Home Blog Page 8610

బాలీవుడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీలో మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ లో ఉన్నాడు. మహేష్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నాడట, దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే భారీ పాన్ ఇండియా మల్టీ స్టారర్ మూవీ లో మహేష్ నటిస్తున్నడనే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీ లో హల్చల్ చేస్తుంది.

బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలా నుంచి మహేష్ కు భారీ ఆఫర్ వచ్చినట్టుగా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఇటీవల ఓ కంపెనీ యాడ్ కోసం బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో కలిసి మహేశ్ నటించారు. ఈ యాడ్ షూటింగ్ ముంబైలో జరుగుతుండగా, అక్కడికి వచ్చిన సాజిద్, ఇరువురు కధానాయకులతో సంప్రదింపులు జరిపారట. మహేష్ బాబు, రణవీర్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఒకవేళ ఈ  క్రేజీ కాంబినేషన్ నిజమైతే గనుక అభిమానులకు పండుగే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

గతంలో మహేష్ బాబు పలుమార్లు బాలీవుడ్ ఎంట్రీ పై స్పష్టత ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ వార్త పై మహేష్ నుంచి క్లారిటీ రావల్సివుంది.

డీసీసీబీ చైర్మన్ ఎన్నికల్లో మంత్రులకు షాక్

తెలంగాణలో ఏకగ్రీవంగా జరిగిన డీసీసీబీ చైర్మన్ ఎన్నికల్లో మంత్రులకు, సీనియర్ నేతలకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు షాక్ ఇచ్చారు. పార్టీలో బలమైన నాయకత్వం ఏర్పడకుండా, తన కొడుకు కేటీఆర్ ఆధిపత్యం కొనసాగేందుకు ఈ సందర్భంగా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తున్నది. అందుకనే పలు జిల్లాల్లో బలమైన నాయకులు, మంత్రులు సూచించిన వారికి కాకుండా అనూహ్యమైన పేర్లను తెరపైకి తెచ్చారు.

చైర్మన్ ఎన్నికపై పార్టీ పెద్దలు ముందుగా ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. వారి అభిప్రాయం మేరకు ఎంపిక జరుగుతుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. అభ్యర్థుల పేర్లను సీల్డ్ కవర్‌లో పెట్టి అబ్జర్వర్ల చేతికిచ్చారు.

రాత్రికి రాత్రే జిల్లాలకు వెళ్లిన అబ్జర్వర్లు.. మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో సీల్ట్ కవర్స్‌ తెరవగానే, వాటిల్లో ఉన్న పేర్లు చూసి కొందరు మంత్రులు కంగుతిన్నారు. తమ ఆధిపత్యానికి కావాలని చెక్ పెడుతున్నారని వారు గ్రహించారు.

నల్గొండ జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతలైన మంత్రి జగదీశ్ రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లకు షాక్ ఇచ్చారు. ఇప్పటికే అసెంబ్లీ విప్ గా ఉన్న ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత భర్త మహేందర్ రెడ్డికి డీసీసీబీ చైర్మన్ పదవి దక్కింది .

రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవిని తమ బంధువైన కిష్టారెడ్డికి ఇప్పించుకునేందుకు మంత్రి సబితారెడ్డి చివరి నిమిషం వరకు లాబీయింగ్ చేశారు. కాని కేటీఆర్ అనుచరుడైన మనోహర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో డీసీసీబీ చైర్మన్ పదవిని తన అనుచరుడు ఎం.విష్ణువర్థన్ రెడ్డికి కట్టబెట్టేందుకు మంత్రి నిరంజన్ ప్రయత్నించారు. కానీ మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించిన మైనారిటీ నేత నిజాం పాషాను ఈ పదవి వరించింది.

నిజామాబాద్ లో సహితం మంత్రి సంతోష్ రెడ్డి అభ్యర్థిని కాదని డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కొడుకు భాస్కర్ రెడ్డికి ఇచ్చారు.

మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా తన భర్తకు అవకాశం ఇవ్వాలని మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కేబినెట్‌లోకి తీసుకోలేదని దానికి ప్రతిగా తన భర్తకు చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే తాజా మాజీ డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న చిట్టి దేవేందర్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చారు.

వరంగల్ డీసీసీబీ చైర్మన్‌గా మార్నేని రవీందర్ రావు ఎంపికను మంత్రి ఎర్రబెల్లి అయిష్టంగానే ఒప్పుకున్నట్టు పార్టీ నేతలు చెపుతున్నారు.

ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పదవిని తన అనుచరుడైన తుళ్లూరు బ్రహ్మయ్యకు ఇప్పించేందుకు ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రయత్నించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడిగా ఉన్న మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. వీరిద్దరిని కాదని, మరి మంత్రి అజయ్ బలపరచిన బీసీ కులానికి చెందిన కూరాకుల నాగభూమయ్య ను ఎంపిక చేశారు.

దటీజ్ ఉపాసన కొణిదెల.. పేదలకోసం..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల సోషల్ సర్వీస్ గురించి సోషల్ మీడియా ద్వారా ప్రజలను చైతన్య పరుస్తుంటారు. తాజాగా పేదలకోసం ఉపాసన ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు

మనం మన కోసమే కాకుండా జనం కోసం కూడా ఆలోచించాలంటున్నారు ఉపాసన. మన జ్ఞాపకాలతో ముడిపడనివి, వాడేసిన వస్తువులు, దుస్తులు ఏమైనా ఉంటే వాటిని పేదలకు ఇచ్చే ఏర్పాటు చేయాలంటున్నారామె.

తన ఇంట్లో వాడకం మొదలుపెట్టి 10 నెలలు దాటిన అలాంటి వస్తువులను జనం కోసం వినియోగించేందుకు సిద్ధమవ్వాలంటూ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. ‘దటీజ్ ఉపాసన’
https://www.instagram.com/p/B9JszaqlwoY/

ప్రియాంక రాజ్యసభ సీట్… కమల్ నాథ్ ఎత్తుగడ!

ఈ నెలలో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాను రాజ్యసభకు పంపనున్నట్లు విశేష ప్రచారం జరిగింది. అయితే, ఇదంతా తన రాజకీయ ప్రత్యర్ధులకు రాజ్యసభ సీట్ ఇవ్వకుండా చేయడం కోసం మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ వేసిన ఎత్తుగడగా తెలుస్తున్నది.

ఇప్పటికే సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యులుగా ఉన్నారు. అటువంటప్పుడు అదే కుటుంభం నుండి మరొకరిని రాజ్యసభకు పంపడం సాధ్యం కాకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పైగా, తమ కుటుంభం సభ్యులకు పార్టీ సీట్లు ఇవ్వాలని వత్తిడి తేవద్దని రాహుల్ గాంధీ చెబుతూనే ఉన్నారు.

ఈ నెలలో జరిగే రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ తొమ్మిది సీట్లు గెల్చుకొనే అవకాశం ఉంది. ప్రియాంక వాద్రా పేరును తెరపైకి తీసుకు వచ్చింది మధ్యప్రదేశ్ మంత్రి సజ్జన్ సింగ్ వర్మ కావడం గమనార్హం. వర్మ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కు సన్నిహితుడు.

కమలనాథ్ కు నిద్రలేకుండా చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా – ఇద్దరు రాజ్యసభకు వెళ్లాలని అనుకొంటున్నారు. వారిద్దరూ గత లోక్ సభ ఎన్నికలలో ఓటమి చెందారు. అయితే వారిద్దరిని రాజ్యసభకు పంపడం కమల్ నాథ్ కు ఇష్టం లేదు. అందుకనే ప్రింయంకాను మధ్యప్రదేశ్ కు వచ్చి రాజ్యసభకు పోటీ చేయమని చెబుతున్నారు.

అమెరికా-తాలిబన్ల మధ్య చారిత్రక శాంతి ఒప్పందం!

నిత్యం బాంబులు, తుపాకుల మోతలతో గత 19 ఏళ్లుగా మొత్తం దక్షిణ ఆసియాలో నిప్పుటి కుంపటి వలే అగ్గి రాజేస్తున్న ఆఫ్ఘానిస్తాన్ లో ప్రశాంతత నెలకొనడం కోసం అమెరికా, బలిబాన్ల మధ్య చారిత్రక శాంతి ఒప్పందం జరిగింది. ఖతర్‌లోని దోహాలో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి జల్మీ ఖాలిల్జాద్‌, తాలిబన్ల ప్రతినిధి ముల్లా బరదర్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం ప్రకారం తాలిబన్లు ఉగ్రకార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలి. తమ ప్రాంతాల్లో ఇతర సంస్థల ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వరాదు. మరోవైపు అమెరికా, దాని మిత్రదేశాలు 14 నెలల్లోగా ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి పూర్తిగా తన బలగాలను ఉపసంహరిస్తాయి. తొలిదశగా అమెరికా 135 రోజుల్లో 8,600 మందిని వెనక్కి రప్పిస్తుంది.

అయితే.. ఈ ఒప్పందం అమలుకావాలంటే తాలిబన్లు, ఆఫ్ఘన్‌ ప్రభుత్వం మధ్య ఈ నెల 10న జరిగే చర్చలు కీలకం కానున్నాయి. వీరి మధ్య రాజకీయ ఒప్పందం కుదిరితే యుద్ధం ముగుస్తుంది. ఈ నెల 10న నార్వే రాజధాని ఓస్లోలో ఆఫ్ఘన్‌ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలు జరుగనున్నాయి.

ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరికి నమ్మ కం కుదిరేలా బందీలను విడుదల చేయనున్నారు. ప్రభుత్వం ఐదువేల మంది తాలిబన్లను విడుదల చేస్తుండగా, తాలిబన్లు వెయ్యి మంది ఆఫ్ఘన్‌ సైనికులకు విముక్తి కల్పించనున్నారు. మరోవైపు తాలిబన్లు శనివారం నుంచి దేశవ్యాప్తంగా సైనిక కార్యకలాపాలను నిలిపివేశారు.

విదేశాంగ మంత్రి మైక్‌పాంపియో ఈ సందర్భంగా మాట్లాడుతూ తాలిబన్లు మాట నిలబెట్టుకోవాలని, ఆల్‌ఖైదాతో సంబంధాలు తెంచుకోవాలని స్పష్టంచేశారు. తాలిబన్లు, ప్రభుత్వం మధ్య చర్చలు విఫలమైనా, వారి రాజకీయ ఒప్పందం సక్రమంగా అమలుకాకపోయినా మళ్లీ బలగాలను మోహరిస్తామని సంకేతాలిచ్చారు.

అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న జంట టవర్లపై 2001 సెప్టెంబర్‌ 11న (9/11) ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఒసామా బిన్‌ లాడెన్‌ నేతృత్వంలోని ఆల్‌ఖైదా ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్టు అమెరికా గుర్తించింది. ఆ సమయంలో తాలిబన్లు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారు. దీంతో అమెరికా నేతృత్వంలో ని సంకీర్ణ సేనలు, నాటో బలగాలు తాలిబన్లపై విరుచుకుపడ్డాయి.

అమెరికా ఈ యుద్ధం కోసం ఇప్పటివరకు లక్ష కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. దాదాపు 2,400 అమెరికా మంది సైనికులు మరణించారు. వేలమంది తాలిబన్లు, ఆఫ్ఘన్‌ సైనికులు, లక్షల మంది పౌరులు మరణించారు. దాదాపు 25 లక్షల మంది శరణార్థులుగా మారగా, దాదాపు 20 లక్షల మంది సొంత దేశంలోనే వలస వెళ్లారు.

అమెరికా యుద్ధంతో ఐదేండ్లలోనే తాలిబన్లు అధికారాన్ని కోల్పోయారు. సంస్థ పూర్తిగా బలహీనపడింది. దీంతో వారు అమెరికాతో సంధికి సిద్ధపడ్డారు. మధ్యవర్తిత్వం వహించడానికి ఖతార్‌ ముందుకొచ్చింది. 2011 నుంచి తాలిబన్‌ నేతలకు ఆతిథ్యం ఇస్తున్నది. వారి కోసం 2013లో ఒక కార్యాలయాన్ని తెరిచింది. అయితే జెండా విషయంలో వివాదం తలెత్తడంతో అదే ఏడాది కార్యాలయాన్ని మూసివేశారు. చర్చల ప్రయత్నాలు కూడా ఆగిపోయాయి.

దాదాపు ఐదేండ్ల తర్వాత 2018లో తాలిబన్లు మరోసారి అమెరికాతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఆ తర్వాత ఇరు వర్గాల ప్రతినిధులు దాదాపు తొమ్మిది విడుతలుగా సమావేశమయ్యారు. సూత్రప్రాయ ఒప్పందానికి వచ్చారు. దీని ప్రకారం 20 వారాల్లో 5,400 మంది సైనికులను ఉపసంహరించుకుంటామని 2019 సెప్టెంబర్‌లో అమెరికా ప్రకటించింది.

అయితే కొన్ని రోజులకే తాలిబన్లు అమెరికా సైనికుడిని చంపడంతో చర్చల ప్రక్రియ నుంచి బయటికి వస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ చర్చలు మొదలై.. తాజా శాంతి ఒప్పందం కుదిరింది.

Bheeshma Thanks Meet at Vizag Photos

Jayasudha Son Nihar Wedding Reception Photos

Rashmika Mandanna Latest Photos

రామ్ దర్శకుడితో మాస్ మహారాజ్

మాస్ మహారాజ్ రవితేజ ప్లాపులతో సంబంధం లేకుండా మూవీలను చేసుకుంటూ పోతున్నాడు. రవితేజ నటించిన మూవీలు ఇటీవల కాలంలో నిరాశ పరుస్తున్నాయి. ఎంతో నమ్మకంతో చేసిన ‘డిస్కో రాజా’ కూడా నిరాశే మిగిల్చింది. తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ‘క్రాక్’ మూవీ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ అందరిలోనూ అంచనాలను పెంచేసింది. ఈ మూవీపై మాస్ మహారాజ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు.

‘క్రాక్’ మూవీ చేస్తూనే రవితేజ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘హలో గురు ప్రేమకోసమే’ మూవీ చేసిన త్రినాధరావుతో సినిమా చేసేందుకు రవితేజ ఒపుకున్నారట. రామ్ హీరోగా నటించిన ఈ మూవీ మంచి విజయాన్నే సాధించింది. రవితేజతో త్రినాథరావు తెరకెక్కించే మూవీని పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించనుందని సమాచారం.

అదేవిధంగా రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించినట్లు తెలుస్తోంది. రవితేజ సినిమాలు ఫ్లాపుల్లో ఉన్నా దర్శక, నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. వచ్చిన అవకాశాలను రవితేజ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ రెండు మూవీలను ఒకేసారి లైన్లో పెట్టిన రవితేజ త్వరలో పట్టాలెక్కే పనిలో పడ్డాడు. త్వరగా ప్లాపుల నుంచి బయటపడి మునుపటిగా సక్సస్ హీరోగా మారాలనుకుంటున్నాడు. ఈ మూడింటిలో ఏ మూవీ హిట్టయినా రవితేజ మళ్లీ హిట్టు ట్రాక్ పడట్లే. రవితేజకు ఏ మూవీ హిట్టు ఇస్తుందో వేచి చూడాల్సిందే.

కేంద్రం మొండి చెయ్యి.. రూ 46,000 కోట్ల లోటుతో జగన్

ఆర్ధికంగా ఆదుకోవడం పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం మొండి చేయి చూపడమే కాకుండా, సాధారణంగా రావలసిన నిధులను సహితం ఇవ్వకుండా సహాయనిరాకరణ పాటిస్తూ ఉండడం, మరో వంక ప్రభుత్వ ఆదాయ మార్గాలు తగ్గిపోతూ ఉండడం, చివరకు అప్పులు కూడా చేయలేని పరిస్థితులు నెలకొనడంతో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్ధికంగా తీవ్ర సంక్షోభకర పరిష్టితులలో చిక్కుకున్నది.

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఇప్పటికే 11 నెలలు గడిచి పోగా, రూ 46,000 కోట్ల లోటు పేరుకు పోవడంతో చివరి నెల ఎట్లా అని దిక్కుతోచని పరిస్థితులు వెంటాడుతున్నాయి. గత ఏడాది జనవరి నెలాఖరుకు కేంద్రం నుండి 33.25శాతం గ్రాంట్లు రాగా, ఈ ఏడాది 22.20 శాతానికి తగ్గిపోయాయి. ఇతర పద్దుల పరిస్థితి కూడా ఇంతే!

దీనికి తోడు ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలు సడలించాలంటూ చేసిన విజ్ఞప్తులకు సైతం కేంద్రం స్పందించకపోవడంతో రుణాలు తీసుకునే అవకాశం కుదించుకుపో యింది. జాతీయ బ్యాంకులు కూడా ఆశించిన రీతిలో సహకరించడం లేదు. మరోవైపు రాష్ట్రంలో ఖర్చులు ఏ నెలకు ఆ నెల పెరుగుతున్నాయి.

జనవరి నెలాఖరుకు కేంద్ర, రాష్ట్ర వనరులను కలుపుకుని రూ 2.14 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేయగా, రూ 1.33 లక్షల కోట్లు (11 నెలల్లో 62 శాతం) మాత్రమే వచ్చాయి. ఇంత పెద్ద మొత్తంలో గండి పడటానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు అన్ని పద్దుల్లోనూ తగ్గుతుండమే కారణం.

కేంద్రం నుంచి రావాల్సిన రూ 61 వేల కోట్లకుగాను అతి తక్కువగా రూ 13,500 కోట్లు మాత్రమే వచ్చాయి. పూర్తిస్థాయిలో లెక్కలు తీస్తే ఇది మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

రాష్ట్ర పన్నులు, కేంద్ర పన్నుల్లో వాటా కలిపి రూ.1.78 లక్షల కోట్లు రావాల్సిఉండగా రు.86 వేల కోట్లు మాత్రమే ఖజానాకు చేరాయి. ఇక్కడ కూడా గత ఏడాదితో పోల్చి చూస్లే ఇది 11 శాతం తక్కువ, విడివిడిగా చూస్తే దాదాపుగా అన్ని రాష్ట్ర ఆదాయ వనరుల శాఖలు 60శాతం లక్ష్యాలు చేరుకోగా, పన్నుల్లో వాటా ద్వారా రాష్ట్రానికి రావాల్సిన మొత్తం 45 నుండి 50 శాతం లోపే వచ్చినట్లు సమాచారం,

పెట్టుబడి ఆదాయం (క్యాపిటల్‌ రెవిన్యూ) రూ 35,800 కోట్లు వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేయగా రూ 47 వేల కోట్లు ఖజానాకు చేరాయి. అయితే, ఈ మొత్తంలో రూ 46,500 కోట్లు అప్పులే కావడం గమనార్హం. అన్ని రంగాల్లోరూ 2.12 లక్షల కోట్లు ఖర్చు చేయాలని బడ్జెట్‌లో అంచనా వేయగా, రూ 1.27 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. ఈ ఖర్చులో కూడా రెవెన్యూ వ్యయమే రూ 1.20 లక్షల కోట్లుగా ఉన్నట్లు తేల్చారు.

ఇక కీలకమైన పెట్టుబడి వ్యయం అతి తక్కువగా రూ 7200 కోట్లే ఖర్చు చేసినట్లు తేలింది. రూ 32 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పెట్టుబడి వ్యయంలో 22 శాతం మాత్రమే ఖర్చు చేయడం వల్ల అభివృద్ధిపైనా ప్రతికూల ప్రభావం పడినట్లు కనిపిస్తోంది.

ఆదాయం తగ్గిపోవడం, ఖర్చులు భారీగా ఉండటం వంటి కారణాల వల్ల ఆదాయ, ద్రవ్య లోటు కూడా భారీగానే రికార్డవుతున్నాయి. తాజా గణారకాల మేరకు ఆదాయ లోటు రూ 1779 కోట్లుగా ఉంటుందని బడ్జెట్‌లో ప్రతిపాదించగా, జనవరి చివరి నాటికే రూ 34,690 కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఇక ద్రవ్య లోటు కూడా రూ 35 వేల కోట్ల వరకు ఉంటుందని బడ్జెట్‌లో ప్రతిపాదించగా, ఇప్పటికే రూ 46 వేల కోట్లు దాటిపోయినట్లు తేలింది.

హైవే మీద చెక్‌పోస్ట్‌ల వద్ద రూ 48,000 కోట్ల దోపిడీ

జీఎస్టీ ని ప్రవేశ పెట్టడంతో `ఒకే దేశం – ఒకే పన్ను’ అమలులోకి వచ్చినదని, ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ ల పేరులతో పన్నుల బాదుడు ఉండబోదని నరేంద్ర మోదీ ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ రహదారులపై ఒక వంక టోల్ గేటుల పేరుతో రూ 1 లక్ష కోట్లకు పైగా రుసుములను ప్రజల నుండి ప్రభుత్వమే దోపిడీ చేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా వాహనాల పన్నులు వసూలు చేస్తున్నా, రహదారుల నిర్వహణ బాధ్యతను మాత్రం చేపట్టకుండా పిపిపి పద్దతిలో అంటూ `జీవిత కాలం’ రహదారులపై టోల్ గేట్ రుసుములు వసూలు చేస్తున్నారు.

జీఎస్టీ రాకతో చెక్ పోస్ట్ లను ఎత్తివేసిన్నట్లు ప్రభుత్వం ప్రకటించినా లారీలను `నిలువు దోపిడీ’ చేస్తూనే ఉన్నట్లు వెల్లడైనది. హైవే మీద చెక్‌పోస్ట్‌ల దగ్గర లారీ డ్రైవర్లు, ఓనర్లు ‘కచ్చితంగా’ ఎంతో కొంత సమర్పించుకోవడం చూస్తూనే ఉంటాం. ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీవో అధికారుల బాదుడు దీనికి అదనం. ఇలా ఒక్కో ట్రిప్పునకు సగటున రూ.1,257 వసూలు చేస్తున్నారట.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌, బండి రిజిస్ట్రేషన్‌ సమయంలోనూ రూ.1500 వరకు మోత తప్పడం లేదు. దేశం మొత్తం ఉన్న లారీల డ్రైవర్లు, ఓనర్లు కలిసి ట్రాఫిక్‌, హైవే పోలీసులు, ఆర్టీవో అధికారులు తదితరులకు ప్రతి సంవత్సరం సమర్పించుకుంటున్న ఆమ్యామ్యాల మొత్తం అక్షరాలా రూ 48,000 కోట్లు అట. ‘సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ సర్వే చేసి తేల్చిన లెక్క ఇది.

దేశవ్యాప్తంగా ఉన్న పది భారీ రవాణా కేంద్రాలు (ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ ట్రాన్సిస్ట్‌ హబ్‌) పరిధిలో అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది. సర్వేలో భాగంగా 1,217 మంది డ్రైవర్లు, 110 మంది యజమానులను సమగ్రంగా ప్రశ్నలు అడిగారు. ఈ నివేదికను కేంద్ర రవాణాశాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ ఇటీవలే విడుదల చేశారు. దీని ప్రకారం.

ప్రతి ట్రిప్పునకు లంచం ఇస్తున్నామని సగటున 82% శాతం మంది డ్రైవర్లు చెప్తున్నారు. ఈ జాబితాలో గువాహటి, చెన్నై, ఢిల్లీ అగ్రస్థానంలో ఉన్నాయి. ఒక ట్రిప్పునకు సగటున చెల్లిస్తున్న మొత్తం రూ.1,257. నిబంధనల ప్రకారమే వెళ్తున్నా.. కొన్ని ప్రాంతాల్లో ఆర్టీవో అధికారులు వాహన రకాన్ని బట్టి ‘నిర్ణీత’ మొత్తం వసూలు చేస్తున్నారట. ఇలా ధరల పట్టిక అమలు చేస్తున్న హబ్‌లలో బెంగళూరు, గువాహటి టాప్‌లో ఉన్నాయి.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ సమయంలో ఆర్టీవో అధికారులకు లంచం ఇవ్వాల్సి వస్తున్నదని సగటున 47 శాతం మంది డ్రైవర్లు చెప్పారు. ముంబైలో ఏకంగా 93 శాతం మంది నుంచి, ఢిల్లీలో 78శాతం మంది నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారట. ఇలా లైసెన్స్‌ రెన్యువల్‌కు ఒక్కో డ్రైవర్‌ సగటున రూ.1,789 ముట్టజెప్తున్నారని తేలింది.

అత్యధికంగా ఢిల్లీలో రూ. 2,025 ముట్టజెప్పాల్సి వస్తున్నదని వాపోతున్నారు. అదేవిధంగా ట్రక్కుల రిజిస్ట్రేషన్‌ సమయంలో ఒక్కో వాహనానికి సగటున రూ.1,360 ముట్టజెప్పాల్సి వస్తున్నదని వాపోతున్నారు.

టీ వెనక ఇంత చరిత్ర వుందా ?

అప్పుడే వారాంతం వచ్చింది. ఈవారంలో భారత్ లో రెండు పెద్ద సంఘటనలు జరిగాయి. ఒకటి అత్యంత వివాదాస్పద వ్యక్తి, అదేసమయంలో అత్యంత శక్తిమంతమైన అమెరికాకు అధ్యక్షుడు కూడా అయిన ట్రంప్ భారత్ రావటం వెళ్ళటం జరిగింది. దానితోపాటు ఇంకో పెద్దది ఢిల్లీలో జరిగిన అల్లర్లు. ఒకటి భారత్ ప్రతిష్ట పెరిగేదయితే,రెండోది భారత్ ప్రతిష్ట మంటగలిసేది. రెండూ ఈ వారంలోనే జరిగాయి. మొత్తం టీవీ లు , పత్రికలూ అన్నీ వీటిగురించే మాట్లాడుకుంటున్నాయి. మనంకూడా సెలవురోజుల్లోకూడా వాటిగురించి మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది చెప్మా. ఇంకేదన్నా సరదాగా మాట్లాడుకుందామా. ఈసారి మనం మనం రోజూ తాగే టీ గురించి మాట్లాడుకుందాం.

అసలు ఈ టీ ఎవడు కనిపెట్టాడోకానీ టీ తాగని వాళ్ళు వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. చీనీ, జాపనీస్ వాళ్ళు మొదలుపెడితే దాన్ని ప్రపంచ వ్యాపారంగా మార్చింది బ్రిటిష్ కంపెనీలు. దానికి కార్యస్థానం మనభూభాగమేనండోయ్. అంతవరకూ బాగానేఉందికానీ ఈ టీ వలన అమెరికా కు స్వాతంత్రమే వచ్చిందని తెలుసా? టీమీద వేసిన పన్నులకు నిరసనే అమెరికా స్వాతంత్రానికి దారి తీసిందని తెలుసనుకుంటాను. కానీ ఇందులో చాలా మందికి తెలియని అంశం ఒకటుంది. దీనికి ఇండియా కనెక్షన్ ఉందని. అదేంటో తెలుసా ? భారత్ లోని పరిణామాలే ఆ పన్నులేయటానికి కారణం. మనదేశంతో వ్యాపారం చేయటానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ రాబర్ట్ క్లెయివ్ ఆధ్వర్యాన 1757 లో ప్లాసీ యుద్ధం, ఆ తర్వాత బక్సర్ యుద్ధం తో వ్యాపారసంస్థ నుంచి పాలనా సంస్థగా మారిందికదా. ఇది మనకు తెలిసిన చరిత్ర. తెలియనిదేమిటంటే ఈ యుద్ధాలతో ఈస్ట్ ఇండియా కంపెనీ దివాళా తీసే పరిస్థితి వచ్చింది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని ఎట్లాగైనా కాపాడాలని అనుకుంది. అప్పటికే ఈస్ట్ ఇండియా కంపెనీ అమెరికాకు మనదేశం నుంచి టీ ని సరఫరా చేస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ కి ఆదాయం పెంచి దివాళానుంచి బయటపడేయాలంటే ఆ టీ పై సుంకాల్ని బ్రిటిష్ ప్రభుత్వం పెంచింది. ఇంకేముంది అప్పటికే రగులుతున్న అమెరికా ప్రజలకి మంచి ఆయుధం దొరికింది. మిగతా కధ మీ అందరికీ తెలిసిందే. ఇంతకీ దీని సారాంశమేమిటంటే ఈ టీ వలన బ్రిటిష్ ప్రభుత్వం అమెరికా లాంటి పెద్ద భూభాగాన్ని పోగొట్టుకుని ఇండియాని కాపాడుకుంది. మరిఈ టీ కి అంత శక్తి వుంది. బ్రిటిష్ లాంటి అత్యంత శక్తివంతమైన దేశాన్ని వణికించింది. కాబట్టి టీ ని తక్కువ అంచనా వేయకండి.

ఇక ఇండియా కొస్తే మన టీ ప్రత్యేకం. పాలతో మరిగించి తయారుచేస్తాం. ఒకనాడు పెద్దవాళ్లకే పరిమితమైన ఈ టీ ఇప్పుడు అతి సామాన్యుడికి దివ్యఔషధం. అది తాగితేనే మనసుకు కిక్కు ఎక్కుతుంది. ఇంటికి పనిమనిషివచ్చినా ఏమిచ్చినా ఇవ్వకపోయినా టీ ఇవ్వాల్సిందే. ఇప్పుడిప్పుడే బ్లాక్ టీ, గ్రీన్ టీ తాగేవాళ్ళు పెరుగుతున్నా ఇప్పటికీ మన పాల టీ నే ఎక్కువమంది భారతీయులు ఇష్టపడతారు. ఇక్కడేకాదు అమెరికాకి వెళ్లినా , ఇంగ్లాండ్ వెళ్లినా ఇంట్లో మన పాల టీ నే తాగుతుంటారు. అదీ ఇండియా నుంచి దిగుమతిచేసుకున్న ఇండియా బ్రాండ్ టీ పొడినే వాడతారు. ఎందుకంటే పాలతో మరిగించే టీ ఆకును మన అస్సాం లోనే ఎక్కువగా పండిస్తారు. డార్జిలింగ్ వెరైటీ ఎక్కువగా బ్లాక్ టీ కి వాడతారు. అది ఖరీదు కూడా. ఒకవిధంగా చెప్పాలంటే అందరిదీ అస్సాం టీ, వున్నత వర్గాలది మాత్రమే డార్జిలింగ్ టీ కిందకి మారింది. అంతేకాదండి , ఇది ప్రాంతాల్ని బట్టి మారుతుంది.

మొదటగా చెప్పుకోవాల్సి వస్తే అమెరికాలో అప్పటినుంచి కూడా టీ వాడకం తగ్గి కాఫీ వాడకం పెరిగింది. పొద్దున్నే స్టార్ బక్స్ కాఫీ వాళ్ళ దినచర్యలో భాగమైపోయింది. టీ అందుబాటులో వున్నా తాగే వాళ్ళ సంఖ్య బాగా తక్కువ. మరి కారణం తెలియదు. అలాగే లాటిన్ అమెరికా కూడా. ఇటీవలి కాలంలో జన్మస్థానమైన చైనా లోకూడా టీ ని కాఫీ డామినేట్ చేస్తుందంట. అదీ అమెరికా కంపెనీ అయిన స్టార్ బక్స్ శాఖలు విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. ఇక ఇండియాకొస్తే ఎందుకనో దక్షిణాదిలో పొద్దున్నే ఫిల్టర్ కాఫీ వాళ్ళ దినచర్యలో భాగం. అదే ఉత్తరాదిలో ఇప్పటికీ టీ అదీ పెద్ద గ్లాసుల్లో తాగాల్సిందే. మరి ఈ తేడా ఎందుకొచ్చిందో? కెసిఆర్ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర, తెలంగాణ సంస్కృతులు , వంటకాలు వేరని సోదాహరణంగా వివరించాడు. కానీ టీ, కాఫీ ల గురించి చెప్పటం మరిచిపోయాడు. ఆంధ్రాలో ఇప్పటికీ పొద్దున్నే కాఫీ అదీ ఫిల్టర్ కాఫీ తాగుతారు. కానీ హైదరాబాద్ లో, తెలంగాణాలో పొద్దున్నే ఇప్పటికీ టీ నే ఇష్టపడతారు. హైదరాబాద్ లో అయితే ఇరానీ చాయ్ అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎందుకనో కెసిఆర్ ఈ విషయం చెప్పటం మరిచిపోయాడు. ఎవరూ గుర్తు చేయలేదేమో లేకపోతే దీన్ని కూడా బ్రహ్మాడంగా వాడేసుకునేవాడు. ఎంతచెప్పినా కెసిఆర్ ఒరిజినల్ నాయకుడు, ప్రజల నాడిని పట్టగల మేధావని నిరూపించుకున్నాడు. కానీ టీ ప్రత్యేకత ని మిస్ అయ్యాడు. అయినా ఇప్పుడింకా వీటితో పనిలేదనుకోండి. అంటే అమెరికా దేశం స్వాతంత్రం పొందటంలోనే కాదు ఆంధ్ర , తెలంగాణ విభజన లో కూడా టీ ప్రత్యేకతని సంతరించుకున్నదన్నమాట.అంతెందుకండి టీ అమ్మిన మోడీ మన దేశానికి ప్రధానమంత్రే అయ్యాడు. చూసారా టీ మహత్యం. మనం టీ ని రోజూ తాగుతున్నామేకానీ దానికి ఇంత చరిత్ర ఉందని తెలిసిన తర్వాత తాగేటప్పుడు ఇకనుంచి టీ మహత్యం గుర్తుకొస్తుందనుకుంటా.

ఇవీ ఈవారం ముచ్చట్లు, వచ్చే వారం మళ్ళీ కలుద్దాం, అంతవరకూ సెలవు
…….. మీ రామ్

చిరు-152లో విలన్ గా బాలీవుడ్ నటుడు

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి-152వ చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ ప్రారంభమైనప్పటి నుంచి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తునే ఉంది. భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ నటుడు సోనుసూద్ ఖరారైనట్లు సమాచారం. టాలీవుడ్ లో విలన్ గా సోనూసూద్ మంచి పేరు సంపాదించుకున్నాడు.

నాగార్జున, మహేష్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలో విలన్ గా సోనూసూద్ నటించాడు. తాజాగా మెగాస్టార్ 152వ మూవీలో సోనుసూద్ కు విలన్ గా నటించే అవకాశం దక్కింది. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు చిరంజీవి, కొరటాల శివకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశాడు. మెగాస్టార్ తో కలిసి నటించడం చేసుకోవడం తన అదృష్టమని తాజాగా కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

చిరంజీవి-152వ మూవీకి ‘ఆచార్య’ టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. సోనూసూద్ కు ఈ అవకాశం రావడానికి మహేష్ బాబే కారణం తెలుస్తోంది. మహేష్ బాబుకు సోనుసూద్ మంచి మిత్రుడైనందునే మెగాస్టార్ మూవీలో అవకాశం ఇప్పించారని సమాచారం. ఈ మూవీలో అవకాశం వచ్చినందుకు సోనూసూద్ తన అదృష్టంగా భావిస్తున్నాడు. చిరుకు జోడీగా త్రిష నటిస్తుంది. గతంలో వీరిద్దరు స్టాలీన్ మూవీలో నటించారు. రాంచరణ్ మ్యాట్నీ మూవీ మేకర్స్ తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాడు ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Sarileru Neekevvaru 50 Days Posters

థ్రిల్లర్ మూవీలో సమంత

సమంత తన ఫ్యాన్స్ భయపెట్టేందుకు సిద్ధమవుతుంది. ‘గేమ్ ఓవర్’, ‘మాయ’ సినిమాల దర్శకుడు అశ్విన్ త్వరలో హర్రర్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీని కథను ఇటీవల సమంతను దర్శకుడు అశ్విన్ సమంతకు విన్పించాడు. కథ నచ్చడంతో సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తాజాగా ఈ మూవీపై సమంత కామెంట్ చేసింది. ఈ మూవీ హర్రర్ తలదన్నేలా ఉంటుందని సమంత కామెంట్ చేసింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్లో జరుగనుంది.

‘ఏం మాయ చేశావే’ నుంచి సమంత ఎక్కువగా లవ్ స్టోరీల్లోనే నటించింది. అలాంటి సినిమాలే సమంత మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇటీవల సమంత-శర్వానంద్ జంటగా ‘జాను’ రిలీజైంది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోయింది. సమంతకు నాగచైతన్యతో పెళ్లాయక గ్లామర్ రోల్స్ తగ్గించి లేడి ఓరియెంటెడ్ పాత్రలకే ప్రాధాన్యమిస్తుంది.

తాజాగా సమంత హర్రర్ మూవీకి సైన్ చేసింది. తెలుగు, తమిళం, హిందీలోనూ ఈమూవీ తెరకెక్కనుంది. గతంలోనూ సమంత చేసిన ‘రాజుగారి గది-2’ లాంటి హర్రర్ మూవీల్లో నటించింది. అయితే ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో సమంత రెగ్యూలర్ లవ్ స్టోరీలపైనే దృష్టిసారించింది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ హర్రర్ మూవీలో సమంత నటించనుంది. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘మోసగాళ్లు’లో సునీల్ శెట్టి ఫస్ట్ లుక్ విడుదల..


మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘మోసగాళ్లు’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ వేసవిలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తోన్న బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి ఫస్ట్ లుక్ ను శనివారం చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ లుక్ లో పోలీస్ యూనిఫామ్, తలకు సిక్కులు ధరించే ‘టర్బన్’తో సునీల్ శెట్టి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. ఆయన పోషిస్తున్న పాత్ర పేరు ఏసీపీ కుమార్.

ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణంగా భారత్ లో చోటుచేసుకొని, అమెరికాను సైతం వణికించిన యథార్థ ఉదంతం ఆధారంగా ‘మోసగాళ్లు’ సినిమా రూపొందుతోంది.

సోమవారం నుంచి ఈ సినిమా తదుపరి షెడ్యూల్ జరగనుంది. కాజల్ అగర్వాల్, రుహాని సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

వియా మార్ ఎంటర్టైన్మెంట్, ఎ.వి.ఎ. ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విరానికా మంచు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు.

జేసీ మెడకు చుట్టుకున్న మరో కొత్త కేసు!

టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర రెడ్డి పై మరో కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. ఆయన కంపెనీలో జేసీ ట్రావల్స్ సంస్థ వాహానాల పోర్జరీ కేసులో మరో కోణం బయటపడింది. వారు కేవలం ఎస్.ఐ,సి.ఐ వంటి పోలీసు అధికారుల సంతకాలను పోర్జరీ చేయడమే కాకుండా ఏకంగా ఇన్సూరెన్స్ కంపెనీ పేరుతో కూడా డాక్యుమెంట్లు సృష్టించటంతో.. దీనిపై రవాణా శాఖ అధికారులు పోలీసులకు పిర్యాదు చేశారు. జేసీ ఫోర్జరీ వ్యవహారంపై విచారణ జరుపుతున్న రవాణాశాఖ టాస్క్‌ఫోర్స్‌ బృందం.. ఇప్పటివరకు 56 నకిలీ ఇన్సూరెన్స్‌ సర్టిఫికేట్లను గుర్తించింది.

బీఎస్‌-3 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో బీఎస్‌-4గా రిజిస్ట్రేషన్‌ చేయించారు. నాగాలాండ్‌, కర్ణాటక రాష్ట్రాలలో 154 లారీలను నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటిదాకా 20లారీలను సీజ్‌ చేశారు. మిగిలిన వాహనాలను జేసీ ట్రావెల్స్‌ అజ్ఞాతంలోకి తరలించారు. రెండు లారీలను బస్సులుగా మార్చేసి వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తాజాగా వెలుగు చూసిన ఫేక్‌ ఇన్సురెన్స్‌ సర్టిఫికేట్ల బాగోతంపై రవాణా శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.