
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటనలో భాగంగా ఈ రోజు (ఫిబ్రవరి 24)న మొదటిగా సబర్మతి ఆశ్రయాన్ని సందర్శించి, ఆ తర్వాత మోతేరా స్టేడియం లో ఏర్పాటు చేసిన “నమస్తే ట్రంప్” (కెమ్ ఛో ట్రంప్) కార్యక్రమంలో పాల్గొని సాయంత్రానికి ఆగ్రాకు చేరుకొని తాజ్ మహల్ ని సందర్శించనున్నారు.
అయితే గుజరాత్ పర్యటన అనంతరం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి ఖేరియా విమానాశ్రయం ఆ తర్వాత తాజ్ మహల్ కి బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో ఖేరియా విమానాశ్రయం నుండి తాజ్ మహల్ వరకు దూరం 15 కిలోమీటర్లు. ఈ మార్గం మధ్యలో జాతీయ జండాలు పట్టుకున్న పాఠశాల పిల్లలు ట్రంప్ కి ఘన స్వాగతం చెప్పడానికి ప్రణాళికలు రూపొందించారు. పాఠశాల పిల్లలను అజిత్‌నగర్ గేట్ నుండి శిల్‌పగ్రామ్ వరకు రహదారికి ఇరువైపులా దాదాపు 26 వేల మంది పిల్లలను నిలబెట్టడానికి ప్రణాళికలు పూర్తి చేశారు. ట్రంప్ రిసెప్షన్‌లో భాగంగా ఈ 26వేల మంది పిల్లలు సుమారు ఐదు గంటలు నిలబడాల్సి ఉంటుంది. ట్రంప్ వచ్చి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యేవరకు అంటే మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఏడు గంటలకు అక్కడే ఉండాలి. ఈ ఐదు గంటలు పిల్లలు శబ్దం చేయకూడదు. గందరగోళ వాతావరణాన్ని సృష్టిచకూడదు. దింతో ఈ ఐదు గంటలు పిల్లలకు ఎంతోకొంత శారీరక బడలిక, మానసిక విసుగు కలిగే అవకాశాలు ఉన్నాయి.
అలాగే ట్రంప్ ప్రయాణించే మార్గం మధ్యలో, ఆ సమయంలో దుకాణాలు మూసివేయాలి, వసతి గృహాలు, హోటళ్లు తెరవకూడదు,
ఉదయం 9 గంటల నుండే ఎటువంటి వాహనం అనుమతించబడటం లేదు. ఒక్క వాహనం కూడా ఆ పరిసర ప్రాంతాలలో పార్కింగ్ చేయడానికి అనుమానతించబడదు. ఈ ఐదు గంటలు ఖేరియా విమానాశ్రయం నుండి తాజ్ మహల్ వరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు.