అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా భారత్ ప్రభుత్వం అత్యుత్సాహం చూపిందా అనే అనుమానం కలుగుతున్నది. కేవలం ఐదు నెలల క్రితమే అమెరికాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సంబంధాల గురించి సవివరంగా సమాలోచనలు జరిపారు. అటువంటప్పుడు అంత తక్కువ వ్యవధిలో ట్రంప్ ఇక్కడకు రావలసిన అవసరం లేదు.
వాస్తవానికి తాను అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తర్వాత రావాలి అనుకొంటే, ఇప్పుడే రమ్మనమని మోదీ కోరాడని, అందుకే వచ్చానని ట్రంప్ స్వయంగా చెప్పడం గమనార్హం. సాధారణంగా అమెరికా అంటేనే వ్యాపారం. వాణిజ్య ప్రయోజనం లేకుండా ఏమీ చేయరు. భారీ వాణిజ్య ప్రతినిధి వర్గాలు లేకుండా అమెరికా అద్యక్షులు ఏ దేశానికి కూడా వెళ్లారు. కానీ బహుశా తొలిసారి ట్రంప్ సదా, సీదాగా భారత్ కు వచ్చారు.
పర్యటనకు ముందే తాము భారత్ తో వాణిజ్యం ఒప్పందం ఏమీ ఇప్పుడే చేసుకోబోవడం లేదని కూడా చెప్పారు కూడా. ఐదు గంటల పాటు ప్రధాని మోదీతో జరిపిన ద్వైపాక్షిక సమావేశంలో సహితం రూ 21,000 కోట్ల విలువ గల యుద్ధ విమానాల సరఫరా మించి నిర్ధిష్టమైన ఒప్పందం అంటూ లేదు. ఇంత చిన్న ఒప్పందం కోసం స్వయంగా అమెరికా అధ్యక్షుడు రావలసిన అవసరం లేదు.
రాక, పోకలకు 36 గంటల సేపు ప్రయాణం చేసిన, ట్రంప్ దంపతులు భారత్ 35 గంటలకు మించి లేరు. ముందురోజు అహ్మదాబాద్ ఎందుకు వచ్చారో తెలియదు. అక్కడ మోదీ బలప్రదర్శనగా ఏర్పాటు చేసిన `నమస్తే ట్రంప్’ లో హాజరు కావడానికి వచ్చారు. ఈ సందర్భంగా శృతిమించి ఆయన మోదీని పొగడ్తలతో నింపేశారు. బిజెపి నాయకులు కూడా ఎవ్వరు మోదీని అంతగా పొగిడి ఉండరు.
ఈ విషంగా ఒక విదేశీ అధ్యక్షుడికి ఆ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బహిరంగ సభను ఏర్పాటు చేయవలసిన అవసరం ఏముంది? గత సెప్టెంబర్ లో మోదీ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొనడంతో, అంతుకు ప్రతిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెబుతున్నారు.
అయితే అమెరికాలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రంప్ ఒక అతిధిగా పాల్గొన్నారు గాని, ఆ కార్యక్రమ నిర్వహణలో అమెరికా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రభుత్వం నుండి ఒక్క డాలర్ కూడా ఖర్చు పెట్టలేదు. పైగా అమెరికా ప్రజలు కొద్దీ ఏమీ ఖర్చు పెట్టలేదు. అటువంటిది ట్రంప్ రాక సందర్భంగా ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం రాజకీయ ఉద్దేశ్యాలతో తప్ప దౌత్యపరంగా ఎటువంటి సంబంధం లేని అంశమని భావించ వలసి ఉంటుంది.
ట్రంప్ అంటే నే పక్కా వ్యాపార వేత్త. ఆయనకు ప్రజాజీవనంలో ఎటువంటి సంబంధం లేదు. రాజకీయ, నైతిక విలువలు కూడా ఆయనకు లేవు. అటువంటి ఆయనను ప్రత్యేకంగా సబర్మతి ఆశ్రయంకు తీసుకు వెళ్లడం, అక్కడ సందర్శకుల పుస్తకంలో గాంధీ పేరును కూడా ఆయన ప్రస్తావించక పోవడం చూస్తే భారత ప్రభుత్వమే నవ్వుల పాలయిన్నట్లు ఉంది.
ఇంకా బరాక్ ఒబామా వంటి వారిని సబర్మతి ఆశ్రయంకు తీసుకు వచ్చినా ఒక అర్ధం ఉంటుంది. ఆయన స్వయంగా సామజిక జీవనంలో క్రియాశీలకంగా పాల్గొన్నవారే కాకుండా, తాను ఈ స్థితికి రావడానికి మహాత్మ గాంధీ అని సగర్వంగా చెప్పుకున్నారు.
చాలామంది జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో భారత సంతతి ఓటర్ల మద్దతు ట్రంప్ కు లభింప చేసేందుకు మోదీ `నమస్తే ట్రంప్’ బహిరంగ సభ ఏర్పాటు చేసారని చెబుతున్నారు. అయితే అక్కడున్న భారతీయులు సామజిక ప్రభావం చూపే కీలక స్థానాలలో ఉన్నప్పటికీ మొత్తం ఓటర్లలో 1 శాతం మాత్రమే ఉన్నారు.
వారిలో 70 శాతం డెమోక్రాటిక్ పార్టీ ఓటర్లు. వారు ట్రంప్ కు అనుకూలంగా మారే అవకాశం లేదు. పైగా వీసాల విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న కఠిన ధోరణి కారణంగా ఈ పర్యాయం మరింత ఎక్కువ మంది భారత సంతతి వారు ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం లేకపోలేదు.
తనను ఒక అంతర్జాతీయ నాయకుడిగా స్వదేశంలో గుర్తింపు కోసం మొదటి నుండి తంటాలు పడుతున్న మోదీ తన మెహర్భానీ చూపించుకోవడం కోసమే ఈ బల ప్రదర్శనకు దిగిన్నట్లు భావించ వలసి వస్తుంది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Namaste trump with govt expenses
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com