Home Blog Page 8615

వైరల్:తాజ్ ముందు ఇవాంకా ఫొటోల మార్ఫింగ్?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటన ముగిసింది. కుటుంబ సమేతంగా భారత్ కి విచ్చేసిన ట్రంప్ మరలా అమెరికాకు తిరిగి ప్రయాణమయ్యారు. అయితే ఈ పర్యటనలో భాగంగా తాజ్ మహల్ ని సందర్శించిన ట్రంప్ కుటుంబం, తాజ్ అందాలకు ముగ్ధులై అక్కడ కొన్ని ఫోటోలు కూడా దిగారు.ఇవాంకా ట్రంప్ కూడా తాజ్ ముందు నిలబడి ఫొటోలకు ఫోజిచ్చారు. ‘తాజ్ మహల్ వైభవం, అందం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది’ అంటూ ఇవాంకా తన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు కూడా చేశారు. దింతో ఆమె ఫాలోవర్లు లైక్ లు కొట్టారు, తాజ్ అందాలను పొగుడుతూ.. కామెంట్స్ చేశారు. ఇలా ఇన్ స్టాగ్రామ్‌ లో పోస్టు చేసిన కొద్దిసేపటికే ఆమె ఫొటోపై కామెంట్ల వర్షం కురిసింది.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆమె ఫోటోలపై కొంతమంది నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె దిగిన ఫోటోలు ఓరినాల్ కాదని, అవి ఫోటో షాప్ లో ఎడిట్ చేసిన ఫోటోలని కామెంట్లు పెట్టారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. తాజ్ మహల్ ముందు ఉన్న వాటర్ ఫుల్ లో నీరు, ఫోటోలో ఇవాంకా ట్రంప్ వెనుక ఉన్న నీరు ఒకేలా లేవు. అదే విధంగా.. ఆమె ఫొటోలో ఉన్న నీరు రెండు రకాలుగా కనిపించాయి. ఇవాంకా ఎడమ చేతి మధ్యలో ఉన్న ప్రాంతంలో కనిపించే నీరు.. ఇరువైపులా ఉన్న నీటి కంటే స్పష్టంగా ఉన్నట్లు కనిపిస్తోంది’

ఇవాంకా ఫొటోను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు.. “ట్రంప్ కుమార్తె ఇవాంకా ఫొటోను ఎడిటింగ్ చేశారు” అంటూ కామెంట్లు పెట్టారు. ‘ఆమె తన నడుమును చిన్నదిగా చేసింది’ అని ఒక వ్యక్తి ట్విట్టర్‌లో కామెంట్ పెట్టాడు. ’ఆమె నడుము చేయి మధ్య నీటిని చూడండి. ఇది పక్కనే ఉన్న నీటి కంటే రంగు ఆకృతి భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తోంది ’ అని మరొకరు ట్వీట్ చేశాడు. పూర్తి పూల్ నీటిని బ్లర్ చేయండి.. లేదా ఇవాంకా నడుము / చేయి అంతరాన్ని క్రమబద్ధీకరించండి.. లేదంటే ఆమె నడుమును ఫొటోషాప్‌ లో ఎడిటింగ్ చేశారని మేము అనుకోవచ్చు’ అని మరొక వ్యక్తి ట్వీట్ చేశాడు.

ఇవాంకా ట్రంప్ ఫోటోలు మాత్రమే ఇలా మార్ఫింగ్ చేశారా లేక ట్రంప్ కుటుంబ ఫోటోలన్ని ఈ రీతిగానే మార్ఫింగ్ చేశారా? అనే అనుమానాలు అనేకమంది నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

కొరటాలపై రాంచరణ్ సీరియస్

చిరంజీవి-152వ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీని ఆగస్టులో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. శరవేగంగా పూర్తి చేసుకుంటున్న సినిమా షూటింగ్లో కొన్ని సీన్లు లీకవుతుండంపై మెగా పవర్ స్టార్ రాంచరణ్ సీరియస్ అయ్యారు. దర్శకుడు కొరటాల శివకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఇక ముందు సినిమాకు సంబంధించిన ఎలాంటి లీకులు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ప్రచారం జరుగుతుంది.

ఇటీవల చిరంజీవికి సంబంధించి కొన్ని సీన్లు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో చిరంజీవి ఇందులో ప్రజా నాట్య కళాకారుడిగా కన్పిస్తాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో సినిమాకు సంబంధించి కథాంశం ముందే లీకైతే అభిమానుల్లో ఉత్సాహం తగ్గుతుందని నిర్మాత రాంచరణ్ భావిస్తున్నారు. అదేవిధంగా చిత్ర టైటిల్ విషయంలోనూ, రాంచరణ్ ఎంట్రీ విషయంలోనూ పలురకాల గాసిప్స్ చక్కర్లు కోడుతుండటంతో కొరటాల శివపై నిర్మాత రాంచరణ్ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఈమేరకు సినిమా షూటింగ్లో దర్శకుడు కొరటాల శివ సెట్స్ లో కొన్ని ఆంక్షలు విధించినట్లు సమాచారం. సినిమా షూటింగ్లో పాల్గొనే నటీనటులతోపాటు, టెక్నిషన్లు, ఇతర సిబ్బంది తమ మొబైల్స్, ల్యాప్ టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోనికి తీసుకురావద్దని ముందు చెబుతున్నారు. సెట్లోనే ఈ పరికరాలను ఉంచుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెల్సింది. ‘బహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’లకు దర్శకుడు రాజమౌళి షూటింగ్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చిరంజీవి-152 విషయంలోనూ అదే ప్లాన్ చేస్తున్నారని తెల్సింది. అయితే ఎవరెన్నీ చర్యలు చేపట్టినా లీకులు మాత్రం అరికట్టడంలో విఫలమవుతూనే ఉన్నారు. కొరటాల శివ ఏమేరకు లీకులను కట్టడి చేయగలడో వేచి చూడాల్సిందే.

Sumanth Ashwin New Movie Opening Photos

ట్రంప్ భారత్ పర్యటన విజయవంతమేనా?

ట్రంప్ భారత పర్యటన విజయవంతమా , విఫలమా అనేది అందరి నోళ్ళల్లో నానుతున్న మాట. ముందుగా ఒక మాట చెప్పాల్సివుంది. రాజకీయ పరిశీలకులు, మేధావులు వారి వ్యాఖ్యానాల్లో ఇచ్చే అభిప్రాయం మెరిట్స్ మీదకన్నా ఇప్పటికే వాళ్ళ మెదడుల్లో మోడీ పై ఏర్పరుచుకున్న అభిప్రాయాన్ని బట్టే వుంటుందికాని జరిగిన చర్చల సారాంశాన్ని బట్టికాదని గుర్తించుకోవాలి. ఇది అక్షరాలా సత్యం. కాబట్టి ఆ మీమాంస లోకి వెళ్లకుండా నేరుగా చర్చల సారాంశాన్ని బట్టి మాట్లాడుకుందాం.

ప్రధానమంత్రి మోడీ, అధ్యక్షుడు ట్రంప్ సంయుక్త ప్రకటనలో మాట్లాడినదాన్నిబట్టి చర్చలు స్థూలంగా సఫలమయ్యాయనే చెప్పొచ్చు. అన్నింటికన్నా ముందుగా చెప్పవలసివస్తే అమెరికా-భారత్ సంబంధాల్ని ఇప్పుడున్న స్థాయి నుంచి ఇంకో మెట్టు పైకి తీసుకెళ్లటం ఆహ్వానించదగిన పరిణామం. ఇవి సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య దిశగా పయనించటం ముదావహం. చైనా భారత ఉపఖండంలో క్రమ క్రమేణా తిష్టవేయటం భారత రక్షణకి ముప్పుగా భావిస్తున్న తరుణంలో అమెరికా సంబంధాల స్థాయిని పెంచటం భారత్ కు ఉపయోగం. దానితోపాటు అత్యంత అధునాతన సాంకేతికత కూడిన హెలికాఫ్టర్లను భారత్ కు విక్రయించటానికి ఒప్పుకోవటం కూడా భారత్ రక్షణలో ముందడుగు వేయటానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అమెరికా రక్షణ రంగం లో ఎవరికీ అందనంత దూరంలో ఉందనేవిషయం. కొన్ని సంవత్సరాల్లో చైనా అమెరికా కంటే పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించే అవకాశాలున్నా రక్షణ రంగంలో మాత్రం సమీప భవిష్యత్తులో అమెరికా దరిదాపుల్లోకి కూడా చైనాతో సహా ఏదేశమూ సరితూగదు. ఇది మనకు కలిసొచ్చే అంశం. ఈ సంబంధాలతో మన రక్షణ వ్యవస్థ బలపడటం దేశప్రయోజనాల రీత్యా హర్షించదగ్గ పరిణామం.

రెండోది, అమెరికాలో ఇప్పటికే భారతీయులు గత రెండు దశాబ్దాలనుంచి పెద్ద సంఖ్యలో స్థిరపడి అన్నిరంగాల్లో రాణించటం చూస్తున్నాం. దానితోపాటు అక్కడనుంచి మన దేశానికి ప్రపంచంలోనే ఎక్కువగా డబ్బులు పంపించటం తెలిసిందే. ఇది మన ఆర్ధిక వ్యవస్థకు ఊతమిస్తుంది. ఈ పర్యటన ఆ సంబంధాల్ని మరింత మెరుగుపరుస్తుందని ఆశిద్దాం.

మూడోది, ఇవి రెండు ప్రజాస్వామ్య దేశాలు కావటం కూడా ముఖ్యమే. అదే ఏ చైనాలోనో , రష్యాలోనో వెళ్లి ఉండటం మనకు ఇబ్బందికరం. అయినా వాళ్ళు రానివ్వరనుకో అది వేరే విషయం. రెండు సమాజాలూ చాలా విషయాల్లో సామీప్యతలు వున్నాయి. రెండూ సెక్యులర్ దేశాలు, బహు జాతుల, మతాల, ఆచారాల, భాషల కలయికలతో నడుస్తున్నవి. మననుంచి వాళ్ళు, వాళ్ళనుంచి మనం ఎన్నో నేర్చుకుంటున్నాం. ఆధునిక సమాజంలో ఈ రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే మానవాళికి మేలుజరుగుతుంది.

నాలుగోది, గత దశాబ్దంలో వాణిజ్యం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి ఈ సంవత్సరం చైనాను దాటి మనకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఎదిగింది. అయితే దీనితోపాటు ఇరుదేశాల ప్రయోజనాల రీత్యా కొత్త వాణిజ్య ఒప్పందం అవసరం ఏర్పడింది. దానికోసం ఇప్పటికే ఎన్నో దఫాలు చర్చలు జరిగినా ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదు. ఈరోజు సంయుక్త ప్రకటనలో మోడీ చెప్పినదాన్నిబట్టి త్వరలో పరిమిత ఒప్పందం కుదిరే అవకాశాలు మెండుగా వున్నాయి. అదేసమయంలో భారీ ఒప్పందంకోసం కూడా ఒకేసారి చర్చలు మొదలవుతాయని కూడా ప్రకటించారు. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. అమెరికా మనకు అతిపెద్ద వాణిజ్యభాగస్వామి మాత్రమే కాదు అతిపెద్ద వాణిజ్య మిగులు వున్న దేశం కూడా. అందుకే భారత్ ఆచి తూచి అడుగులేస్తోంది. త్వరలో ఒప్పందం కుదరటానికి ట్రంప్ పర్యటన దోహదం చేస్తుందని చెప్పొచ్చు.

అదేసమయంలో భారత్ వైపునుంచి కొన్ని విషయాల్లో భయాందోళనలు వున్నాయి. ఇప్పటికే అమెరికా మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ప్రకటించింది. ఇప్పటివరకు చైనా, భారత్ లు అభివృద్ధి చెందే దేశాల కేటగిరీలో వున్నాయి. ఇప్పుడు వాటి కాటగిరీని మార్చటం భారత్ కి దెబ్బ. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఈమార్పుతో మన ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఇప్పటికే భారత్ దీనిపై నిరసన తెలిపింది.
అలాగే మన వాళ్ళు ఎంతోమంది హెచ్ 1 బి , ఎఫ్ 1, ఎల్ 1 వీసాలపై పనిచేస్తున్నారు. ట్రంప్ వచ్చినతరువాత వీటిపై కఠిన నిబంధనలు తీసుకొచ్చాడు. దానితో మన ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే గ్రీన్ కార్డు నిబంధనల్లో దేశవాళీ కోటా ఉండటంతో మన భారతీయులు ఎంతోమంది ఎన్నోయేళ్ల నుంచి వెయిట్ లిస్ట్ లో వున్నారు. ఇదే నిబంధనలు కొనసాగితే మనవాళ్లకు దశాబ్దాలతరబడి గ్రీన్ కార్డు వచ్చే అవకాశం లేదు. దీనిపై ట్రంప్ సానుకూలంగానే వున్నాడు కానీ అమెరికా కాంగ్రెస్ లో మార్పులకోసం చేసే ప్రయత్నాలు సఫలం కావట్లేదు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నందున ఆలోపల మార్పులు జరిగే అవకాశం లేదు. అయినా భారత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి. ఇందులో ఎక్కువ నష్టపోతోంది తెలుగువాళ్లే.

మొత్తం మీద చూస్తే ట్రంప్ పర్యటన విజయవంతమయిందనే చెప్పాలి. ఈ పర్యటనలో జరిగిన ఒప్పందాలకన్నా ముందు ముందు ఇంకా సంబంధాలు మెరుగు పడే అవకాశాలు మెండుగా వున్నాయి. అయితే ఈ సానుకూల ప్రభావాన్ని తగ్గించాలనే కుట్ర మన భూభాగంపైనే జరగటం విచారకరం. దీనికి పాకిస్తాన్ అండదండలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అయినా ఇవేమీ భారత్ పురోభివృధిని ఆపలేవు. త్వరలో భారత్ ప్రపంచ శక్తిగా ఎదగటం ఖాయం.

ఢిల్లీ అల్లర్ల వెనుక దేశద్రోహ కుట్ర?

ఢిల్లీ అల్లర్లు ఆందోళనకరం. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన జరిపేటప్పుడే ఈ అల్లర్లు జరగటం కాకతాళీయం కాదు. ఓ పధకం ప్రకారం కుట్ర పూరితంగానే ఈ అల్లర్లు జరిగినట్లు తెలుస్తుంది. లేకపోతే కరెక్టుగా ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి. కొన్ని వీడియో ల్లో డైరెక్టుగానే నిరసనలు, అల్లర్లు జరిగితేనేగాని భారత్ కు బయటనుంచి పెట్టుబడులు ఆగిపోవని మాట్లాడటం చూసాం. దురదృష్టవశాత్తు ఆ వీడియో చూసిన తర్వాతైనా నిరసనలకు మద్దతిచ్చే రాజకీయ పార్టీలు వాటిని ఖండించి వుండాల్సింది. కానీ అలా జరగలేదు.

నిరసన తెలపటం ప్రజల ప్రాధమిక హక్కు. కానీ ఆ పేరుతో మిగతా వాళ్ళ హక్కులను హరించే పని చేయకూడదు. గత రెండు నెలల నుంచి జరుగుతున్న నిరసనల్లో దేశ వ్యతిరేక స్లోగన్లు ఇవ్వటం పరిపాటయ్యింది. సుప్రీమ్ కోర్ట్ కూడా నిరసనకారులకు ఎంత హక్కు వుందో రోడ్డు బ్లాక్ చేయటం వలన నష్టపోయే వాళ్లకు కూడా అంతే హక్కుఉందని తెలిపింది. అంతవరకూ సర్దుకుందామనుకున్నా నిన్న, ఈరోజు జరుగుతున్న హింసతో కూడిన నిరసనలు ఏ మాత్రం సమర్ధించలేము. రాళ్లు విసరటం అతి పురాతన, అనాగరిక చర్య. దీన్ని ఓ ఆయుధంగా వాడుకోవటం ఇన్నాళ్లనుంచి చెబుతున్న శాంతి కాముక, రాజ్యాంగ బద్ద నిరసన ఎంత బూటకమో అర్ధమవుతుంది. దానితోపాటు అమెరికా అధ్యక్షుడి రాక రోజుని సెలెక్ట్ చేసుకోవటంలో పెద్ద కుట్ర దాగివుంది.

అమెరికా అధ్యక్షుడు రాక తో అంతర్జాతీయ మీడియా భారత్ పై సహజంగానే ఫోకస్ పెడతాయి. ఆ సమయంలో అల్లర్లు చేయగలిగితే ట్రంప్ రాకపై వచ్చే సానుకూల వార్తలతోపాటు భారత్ ప్రతిష్ట కూడా మంటగలపొచ్చని కుట్ర జరిగింది. అమెరికా అధ్యక్షుడి రాకతో విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశాన్ని దెబ్బతీయాలనే లక్ష్యంతోనే ఈ అల్లర్లు చెలరేగాయి. నిరసన ప్రదర్శనల్లో మాట్లాడే కొంత మంది మత పెద్దలు ఈ విషయం బహిరంగంగానే మాట్లాడటం ఈ కుట్రను చెప్పకనే చెపుతున్నాయి. పాకిస్తాన్ ప్రమేయం ఇందులో వుందనేది ప్రభుత్వ వర్గాలు బలంగా నమ్ముతున్నారు. చివరకు ఈరోజు ట్రంప్ పత్రికా విలేఖర్ల సమావేశంలో దీన్నిపనిగట్టుకొని ప్రస్తావించటం వీరి కుట్రను మరొక్కసారి బయటపెట్టింది. ఇప్పుడైనా కాంగ్రెస్ లాంటి జాతీయపార్టీలు ఈ అల్లర్ల పధకాన్ని నిర్ద్వందంగా ఖండించకపోవడం విచారించదగ్గ విషయం. దేశమా పార్టీ ప్రయోజనమా ఏది ముఖ్యం రాహుల్ గాంధీ గారూ ? ఈ కుట్రను కూడా ఖండించకపోతే మిమ్మల్ని పూర్తిగా ప్రజలే ఖండించే రోజు దగ్గర్లో వుంది. ఇప్పటికే ఆ పని చాలా ముందుకు వెళ్ళింది. ముందు ముందు కాంగ్రెస్ ని అటు హిందువులు, ఇటు ముస్లింలు కూడా నమ్మలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని అర్దముచేసుకుంటే మంచిది.

తెరపై గంగూలీ ఇన్నింగ్స్?

ప్రముఖ క్రికెటర్ గంగూలీ బయోపిక్ త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవమెంతోగానీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే బాలీవుడ్లో భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ధోని బయోపిక్ తెరపై అలరించాయి. ప్రస్తుతం బాలీవుడ్లో 1983 ప్రపంచ కప్ ఆధారంగా ‘83’ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.

బాలీవుడ్లో క్రీడాంశాలతో తెరకెక్కించిన మూవీలకు మంచి ఆదరణ లభిస్తుంది. హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్ క్రీడాంశాలతో వచ్చిన మూవీలు బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టాయి. ఇటీవలే సచిన్, ధోని జీవితాధారంగా తెరకెక్కించిన మూవీలు కూడా పర్వాలేదనిపించాయి. దీంతో ప్రస్తుత బీసీసీఐ చీఫ్, మాజీ భారత క్రికెట్ కెప్టెన్ గంగూలీ జీవితాధారంగా సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ మూవీని బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహర్ రూపొందించున్నారని సమాచారం.

ఈ క్రేజీ మూవీని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు నిర్మాత కరణ్ జోహర్ ప్లాన్ చేస్తున్నారు. గంగూలీ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్ని అనుకూలిస్తే త్వరలోనే గంగూలీ ఇన్నింగ్స్ మరోసారి తెరమీద చూడొచ్చు.

జాన్వీ కపూర్‌ డాన్స్.. వీడియో వైరల్

అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ అందంతో పటు నటనతో హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. తొలి చిత్రం ‘ధడక్’ మూవీ తో జాన్వీ అభిమానుల గుండెల్లో చెదరని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్‌ పాన్ ఇండియా మూవీ ‘తఖ్త్‌’లో నటిస్తుంది. విజయ్ దేవరకొండతో కలిసి ‘ఫైటర్’ మూవీ లో జాన్వీ నటిస్తుందనే వార్తలు హల్చల్ చేసాయి. కాని జాన్వీకి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వాళ్ళే ‘ఫైటర్’ సినిమా వదులుకుందని సమాచారం. ప్రస్తుతం ‘ఫైటర్’ మూవీ లో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తుందని చిత్రబృందం ప్రకటించారు.

తాజాగా జాన్వీ కపూర్‌ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ డాన్స్ వీడియోని షేర్ చేసింది. ‘పియా తోసే నైనా లాగిరే’ అనే పాటకు వయ్యారంగా డాన్స్ చేసింది. ఈ వీడియో చూసిన అభిమానులు అచ్చం శ్రీదేవి లానే చేసిందని అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.instagram.com/p/B8-tSpdnDsq/

అమెరికా- భారత్ ల మధ్య భారీ డీల్!


అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యాటనలో భాగంగా ఇరు దేశాల మధ్య వివిధ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌ హౌస్‌ లో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఇరు దేశాధినేతలు మాట్లాడారు.

మొదటగా మాట్లాడిన ప్రధాని మోడీ… మోతెరా స్టేడియంలో ట్రంప్‌కు అపూర్వ స్వాగతం పలికామన్నారు. అహ్మదాబాద్‌ లో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని మోడీ అన్నారు.  21వ శతాబ్దంలో అమెరికా-భారత స్నేహం చాలా ముఖ్యం అని అన్నారు. దేశ భద్రతకు అమెరికా, భారత్‌ మైత్రీ బంధం ఎంతో సాయంగా ఉంటుందని మోడీ అన్నారు. మానవ అక్రమ రవాణా, డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ పై ఉమ్మడి కార్యాచరణ చేస్తున్నామన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ట్రంప్‌ పాలసీలతో ట్రేడ్‌ బంధం బలోపేతం అవుతోందన్నారు. రక్షణ, భద్రత, టెక్నాలజీ అంశాలపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతాయని, ట్రంప్‌ సతీసమేతంగా రావడం ఆనందంగా ఉందన్నారు. రెండు దేశాల మధ్య స్నేహబంధం పెరిగిందని మోడీ అన్నారు.

రక్షణ రంగం బలోపేతం

తర్వాత మాట్లాడిన ట్రంప్.. ఇది మర్చిపోలేని ప్రత్యేకమైన పర్యటన అని, ఇరు దేశాలకు ఇది ఫలవంతమైన పర్యటనగా మిగులుతుందని అన్నారు. రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదం నుంచి రెండు దేశాల ప్రజలకు భద్రత కల్పించే అంశంపై చర్చించామని, భారత్, అమెరికా రక్షణ సహకారాన్ని మరింత విస్తరించుకునే విధంగా పరస్పర సహకారం ఉంటుందని అన్నారు. రెండు దేశాల మధ్య 21,500 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఒప్పందాలు జరిగాయని ట్రంప్ అన్నారు. వీటిలో అపాచీ, ఎంహెచ్ 60 రోమియో హెలికాటర్లు లాంటివి ఉన్నాయి ట్రంప్ చెప్పారు.

చిరు మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి-152వ సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. గతేడాది దసరా రోజున ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. అయితే కొన్నినెలలు గ్యాప్ తర్వాత ఇటీవలే మెగాస్టార్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ తొలుత 2020 దసరా కానుకగా విడుదల చేయాలనుకున్నారు. ఇటీవల ‘సరిలేరునికెవ్వరు’ ప్రీరిలీజ్ ఫంక్షన్లో చిరంజీవికి కొరటాల శివ 90రోజుల్లో మూవీ కాంప్లీట్ చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఈ మూవీని వీలైనంత త్వరగా కాంప్లీట్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.

ఈ మూవీలో మెగాస్టార్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవిని మునుపటి మెగాస్టార్ల చూపేందుకు కొరటాల శివ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మెగాస్టార్ అభిమానులకు దృష్టిలో ఉంచుకొని సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్ అన్ని అంశాలను టచ్ చేస్తూ సామాజిక అంశంతో మూవీని తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవికి జోడీగా సీనియర్ నటి త్రిష నటిస్తుంది. గతంలో మెగాస్టార్ నటించిన స్టాలీన్ మూవీలో త్రిష నటించింది. వీరిద్దరి కాంబినేషన్లలో ఇది రెండో చిత్రం. చిరంజీవి-రెజీనాలపై ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ రామోజీ ఫిల్మ్ సీటీలో షూట్ చేశారు. తెలుగమ్మాయి ఈషారెబ్బా ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

ఇప్పటికే షూటింగ్ 70శాతం మేర పూర్తయినట్లు తెలుస్తోంది. చిరంజీవి, ఇతర నటీనటుల పాత్రలకు షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో రాంచరణ్ షూటింగ్లో బీజీగా ఉండటంతో ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. రాంచరణ్ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు లేదా అల్లు అర్జున్ నటిస్తారని ప్రచారం జరుగుతుంది. వీరిలో ఎవరో ఒకరు ఫైనల్ అయ్యాక చిత్రం తుదిదశకు చేరుకోనుంది. ఆ తర్వాత పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోనుంది. ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది.

అన్ని అనునున్నట్లు జరిగితే చిరంజీవి పుట్టిన రోజుకు ఒక రోజు ముందుగానే అంటే ఆగస్టు 21న సినిమా ప్రేక్షకుల ముదుకు రావడం ఖాయంగా కన్పిస్తుంది.

‘మిషన్‌‌‌‌ కాకతీయ’ కు మంగళం

తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చెప్పుకొంటూ వస్తున్న `మిషన్ కాకతీయ’ పథకంకు ఇక మంగళం పాడారు. ఈ పధకం కింద ఇకపై పనులేవీ చేపట్టవద్దని నిర్ణయించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్‌‌‌‌ మౌఖికంగా ఆదేశాలిచ్చినట్టు తెలుస్తున్నది.

చెరువులు, కుంటల్లో పూడిక తీసి నీటి నిల్వలు పెంచాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ పధకం రాష్ట్రంలో కొంత మేర ప్రయోజనం కలిగించింది. రానురాను నిధుల విడుదలలో జాప్యం కారణంగా కొన్నాళ్లు నత్తనడకగా నడుస్తుండగా, ఇప్పుడు మొత్తంగా మంగళం పాడారు.

ప్రస్తుత నిర్ణయంతో వివిధ దశల్లో ఉన్న 5,553 చెరువుల పనులు ఆగిపోయాయని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో 46,531 చెరువులు, కుంటలున్నట్టు 2014లో నిర్వహించిన మైనర్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ శాఖ చేపట్టిన లెక్కల్లో తేలింది. మిషన్‌‌‌‌ కాకతీయ పథకంకు రూపకల్పన చేసినప్పుడు ఏటా 9,300 చెరువుల్ని బాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఐదేళ్లలో మొత్తం చెరువులు, కుంటల్లో పూడిక తీసి, కట్టలు, తూములు బలోపేతం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే పధకం అమలుకు వచ్చేసరికి కేవలం 27,625 చెరువుల పనులకే పరిపాలనా ఆమోదం ఇచ్చారు. వాటిని 4 విడతల్లో బాగు చేస్తామని చెప్పారు. వాటిలో 26,989 చెరువులు బాగు చేసేందుకు రూ.9,125 కోట్లు కేటాయించారు.

మిషన్‌‌‌‌ కాకతీయ మొదటి డతలో మంజూరుఅయిన చెరువుల పనులు దాదాపుగా పూర్తి పూర్తి య్యాయి. ఈ విడతలో శాంక్షన్‌‌‌‌ ఇచ్చిన వాటిలో కేవలం 20 చెరువుల పనులే పెండింగ్‌‌‌‌ ఉన్నాయి.రెండో విడతలో అత్యధిక చెరువుల పనులకు అనుమతులు ఇచ్చినా ఇంకా వెయ్యికిపైగా చెరువుల పనులు పెండింగ్‌‌‌‌లోనే ఉన్నాయి.

మూడో విడతకు వచ్చే సరికే పనుల్లో వేగం తగ్గింది. నిధులు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం చూపడంతో కేవలం 65 శాతం పనులే పూర్తి అయ్యాయి. నాలుగో విడతకు వచ్చేసరికి పధకం పూర్తిగా పక్కకుపోయింది. ఈ విడతలో కేవలం 40 శాతం పనులే చేశారు.

మొత్తంగా అన్ని విడతల్లో కలిపి మంజూరు చేసిన నిధుల్లో సగం కూడా ఖర్చు చేయలేదు. ఫిబ్రవరి మొదటి వారం వరకు మిషన్‌‌‌‌ కాకతీయలో రూ.4,352.18 కోట్ల పనులు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇందులో రూ.450 కోట్ల బిల్లులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి.

నాలుగు విడతల్లో మంజూరు చేసిన వాటిలో 5,553 చెరువులు, కుంటల పనులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. నిధుల కొరత ఉందని, ఇక వాటి జోలికెళ్లొద్దని అధికారులను సీఎం కేసీఆర్‌‌‌‌ ఆదేశించినట్టు తెలిసింది.

ఎక్కడైనా పది శాతం, అంతకన్నా కొంచెం అటుఇటుగా పనులు పెండింగ్‌‌‌‌లో ఉంటే ఈ ఎండాకాలంలో పూర్తి చేయాలని, అంతకుమించి పనులున్న చెరువులను వదిలేయాలని సూచించినట్టు సమాచారం. కేవలం 100లోపు చెరువుల్లోనే పది శాతంలోపు పనులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని, వాటిని ఈ ఎండాకాలంలో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇళ్ల స్థలాలకు నిరుపేదల భూములా!


ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందించేందుకు నిరుపేదల భూములను బలవంతంగా లొక్కొనే ప్రయత్నాలు జరుగుతూ ఉండడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం పేదల పొట్టగొట్టేలా వ్యవహరిస్తోందనే విమర్శలు చెలరేగుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా అసైన్‌మెంట్‌, ప్రభుత్వ పోరంబోకు భూములను సుదీర్ఘకాలంగా సాగు చేసుకుంటూ పట్టాల కోసం ఎదురుచూస్తోన్న పేదల భూములను దౌర్జన్యంగా, చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకుంటున్నారనే ఆరోపణలు చెలరేగుతున్నాయి. ఈ విషయమై పలుచోట్ల అధికార యంత్రాంగం ప్రతి చోటా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నది.

2013 భూసేకరణ చట్టం ప్రకారం అన్ని భూములకూ పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసి ఉంది. దల భూములు, అసైన్‌మెంట్‌ భూముల జోలికి వెళ్లే అవకాశం లేదని ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించినా అధికారులు ఆ విధంగా చేస్తుండటం గమనార్హం. కోర్టు తీర్పులను పెడచెవిన పెట్టి, భూములు లాక్కోవాలని చూస్తే ఉద్యమిస్తామని ప్రతిపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు.

అప్పులు పేరుకుపోయి ఉన్న రాష్ట్రంలో ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ అసాధ్యమని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి పునరాలోచించాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు సూచించారు. సిఎంకు సరైన సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ సలహాదారులకు ఉన్నప్పటికీ వారు డూడూ బసవన్నల్లా వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు.

కాగా, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరం బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన భూములను ఇళ్లస్థలాలుగా కేటాయించే నిర్ణయం పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ జారీ చేసిన ప్రొసీడింగ్‌ను నిలుపుదల చేయాలని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ పంపారు.

తెలుగు యూనివర్సిటీకి చెందిన 20 ఎకరాల భూములను ఇళ్లస్థలాల కోసం సేకరించాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి ఈనెల 17న ప్రొసీడింగ్స్‌ను జారీ చేశారు.యూనివర్సిటీ భూములను ఇళ్లసలాల సేకరణకు కుదరదని ఆ లేఖలో అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన సెక్షన్‌ 75 సెంట్రల్‌ యాక్ట్‌ 6/2014 ప్రకారం వీలు కాదని స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఉమ్మడిగా ఉన్న ఐదు తెలుగు యూనివర్సిటీ క్యాంపస్‌ల పంపకాలు జరగలేదని పేర్కొన్నారు. వర్సిటీ విభజన జరగకుండా ఆ యూనివర్సిటీ భూములను సేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు.

వామ్మో..’అరణ్య’ కోసం ‘రానా’ ఇన్ని కిలోలు తగ్గాడా..!

రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న ‘అరణ్య’ చిత్రం 2020లోనే అతిపెద్ద అడ్వెంచర్ డ్రామా. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ఒకటి. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా మూడు భాషల్లో విడుదలవుతుండగా, మూడింటిలోనూ రానా హీరోగా నటిస్తున్నారు. తెలుగు వెర్షన్ ‘అరణ్య’, తమిళ వెర్షన్ ‘కాడన్’లో రానాతో పాటు విష్ణు విశాల్, హిందీ వెర్షన్ ‘హాథీ మేరీ సాథీ’లో పుల్కిత్ సామ్రాట్ నటిస్తున్నారు. మరో రెండు ఆసక్తికర పాత్రల్ని శ్రియా పిల్గావోంకర్, జోయా హుస్సేన్ చేస్తున్నారు.

కాగా ఈ యాక్షన్ మూవీలో ఇదివరకెన్నడూ కనిపించని కొత్త అవతారంలో రానా దగ్గుబాటి కనిపిస్తున్నాడంటూ ఇటు సినిమా వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో చర్చలు నడుస్తున్నాయి. రానా ఫస్ట్ లుక్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, అప్పట్నుంచే ఆయన అభిమానులు దాని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక సోషల్ మీడియాలో స్పందనకు అంతు లేదు. 35 ఏళ్ల రానా ఈ సినిమాలో బాణదేవ్ అనే అడవి మనిషి పాత్రలో కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ఆయన చాలా కఠినమైన ఆహార నియమాల్ని పాటించడమే కాకుండా, కఠిన శిక్షణతో 30 కిలోల బరువు తగ్గారు. సినిమా అంతా ఆయన బాగా పెరిగిన గడ్డం, గ్రే హెయిర్, పైకి వంచిన భుజంతో కనిపిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే, ఆ పాత్ర కోసం రానాతో పలు రకాల లుక్స్ ప్రయత్నించారు దర్శకనిర్మాతలు. వాటిలో దేన్ని ఫైనల్ చేశారో మొదటిరోజు షూటింగ్ లో పాల్గొనేదాకా ఆయనకు కూడా వారు చెప్పలేదు.

ఆ పాత్ర కోసం తన రూపాన్ని ఎలా మార్చుకున్నదీ రానా వెల్లడించారు. “డైరెక్టర్ ప్రభు సాల్మన్ నా పాత్రకు సంబంధించి ప్రతిదీ వాస్తవికంగా, సహజంగా ఉండాలని భావించారు. ఎప్పుడూ భారీకాయంతో, దృఢంగా ఉండాలనుకొనే నాకు ఈ స్థాయిలో బరువుతగ్గడం అనేది చాలా క్లిష్టమైన పని. బాణదేవ్ క్యారెక్టర్ కోసం సన్నగా మారడానికి తీవ్రమైన ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నా. అది నాకొక వండర్ఫుల్ లెర్నింగ్ ఎక్స్ పీరియెన్స్” అని ఆయన తెలిపారు.

ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ సినిమా తెలుగులో ‘అరణ్య’గా, తమిళంలో ‘కాడన్’గా, హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా 2020 ఏప్రిల్ 2 గురువారం విడుదలకు సిద్ధమవుతోంది. అస్సాంలోని కజిరంగా ప్రాంతంలో ఉన్న ఏనుగుల ఆవాసాన్ని మనుషులు అక్రమంగా కబ్జా చేసిన దురదృష్టకర ఘటనను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రభు సాల్మన్ రూపొందించారు. ఈ చిత్రంలో తన జీవితాన్ని ఎక్కువగా అడవికే అంకితం చేసి, అక్కడ నివసించే జంతువులను కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ఉండే బాణదేవ్ పాత్రలో రానా మనకు కనిపించబోతున్నారు. వన్యప్రాణుల్నీ, ప్రకృతినీ కాపాడుకోవడానికి జరిగే ఘర్షణలో ఆయన ఏవిధంగా భాగమవుతాడో ఈ సినిమాలో మనం చూడనున్నాం.

ప్రభుత్వ పాఠశాలలో ట్రంప్ సతీమణి సందడి


భారత్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్ దంపతులు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నారు. ఈ సందర్బంగా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో ట్రంప్ సతీమణి మెలానియా సందడి చేశారు. దక్షిణ మోతీ బాగ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘హ్యాపీనెస్ క్లాస్’ సమావేశానికి ఆమె హాజరయ్యారు.

అమెరికా ప్రథమ మహిళకు స్వాగతం పలికేందుకు సర్వోదయ కో-ఎడ్యుకేషనల్ సీనియర్ సెకండరీ స్కూల్‌ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మెలానియా ట్రంప్‌ కు స్వాగతం పలికేందుకు పాఠశాల విద్యార్థులు ప్రకాశవంతమైన రంగు, రంగుల చీరలు, ‘ఘగ్రా-చోలి’ వంటి సంప్రదాయ దుస్తులను ధరించారు. వారిలో కొందరు బ్యాగ్‌ పైపులు మరియు ఇతర సంగీత వాయిద్యాలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు.

ఆమె సందర్శించిన మొదటి తరగతి గది పెయింటింగ్స్‌తో అలంకరించబడింది మరియు “పుస్తకాల నిధిలోకి స్వాగతం ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.”అని అక్కడున్న బోర్డు పై రాసి ఉంది.

మెలానియా మరొక తరగతికి వెళ్లారు. అక్కడ బోర్డు మీద “మా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ ను మా హ్యాపీ వరల్డ్‌కు స్వాగతిస్తున్నాము” – మరియు చెట్ల పెయింటింగ్‌ కు “కృతజ్ఞతా గోడ”(Gratitude Wall) అని పేరు పెట్టారు. గేట్లు కూడా వివిధ చిత్రాలతో అలంకరించబడ్డాయి మరియు వాటిపై “వెల్‌కమ్ టు హ్యాపీనెస్ క్లాస్” అనే పదాలు ఉన్నాయి.

ఆ తరవాత మెలానియా పాఠశాలలో ‘హ్యాపీనెస్ క్లాస్‌’లకు హాజరయ్యారు, ఇందులో భాగంగా విద్యార్థులకు ధ్యానం, వీధి నాటకాలు, పిల్లలలో ఆందోళన మరియు ఒత్తిడి స్థాయిలను తగ్గించే లక్ష్యంతో ప్రాథమిక విధేయత వంటి వివిధ కార్యక్రమాలు నేర్పుతారు.

అమెరికా నుండి తమ అతిథిని అలరించడానికి బాలీవుడ్ సంగీతానికి నృత్యం చేసే పిల్లలతో ఆమె పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ విధంగా పాఠశాల విద్యార్థులతో మెలానియా ట్రంప్ తన సెషన్‌ ను పూర్తిగా ఆనందిస్తున్నట్లు అనిపించింది.

మెలానియా ట్రంప్‌ రాకముందే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమెను స్వాగతిస్తూ.. ఒక ట్వీట్ చేశారు. “ఈ రోజు మా ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ఢిల్లీ వాసులకు గొప్ప రోజు. ఎందుకంటే మా పాఠశాలలో “హ్యాపీనెస్ క్లాస్” కి అమెరికా ప్రథమ మహిళ(మెలానియా ట్రంప్‌) హాజరవుతారు. శతాబ్దాలుగా, భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మికతను నేర్పింది. ఆమె మా పాఠశాల నుండి ఆనందం యొక్క సందేశాన్ని తిరిగి తీసుకువెళ్లనుంది అని చెప్పడానికి నేను సంతోషితున్నాను” అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

‘హ్యాపీనెస్ క్లాస్’ ను 2018 లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ధ్యానం, వీధి నాటకాలు, ప్రాథమిక విధేయత మరియు పిల్లలలో ఆందోళన మరియు ఒత్తిడి స్థాయిలను తగ్గించే లక్ష్యంతో సహా వివిధ కార్యకలాపాలు నేర్పుతారు.

Bheeshma Movie Successmeet Photos

Rashmika Latest Glamorous Pics

హిట్ మూవీ నుండి స్నీక్ పీక్ వీడియో విడుద‌ల‌

ఇప్పటికే విడుదలైన హిట్ సినిమా పోస్ట‌ర్స్‌, టీజ‌ర్,ట్రైలర్ ప్రేక్ష‌కుల‌కి మంచి థ్రిల్ క‌లిగించాయి. తాజాగా ఈ చిత్ర బృందం నాలుగున్న‌ర నిమిషాల స్నీక్ పీక్ వీడియో విడుద‌ల చేశారు. ఇక ఈ వీడియో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచుతుంది. హత్య చేసి పొదల్లో పాతిపెట్టిన మహిళ మృత దేహాన్ని విశ్వక్ సేన్ చాలా చాకచక్యంగా కనిపెడతాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది.ఈ చిత్రంలో ప్రీతీ అని ఒక మిస్సింగ్ అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తుంది.