
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు రాష్ట్రపతి భవన్ లో ఇచ్చిన విందుకు దేశంలోని పలు రాష్ట్రాల నుండి వివిధ ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందింది. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఆహ్వానం అందుకున్నారు. కానీ, ఏపీ సీఎం జగన్ కి మాత్రం ఆహ్వానం అందలేదు. దింతో రాజకీయాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జగన్ పై సెటైర్లు వేశారు.
ఇదే విషయమై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు కడుపు మంటతో సీఎం జగన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఆయనే తెలివైనవారు.. మిగిలిన వారు అమయాకులు అని చంద్రబాబు అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీన్ పట్నాయక్ నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినా ఆయనకు ఆహ్వానం ఎందుకు అందలేదని ప్రశ్నించారు బొత్స. బీజేపీ వాళ్ల సమీకరణలు ఆలోచనలు వాళ్లకు ఉంటాయని.. రాష్ట్రాల్లో ఎవరికైతే బలమైన నాయకత్వం ఉన్నవాళ్లను పిలవలేదని అన్నారు మంత్రి. దేశంలో బలమైన నాయకుడు జగన్.. అందుకే జగన్ ని ట్రంప్ వస్తే ఆహ్వానించలేదు అని మేం అనుకుంటున్నాం అని బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.