Home Blog Page 8616

ఈ శుక్రవారం విడుదల కాబోయే ఐదు సినిమాలివే..!

ఫిబ్రవరి 28 వ తేదీ శుక్రవారం ఐదు సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. వీటిలో 2 డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. గత శుక్రవారం ఆరు సినిమాలు  విడుదల కాగా అందులో భీష్మ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ వారంలో ఏది బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధిస్తుందో వేచి చూడాలి…ఈ శుక్రవారం రిలీజ్ కాబోయే ఐదు సినిమాల వివరాలు ఇవే…

1. HIT: హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా సస్పెన్స్ థ్రిల్లర్ “HIT” మూవీ రూపొందింది. రుహానీ శర్మ కథానాయిక కాగా వివేక్ సాగర్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ మూవీ పై అంచనాలు పెంచాయి.

2.లోకల్ బాయ్: సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా కిక్ బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా “లోకల్ బాయ్ ” మూవీ రూపొందింది. స్నేహ, మెహరీన్ కథానాయికలు కాగా నవీన్ చంద్ర, నాజర్ ముఖ్య పాత్రలలో నటించారు. “పట్టాస్” తమిళ మూవీ కి డబ్బింగ్ వెర్షన్ “లోకల్ బాయ్” మూవీ.

 

3. కనులు కనులను దోచాయంటే : వయాకామ్ 18 స్టూడియోస్, AJ ఫిల్మ్ కంపెనీ, DQ బ్యానర్స్ పై దేసింగ్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందిన తమిళ మూవీ “కన్నుమ్ కన్నుమ్ కొళ్ళైయాడితాళ్” తెలుగు డబ్బింగ్ వెర్షన్ ” కనులు కనులను దోచాయంటే” మూవీ 28వ తేదీ రిలీజ్ కానుంది .ఈ మూవీ లో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటించడం విశేషం.

 

4.స్వేఛ్చ: సరస్వతి డెవలపర్స్ సమర్పణ లో లచ్చు రామ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై KPN చౌహాన్ దర్శకత్వంలో సింగర్ మంగ్లీ ప్రధాన పాత్రలో రూపొందిన స్వేఛ్చ మూవీ 28 వ తేదీ రిలీజ్ కానుంది.

 

5 . రాహు: శ్రీ శక్తి స్వరూప్ క్రియేషన్స్ బ్యానర్ పై సుబ్బు వేదుల దర్శకత్వంలో అభిరామ్ వర్మ, కృతి గార్గ్ జంటగా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ “రాహు” మూవీ రూపొందింది. ఈ మూవీ కి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. “రాహు” మూవీ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

భీష్మ 4 డేస్ కలెక్షన్స్..

నితిన్, రష్మిక జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ భీష్మ, వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తెలుగు రాష్ట్రంలో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే 16.71 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

రిలీజ్ అయిన ప్రతి సినిమాకు సోమవారం ఒక అగ్ని పరిక్ష లాంటిది. కానీ ఈ సినిమా సోమవారం కూడా 1.87 కోట్లు రాబటింది. దగ్గరలో చెప్పుకోదగిన సినిమాలేవీ లేకపోవడంతో, బాక్స్ ఆఫీస్ వద్ద ‘భీష్మ’ జోరు కొనసాగడం ఖాయం. నితిన్ కెరియర్లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాల జాబితాలో భీష్మ కూడా చేరనుంది.

భీష్మ 4 రోజుల్లో సాధించిన వసూళ్ళ వివరాలు ఇవే..

నిజాం: 6.64 కోట్లు

సీడెడ్: 2.55 కోట్లు

ఉత్తరాంధ్ర 2.13 కోట్లు

ఈస్ట్: 1.32 కోట్లు

వెస్ట్: 0.97 కోట్లు

కృష్ణా: 1.05 కోట్లు

గుంటూరు: 1.51 కోట్లు

నెల్లూరు: 0.54 కోట్లు

మొత్తం ఆంధ్ర & తెలంగాణా వసూళ్లు: 16.71 కోట్లు ( షేర్ )

భారత్ లో ట్రంప్ పర్యటనపై పాకిస్తాన్ కుట్ర!


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న భారత్ లో అడుగుపెట్టారు. అయితే ఆయన పర్యటనను ఆటంకపరచాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. ట్రంప్ పర్యటనకు ప్రజలను దూరంగా ఉంచి తన పంతం నెగ్గించుకోవాలని పాకిస్థాన్ కుట్ర పన్నుతోంది.

“భారత్, కరోనా వైరస్ ని దాచిపెడుతుంది” (“#india hiding corona virus”) అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు పాకిస్తాన్ ట్విటర్‌ లో టాప్ ట్రెండ్‌లో ఉంది. #TrumpinIndia అనేది దాని తర్వాత స్థానంలో ఉండటం విశేషం.

“కరోనాకు ప్రభావితమైనవారిని హిందూయేతర ప్రాంతాల్లో ఉంచుతున్నారు” అని కొంతమంది ట్వీట్ చేస్తున్నారు. ఇలాంటి వాటి ద్వారా, అమెరికా అధ్యక్షుడి పర్యటనను కనీసం సోషల్ మీడియాలో అయినా కరోనా వైరస్‌తో దెబ్బ కొట్టాలని పాకిస్తాన్‌లోని కొంతమంది చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక యూజర్, ట్రంప్, ఇవాంక ఉన్న ఫొటోను పోస్ట్ చేసి “మఫ్లర్, మీసాలు ఉన్న ఎవరైనా మిమ్మల్ని కలవడానికి వస్తే మీ హ్యాండ్ శానిటైజర్ సిద్ధంగా ఉంచుకోండి” అని రాశారు.

ట్రంప్ భారత పర్యటన గురించి మరో యూజర్ “మోదీ ఒక మాంసం తినే వ్యక్తిని ఆలింగనం చేసుకున్నప్పుడు, మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు” అన్నారు.

ఈ విధంగా విభిన్న రీతులలో ట్రంప్ పర్యటనను ఆటంకపరచడానికి పాకిస్తాన్ కుట్రలు చేస్తుంది.

గతం లో కూడా అమెరికాలో భారత్ ప్రధాని మోడీ కోసం ఏర్పాటుచేసిన “హౌడి మోడీ” కారక్రమాన్ని భంగం చేయడానికి పాకిస్థాన్ చేయని ప్రయత్నం లేదు. నల్లని మాస్క్ లు కట్టుకొని అమెరికా వీధులలో నడుస్తూ వినూత్న ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.. మరలా ఇప్పుడు “నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి ఈ రోజు కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది పాకిస్థాన్.

హిందూత్వ రాజకీయాల ధృవతార బలరాజ్ మధోక్!


భారత రాజకీయాలలో హిందుత్వ సైద్ధాంతిక ప్రాతిపదికతో బలమైన రాజకీయ ప్రత్యామ్న్యాయం ఏర్పాటుకు అవిరళ కృషిచేసిన మేధావి, విశేష ప్రజాదరణ పొందిన నాయకుడు, వీరోచిత పోరాట యోధుడు ప్రొఫెసర్ బలరాజ్ మధోక్. విదేశీ సైద్ధాంతిక ఆలోచనలు భారత రాజకీయ రంగాన్ని ముంచి వేస్తున్న రోజులలో ప్రత్యామ్న్యాయ సామజిక, రాజకీయ, ఆర్ధిక విలువలతో బలమైన రాజకీయ పార్టీ ఏర్పాటుకు విఫల ప్రయత్నం చేశారు.

డా. శ్యామ్ ప్రసాద్ ముఖేర్జీ తో కలసి భారతీయ జనసంఘ్ ను స్థాపించి, దానికి ఒక విలక్షణమైన సైద్ధాంతిక రూపు కలిగింఫంచారు. అమెరికా, ఇజ్రాయెల్ లు భారత్ కు `సహజ మిత్రులు’ అని, వారితో భారత్ దేశం సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని దేశం అంతా రష్యా, చైనా మత్తులలో ఉన్న సమయంలోనే బలంగా వాదించిన నేత.

అయోధ్యలో రామమందిరం నిర్మించాలని పార్లమెంట్ లో మొట్ట మొదటిగా సెప్టెంబర్ 1, 1961న వాదించిన నేత. అయోధ్యతో పాటు కాశి, మథుర లను సహితం హిందువులకు ఇచ్చివేయడం ద్వారా భారతదేశంలో పరస్పరం సుహృధభావం కలిగి ఉండేందుకు చేతులు కలపాలని ముస్లింలకు పిలుపిచ్చిన మొదటి నేత.

హిందువులలో రాజకీయ చైతన్యం అవసరమని మొదటగా చెప్పారు. `సాంస్కృతిక హిందుత్వ’ అంటే విస్తృతమైన అంశమని, నేడు భారతీయులకు అవసరమైనది బలమైన రాజకీయ సందేశం అని స్పష్టం చేశారు. దేశ విభజనకు కారణమై, ఇంకా దేశంలోనే ఉంటున్నవారు హిందువులతో పాటు సమానమైన ఆదరణ మాత్రమే పొందగలరని కూడా నిక్కచ్చిగా చెప్పారు.

1946లోనే ముస్లిం సమస్యను చారిత్రక దృక్కోణంలో అధ్యయనం చేసి ఆయన లాహోర్ లో వ్రాసిన వ్యాసం ఇండియన్ లిబరల్ లీగ్ నుండి మొదటి బహుమతి పొందింది. “నేటి మూల సమస్య భారతీయ ఇస్లాం భారతీయకరణ పూర్తిగా జారకపోవడం. అదే జాతీయవాద శక్తులను బలహీన పరుస్తున్నది. తిరోగమన, జాతి వ్యతిరేక శక్తులకు బలం చేకూరుస్తుంది” అంటూ నిర్మోహాటంగా తన భావాలను వ్యక్తం చేశారు.

“బలహీనమైన విధానాలు ఏ సమస్యను పరిష్కరింపలేవు. సరైన మార్గం తీసుకొని, దారిలో వచ్చే అడ్డంకులను తొలగించుకొంటూ వెళ్లగల మనోబలం, శక్తీ దేశానికి నేడు అవసరం” అని కూడా చెప్పారు. జాతీయత ఇటలీ, జర్మనీలను ఐక్య పరిస్తే, ముస్లిం వేర్పాటువాదం భారత దేశ విభజనకు దారితీసిన్నట్లు ఆయన తెలిపారు.

రాజకీయాల నుండి మతాన్ని విడదీయాలని కోరుకొంటున్న వారు ముందుగా దేశాన్ని నిజమైన లౌకిక రాజ్యంగా మారల్చాలని మధోక్ కోరారు. లౌకిక రాజ్యంలో పౌరుల మధ్య మతం పేరుతో వివక్షత చూపడం తగదని, అందరికి ఒకేరకమైన చట్టాలు ఉండాలని, చట్టం ముందు అందరు సమానమే అని స్పష్టం చేశారు. లౌకికవాదులం అని చెప్పుకొనే వారు మతాన్ని, రాజకీయాలను మిళితం చేయడమే నేడు దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అని చెప్పారు.

భారత రాజకీయ వ్యవస్థ విదేశీ సైద్ధాంతిక జడివానలో కొట్టుకు పోతున్న తరణంలో అసలైన భారతీయ ఆర్ధిక, సామజిక, రాజకీయ విలువలతో ప్రత్యామ్న్యాయ రాజకీయాల కోసం తపించారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్, సోషలిస్ట్ రాజకీయాలకు భిన్నమైన రాజకీయ పక్షం ఏర్పాటు కోసం విశేషంగా ప్రయత్నం చేశారు.

అయితే సిద్ధాంతాల ముసుగులో అవకాశవాద రాజకీయాలు చేస్తున్నవారు, సిద్ధాంతం ముసుగులో భజనప్రియులను మాత్రమే ప్రోత్సహిస్తున్నవారు ఆయనను పక్కకు తప్పించడంతో భారత రాజకీయ రంగం అవకాశం రాజకీయాల వేదికగా ఉండిపోయింది. సైద్ధాంతిక భూమికపై, విలువల ప్రాతిపదికన రాజకీయాలు నడిపే నాయకత్వం కనిపించకుండా పోయింది. సైద్ధాంతిక అంశాలపై రాజీలేని ధోరణి ఆవలభించడం ఆనాటి ఆర్ ఎస్ ఎస్, జనసంఘ్ నాయకులకు నచ్చలేదు.

ప్రస్తుతం పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న స్కర్దులో 1920, ఫిబ్రవరి 25న జన్మించిన ఆయన శ్రీనగర్, లాహోరుల్లో చదువుకున్నారు. 1940లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి 1942లో ప్రచారక్‌గా వెళ్లారు. జమ్మూకశ్మీర్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆయనను రాష్ట్రం నుంచి బహిష్కరించడానికి ఒక దశలో షేక్ అబ్దుల్లా ప్రయత్నించాడు.

జమ్మూలో ప్రజాపరిషత్ స్థాపకులలో ఒకరైన ఆయన 1949లో ఢిల్లీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ను ప్రారంభించడంలో క్రియాశీలకంగా వ్యవహరించి, వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశారు. 1951లో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులలో ఒకరిగా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. పార్టీ ఢిల్లీలో జరిపిన మొదటి సదస్సుకు కన్వీనర్‌గా ఉన్నారు.

ఇద్దరు ఉద్దండులైన శ్యామ ప్రసాద్ ముఖర్జీ, పండిత దీన దయాళ్ ఉపాధ్యాయలతో కలిసి పనిచేశారు. వారిద్దరూ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం గమనార్హం.
జనసంఘ్‌కు విలక్షణమైన రాజకీయ, ఆర్థిక, సైద్ధాంతిక భూమికను ఏర్పరచడం కోసం ప్రయత్నించారు. పార్టీ మొదటి ఎన్నికల ప్రణాళికను ఆయన తయారుచేశారు.

రెండుసార్లు ఢిల్లీనుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే జనసంఘ్ లోక్‌సభలో అత్యధిక సంఖ్యలో 35 స్థానాలు గెలుచుకొని వివిధ రాష్ట్రాల్లో బలమైన పార్టీగా ఎదిగింది.

దేశవిభజన సమయంలో విద్రోహానికి గురయి, మారణహోమానికి గురయిన హిందువులు, సిక్కుల పక్షాన నిలబడి వారి భద్రతకోసం అవిరామంగా పోరాడిన కొద్దిమంది రాజకీయ నాయకుల్లో ఆయన ప్రముఖులు. జమ్మూకశ్మీర్‌లో రాజకీయ ఉద్యమకారుడిగా పాకిస్తాన్ సైనికుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ భారతీయ సైన్యానికి అందజేస్తూ ఉండేవారు. 2016 మే 2న ఢిల్లీలో మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Photos: Pawan Kalyan congratulates Bheeshma team

కంగనా రనౌత్ ‘తలైవి’ కొత్త లుక్

దేశంలోని కోట్లాది మందికి ఆరాధ్య నాయకి దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత. ఆ లెజెండ్ కు నివాళిగా రూపొందుతోన్న బయోపిక్ ‘తలైవి’ని తీర్చిదిద్దడంలో చిత్ర బృందం ఏ విషయంలోనూ రాజీ పడటం లేదు. ఇటీవల విడుదల చేసిన విజువల్ ప్రోమోస్, ఎంజీఆర్ గా అరవింద్ స్వామి లుక్ లకు వచ్చిన అనూహ్య స్పందన తర్వాత, ఇప్పుడు మరో ఆకర్షణను నిర్మాతలు సిద్ధం చేశారు. సెల్వి జె. జయలలిత 72వ జయంతిని పురస్కరించుకొని ఫిబ్రవరి 24న జయలలిత పాత్ర చేస్తున్న కంగనా రనౌత్ కొత్త లుక్ ను విడుదల చేస్తున్నారు. ఈ లుక్ లో యంగ్ పొలిటీషియన్ గా ముప్పైలలో ఉన్న జయలలితను చూడవచ్చు.

ఈ సందర్భంగా డైరెక్టర్ విజయ్ మాట్లాడుతూ, “అనేకమందికి మేడం జయలలిత స్ఫూర్తి. కోట్లాది మందికి ఆమె జీవిత కథ చేరాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆమె జయంతి. కాబట్టి ప్రేమగా ఆ లెజెండ్ ను గుర్తు చేసుకోవడం ద్వారా ఆమెను గౌరవించుకోవడాన్ని వదులుకోకూడదని మేం నిర్ణయించుకున్నాం. ఆమె పాత్రను ఎంతో అంకితభావంతో పోషిస్తూ, ఆ పాత్రకు జీవాన్నిస్తున్న కంగనా రనౌత్ కు నా థాంక్స్. ఈ సినిమాలో ఆమె భాగం కావడం అనేది దీని క్వాలిటీని ఎన్నో రెట్లు పెంచింది” అని చెప్పారు.

నిర్మాత విష్ణువర్ధన్ ఇందూరి మాట్లాడుతూ, “స్ఫూర్తిదాయకమైన కథలను చెప్పడాన్ని స్టోరీ టెల్లర్స్ గా మేం ఇష్టపడతాం. హిందీలో మా మొదటి సినిమా ’83’ తర్వాత, జాతీయ స్థాయిలో అలా చెప్పగల కథ ‘తలైవి’ అని మేం నమ్ముతున్నాం. ఎందుకంటే, అంతవరకూ మహిళా రాజకీయవేత్తలు లేని ఒక రాష్ట్రంలో తనకు ఎదురైన ఎన్నో అడ్డంకులతో పోరాడి, వాటిని అధిగమించి, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఒక స్త్రీ గాథ ఇది” అని తెలిపారు.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో 2020 జూన్ లో విడుదలకు సిద్ధమవుతున్న ‘తలైవి’ చిత్రానికి విజయ్ దర్శకత్వం వహిస్తుండగా, విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

పెళ్లయిన భామతో యంగ్ టైగర్ రోమాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో బీజీగా ఉన్నారు. దర్శకుడు రాజమౌళితో మూవీ చేస్తూనే జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ను లైన్లో పెట్టారు. ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బానర్లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుస్తున్న ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా సమంత ఖరారైనట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ‘బృందావనం’, ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ వచ్చి దాదాపు నాలుగేళ్లు గడుస్తోంది. సమంత పెళ్లాయిన తర్వాత తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రోమాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్-ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఇటీవలే త్రివిక్రమ్ ‘అల.. వైకుంఠపురములో’ మూవీతో బాక్సాఫీసు రికార్డులు సృష్టించాడు. అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా ‘అల.. వైకుంఠపురములో’ మూవీ నిలిచింది. ఎన్టీఆర్ మూవీలో ఇప్పటికే ఒక హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికైంది. మరో కథనాయికగా సమంతను తీసుకున్నట్లు తెలుస్తోంది. సమంత సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించనుందని సమాచారం.

ఈ మూవీకి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ఎన్టీఆర్ షూటింగ్ కాంప్లీట్ కాగానే ఈ మూవీని పట్టాలెక్కేందుకు త్రివిక్రమ్ సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తుంది.

తాజ్ సోయగాలకు ముగ్ధులైన ట్రంప్ దంపతులు


భారత్ రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు ఈ రోజు ఆగ్రాలో అడుగుపెట్టారు. భార్య మెలానియాతో కలిసి ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ను ట్రంప్ సందర్శించారు. తాజ్ మహల్ అందాలకు ట్రంప్ దంపతులు మంత్రముగ్ధులయ్యారు. చేతిలో చేయి వేసుకొని తాజ్ మహల్ చుట్టూ కలియ తిరుగుతూ తాజ్ అందాలను ఆస్వాదించారు.

చాలా ఆసక్తిగా తాజ్ విశేషాలను స్థానిక గైడ్ ను అడిగి తెలుసుకున్నారు ట్రంప్ దంపతులు. తాజ్ వెనుక భాగంలో ఉన్న యమునా నదిని కూడా ట్రంప్ దంపతులు వీక్షించారు. తాజ్ అందాలు చూసి ముగ్ధులయ్యారు ట్రంప్ దంపతులు. పర్యటనకు గుర్తుగా సందర్శకుల బుక్ లో ఓ సందేశం రాసి సంతకం పెట్టారు ట్రంప్ దంపతులు. ట్రంప్ కూతురు ఇవాంకా,అల్లుడు కుష్నార్ కూడా తాజ్ అందాలకు ముగ్ధులయ్యారు.

జేసీ సోదరులకు త్వరలో మరో ఉచ్చు

సుదీర్ఘకాలంగా అనంతపూర్ జిల్లాలో తిరుగులేని నాయకులుగా చెలామణి కావడమే కాకుండా, రాష్ట్ర రాజకీయాలపై తమదైన ప్రత్యేక ముద్ర వేస్తూ వచ్చిన జేసీ సోదరులకు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగలక తప్పడం లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని, చట్టాలను తుంగలోకి నెట్టివేసి ఇష్టారాజ్యంగా సాగించిన వారి గత వ్యవహారాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఒకొక్కటి పైకి తీసుకొస్తూ ఉండడంతో అనేక కేసులలో ఇరుక్కోవలసి వస్తున్నది.

తాజాగా జేసీ సోదరులకు త్వరలో మరో ఉచ్చు బిగుసుకోబోతోంది. నాగాలాండ్‌లో స్క్రాప్‌లో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన నిషేధిత బీఎస్-3 లారీలను బీఎస్-4గా మార్చి నకిలీ డాక్యుమెంట్లతో వాటిని జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయించినట్లు రవాణా శాఖ గుర్తించింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

మొత్తం 68 లారీలు అక్రమంగా విక్రయించినట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ గుర్తించి ఆ మేరకు చేసిన ఫిర్యాదుతో తొలుత ఎఫ్‌ఐఆర్ ఉంది. ఈ కేసుకు పొడిగింపుగా రెండు, మూడు రోజుల్లో మరో కేసు నమోదు చేయడానికి రవాణా శాఖ పకడ్బందీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి అక్రమాలకు సంబంధించి వందలాది లారీలు తిరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఇంకా లోతుగా విచారణ జరిపిన రవాణా శాఖ మరో 86 లారీలు ఉన్నట్లు గుర్తించింది. వీటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సంబంధిత అధికారులు సేకరించారు.

దీంతో జేసీ సోదరులకు నోటీసులిచ్చి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. తొలుత నమోదైన కేసులో అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బీఎస్-3 లారీలను కొన్నట్లు రవాణా శాఖ అధికారులు సమగ్ర విచారణలో తేల్చిన విషయం విదితమే.

జేసీ సోదరులు పాల్పడిన లారీల కుంభకోణంలో మొత్తంగా 154 (తొలి 68 లారీలు కలిపి) ఉన్నట్లు గుర్తించామని అధికారులు నిర్ధారిస్తున్నారు.

ట్రంప్ మెచ్చుకున్న భారతీయ సినిమాలు ఇవే..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఇండియా వచ్చారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో ఏర్పాటుచేసిన “నమస్తే ట్రంప్” కార్యక్రమంలో పాల్గొని వివిధ అంశాల పై ఆసక్తికరంగా మాట్లాడారు. ఈ సమావేశంలో ట్రంప్ ఏం మాట్లాడతారు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనే దాని గురించి మీడియా ఫోకస్ చేసింది. అనుకున్నట్టుగానే ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

మొదటగా మోడీని ప్రశంసించిన ట్రంప్, ఆ తరవాత ఇండియన్ సినిమాల గురించి మాట్లాడారు. షారుక్ నటించిన దిల్ వాలే దిల్హానియా లేజాయంగే సినిమా గురించి, అమితాబ్ హీరోగా చేసిన ఆల్ టైమ్ హిట్ సినిమా షోలే గురించి ట్రంప్ మొతేరా స్టేడియంలో పేర్కొన్నారు.
సంవత్సరానికి వెయ్యికిపైగా సినిమాలు భారత్ నుండే వస్తున్నాయని ట్రంప్ అన్నారు. ఈ విధంగా సినిమాలు రావడం వల్ల భారత్ మంచి ఆదాయాన్ని గడిస్తుందని తెలిపారు. హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి, చైనా తరువాత ఇండియా కూడా మంచి ఆధాయ వనరుగా ఉందని ట్రంప్ చెప్పడం విశేషం.

Palasa 1978 Movie Team Vizag Tour Photos

మొతేరా స్టేడియంలో ట్రంప్ అద్భుతమైన ప్రసంగం


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ రోజు, రేపు (ఫిబ్రవరి 24, 25 వ తేదీలలో) భారత్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ లో మోతేరా స్టేడియం లో ఏర్పాటు చేసిన “నమస్తే ట్రంప్”లో ప్రసంగించిన ట్రంప్ ‘నమస్తే’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి, తనను ఇక్కడికి ఆహ్వానించిన మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 1.20 లక్షల మందిని ఒకేచోట చూడడం ఆనందంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. మా హృదయంలో ఎప్పుడూ భారత్‌కు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు.

మోడీ నా ఫ్రెండ్‌ అని చెప్పడానికి గర్విస్తున్నానని అన్నారు. టీ అమ్మేస్థాయి నుంచి నరేంద్ర మోడీ ఎదిగారని అన్నారు. గుజరాతే కాదు దేశం గర్వించదగ్గ నేతగా ఆయన ఎదిగారని ట్రంప్ అన్నారు. అలాగే గత ఏడాది మోడీ అద్భుతమైన మెజార్టీతో గెలిచారని ట్రంప్ గుర్తుచేశారు. దేశ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ నిరంతరం కృషి చేస్తున్నారని భారతీయులు ఏమైనా సాధించగలరు అనడానికి మోడీయే నిదర్శనమని అన్నారు ట్రంప్. భూ ప్రపంచం మీద మోడీ గొప్పనేతన్న ట్రంప్ చాయ్‌వాలా నుంచి ప్రధాని స్థాయికి రావడం మామూలు విషయం కాదని మరోసారి ట్రంప్ అన్నారు.

మతసామరస్యానికి భారత్ ప్రతీక అని, భిన్నత్వంలో ఏకత్వం భారత్‌ కే చెందుతుందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు కనిపిస్తారని ట్రంప్ అన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ లేనంతా ముందుకు వెళ్తుందని, నిరుద్యోగం తగ్గింది, అమెరికా మిలటరీని మరింత శక్తివంతంగా మార్చామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రంప్ ఇండియా, అమెరికా దేశాల మధ్య ఫ్రెండ్ షిప్ గురించి మాట్లాడారు. రేపు జరగబోయే దైపాక్షిక సమావేశంలో ఎలాంటి ఒప్పందాలు చేసుకోబోతున్నారో వాటి గురించి మాట్లాడారు. రెండు దేశాలు కలిసి ఉగ్రవాదంపై జరపబోతున్న పోరు గురించి మాట్లాడారు. ఈ విధంగా ఆది నుండి అంతం వరకు అద్భుతంగా ప్రసంగించారు ట్రంప్.

Komali Prasad Photo Stills

బీజేపీలో కలకలం రేపుతున్న విద్వేష పూర్వక ప్రసంగాలు!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం బీజేపీలో ఒకరిపై మరొకరు బాధ్యతలను నెట్టివేసుకొనే పరిస్థితులకు దారితీస్తుంది. ఈ పరాజయంపై ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోదీ విప్పలేదు. మొత్తం ప్రచారాన్ని తన భుజస్కందాలపై నడిపించిన హోమ్ మంత్రి అమిత్ షా కొందరు పార్టీ నాయకుల వివేశపూర్వక ప్రసంగాలు తమకు తీవ్ర నష్టం కలిగించినట్లు అంగీకరించారు.

ఆ విద్వేష పూర్వక ప్రసంగాలు చేసిన వారిలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి స్వామి ఆదిత్యనాథ్ తో పాటు ఇద్దరు కేంద్ర మంత్రులు – ప్రకాష్ జావడేకర్, అనురాగ్ ఠాకూర్ ఉండటం గమనార్హం. వారిద్దరు కీలక మంత్రిత్వ శాఖలలో ఉండడంతో పాటు జావడేకర్ ఢిల్లీ ఎన్నికల ఇన్ ఛార్జ్ కూడా. వీరిలో ఠాకూర్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను `ఉగ్రవాది’ అంటూ నిందించగా, ఆయనను జావడేకర్ సమర్ధించారు.

వీరితో పాటు పలువురు బిజెపి నాయకులు చాలాకాలంగా ఇటువంటి విద్వేషపూర్వక ప్రసంగాలు చేస్తున్నా ఎప్పుడూ పార్టీ అధిష్టానం పట్టించుకోనని లేదు. వారిని స్టార్ స్పీకర్లకుగా వివిధ రాష్ట్రాలలో పార్టీ ప్రచారానికి పంపుతూనే ఉన్నారు. ఇప్పుడు సమాధానం చెప్పుకోలేని పరాజయం ఎదురు కావడంతో పార్టీలో `బాలి పశువు’లను వెతికే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తున్నది.

తాజాగా ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు మనోజ్ తేవారి సహితం విద్వేష పూర్వక ప్రసంగాల వల్లనే ఢిల్లీలో బిజెపి ఓటమికి కారణం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ సహచరుడు కపిల్ మిశ్రాలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనోజ్ తివారీ మాట్లాడుతూ.. తమ పార్టీ నేతలు అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మ, ప్రకాశ్ జవదేకర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి వారు ఎన్నికల ప్రచారంలో చేసిన వివాదాస్పద ప్రకటనలే తమ కొంపముంచాయని చెప్పారు.

సందర్భం ఏమైనప్పటికీ వారి విద్వేషపూరిత ప్రసంగాలతో అంతిమంగా పార్టీ నష్టపోయిందని తెలిపారు. రాజకీయ నాయకులు చేసే ద్వేషపూరిత ప్రసంగాలకు ఫలితం అనుభవించకతప్పదని కూడా పేర్కొనడం గమనార్హం. డిసెంబరులో ఢిల్లీలో జరిగిన సీఏఏ అనుకూల ర్యాలీలో బీజేపీ నేత కపిల్ మిశ్రా మాట్లాడుతూ.. దేశద్రోహులను కాల్చి పడేయాలని పిలుపునిచ్చారు.

తమ పార్టీ నేతే అయినా ఇలాంటి ప్రసంగాలు చేసే వారిని శాశ్వతంగా పార్టీ నుంచి తొలగించాలని కోరుకుంటుంటున్నా. విద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారు ఎన్నికల్లో పోటీ హక్కును కోల్పోయేలా ఓ విధానాన్ని తీసుకురావాలి. అలాంటి విధానాన్ని తీసుకొస్తే ఓ వ్యక్తిగా (పార్టీ అధ్యక్షుడిగా కాకుండా) నేను పూర్తి మద్దతు ఇస్తాను’’ అని తివారీ చెప్పుకొచ్చారు. ఢిల్లీలో బీజేపీకి సీఎం అభ్యర్థి లేకపోవడం కూడా పార్టీ ఓటమి ఓ కారణమని మనోజ్ తివారీ పేర్కొన్నారు.

తల్లిని మిస్ అవుతూ జాన్వీ పోస్ట్


2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అతిలోకసుందరి అనంతలోకాలకు వెళ్ళిపోయి నేటికి రెండేళ్లు అవుతోంది.ఆమె పెద్ద కూతురు జాన్వి కపూర్ ఈరోజు శ్రీదేవి వర్థంతి సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు, తన చిన్నప్పుడు తల్లితో కలిసి దిగిన ఫొటోతో పాటు , ‘రోజూ నిన్ను మిస్ అవుతూనే ఉంటాను’ అని రాసి పోస్ట్ చేసింది.

ఈ పోస్ట్‌పై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ…. జాన్వి ధైర్యంగా ఉంటూ , ఇంట్లోవారికి ధైర్యం చెప్పాలంటూ సర్దిచెప్తున్నారు.శ్రీదేవి అభిమానులు కూడా ఆమె ఆత్మకు శాంతి కలగాలని పోస్ట్‌లు పెడుతున్నారు.జాన్వి తోలి సినిమ ‘ధడక్’లో నటిస్తున్న సమయంలోనే శ్రీదేవి చనిపోయారు.కూతురి తోలి సినిమాను చూడకుండానే వెళ్లిపోవడం బాధాకరం… ఏ లోకంలో ఉన్నా శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.

నితిన్ ‘అంధాదున్’ షూటింగ్ ప్రారంభం

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాదున్’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెల్సిందే. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. సోమవారం నటీనటులతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలిషాట్ కు శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, దర్శకుడు సురేందర్ రెడ్డి తొలిషాట్ తీశారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి గతంలోనే ‘అంధాదున్’ రీమేక్ హక్కులను దక్కించుకున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘అంధాదున్’ తెలుగులో రీమేక్ అవుతుంది. సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ మూవీస్ బ్యానర్లో ఈ మూవీని నిర్మిస్తున్నాడు.

ఈ మూవీలో నితిన్ అంధుడిగా కనిపించబోతున్నాడు. అంధుడైన వ్యక్తి ఓ హత్యకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాడు. చట్టానికి నిందితులను ఎలా పట్టించాడు అనేది కథ.. అనేక ట్వీస్టులు, సస్పెన్స్ తో ఆకట్టుకునేలా చిత్రాన్ని బాలీవుడ్లో తెరకెక్కించారు. ఈ మూవీని తెలుగు నెటివీటికి అనుగుణంగా మార్పులుచేసి రీమేక్ చేస్తున్నారు. నితిన్ సరసన హబ్బాపటేల్ ఎంపికైనట్లు సమాచారం. ‘అంధాధున్’ మూవీలో అద్భుత నటన కనబర్చిన ఆయుష్మాన్ ఖురానా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు.

దర్శకుడు మేకపాటి గాంధీ వెంకట్రాది ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరగా చేసిన కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ కావడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో ‘అంధాదున్’ రీమేక్ తో విజయం సాధించి మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. నితిన్ తాజాగా ‘భీష్మ’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ సక్సస్ అందుకున్నాడు. నితిన్-రష్మిక జోడికి ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది. ‘అంధాదున్’ రీమేక్ లైన్లో పెట్టిన నితిన్ ఆ వెంటనే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ‘రంగ్ దే’ మూవీ చేయబోతున్నారు. బాలీవుడ్లో విమర్శల ప్రశంసలు అందుకున్న ‘అంధాదున్’ తెలుగులో ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.