
చెత్త నుండి విద్యుత్ ను ఉత్పత్తి చేయడానికి సిద్ధపడిన ‘బయో ఎనర్జీ ‘ ప్లాంట్ బోయిన్ పల్లి మార్కెటులో సిద్దమైనది. ప్రస్తుతం ఈ ప్లాంట్ 10 టన్నుల చెత్తతో నిర్మించి ప్రయోగ దశలో ఉంచారు. ప్రస్తుతం ట్రయల్ లో భాగంగా రెండు నుండి మూడు భాగాల చెత్తను ఇంధనంగా మార్చుతున్నారు.దీన్ని పూర్తి స్థాయికి తీసుకెళ్లే పనిలో భాగంగా సాంకేతిక సిబ్భంది పరీక్షలు చేస్తున్నారని కూరగాయల మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ తెలిపారు.
నెల రెండు నెలల్లో ఈ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని, ఇదే సమయంలో ఇంధన వనరుగా మార్చిన తర్వాత మిగిలిన మలినాలను కంపోస్ట్ ఎరువుగా మార్చుతారాని తెలిపారు.
స్వచ్ఛభారత్ తో పాటు ఇంధన వనరులను పరిరక్షించుకొనే క్రమంలో ఇక్కడ బయో ఎనర్జీ ప్లాంట్ ను ఏర్పాటు చేసాం అని ప్రత్యేక ఉన్నతశ్రేని కార్యదర్శి, బోయిన్ పల్లి హోల్ సేల్ మార్కెట్ తెలిపింది…