమాన గౌరవం తీసుకొచ్చింది. ఇస్లాం సమాజంలో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఖలీఫా వ్యవస్థని రద్దుచేసి ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమల్ అటాటర్క్ టర్కీ లో మహిళల సమానత్వం కోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది యుగకర్తలు లింగ సమానత్వం కోసం , సామాజిక మార్పుకోసం పనిచేసారు. అయినా ఈరోజుకి మహిళలు వేధింపులకు గురవుతూనే వున్నారు. కుటుంబ వ్యవస్థ బలపడాలంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచనలు, ధోరణలు మారాలి. స్త్రీలు మనలో సగమని గుర్తించాలి. అప్పుడే కుటుంబ వ్యవస్థ బలపడుతుంది. అదేసమయంలో పెడధోరణలు, పిడి ధోరణులతో ప్రవర్తించే మహిళలు కూడా మారాలి. జీవితమనేది ఇద్దరూ ఒకరినొకరు అర్ధంచేసుకుని చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకుండా ముందుకు సాగితేనే కుటుంబ వ్యవస్థకు అర్ధం , పరమార్ధం .

ప్రాశ్చాత్య సమాజానికి , మనకు వున్న తేడా పిల్లల పెంపకం విషయంలో. అక్కడ ఒక వయసు రాగానే వాళ్ళు ఇంటినుంచి బయటికి పోయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు కూడా అదే నేర్పిస్తారు. మనం దానికి భిన్నం. కనీసం పెళ్లి అయ్యేదాకా , ఆ తర్వాత కూడా కలిసివుండటానికే ప్రయత్నిస్తాం. పిల్లల బాగోగుల కోసం మనం అహర్నిశం శ్రమిస్తాం. పిల్లలు పెద్దయిన తర్వాత తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవటానికి ప్రయత్నిస్తారు . ఇది మన సాంప్రదాయ ఔన్నత్యం. అందుకనే కుటుంబ వ్యవస్థ ను జాగ్రత్తగా కాపాడుకోవటం మనందరి భాద్యత. ఆ నేపథ్యంలోనే భగవత్ గారు కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలని నొక్కి వక్కాణించారు. కానీ దానితోపాటు మనం పైన మాట్లాడుకున్నట్లు ఆలోచనా ధోరణలు, లింగ సమానత్వ భావాలు పెంపొందించుకుంటేనే కుటుంబ వ్యవస్థ నిలబడుతుందని చెప్పివుంటే బాగుండేది. కానీ విద్యవలన అనర్ధాలు వస్తున్నాయనే భావం సరికాదు. ఏదిఏమైనా భగవత్ గారి స్పిరిట్ ని తీసుకుందాం. కుటుంబ వ్యవస్థను బలపరుద్దాం.

ఇదీ ఈవారం ముచ్చట్లు , వచ్చే వారం మళ్ళీ కలుద్దాం , సెలవా మరి.

……. మీ రామ్

లాస్ట్ ఛాన్స్ పోగొట్టుకున్న నిర్భయ నిందితులు..ఇక ఉరే

నిర్భయ అత్యాచారం మరియు హత్య కేసులో మరణశిక్ష విధింపబడిన వారిలో ఒకరైన పవన్ గుప్తా తిహార్ జైలులో తన కొత్త న్యాయవాది సహాయం పొందటానికి నిరాకరించారు.

తన మాజీ న్యాయవాది ఎపి సింగ్ ఈ కేసు నుండి తప్పుకున్న తరువాత రవి ఖాజీని గత వారం పవన్‌కు న్యాయవాదిగా నియమించారు.

మార్చి 3 న ఉదయం 6 గంటలకు నిందితులకు ఉరిశిక్ష అమలుకానున్న నేపథ్యంలో నివారణ లేదా దయ పిటిషన్ యొక్క పరిహారం కోసం కొత్త న్యాయవాదిని కలవకపోవడంతో నిందితులు మరణశిక్ష నుండి తప్పించుకునే చివరి ఛాన్స్ కూడా కోల్పోయారు.

గత కొద్ది రోజులుగా పవన్‌ ని కలవలేక పోయినందున అతని తరపున ఎటువంటి చట్టపరమైన పరిష్కారాన్ని కోర్టుకి పంపలేదని పవన్ యొక్క న్యాయవాది మీడియాకు చెప్పారు.

ఈ కేసు 2012 డిసెంబర్‌లో దేశ రాజధానిలో సామూహిక అత్యాచారం మరియు హత్యకు గురైన 23 ఏళ్ల నిర్భయకి సంబంధించినది.

పావలా వడ్డీ బకాయలు చెల్లించని ఏపీ ప్రభుత్వం!

తీవ్రమైన ఆర్ధిక సమస్యలలో చిక్కుకున్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులను దాదాపు నిలిపి వేయడంతో పావలా వడ్డీ పథకం కింద రైతులకిచ్చిన రుణాలకు గానూ బ్యాంకులకు రీయంబర్స్‌ చేయాల్సిన మొత్తం భారీగా పేరుకుపోతోంది. ఈ మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలని బ్యాంకులు ప్రభుత్వాన్ని కోరుతున్నా ఫలితం ఉండటం లేదు.

దీని ప్రభావం పథకం అమలుపై పడే అవకాశం ఉందని బ్యాంకర్లు చెబుతున్నా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. తాజా సమాచారం ప్రకారం దాదాపుగా రూ 650 కోట్లను బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించాల్సిఉంది. వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ పేరిట చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేరదుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

దీనిలో భాగంగా తీసుకున్న రుణానికి రైతుల పావలా వడ్డీని చెల్లిస్తుండగా, మిగిలిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించాల్సిఉంది. అయితే, 2011-12 ఆర్థిక సంవత్సరం నుండి ఈ మొత్తంలో ఎంతో కొంత ప్రభుత్వం ప్రతి ఏడాది బకాయి పడుతూనేఉంది. ఇలా రూ 874 కోట్లు ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించాల్సిఉండగా, అరదులోరూ 224 కోట్లు మాత్రమే బ్యాంకులకు చేరాయి. ఇరకా రూ 650 కోట్ల వరకు ప్రభుత్వం బకాయి ఉంది.

తాజాగా జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో కూడా ఇదే అరశాన్ని బ్యాంకు అధికారులు లేవనెత్తడం, త్వరలోనే పరిష్కరిస్తామని ఆర్ధికశాఖ చెప్పడం జరిగింది. 2011-12లో ఆరు లక్షల రూపాయలు రావాల్సి ఉండగా, అది ఇప్పటివరకు అందలేదని బ్యాంకర్లు చెబుతున్నారు.

అలాగే 2012-13లో రూ 27.74 లక్షలు రావాల్సి ఉండగా, అందులో రెండు లక్షల రూపాయలు బ్యాంకులకు చేరలేదు. 2013-14లో రూ 26 కోట్లు, 2014-15లో రూ 3.77 కోట్లు, 2015-16లోరూ 3.30 కోట్లు బకాయిలు ఉండగా, 2016-17లో ఏకంగా రూ 221 కోట్లు, ఆ తరువాత సంవత్సరం రూ 310 కోట్లు బకాయిలు ఉండిపోయాయి.

ఈ బకాయిల ప్రభావం తమ దైనందిక లావాదేవీలపై పడుతోందని బ్యాంకు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

.

భారతీయుల సహృదయానికి సలాం..: మోడీ


సుప్రీంకోర్టులో జరిగిన అంతర్జాతీయ జ్యుడిషియల్ కాన్ఫరెన్స్ 2020 – ‘జ్యుడిషియరీ అండ్ ది ఛేంజింగ్ వరల్డ్’ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోడీ మాట్లాడతూ..రాజకీయంగా సున్నితమైన అయోధ్య కేసుతో సహా, కొన్ని కఠినమైన కీలకమైన తీర్పుల విషయంలో న్యాయస్థానం అవలంభించిన తీరును ప్రధాని కొనియాడారు.

స్త్రీ-పురుష భేదం లేకుండా ప్రతిఒక్కరికి న్యాయం చేయలేకపోతే ఏ దేశం కూడా సమగ్ర అభివృద్ధిని సాధించలేదని ప్రధాని అన్నారు
ఈ నేపథ్యంలో “లింగమార్పిడి, ‘ట్రిపుల్ తలాక్’ మరియు ‘దివ్యాంగ్స్’ (వికలాంగుల) హక్కులపై చట్టాలను ప్రస్తావించారు. అలాగే సైనిక సేవలో మహిళలకు హక్కులు ఇవ్వడం మరియు 26 వారాల పాటు ప్రసూతి సెలవులను మంజూరు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను మోడీ ప్రశంసించారు.

అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను సాధించడానికి పర్యావరణ న్యాయ శాస్త్రాన్ని పునర్నిర్వచించినందుకు భారత న్యాయవ్యవస్థను ఆయన ప్రశంసించారు.

టెక్నాలజీ, ఇంటర్నెట్ వాడకంపై మాట్లాడిన మోడీ.. ఇది కోర్టుల విధాన నిర్వహణకు సహాయపడుతుందని, జస్టిస్ డెలివరీ వ్యవస్థకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.

“మారుతున్న కాలంలో, డేటా రక్షణ మరియు సైబర్ నేరాలు వంటి సమస్యలు న్యాయవ్యవస్థకు కొత్త సవాళ్లను కలిగిస్తాయి” అని ఆయన అన్నారు.

“ఇటీవలి కాలంలో, కొన్ని క్లిష్టమైన న్యాయ తీర్పులు మరియు నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ తీర్పులు ఇవ్వడానికి ముందు, పర్యవసానాల గురించి అనేక భయాలు వ్యక్తయ్యాయి. కానీ ఏమి జరిగిందో చూడండి..130 కోట్లమంది భారతీయులు న్యాయ తీర్పులను హృదయపూర్వకంగా అంగీకరించారు ”అని భారతీయులను ప్రశంసలతో ముంచెత్తారు మోడీ .

భారత్ సహాయాన్ని తిరస్కరిస్తున్న డ్రాగన్ దేశం

చైనా నుండి 100 మంది భారతీయులను తిరిగి తీసుకురావడానికి మరియు కరోనావైరస్ వైద్య సామాగ్రిని భారత్ నుండి చైనాకి పంపడానికి ఒక విమానాన్ని ( సి -17 గ్లోబ్‌మాస్టర్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్) వుహాన్ కి పంపడానికి భారత్ సిద్ధంగా ఉన్నా.. చైనా అందుకు తగిన క్లియరెన్స్ ని ఇవ్వడం లేదు.

ఉపశమన సామాగ్రిని తీసుకువెళ్ళే విమానానికి క్లియరెన్స్ మంజూరు చేయడాన్ని చైనా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోంది, ఇది వుహాన్ నుండి మిగిలిన భారతీయ పౌరులను కూడా తిరిగి భారత్ కి తీసుకువస్తుంది. అయితే చైనాకి ఎప్పుడు ఆ ఫ్లైట్ ని పంపాలో స్పష్టమైన వివరణ చైనా నుండి రాకపోవడం గమనార్హం

ఫ్రాన్స్ సహా ఇతర దేశాల నుండి ఉపశమనం మరియు తరలింపు విమానాలు ఉన్నాయి. రిలీఫ్ ఫ్లైట్ కోసం చైనా ప్రభుత్వం క్లియరెన్స్ ఎందుకు ఆలస్యం చేస్తోంది? భారతీయ సహాయంపై వారు ఆసక్తి చూపలేదా? వుహాన్ నుండి మన భారతీయులను తరలించడంలో మరియు వారి కష్టాలకు, మానసిక వేదనకు గురిచేయడంలో వారు రోడ్‌బ్లాక్‌ను ఎందుకు సృష్టిస్తున్నారో? తెలియాల్సి ఉంది.

గతంలో బీజింగ్ ఘోరమైన కరోనావైరస్ వ్యాప్తితో సతమతమవుతున్న సమయంలో, ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మరియు చైనా ప్రజలకి సంఘీభావం తెలిపిన తరువాత చైనాకు వైద్య సామాగ్రిని పంపిస్తామని మోడీ తెలిపారు. అందుకు తగినట్లుగానే భారతదేశం సహాయాన్ని అందించడానికి ముందుకు వస్తే చైనా మాత్రం ఆ సహాయాన్ని వ్యతిరేకించే ధోరణని అవలంభిస్తుంది.

మతులు పోగొడుతోన్న నేహాశర్మ అందాలు..

చిరుత, కుర్రాడు సినిమాలతో తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నేహాశర్మ. ఆ తర్వాత టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా.. బాలీవుడ్‌లో బాగానే బిజీ అయ్యింది. ఈ హాట్ ఫిగర్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాక పంథా మార్చింది. ఎక్స్‌పోజింగ్ అవధులు దాటేసి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.

కిషన్ రెడ్డిపై తెలంగాణ బీజేపీలో రుసరుసలు!


ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి కేంద్రమంత్రివర్గంలో ఉన్న ఏకైక ప్రతినిధిగా, కీలకమైన హోమ్ మంత్రిత్వ శాఖలో ఉండి కూడా జి కిషన్ రెడ్డి పార్టీ ప్రయోజనాల గురించి పట్టించుకోవడం లేదని తెలంగాణ బిజెపి వర్గాలలో అసంతృప్తి సెగలు రాజుకొంటున్నాయి.

మరోవంక, బాధ్యతాయుతమైన స్థాయిలో ఉంటూ అసందర్భపు ప్రకటనలు చేసి పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేస్తున్నారని అంటూ స్వయంగా హోమ్ మంత్రి అమిత్ షా ఇప్పటికి కనీసం రెండు సార్లు పిలిచి మరీ చివాట్లు పెట్టిన్నట్లు తెలుస్తున్నది.

నిర్మల్ జిల్లా భైన్సాలో మున్సిపల్ ఎన్నికల ముందు అధికార పక్షం అండదండలతో మతఘర్షణలు చెలరేగితే, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే నెలరోజుల వరకు పట్టించుకోక పోవడం తెలిసిందే.

నెలరోజుల తర్వాత తీరుబడిగా భైన్సాలో పర్యటన జరిపి, బాధితులకు పార్టీ నలుగురు ఎంపీల తరపున రూ 20 లక్షల విరాళం ప్రకటించి, సానుభూతి చూపి వెళ్లారు. కేంద్రానికి నివేదిక ఇస్తామని చెప్పడం మినహా నిర్దుష్టమైన ఎటువంటి చర్యను ప్రకటించక పోవడం గమనార్హం.

తాజాగా, కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పర్యటన సందర్భంగా కిషన్ రెడ్డి చేసిన వాఖ్యలు పార్టీ పరువును మంటగరిపే విధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో బిజెపి వర్గాల్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. `ఎర్రబస్సులలో తిరిగే తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోదీ వచ్చి రైళ్లలో తిరిగి అవకాశం కల్పిస్తున్నారు’ అంటూ ఒక విధంగా ప్రజలను అవమానించారని ఆ పార్టీ వర్గాలే మండిపడుతున్నాయి.

నిజాం కాలం నుండే తెలంగాణలో రైల్వే వ్యవస్థ ఉండటం గమనార్హం. ఢిల్లీ పెద్దల మెప్పు పొందటానికి కావాలని మాట్లాడారో లేక తెలియక మాట్లాడారో గానీ ఆయన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను ఘోరంగా అవమాన పరిచేవిగా ఉన్నాయి. మోదీ వచ్చేదాక తెలంగాణ ప్రజలకు అసలు రైలు అంటేనే తెలియదని అవహేళనగా మాట్లాడారు.

మోదీ దయవల్లే తెలంగాణ ప్రజలకు రైలు అంటే ఎంటో తెలిసిందని, అంతకు ముందు ఎర్రబస్సే దిక్కని ఎగతాళిగా మాట్లాడారు. హైదరాబాద్‌ స్టేట్‌ దేశంలోనే సొంతంగా రైల్వే వ్యవస్థను కలిగిఉన్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న అమిత్ షా పిలిచి మరి ఇష్టం వచ్చిన్నట్లు మాటలు జారవద్దని హితవు చెప్పారని తెలుస్తున్నది.

అంతకు ముందు అక్రమంగా వలస వచ్చి, రోహ్యాంగి ముస్లింలు హైదరాబాద్ లు కూడా ఉన్నారంటూ ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన సహితం వివాదంపై దారితీసింది. దానితో అమిత్ షా ఢిల్లీకి పిలిపించి హెచ్చరిక లాంటిది చేశారు. బాధ్యతమైన హోమ్ శాఖ మంత్రిగా ఉంటూ ప్రతి మాట ఆచి, తూచి మాట్లాడాలని సున్నితంగా మందలించారు.

‘గతం’ టీజర్ ను రిలీజ్ చేసిన అడవి శేష్

విభిన్న కథాంశంతో తెలుగు తెరపై రాబోతున్న చిత్రం గతం. ఓ జంట మధ్య జ్ఞాపకాలు చెరిగిపోతే వారిద్దరు ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నారనే లైన్ తో కిరణ్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను యువ కథానాయకుడు అడవి శేషు తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసి అభిమానులతో పంచుకున్నారు. ” జస్ట్ ఇమాజిన్ … లైఫ్ రీస్టార్ట్ అయితే… అంటూ ఆసక్తికరమైన మొదలైన గతం ట్రైలర్… ఏ రిలేషన్ షిప్ లోనైనా లైఫ్ లాంగ్ గుర్తిండిపోయేది మెమెరీస్. కానీ మన మధ్య అవి చెరిగిపోయాయంటూ హీరో హీరోయిన్లు తమకున్న ప్రాబ్లమ్ ను వ్యక్తం చేయడం సినిమా ఎంత థ్రిల్లింగ్ గా ఉండబోతుందో అర్థమవుతుంది. భార్గవ పొలుదాసు, రాకేష్ గాలెబె , పూజిత కూరపర్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ఆఫ్ బీట్ ఫిల్మ్స్ అండ్ ఎస్ ఒరిజినల్స్ పతాకాలపై భార్గవ పొలుదాసు, హర్ష ప్రతాప్, సృజన్ ఎరబోలు నిర్మించారు. పూర్తి స్థాయిలో అమెరికాలో మూడు నెలలపాటు ఎముకలు కొరికే చలిలో షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం నిర్మాణాంత కార్యక్రమాలు జరుపుకుంటున్న గతాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=AaHKXYLLTtM

కర్ణాటక కాంగ్రెస్ లో కుమ్ములాటలు.. చీలిక తప్పదా!


కర్ణాటకలో అధికారం కోల్పోయినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అహంకార పూరిత ధోరణి, ముఠా రాజకీయాల కారణంగానే ప్రభుత్వం కూలిపోయిన్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నది.
ఉప ఎన్నికలలో ఘోర పరాజయాన్ని సహితం అది వెల్లడించింది. తొలి ఉంది ముఖ్యమంత్రి కుమారస్వామి పట్ల అసహనంగా వ్యవహరిస్తూ, ఎవ్వరి కారణంగా తాను జెడి (ఎస్) నుండి బైటకు వచ్చి, కాంగ్రెస్ పార్టీలో చేరానో, ఇప్పుడు అదే వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి మద్దతుగా నిలబడతానని జీర్ణించుకోలేక పోతున్నారు.
కుమారస్వామిపై తిరుగుబాటు చేసి, బిజెపితో చేతులు కలిపి, ప్రభుత్వం పతనం కావడానికి కారణమైన ఎమ్యెల్యేలలో అత్యధికులు సిద్దరామయ్య అనుచరులే కావడం గమనార్హం. అటువంటి పరిస్థితులలో కొత్త పిసిసి అధ్యక్షుడి నియామకం రాష్ట్ర కాంగ్రెస్ కు సవాల్ గా మారింది. ఈ విషయమై సిద్దరామయ్య, పార్టీని ఆపదలో ఆడుకొంటున్న డీకే శివకుమార్ ల మధ్య ప్రచ్ఛన్న పోరు నడుస్తున్నది.

కాంగ్రెస్ అధిష్ఠానం శివకుమార్ ను పిసిసి అధ్యక్షుడిగా నియమించడానికి సిద్ద పడుతుండగా, దానిని సిద్దరామయ్య తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. తన మద్దతుదారుడి ఆ పదవి కట్టబెట్టాలని పట్టుబడుతున్నారు. ఈ విషయమై పార్టీలో చీలిక అనివార్యం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

రాబోయే మూడు నెలల్లో కర్నాటక కాంగ్రెస్‌ ముక్కలు ముక్కలుగా చీలిపోతుందని, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య నూతన పార్టీని స్థాపించనున్నారని కర్నాటక బీజేపీ అధ్యక్షుడు నలిన్ కుమార్ చేసిన ప్రకటన ఈ సందర్భంగా కర్ణాటక రాజకీయాలలో పెను సంచలనం కలిగిస్తున్నది.

ఒకవేళ పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్‌ను నియమిస్తే సిద్దరామయ్య కాంగ్రెస్ నుంచి వైదొలిగిపోతారని, ఒకవేళ సిద్దరామయ్య మనిషిని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే డీకే శివకుమార్ కాంగ్రెస్ నుంచి వైదొలిగిపోతారని ఆయన వ్యాఖ్యానించారు.

దీంతో కర్నాటక రాజకీయాల్లో ఒక్క సారిగా పెను దుమారం చెలరేగింది. ఒకవేళ డీకే శివకుమార్‌ను, సిద్దరామయ్యను ఒకే తాటిపైకి తెస్తే మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వరన్ కాంగ్రెస్‌ను వీడి వెళ్తారని కూడా అంటూన్నారు. ఈ పరిణామాలతో కర్నాటక కాంగ్రెస్‌లో ముసలం పుట్టడం ఖాయమని నలిన్ కుమార్తె తెలిపారు.

హిట్లు… కేరాఫ్ కోడి రామకృష్ణ

ఫిబ్రవరి 22 వర్ధంతి…
సినిమాని కాచి వడపోసిన వారు బహు కొద్ది మందే ఉంటారు. ఆ జాబితాలో కచ్చితంగా కోడి రామకృష్ణ ఉంటారు. అందుకే ఆయన హిట్లు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. చిరంజీవి తో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ తో దర్శకుడి గా కెరీర్ ప్రారంభించి అనేక హిట్ సినిమా లతో గురువు ను మించిన శిష్యుడు అనిపించుకున్నారు.

కోడి రామకృష్ణ. ఆయన పాలకొల్లులో జన్మించారు. పాలకొల్లులోని లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేశారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథా నాయకులందరితో ఆయన సినిమాలు చేశారు. తెలుగులోనే కాక తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకూ దర్శకత్వం వహించారు. ఆయన కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే చిత్రలేఖనం వృత్తినీ చేపట్టారు. పగలు చదువుకోవడంతోపాటు అజంతా పెయింటింగ్స్ అనే కమర్షియల్ పెయింటింగ్స్ షాపును రాత్రిళ్ళు నిర్వహించేవారు. ఆయన చిత్రాలు గురువు నాగేశ్వరరావుతో ఫొటోలు తీయించుకుని నటునిగా అవకాశం కోసం పలువురు దర్శకులకు పంపేవారు. అయితే ఆ విషయం తెలిసిన ఆయన తండ్రి నరసింహమూర్తి – “మన వంశంలో డిగ్రీ వరకూ చదువుకున్న వారే లేరు. నువ్వు డిగ్రీ పూర్తిచేస్తే చూడాలనివుంది. డిగ్రీ చదివాకా నీకేది చెయ్యాలని తోస్తే ఆ పనే చేసుకో” అని కోరారు. దాంతో అప్పటి నుంచీ సినిమా ప్రయత్నాలు మానుకుని డిగ్రీ పూర్తిచేశారు.

నాటకరంగంలో తొలి అడుగు
పాలకొల్లు పట్టణం పలువురు నాటక కళాకారులు, సినీ కళాకారులను అందించడంతో పాటు లలితకళలకు ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంది. దాంతో చిన్నతనం నుంచీ రామకృష్ణకు కూడా నాటకాల పట్ల చాలా ఆసక్తివుండేది. అత్యంత చిన్నవయసు నుంచి నాటక ప్రదర్శనల పట్ల ఆసక్తితో నాటకాల్లో ప్రయత్నించేవారు. ఉన్నత పాఠశాల రోజుల నుంచీ చదువుతో పాటు నాటకాలు ఆడేవారు. ఆయన కాలేజీ రోజుల్లో సాధారణ నాటక ప్రదర్శనలతో పాటుగా టిక్కెట్టు నాటకాలు కూడా ఆడేవారు. అందుకోసం మద్రాసు నుంచి కాకరాల వంటి నాటకరంగ ప్రముఖుల్ని కూడా నటించేందుకు రప్పించేవారు. రామకృష్ణ తన స్నేహితుల్లోనూ రకరకాల ఊతపదాలు, మ్యానరిజాలు ఉన్నవారిని ఎన్నుకుని అందుకుతగ్గ పాత్రలు సృష్టించి వారితో నటింపజేసేవారు. రామకృష్ణ కళాశాల ప్రిన్సిపాల్ కి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఉపన్యాసకుడిగా మంచి ప్రఖ్యాతి ఉండేది. ఆయన ఉపన్యాసం ఉన్న ప్రతిచోటకూ అభిమానంగా రామకృష్ణను కూడా తీసుకువెళ్లేవారు. అక్కడ ప్రిన్సిపాల్ ఉపన్యాసానికి ముందు రామకృష్ణతో సుడిగుండాలు సినిమాలోని కోర్టుసీనులో అక్కినేని నాగేశ్వరరావు వాదించే సన్నివేశాన్ని స్వీకరించి చేసే ఏకపాత్రను ప్రదర్శించేవారు.

సినిమా రంగంలో తొలి అడుగు
దర్శకత్వ విభాగంలో సవరించు
దాసరి నారాయణరావు తొలిచిత్రం తాత మనవడు చూశాకా రామకృష్ణ మనస్సులో దర్శకత్వ శాఖలో పనిచేస్తే ఈయన వద్దే పనిచేయాలన్న దృఢసంకల్పం ఏర్పడింది. ఆ సినిమా అర్థశతదినోత్సవం పాలకొల్లులోని మారుతీ టాకీస్ లో జరిగే సందర్భాన్ని పురస్కరించుకుని దాసరితో మాట్లాడి తనకు దర్శకత్వ శాఖలో అవకాశం ఇమ్మని అడిగేందుకు కోడి రామకృష్ణ ప్రణాళిక వేసుకున్నారు. అనుకోని విధంగా ఆ కార్యక్రమంలో చెలరేగిన గొడవల్లో రామకృష్ణ స్నేహితులూ పాల్గొనడంతో, కార్యక్రమం ముగిశాకా ఆయన నిర్మాత రాఘవ, దర్శకుడు నారాయణరావులకు వారి తరఫున క్షమాపణలు చెప్పారు. అయితే అదే సమయంలో దాసరి వద్ద పనిచేయాలన్న తన కోరికనూ వెలిబుచ్చారు. ఆయన డిగ్రీ పూర్తిచేసుకుని వస్తే చూద్దామనడంతో రామకృష్ణ డిగ్రీ పూర్తిచేసుకుని ఆ విషయాన్ని దాసరికి ఉత్తరం రాశారు. వెంటనే బయలుదేరమంటూ దాసరి నుంచి టెలిగ్రాం రావడంతో, ఛార్జీల కోసం పల్లెపడుచు నాటకాన్ని మిత్రులంతా ప్రదర్శించి ఆ డబ్బుతో మద్రాసు బయలుదేరారు.
దాసరి నారాయణరావు ఒకేసారి రెండు, మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తూండేవారు. ఆ క్రమంలో ఎవరికి వారే యమునా తీరే, స్వర్గం నరకం, మనుషుల్లో దేవుడు అన్న మూడు సినిమాలకు కోడి రామకృష్ణను ఒకేసారి అసిస్టెంట్ గా తీసుకున్నారు. అలా దాసరి నటించిన పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేస్తూన్న కోడి రామకృష్ణ, ఎలాగైనా దాసరిని దర్శకునిణ్ణి చేసిన రాఘవ బ్యానర్లోనే తొలిగా దర్శకుడు కావాలని ఆశించారు. అందుకు అనుగుణంగా దాసరి-రాఘవ కాంబినేషన్లో నిర్మించిన తూర్పు పడమర సినిమాలో పట్టుబట్టి దర్శకత్వ శాఖలో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత కోడి రామకృష్ణకు దర్శకునిగా అవకాశం వచ్చి దర్శకత్వ శాఖలో పనిచేయడం మానుకున్నారు.

దర్శకునిగా…
కోడి రామకృష్ణకు దర్శకుడిగా తొలిచిత్రం “ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య”(1981). దర్శకుడిగా దాసరి నారాయణరావుని పరిచయంచేసిన నిర్మాత కె.రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణకు కూడా అవకాశం ఇచ్చారు. మొదట ఆయన తరంగిణి సినిమానే తొలిచిత్రంగా తీద్దామనుకున్నా అది వీలుపడక ఇంట్లో రామయ్యతో దర్శకుడయ్యారు. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకునిగా ఆయన అరుదైన రికార్డు సాధించారు. తెలుగు సినిమా చరిత్రలో అలా వంద సినిమాలు తీసిన దర్శకులు కోడి రామకృష్ణ కాక దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కె.ఎస్.ఆర్.దాస్లు మాత్రమే.

చిరంజీవితో ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య తర్వాత ఆలయశిఖరం(అమితాబ్ నటించిన ఖుద్దార్ చిత్రం ఆధారంగా), సింహపురిసింహం(చిరంజీవి ద్విపాత్రాభినయం), గూఢచారి నెం.1, రిక్షావోడు, అంజి చిత్రాలు నిర్మించారు. బాలకృష్ణకు సోలో హీరోగా తొలి విజయవంతమైన చిత్రం “మంగమ్మగారి మనవడు” ఈయన చిత్రమే. తర్వాత బాలకృష్ణతో ముద్దుల కృష్ణయ్య, ముద్దులమావయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మేనల్లుడు, బాలగోపాలుడు వంటి చిత్రాలు తీసారు. భార్గవ్ ఆర్ట్స్ చిత్రాలలో ఎక్కువభాగం కోడి దర్శకత్వం వహించారు. గొల్లపూడి మారుతీరావు, గణేష్ పాత్రో మాటలతో కోస్తాంధ్ర నేపథ్యంతో కొంతకాలం చిత్రాలు తీశారు. తర్వాత అమ్మోరు(సినిమా) సినిమా నుండి గ్రాఫిక్స్ వినియోగిస్తూ కొన్ని చిత్రాలు తీశారు (దేవి, దేవీపుత్రుడు, దేవుళ్ళు, అంజి). రాజకీయనేపథ్యంతో కొన్ని చిత్రాలు తీసారు. ఈయన దర్శకత్వంలో చివరిగా వచ్చిన అరుంధతి చిత్రం పెద్ద విజయం సాధించింది.

నటునిగా….
రామకృష్ణ మొట్టమొదట దర్శకునిగా కాక సినీనటునిగానే చేద్దామని ప్రయత్నించారు. డిగ్రీ పూర్తికాకుండానే పలు సినిమా దర్శకులకు తన ఫోటోలు పంపేవారు. అయితే తాత మనవడు సినిమా చూశాకా, దాసరి నారాయణరావులా దర్శకుడు కావాలన్న ఆలోచన బలపడింది. కానీ తొలి నుంచీ నటనపై ఉన్న ఆసక్తిని వదులుకోలేదు. దర్శకత్వ శాఖలో పనిచేయడానికి ముందే డిగ్రీ విద్యార్థిగా ఉండగానే రాధమ్మ పెళ్లి అన్న సినిమాలో దాసరి నారాయణరావు ఆయనకు కథానాయికకు అసిస్టెంటుగా ఓ పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర ప్యాచ్ వర్క్ ఎవరో డూప్ తో జరుగుతూండగా అప్పుడే కోడి రామకృష్ణ మద్రాసు రావడంతో ఆయనకే మేకప్ వేసి నటింపజేశారు. దాసరి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే ఆయా సినిమాల్లో చిన్నాపెద్దా పాత్రల్లో నటిస్తూండేవారు. స్వర్గం నరకం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు అభిమాన సంఘం నాయకునిగా ప్రారంభించి ఎవరికి వారే యమునా తీరే వంటి చిత్రాల్లోనూ నటించారు. రాజశ్రీ దర్శకత్వంలో, రాఘవ నిర్మాతగా తీస్తున్న చదువు సంస్కారం సినిమాలో ఓ విద్యార్థి నాయకుని పాత్ర ఉంటే అందుకు రామకృష్ణను విద్యార్థి నాయకునిగా పాలకొల్లులో చూసిన రాఘవ ఆయనతోనే నటింపజేశారు.

అలా మద్రాసు వచ్చిన తొలిరోజే మేకప్ వేసుకుని నటించినట్టు అయింది. దర్శకునిగా గుర్తింపు పొందాక నటునిగా కూడా ప్రయత్నించారు. తొలిసారిగా ‘మా ఇంటికి రండి’ అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. సుహాసిని కథానాయిక. ఐతే చిత్రం విజయవంతం కాలేదు. తర్వాత కొద్ది సినిమాలలో సపోర్టింగ్ పాత్రలు ధరించారు.

అవార్డులు – రివార్డులు
పది నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు వరించాయి. ఆయన 2012లో రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారాన్ని అందుకున్నారు.

ట్రంప్ పర్యటనతో ఎవరికెంత లాభం..

 

 

 

 

 

 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24, 25 వ తేదీలలో భారత్ పర్యటనకు వస్తున్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను భారత్ – అమెరికా దేశాలు పూర్తి చేశాయి. ట్రంప్, అమెరికా నుండి బయలుదేరిన దగ్గర్నుండి మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టె వరకు భారీ భద్రత ఏర్పాట్లు నడుమ, మినిట్ టు మినిట్ ప్రోటోకాల్ తో, పక్కా షెడ్యూల్ తో సర్వం సిద్ధం చేసుకున్నాయి.

భారత్ లో ఢిల్లీ, ఆగ్రా అహ్మదాబాద్ ప్రాంతాలలో ట్రంప్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్-అమెరికాల మధ్య ఎటువంటి ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ రాక భారత్ కి ఎంత వరకు మేలు చేస్తుంది. వాణిజ్య పరంగా భారత్ కి ఎటువంటి ప్రయోజనాలు చేకూరే అవకాశాలున్నాయి. ఏయే రంగాలతో, ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. దిగుమతుల పరిస్థితి ఏమిటి?, ఎగుమతులు ఏమైనా పెరుగుతాయా..? కొత్త ఒప్పందాలతో పెట్టుబడులు ఏమైనా పెరుగుతాయా..? భారత్ యువతకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు పెరిగే పరిస్థితి ఉందా..? అమెరికాలో ఉంటున్న వారికీ వీసా విషయాలలో గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయా..? వంటి అనేకమైన ఆసక్తికర విషయాల గూర్చి విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా.. అగ్రరాజ్యం అధ్యక్షుడు భారత పర్యటనకు వస్తున్నారంటే.. ఇది దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్రంప్ పర్యటన వల్ల భారత్ కి చేకూరే ప్రయోజనాలు

భారత్ అమెరికా దేశాల మధ్య 1999 నుంచి 2018వరకు వాణిజ్య రంగంలో వృద్ధి గణనీయంగా పెరిగింది. 1999లో 16 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉండగా 2018 నాటికి అది 142 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ వృద్ధిని మరింతగా పెంచాలని భారత్ భావిస్తుంది.

అమెరికా నుండి పెట్టుబడులను ఆకర్షించి, యువతికి ఉపాధి కల్పిస్తూ.. దేశీయ వస్తు సేవల ఉత్పత్తిని పెంచి ఇప్పటికే 20-25బిలియన్ డాలర్ల సర్ ప్లస్ ఉన్న ఎగుమతులను మరింతగా పెంచాలని భారత్ భావిస్తుంది.

పాల ఉత్పత్తుల విషయంలో ఆచి తూచి అడుగులేసి,పాల ఉత్పత్తుల దిగుమతులను తగ్గించాలని భారత్ ఆలోచిస్తుంది.

ఇప్పటికే రక్షణ రంగంలో ఫ్రెంచ్, యూరప్, రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాలతో భారత్ కి సత్సంబంధాలు ఉన్నాయి. కానీ అమెరికా దగ్గర ఉన్నంత పటిష్టమైన రక్షణ రంగం ప్రపంచంలో మరే ఇతర దేశంలో లేదు. కాబట్టి రక్షణ రంగంలో అమెరికాతో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించి భారత్ రక్షణ రంగాన్ని పటిష్టం చేయాలనీ, ఆధునాతన వెపన్స్ ని దిగుమతి కోసం భారత్ ప్రయత్నిస్తోంది.

అమెరికా- చైనా మధ్య వాణిజ్య లోటు దాదాపు 4లక్షల బిలియన్ డాలర్లు కాబట్టి అమెరికా, చైనా ని డైరెక్టుగా ఎదురుకోవడం కష్టం కాబట్టి భారత్ ని వ్యూహాత్మంగా ఉపయోగించుకోవాలని చూస్తుంది.ఇది భారత్ కి కలిసొచ్చే విషయం.

అమెరికాకి కలిగే ప్రయోజనాలు

ఈ సంవత్సర ముగింపులో అమెరికాలో ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో భారత్ పర్యటనలో “కెమ్ ఛో ట్రంప్” మరింత కలిసొచ్చే విషయం. ఎందుకంటే అమెరికాలో దాదాపు 30 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అందులో సంగం మందికి అమెరికాలో ఓటు హక్కు ఉంది. వారిని తన పార్టీకి అనుకూలంగా మార్చుకుంటే ట్రంప్ కి మరింత మేలు చేకూరే అవకాశాలు ఉన్నాయి.

ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఎగుమతులు, దిగుమతుల వల్ల అమెరికా ఇప్పటికే 20-25 బిలియన్ డాలర్ల లోటు వాణిజ్యం ఉంది. దానిని తగ్గించడం కోసం ఎగుమతులను పెంచాలని అమెరికా భావిస్తుంది. అందులో భాగంగానే డైరీ ప్రోడక్ట్స్, చికెన్ లెగ్స్ ఎగుమతులు పెంచాలని అమెరికా ఆలోచన.

భారత్ నుండి అమెరికాకు వస్తున్న వలసదారుల విషయంలో అమెరికా ఇప్పటికే ఉక్కుపాదం మోపింది. అలాగే ప్రస్తుతం ఈ విషయంలో మౌనం వహించి. వీసాల రూల్స్ ని మరింత కఠినతరం చేయాలనీ అమెరికా అనుకుంటుంది.

ట్రంప్, మోడీల స్నేహ బంధం గత మూడేళ్లుగా బలపడుతూ వస్తుంది. అలాగే ట్రంప్ మొదటిసారిగా భారత్ గడ్డపై అడుగుపెడుతున్నారు. “భారత్ తో భారీ డీల్” అంటున్న ట్రంప్ మాటలలో నిజమెంత తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సి ఉంటుంది.

భీష్మ ఫస్ట్ డే కలెక్షన్ ఎంతంటే..?

నితిన్, రష్మిక జంటగా నటించిన సినిమా భీష్మ. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుములు తెరకేక్కిన్చారు. అయితే ఈ సినిమా తొలిరోజే బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. మొదటి రోజే హిట్ టాక్ రావడం తో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వసూళ్లు కూడా భారీగానే వచ్చాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.6.35 కోట్లు వసూలు చేసింది. ఈ ఓపెనింగ్స్ నితిన్ కెరీర్‌లోనే బెస్ట్ అని చెప్పాలి.

 

నిజాం: 2.26cr

సీడెడ్: 0.8cr

ఉత్తరాంధ్ర: 0.62 కోట్లు

ఈస్ట్: 0.67 కోట్లు

వెస్ట్: 0.56 కోట్లు

కృష్ణా: 0.4 కోట్లు

గుంటూరు: 0.77 కోట్లు

నెల్లూరు: 0.27 కోట్లు

మొత్తం ఆంధ్ర & తెలంగాణా వసూళ్లు: 6.35cr ( షేర్ )

మొత్తం ఆంధ్ర & తెలంగాణా వసూళ్లు: 9.75 ( గ్రాస్ )

Anchor Manjusha Photo Stills

బాలయ్యకు జోడీగా అంజలి

నందమూరి బాలకృష్ణ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. పూర్తి యాక్షన్ ఎంటటైనర్ గా మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లకు అవకాశం దక్కనుంది. బాలయ్యకు జోడీగా నయనతార, శ్రియ నటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో బొద్దుగమ్మ పేరు తెరపైకి వచ్చింది. బాలయ్య జోడీగా తెలుగమ్మాయి అంజలి ఎంపికైనట్లు తెలుస్తోంది.

ఈ మూవీలో ఒక పాత్రలో బాలయ్య అఘోరగా కనిపించనున్నాడు. దీనికోసం బాలయ్య గుండు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ప్లాష్ బ్యాక్లో వచ్చే సన్నివేశాల్లో బాలయ్య అఘోరగా అలరించనున్నట్లు తెలుస్తోంది. వారణాశిలో ఇందుకు సంబంధించిన షూటింగ్ చిత్రీకరించనున్నారు. బాలయ్యతో దర్శకుడు బోయపాటి శ్రీను ఇది మూడో చిత్రం. ఇప్పటికే ‘లెజండ్’, ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. దీంతో వీరి కాంబినేషన్లో హ్యట్రిక్ హిట్టు ఖాయమనే ధీమాతో నందమూరి అభిమానులు ఉన్నారు.

నందమూరి బాలకృష్ణ సరసన అంజలి ‘డిక్టెటర్’ మూవీలో నటించింది. బాలయ్యకు తగ్గ జోడిగా అంజలి మెప్పించింది. డిక్టెటర్ మూవీ ఘన విజయం సాధించింది. తాజాగా బోయపాటి శ్రీను బాలకృష్ణతో నిర్మించే మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీలో ఇప్పటికే ప్రధాన హీరోయిన్లుగా నయనతార, శ్రియ పేర్లు విన్పించాయి. అయితే అంజలి సెకండ్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. దీంతో బాలయ్య సరసన అంజలి ఖరారైనట్లు సమాచారం. నయతార పేరు ప్రధానంగా విన్పించినా ఆమె బిజీగా ఉండటంతో చివరకు శ్రియను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

22 Movie First Song Launch Photos

Priya Vadlamudi Photo Stills

వైష్ణవ్ తేజ్ ను చిత్రసీమలోకి ఆహ్వానించిన రామ్ చరణ్..


ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తన కజిన్ వైష్ణవ్ తేజ్ ను ఆహ్వానించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతను హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో, “బిగ్ వెల్కమ్ వైష్ణవ్ తేజ్! ఈ జర్నీని నువ్వు ప్రేమిస్తావు. పూర్తి స్థాయిలో దీన్ని ఆస్వాదించు. బుచ్చిబాబు సానా, కృతి శెట్టి, మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అని పోస్ట్ చేశారు.

ఈ మహా శివరాత్రి స్పెషల్ పోస్టర్ లో హీరోయిన్ కృతి శెట్టిని ఫాలో అవుతూ కనిపిస్తున్నాడు వైష్ణవ్ తేజ్.బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.