కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి-152వ చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ ప్రారంభమైనప్పటి నుంచి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తునే ఉంది. భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ నటుడు సోనుసూద్ ఖరారైనట్లు సమాచారం. టాలీవుడ్ లో విలన్ గా సోనూసూద్ మంచి పేరు సంపాదించుకున్నాడు.
నాగార్జున, మహేష్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలో విలన్ గా సోనూసూద్ నటించాడు. తాజాగా మెగాస్టార్ 152వ మూవీలో సోనుసూద్ కు విలన్ గా నటించే అవకాశం దక్కింది. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు చిరంజీవి, కొరటాల శివకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశాడు. మెగాస్టార్ తో కలిసి నటించడం చేసుకోవడం తన అదృష్టమని తాజాగా కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
చిరంజీవి-152వ మూవీకి ‘ఆచార్య’ టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. సోనూసూద్ కు ఈ అవకాశం రావడానికి మహేష్ బాబే కారణం తెలుస్తోంది. మహేష్ బాబుకు సోనుసూద్ మంచి మిత్రుడైనందునే మెగాస్టార్ మూవీలో అవకాశం ఇప్పించారని సమాచారం. ఈ మూవీలో అవకాశం వచ్చినందుకు సోనూసూద్ తన అదృష్టంగా భావిస్తున్నాడు. చిరుకు జోడీగా త్రిష నటిస్తుంది. గతంలో వీరిద్దరు స్టాలీన్ మూవీలో నటించారు. రాంచరణ్ మ్యాట్నీ మూవీ మేకర్స్ తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాడు ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.