Home Blog Page 8614

ఢిల్లీలోశాంతి స్థాపనకోసం అందరం ఒక్కటవుదాం

ఢిల్లీ అల్లర్లు 1984, 1989, 2002 జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నాయి. 1984 లో సిక్కు వ్యతిరేక దమనకాండ, 1989 లో కాశ్మీరీ పండిట్లపై జరిగిన దాడులు, పర్యవసానంగా 4 లక్షలమంది సామూహిక వలస, 2002 లో జరిగిన గోధ్రా రైలు ఘటన, పర్యవసానంగా జరిగిన హిందూ-ముస్లిం ఘర్షణలు, స్వాతంత్య్రానంతరం ఈ మూడే అతిపెద్ద మాయని మచ్చలు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫరాబాద్ అల్లర్లు ఆ స్థాయిలో కాకపోయినా చరిత్రలో చీకటి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. వీటికి ఇప్పుడు దేశరాజధాని ఢిల్లీ కూడా జతకలిసింది. ఇప్పటికే 23 మందిని ఈ అల్లర్లు బలిగొన్నాయి. ఢిల్లీ మన దేశరాజధాని . ఈ అల్లర్లతో ఢిల్లీ ప్రతిష్ట మసకబారింది. చరిత్రలో 1947, 1984 ల్లో ఢిల్లీ మత ఘర్షణల్లో అట్టుడికింది. తిరిగి ఇప్పుడు చరిత్ర పునరావృతమయ్యింది.

దీనికి పూర్వ నేపధ్యం పౌరసత్వ సవరణ చట్టం. గత రెండు నెలలనుంచి దీనిపై ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్నాయి. షహీన్ బాగ్ లో రహదారి నిర్బంధం చేసి ఈ నిరసన కొనసాగుతుంది. మొదట్లో ఇది రాజకీయ ఆందోళనగానే వున్నా రాను రాను కేవలం ఓ మత వర్గానికి చెందిన ఆందోళనగానే పరివర్తన చెందింది. దానిలో మాట్లాడిన వక్తలు దేశ వ్యతిరేక నినాదాలు , దేశవ్యతిరేక ప్రసంగాలు చేయటం ప్రచారసాధనాల్లో చూసాం. దానితో మిగతా వర్గాల్లో కూడా ప్రతిస్పందనలు మొదలయ్యాయి. చివరకు సమాజం రెండు వర్గాలుగా విడిపోయింది. ఈ సందర్భంలో ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తం కావాల్సి వుంది. అంటే ఇంటలిజెన్స్, సర్వైలెన్స్ వ్యవస్థలు చాలా పకడ్బందీగా పనిచేయాల్సివుంది. ఈ విషయంలో వాటి పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వ్యవస్థలు వున్నదే అందుకు.

ఇకపోతే దీనికి ఏదో ఒక వర్గాన్ని నిందించటం తగదు. రెండు చేతులు కలిస్తేనే చప్పుడవుతోందని మరిచిపోవద్దు. షహీన్ బాగ్ స్పూర్తితో ఈ ఆందోళనలను మిగతా ప్రాంతాలకు విస్తరించటానికి ప్రయత్నించటం ఢిల్లీ వాసులకు కోపం తెప్పించిన మాట వాస్తవం. అయితే ప్రభుత్వం లో వున్న వాళ్ళు సహనం వహించాల్సిన అవసరం వుంది. బీజేపీ లోని కొంత మంది నాయకుల రెచ్చగొట్టే ప్రసంగాలు అభ్యంతరకరం. వాళ్లపై బీజేపీ నాయకత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకొని వుండాల్సింది. కనీసం బహిరంగంగా వాటిని ఖండించి వుండాల్సింది. అలా చేయక పోవటం బీజేపీ వైపునుంచి లోపం, తప్పుకూడా. అదేసమయంలో రెండోవైపు షహీన్ బాగ్ లో ఎప్పట్నుంచో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నా కిమ్మనకుండా ఉండటం ప్రభుత్వ నిష్క్రియాపత్వానికి మచ్చుతునక. దానితో పాటు ఇటీవల మజ్లీస్ నాయకుడు గుల్బర్గాలో చేసిన ప్రసంగం దేశం మొత్తం చూడటం కూడా కొంత ఉద్రిక్తతలు కారణమయ్యింది. ఇలా రెండు వైపులా రెచ్చగొట్టే ధోరణలు జరిగాయన్నది వాస్తవం. అయితే ట్రంప్ వచ్చినప్పుడు ఇలా జరగటంతో మన ప్రతిష్ట అంతర్జాతీయ సమాజంలో దెబ్బతిన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవతీసుకుని జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ని రంగంలోకి దించటం ఆహ్వానించదగ్గ పరిణామం. పరిస్థితులు వేగంగానే దారికి వస్తాయని ఆశిద్దాం.

ఇదంతా ఒకఎత్తయితే దీన్ని అవకాశంగా తీసుకొని ప్రభుత్వం పై అస్త్రాలు సంధించటం ప్రతిపక్షాలు చేయదగ్గపనికాదు. దానికి టైముంది. పరిస్థితులన్నీ చక్కబడ్డతర్వాత ప్రభుత్వలోపాల్ని ఎత్తిచూపటం చేయొచ్చు. ఇప్పుడు జరగాల్సింది శాంతిభద్రతల పునరుద్ధరణ. ప్రభుత్వం, ప్రతిపక్షాలు, సాంఘిక సంస్థలు , మేధావులు, మీడియా అందరికీ ఇందులో బాధ్యత వుంది. అందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఒకరిమీద ఒకరు దుమ్మెత్తుకోవటం కొద్దిరోజులు ఆపేయాలి. ఆ ప్రాంతాల్లో పర్యటించి అన్ని వర్గాల్లో విశ్వాసం పాదుకొల్పాలి. ఏదో ఒక వర్గం తరఫున మాట్లాడుతున్నట్లు వుండకూడదు. రెచ్చగొట్టుకోవటం తేలిక, కలపటం సమయం తీసుకుంటుంది. సోనియా గాంధీ అయినా , సీతారాం ఏచూరి అయినా , కేటీర్ అయినా ఇప్పుడుచేయాల్సింది ఇదే. ఆరోపణలకు ఇది సమయం కాదు. ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవాలి. సామరస్యవాతావరణం పునరుద్ధరించటమొక్కటే మనముందున్న ఏకైక లక్ష్యం. దానికోసం అందరం కృషిచేద్దాం.

పేదలకు ఇళ్ల స్థలాలు.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలకి ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందించేందుకు జగన్ సర్కార్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే… అయితే ఈ ఇళ్ల స్థలాల కేటాయింపు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిచారు. వివాదాలకు తావులేని భూములనే ఇళ్ల స్థలాలగా ఇవ్వాలని పవన్‌ అన్నారు. రాజధాని కోసం సమీకరించిన భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడం వివాదాలకు దారితీస్తోందన్నారు. ఎలాంటి వివాదాలు లేని భూములనే పేదలకు ఇవ్వాలన్నారు. ఒకవైపు అమరావతి రైతులు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు జగన్ సర్కార్ పట్టాలివ్వాలని చూడటం ప్రజల మధ్య చిచ్చు పెట్టడమేనని విమర్శించారు.

2013 భూసేకరణ చట్టం ప్రకారం అన్ని భూములకూ పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసి ఉంది. పేదల భూములు, అసైన్‌ మెంట్‌ భూముల జోలికి వెళ్లే అవకాశం లేదని ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించినా అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అసైన్‌మెంట్‌, ప్రభుత్వ పోరంబోకు భూములను సుదీర్ఘకాలంగా సాగు చేసుకుంటూ పట్టాల కోసం ఎదురుచూస్తోన్న పేదల భూములను దౌర్జన్యంగా, చట్టవిరుద్ధంగా స్వాధీనం చేస్తుండటం గమనార్హం. కోర్టు తీర్పులను పెడచెవిన పెట్టి, భూములు లాక్కోవాలని చూస్తే ఉద్యమిస్తామని ప్రతిపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలలో ఐదు ప్రైవేట్‌ రైళ్లు


దక్షిణ మధ్య రైల్వేలో ఐదు ప్రైవేట్‌ రైళ్ల రాకపోకలు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా వంద మార్గాల్లో 150 ప్రైవేట్‌ ప్యాసింజర్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇటీవల బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్‌ ఉన్న పలు రైలు మార్గాల్లో ప్రైవేట్‌ రైళ్లకు అవకాశం కల్పిస్తున్నారు.

ప్రస్తుతం ఢిల్లీ – లక్నో మధ్య తేజస్‌ ప్రైవేట్‌ రైళ్లు విజయవంతంగా రాకపోకలు సాగిస్తున్నాయి. రెండో ప్రైవేట్‌ రైలు అహ్మదాబాద్‌- ముంబై మార్గంలో జనవరి 19 నుంచి అందుబాటులోకి వచ్చింది. రూ 22, 500 కోట్ల పెట్టుబడితో దేశంలోని వంద మార్గాల్లో 150 రైళ్లను ప్రైవేటు ఆపరేటర్లు నడపనున్నట్లు రైల్వే ప్రకటించింది. వీటిలో సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలో ఎపి కి సంబంధించి అయిదు రూట్లు ఉన్నాయి.

ప్రైవేట్‌ రైళ్లలో సకల సౌకర్యాలుంటాయని.. విమానాల తరహాలో అత్యంత ఖరీదైన వసతులతో పాటు రైల్‌ హోస్టెస్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల డిమాండ్‌ అధికంగా ఉన్న రూట్లనే ప్రైవేటు రైళ్లకు ఎంపిక చేశారు.

చర్లపల్లి – శ్రీకాకుళం, లింగంపల్లి – తిరుపతి, గుంటూరు – లింగంపల్లిల మధ్య డైలీ ట్రైన్లు నడపనున్నారు. ఇక విజయవాడ – విశాఖతో పాటూ, విశాఖ – తిరుపతి మధ్య ట్రై వీక్లీ ప్రైవేట్‌ రైళ్లు నడిపేందుకు మార్గం సుగమమయింది.ప్రైవేటు రైళ్లలో డ్రైవరు, గార్డులను రైల్వే శాఖ అందిస్తుంది.

ప్రమాదాలు జరిగితే సహాయ చర్యలు, బీమాతో పాటూ మిగిలిన సౌకర్యాల బాధ్యత మొత్తం ప్రైవేటు ఆపరేటర్లదే. రైల్వేల్లో పెట్టుబడి కోసం విదేశీ సంస్థలపైన హ్యూండారు, సీమెన్స్‌, ఆల్స్ట్రామ్‌ ఆసక్తి కనబరుస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. దేశీయ సంస్థలైన టాటా, అదానీ గ్రూప్‌లు కూడా ప్రైవేటు రైళ్ల వైపు అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది

ట్రంప్ విందు:ఓహో.. జగన్ కి అందుకే ఆహ్వానం రాలేదా..!


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కు రాష్ట్రపతి భవన్ లో ఇచ్చిన విందుకు దేశంలోని పలు రాష్ట్రాల నుండి వివిధ ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందింది. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఆహ్వానం అందుకున్నారు. కానీ, ఏపీ సీఎం జగన్ కి మాత్రం ఆహ్వానం అందలేదు. దింతో రాజకీయాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జగన్‌ పై సెటైర్లు వేశారు.

ఇదే విషయమై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు కడుపు మంటతో సీఎం జగన్‌ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఆయనే తెలివైనవారు.. మిగిలిన వారు అమయాకులు అని చంద్రబాబు అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీన్ పట్నాయక్ నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినా ఆయనకు ఆహ్వానం ఎందుకు అందలేదని ప్రశ్నించారు బొత్స. బీజేపీ వాళ్ల సమీకరణలు ఆలోచనలు వాళ్లకు ఉంటాయని.. రాష్ట్రాల్లో ఎవరికైతే బలమైన నాయకత్వం ఉన్నవాళ్లను పిలవలేదని అన్నారు మంత్రి. దేశంలో బలమైన నాయకుడు జగన్.. అందుకే జగన్‌ ని ట్రంప్ వస్తే ఆహ్వానించలేదు అని మేం అనుకుంటున్నాం అని బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

వెంకటేష్ విడుదల చేసిన సముద్ర ‘జైసేన’ ట్రైలర్..

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి, సుష్మా రెడ్డి ఫిలిమ్స్ సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. ఇప్పటికే విడుదలైన టీజ‌ర్‌, పాటలకి ట్రెమండ‌స్ రెస్పాన్స్‌ వస్తోంది. కాగా ఈ చిత్రం ట్రైల‌ర్‌ను విక్ట‌రీ వెంకటేష్ విడుద‌ల‌చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో దర్శకుడు సముద్ర, నిర్మాత వి.సాయి అరుణ్‌ కుమార్‌, కో ప్రొడ్యూసర్స్‌ పి.శిరీష్‌ రెడ్డి, దేవినేని శ్రీనివాస్‌, న‌టులు శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా..

విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ – “సముద్ర స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వ‌హించిన ‘జైసేన’ ది పవర్ ఆఫ్ యూత్ మూవీ ట్రైలర్ ఇప్పుడే చూశాను. ఎపుడైనా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, సాలిడ్ స్క్రిప్ట్ తో వ‌స్తారు స‌ముద్ర‌. ఈ సినిమాకి కూడా లాట్ ఆఫ్ ఎమోషన్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో ఒక మంచి స్క్రిప్ట్ తీసుకున్నారు. శ్రీకాంత్, సునీల్ తో పాటు చాలా మంది యంగ్ స్టర్స్ ఈ సినిమాలో నటించారు. నిర్మాణ విలువలు కూడా ఒక పెద్ద నిర్మాణ సంస్థ నుండి వచ్చిన సినిమాలా ఉన్నాయి. దర్శకుడు స‌ముద్ర‌తో పాటు ఈ టీమ్ అంద‌రికి ఒక మంచి సినిమా అవ్వాల‌ని కోరుకుంటున్నాను. టీమ్ అంద‌రికి ఆల్ ది బెస్ట్” అన్నారు.

 

పవన్ జోడిగా మరోసారి మహానటి ..!

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే… ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నట్టు పూజ హెగ్డే, ప్రగ్యా జైస్వాల్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. మహానటి సినిమాతో మంచి పేరు దక్కించుకున్న కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు కీర్తి సురేషే ఫైనల్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ కీర్తి సురేష్ కలిసి అజ్ఞాతవాసి సినిమా చేసిన సంగతి తెలిసిందే.

Mangli at Swetcha Movie Pre-release Event

ప్రభాస్ ను లైన్లో పెట్టిన నాగ్ అశ్విన్

‘బహుబలి’ సీరీస్ లతో హీరో ప్రభాస్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు. ఆయనతో కలిసి పని చేసేందుకు అగ్ర దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే డార్లింగ్ మాత్రం ఆచితూచి సినిమాలకు కమిట్ అవుతున్నాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలనే చేస్తూ బీజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొనసాగుతుండగానే ప్రభాస్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

‘మహానటి’ మూవీతో దర్శకుడు నాగ్ అశ్విన్ జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఆయన ఏ సినిమాను చేయలేదు. అయితే తాజాగా డార్లింగ్ ప్రభాస్ తో సైంటిఫిక్ ఫిక్షన్ బ్యాక్ గ్రాప్ లో ఓ మూవీ తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన చిత్రబృందం బుధవారం ప్రకటించింది. దీంతో నాగ్ అశ్విన్ తో ప్రభాస్ మూవీపై క్లారిటీ వచ్చేసింది.

ఇటీవల ప్రభాస్ నటించిన ‘సాహో’ మూవీ ‘బహుబలి’ రికార్డులను తిరగరాస్తుందని అనుకున్నారు. అయితే ఆ రేంజ్లో కాకపోయిన మంచి విజయాన్నే దక్కించుకుంది. ఈ మూవీ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్నాడు. ప్రభాస్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ మూవీని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ మూవీ ప్రారంభం కానుంది.

రాజ్యసభకు వై ఎస్ షర్మిల !

రాజ్యసభ ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని అధికార పార్టీలలో ఈ పదవి ఆశిస్తున్న వారిలో కదలిక ప్రారంభమైనది. ఆంధ్ర ప్రదేశ్ నుండి నాలుగు, తెలంగాణ నుండి రెండు స్థానాలకు జరిగే ఎన్నికలలో అన్ని స్థానాలను అధికార పక్షాలే గెలుచుకోగలవు.

ఒక వంక తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో ఓటమి చెందిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను రాజ్యసభకు పంపే అంశంపై ఊహాగానాలు జరుగుతున్నా ఇప్పటివరకు నిర్దుష్టమైన సంకేతాలు వెలువడలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి వై ఎస్ షర్మిలను రాజ్యసభకు పంపడం గురించి సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి.

2014లో కడప నుండి, 2019లో ఒంగోలు లేదా విశాఖపట్నంల నుండి లోక్ సభకు పోటీ చేయాలని ఆమె ఎంతగా ప్రయత్నించినా జగన్ ఒప్పుకోలేదు. కడప నుండి తమ కుటుంభంకు చెందిన అవినాష్ రెడ్డికి అవకాశం ఇస్తూ వస్తున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఒక విధంగా షర్మిల ప్రభుత్వానికి, రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

2014లో నరసరావుపేట నుండి పోటీ చేసి ఓటమి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయోధ్యరామి రెడ్డికి సీట్ ఇస్తున్నట్లు కూడా కధనాలు వెలువడ్డాయి. అయితే అకస్మాత్తుగా ఇప్పుడు షర్మిల పేరు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంది.

న్యాయసంబంధంగా అనూహ్య పరిణామాలు జరిగి, జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వస్తే తమ కుటుంబంలోనే అధికారం కోసం కుమ్ములాటలు ఏర్పడకుండా నివారించడం కోసం ఆమెను రాజ్యసభకు పంపాలని జగన్ భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా తాను రాజీనామా చేయవలసి వస్తే ముఖ్యమంత్రిగా భార్య వై ఎస్ భారతిని చేయడానికి అడ్డు లేకుండా చేసే ప్రయత్నం చేసారని చెబుతున్నారు.

షర్మిలను రాజ్యసభకు పంపితే రెడ్డి సామజిక వర్గం నుండి మరొకరికి అవకాశం లభించే పరిష్టితి ఏర్పడదు. శాసన మండలి రద్దు చేయాలని అనుకోవడంలో ప్రస్తుతం మంత్రి పదవులలో ఉన్న ఇద్దరు ఎమ్యెల్సీలు – పి సుభాష్ చంద్ర బోస్, ఎం వి రమణారావు లలో ఒకరిని రాజ్యసభకు పంపనున్నట్లు ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. ఈ సందర్భంగా రమణారావు పేరు వినిపిస్తున్నది.

ప్రభుత్వ ఖర్చులతో `నమస్తే ట్రంప్’ జరపడమా!


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా భారత్ ప్రభుత్వం అత్యుత్సాహం చూపిందా అనే అనుమానం కలుగుతున్నది. కేవలం ఐదు నెలల క్రితమే అమెరికాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సంబంధాల గురించి సవివరంగా సమాలోచనలు జరిపారు. అటువంటప్పుడు అంత తక్కువ వ్యవధిలో ట్రంప్ ఇక్కడకు రావలసిన అవసరం లేదు.

వాస్తవానికి తాను అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తర్వాత రావాలి అనుకొంటే, ఇప్పుడే రమ్మనమని మోదీ కోరాడని, అందుకే వచ్చానని ట్రంప్ స్వయంగా చెప్పడం గమనార్హం. సాధారణంగా అమెరికా అంటేనే వ్యాపారం. వాణిజ్య ప్రయోజనం లేకుండా ఏమీ చేయరు. భారీ వాణిజ్య ప్రతినిధి వర్గాలు లేకుండా అమెరికా అద్యక్షులు ఏ దేశానికి కూడా వెళ్లారు. కానీ బహుశా తొలిసారి ట్రంప్ సదా, సీదాగా భారత్ కు వచ్చారు.

పర్యటనకు ముందే తాము భారత్ తో వాణిజ్యం ఒప్పందం ఏమీ ఇప్పుడే చేసుకోబోవడం లేదని కూడా చెప్పారు కూడా. ఐదు గంటల పాటు ప్రధాని మోదీతో జరిపిన ద్వైపాక్షిక సమావేశంలో సహితం రూ 21,000 కోట్ల విలువ గల యుద్ధ విమానాల సరఫరా మించి నిర్ధిష్టమైన ఒప్పందం అంటూ లేదు. ఇంత చిన్న ఒప్పందం కోసం స్వయంగా అమెరికా అధ్యక్షుడు రావలసిన అవసరం లేదు.

రాక, పోకలకు 36 గంటల సేపు ప్రయాణం చేసిన, ట్రంప్ దంపతులు భారత్ 35 గంటలకు మించి లేరు. ముందురోజు అహ్మదాబాద్ ఎందుకు వచ్చారో తెలియదు. అక్కడ మోదీ బలప్రదర్శనగా ఏర్పాటు చేసిన `నమస్తే ట్రంప్’ లో హాజరు కావడానికి వచ్చారు. ఈ సందర్భంగా శృతిమించి ఆయన మోదీని పొగడ్తలతో నింపేశారు. బిజెపి నాయకులు కూడా ఎవ్వరు మోదీని అంతగా పొగిడి ఉండరు.

ఈ విషంగా ఒక విదేశీ అధ్యక్షుడికి ఆ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బహిరంగ సభను ఏర్పాటు చేయవలసిన అవసరం ఏముంది? గత సెప్టెంబర్ లో మోదీ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొనడంతో, అంతుకు ప్రతిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెబుతున్నారు.

అయితే అమెరికాలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రంప్ ఒక అతిధిగా పాల్గొన్నారు గాని, ఆ కార్యక్రమ నిర్వహణలో అమెరికా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రభుత్వం నుండి ఒక్క డాలర్ కూడా ఖర్చు పెట్టలేదు. పైగా అమెరికా ప్రజలు కొద్దీ ఏమీ ఖర్చు పెట్టలేదు. అటువంటిది ట్రంప్ రాక సందర్భంగా ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం రాజకీయ ఉద్దేశ్యాలతో తప్ప దౌత్యపరంగా ఎటువంటి సంబంధం లేని అంశమని భావించ వలసి ఉంటుంది.

ట్రంప్ అంటే నే పక్కా వ్యాపార వేత్త. ఆయనకు ప్రజాజీవనంలో ఎటువంటి సంబంధం లేదు. రాజకీయ, నైతిక విలువలు కూడా ఆయనకు లేవు. అటువంటి ఆయనను ప్రత్యేకంగా సబర్మతి ఆశ్రయంకు తీసుకు వెళ్లడం, అక్కడ సందర్శకుల పుస్తకంలో గాంధీ పేరును కూడా ఆయన ప్రస్తావించక పోవడం చూస్తే భారత ప్రభుత్వమే నవ్వుల పాలయిన్నట్లు ఉంది.

ఇంకా బరాక్ ఒబామా వంటి వారిని సబర్మతి ఆశ్రయంకు తీసుకు వచ్చినా ఒక అర్ధం ఉంటుంది. ఆయన స్వయంగా సామజిక జీవనంలో క్రియాశీలకంగా పాల్గొన్నవారే కాకుండా, తాను ఈ స్థితికి రావడానికి మహాత్మ గాంధీ అని సగర్వంగా చెప్పుకున్నారు.

చాలామంది జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో భారత సంతతి ఓటర్ల మద్దతు ట్రంప్ కు లభింప చేసేందుకు మోదీ `నమస్తే ట్రంప్’ బహిరంగ సభ ఏర్పాటు చేసారని చెబుతున్నారు. అయితే అక్కడున్న భారతీయులు సామజిక ప్రభావం చూపే కీలక స్థానాలలో ఉన్నప్పటికీ మొత్తం ఓటర్లలో 1 శాతం మాత్రమే ఉన్నారు.

వారిలో 70 శాతం డెమోక్రాటిక్ పార్టీ ఓటర్లు. వారు ట్రంప్ కు అనుకూలంగా మారే అవకాశం లేదు. పైగా వీసాల విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న కఠిన ధోరణి కారణంగా ఈ పర్యాయం మరింత ఎక్కువ మంది భారత సంతతి వారు ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం లేకపోలేదు.

తనను ఒక అంతర్జాతీయ నాయకుడిగా స్వదేశంలో గుర్తింపు కోసం మొదటి నుండి తంటాలు పడుతున్న మోదీ తన మెహర్భానీ చూపించుకోవడం కోసమే ఈ బల ప్రదర్శనకు దిగిన్నట్లు భావించ వలసి వస్తుంది.

Swetcha Movie Pre-release Event Photos

ఢిల్లీలో ఆగని అల్లర్లు..పెరుగుతున్న మృతుల సంఖ్య..!

ఈశాన్య ఢిల్లీలో ప్రారంభమైన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల ఘర్షణ ఈ రోజుకి ఢిల్లీ తూర్పు ప్రాంతానికి వ్యాపించాయి. ఇప్పటి వరకు 20 మంది మృతి చెందగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. దింతో అల్లర్లను అదుపు చేసేందుకు ఢిల్లీ పోలీసుల బలం సరిపోవడం లేదని, వెంటనే ఆర్మీని రంగంలోకి దింపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ఈ అల్లర్ల ఘటనపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. పోలీసులకు నోటీసులు జారీ చేసి, విచారణకు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దేశ రాజధానిలో 1984 నాటి తరహాలో అల్లర్లు పునరావృతం కాకూడదని, పూర్తి స్థాయిలో పౌరులకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది. బాధితులను, వారి కుటుంబాలను ఉన్నతాధికారులు పరామర్శించాలి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోర్టు ఆదేశించింది.

అల్లర్లకు భయపడి బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లడానికి భయపడితే వారికి షెల్టర్లు ఏర్పాటు చేయాలని, షెల్టర్లలో బాధితులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని కోర్టు చెప్పింది. హెల్ప్‌లైన్లు, హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేసి ప్రజలకు సహాయం చేయాలి. క్షతగాత్రుల వద్దకు అంబులెన్స్‌లు సురక్షితంగా చేరేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అల్లర్లను అదుపు చేసే బాధ్యతను జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌కు కేంద్రం అప్పగించినట్టు తెలిసింది.

‘హిట్’ మూవీ USA షో టైమ్స్

విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా నటించిన చిత్రం ‘హిట్’. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. ఈనెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘హిట్’ మూవీ AUS/NUZ షో టైమ్స్

విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా నటించిన చిత్రం ‘హిట్’. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. ఈనెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

నిర్మాతగా మారనున్న నాగచైతన్య

అక్కినేని నాగేశ్వర్ రావు మనువడు నాగచైతన్య త్వరలోనే నిర్మాణ రంగంలోకి అడుగులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నాని తదితర హీరోలంతా సొంత బ్యానర్లు ఏర్పాటు చేసుకొని సినిమాలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ బ్యానర్లో వాళ్ల కుటుంబానికి చెందిన హీరోలతోపాటు కొత్త నటీనటులను పరిచయం చేస్తూ నిర్మాతలుగా విజయవంతం అవుతున్నారు. వీరి బాటలోనే అక్కినేని నాగచైతన్య నడిచేందుకు సిద్ధమవుతున్నాడు.

అక్కినేని కుటుంబానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా వీడదీయరాని బంధం ఉంది. టాలీవుడ్ హైదరాబాద్ రావడానికి ముఖ్య కారణం నాగేశ్వర్ రావు అని తెల్సిందే. అలాగే అక్కినేని నాగేశ్వర్ రావు అన్నపూర్ణ స్టూడియోను నిర్మించి ఎన్నో సినిమాలను చేశారు. ఆ తర్వాత ఆయన కుమారుడు నాగార్జున నాగేశ్వర్ ఈ స్టూడియోను ప్రారంభించారు. సొంతంగా ‘మనం ఎంటర్ ప్రైజెస్’ బ్యానర్ ఏర్పాటుచేసి పలు సినిమాలకు నిర్మించారు. తాజాగా నాగార్జున తనయుడు నాగచైతన్య కూడా సొంత బ్యానర్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాడు.

నాగచైతన్య ప్రస్తుతం ‘నాగేశ్వర్ రావు’ ‘లవ్ స్టోరీస్’ మూవీల్లో నటిస్తూ బీజీగా ఉన్నాడు. అయినప్పటికీ సొంత బ్యానర్ ఏర్పాటు చేసి కొత్త నటీనటులకు అవకాశం కల్పించాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. ఈ బ్యానర్లో చిన్న హీరోలతో తొలుత సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగా రాజ్ తరుణ్ హీరోగా ఈ సినిమాను చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై నాగచైతన్య అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

మందుల కంపెనీల ముడుపులకు ఐటి మినహాయింపులా!


తమ కంపెనీ మందులనే అవసరం ఉన్నా లేక పోయినా రోగులకు వ్రాసి తమకు లాభాలు తెచ్చిపెట్టమని ఔషధ కంపెనీలు డాక్టర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ఉండటం అందరికి తెలిసింది. అందుకు ప్రతిఫలంగా డాక్టర్లకు నగదు పారితోషికంతో పాటు ఖరీదైన బహుమతులు, విలాసవంతమైన పర్యటనలు ఏర్పాటు చేస్తుంటాయి. ఇటువంటి ఖర్చులు అన్ని అనైతికం, డాక్టర్లకు ముడుపులు చెల్లించడంగానే పరిగణించాలి.

అయితే దేశంలో ప్రముఖ ఔషధ కంపెనీలు అన్ని అటువంటి ఖర్చులను `సేల్స్ ప్రమోషన్’ వ్యయంగా చూపి, అందుకోసం ఆదాయపన్ను మినహాయింపులు కోరుతూ వస్తున్నాయి. కొన్ని ఔషధ కంపెనీలు అనుసరిస్తున్న ఇటువంటి అనైతిక చర్యలపై విచారణ జరపడం కోసం స్వయంగా మద్రాస్ హైకోర్టు రంగంలోకి దిగింది.

2019–20 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 8,667 ఫార్మా కంపెనీలు ‘సేల్‌‌ ప్రమోషనల్‌‌ వ్యయం’, ‘బహుమతులు’ ల కింద ఆదాయపన్ను మినహాయింపును క్లయిమ్‌‌ చేశాయని ఐటీ శాఖ మద్రాస్‌‌ హైకోర్టుకు వివరించింది. 2019–20కి గాను 1,410 కంపెనీలు ఐటీఆర్‌‌ (ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్‌‌ రిటర్న్‌‌)‌‌ 3 ద్వారా, 1,915 కంపెనీలు ఐటీఆర్‌‌‌‌ 5 ద్వారా, 5,342 కంపెనీలు ఐటీఆర్‌‌ 6 ‌‌ ద్వారా ‘సేల్‌‌ ప్రమోషన్‌‌ వ్యయం’, ‘బహుమతులు’ కింద పన్ను మినహాయింపును క్లయిమ్‌‌ చేశాయని కోర్టు ఫిబ్రవరి 17 న ఇచ్చిన ఆర్డర్‌‌‌‌లో పేర్కొంది.

ఈ ఆర్డర్‌‌‌‌ను ఎన్‌‌ కిరుబకరన్‌‌, పీ వెలమురగన్‌‌తో కూడిన బెంచ్‌‌ ఇచ్చింది. సేల్‌‌ ప్రమోషన్‌‌ ఖర్చులు, లైసెన్స్‌‌ ఖర్చులు ఆదాయపన్ను నుంచి మినహాయించాలని క్లయిమ్‌‌ చేయడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని కోర్టు ఆ ఆర్డర్‌‌‌‌లో పేర్కొంది. డాక్టర్స్‌‌కి నగదు, బహుమతులు ఇవ్వడం కేవలం లంచమివ్వడంతో సమానమని కోర్టు వ్యాఖ్యానించింది.

ఫార్మా కంపెనీలు ఇప్పటికి కూడా డాక్టర్లకు బహుమతులు ఇవ్వడం, ప్రయాణ సదుపాయాలు కల్పించడం, నగదు ఇవ్వడం జరుగుతుందని వ్యాఖ్యానించింది. కంపెనీలు చట్టవిరుద్ధంగా మందుల ధరాల్నయూ పెంచడం కూడా నిజమని పేర్కొంది.

‘సేల్‌‌ ప్రమోషనల్‌‌ వ్యయం’, ‘బహుమతులు’ కింద ఆదాయపన్ను మినహాయింపును క్లయిమ్‌‌ చేసిన కంపెనీలు, ఓవర్‌‌‌‌ ప్రైసింగ్‌‌ చేయడం వలన జరిమానాలు కట్టిన కంపెనీల వివరాలను సమర్పించాలని కోర్టు ఆదాయపన్ను శాఖను ఆదేశించింది. ఫార్మా కంపెనీలు అనైతిక విధానాలను అనుసరిస్తున్నాయని గతంలో కూడా ఆరోపణలొచ్చాయి. పన్ను చెల్లింపులో భాగంగా ఓ ఫార్మా కంపెనీకి, ఐటీ శాఖకు మధ్య విభేదాలు చెలరేగడంతో ఈ వార్తాలొచ్చాయి.

తల్లా పెళ్ళామా..? అనసూయ గేమ్ షో

హాట్ యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ టీవి షోతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ షోతో సంపాదించిన క్రేజ్ తో లోకల్ గ్యాంగ్, ప్రతి రోజు పండగే అనే టీవీ షోలలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు ‘తల్లా పెళ్ళామా’ అనే మరో గేమ్ షోలో కూడా యాంకరింగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబందించిన ఒక వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఈ సరికొత్త షో ఎలా ఉండబోతుంది.. ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుంది..? అన్న‌ది వేచి చూడాలి.

 

https://www.youtube.com/watch?v=YxfoUnebs0Q