Home Blog Page 8604

వేలమంది వాడిన దుప్పటి మనది…!

రైళ్లలోని ఎయిర్ కండిషన్డ్ బోగీల్లో ప్రయాణంలో చేసేటప్పుడు రైల్వేవారు ఇచ్చే దుప్పట్లను ఉపయోగిస్తుంటాం. అలాంటివారందరికి ఈ సమాచారం షాక్ ఇస్తుంది. రైళ్లలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు వినియోగించే నలుపు లేదా గోధుమ రంగులో వుండే మందపాటి దుప్పట్లను నెలకు ఒకసారి మాత్రమే ఉతుకుతారట. సుమారు 83 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, వేలాది మంది ప్రయాణికులు ఉపయోగించిన తర్వాత మాత్రమే ఉతుకుతారట. ఈ సమాచారం ఆర్టీఐ ప్రశ్నకు ప్రతిస్పందనగా రైల్వే శాఖ తెలియజేసింది. 64 ఏళ్ల జతిన్ దేశాయ్ ఆర్టీఐ ద్వారా ఈ సమాచారాన్ని రైల్వే శాఖ నుండి అడిగారు.

ఈ సందర్భంగా దేశాయ్ మాట్లాడుతూ ‘నేను చాలా సార్లు రైళ్లలో ప్రయాణించాను. రైళ్ళలో మురికి, చిరిగిన దుప్పట్లు చూసాను. అందుకే నా స్నేహితుడు తన సొంత దుప్పటితో అతనితో ప్రయాణిస్తుంటాడు. రైళ్లలో ఇచ్చిన దుప్పట్లు శుభ్రంగా వున్నాయంటే అతను నమ్మడు. అటువంటి పరిస్థితిలో ఈ దుప్పట్లు ఎప్పుడెప్పుడు ఉతుకుతారో తెలుసుకోవాలనుకున్నాను, అందుకే ఆర్టీఐకి దరఖాస్తు చేశానని తెలిపారు. కాగా ఈ విషయమై సిపిఆర్ఓ రవీందర్ భఖర్ మాట్లాడుతూ ఉన్ని దుప్పట్లు ఉతికితే పాడవుతాయి. గతంలో ఈ దుప్పట్లు ప్రతి రెండు నెలలకు ఒకసారి ఉతికేవారు. కాని ఇప్పుడు ప్రతి నెలా ఉతుకుతున్నారు. రోజూ ఉన్ని దుప్పట్లు ఉతకడం సాధ్యం కాదని చెప్పారు.

సీక్వెల్సే శ్రీరామరక్ష..

విజయాలే కొలమానంగా పరిగణించబడే సినీ పరిశ్రమలో ఆచి తూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి వుంది. లేదంటే చిత్ర రంగంలో నిలదొక్కు కోవడం చాలా కష్టం. విజయంతో పాటు డిమాండ్ ఎంత త్వరగా పెరుగుతుందో అపజయంతో పాటు అంతే త్వరగా అపకీర్తి వస్తుంది. అందుకే స్టార్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు వరుస విజయాల కోసం అహర్నిశలు శ్రమించాలి. ఇంకా చెప్పాలంటే తనని తాను ఆ దిశగా మౌల్డ్ చేసుకోవాలి. బాలీవుడ్ టాప్ త్రీ నటుల్లో ఒకడైన సల్మాన్ ఖాన్ తన స్టార్ స్టేటస్ కాపాడుకోవడానికి అనేక మార్గాలు వెతుక్కొంటున్నాడు. ఆ క్రమంలో గతం లో తనకి విజయాన్ని తెచ్చి పెట్టిన చిత్రాల్నే నమ్ముకొన్నాడు. వరుసగా సీక్వెల్స్ కి శ్రీకారం చుట్టబోతున్నాడు. 2012 లో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ ఫై నిర్మించబడి సంచలన విజయం సాధించిన ఏక్ థా టైగర్ చిత్రం సల్మాన్ ఖాన్ చిత్రాల్లో ఒక అరుదైన చిత్రం. విభిన్నంగా సాగే స్క్రీన్ ప్లే తో పాటు పసందైన పాటలు, యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రం నిండా పుష్కలంగా ఉంటాయి. అవే చిత్ర ఘన విజయం లో మూల స్తంభాలయ్యాయి. దరిమిలా ఈ చిత్రానికి 2017 లో సీక్వెల్ నిర్మించ బడింది. టైగర్ జిందా హై పేరు తో నిర్మించ బడ్డ ఈ సినిమా కూడా కాసుల వర్షం కురిపించింది. అలా రెండు సార్లు విజయం దక్కించుకున్న ఈ టైగర్ సిరీస్ చిత్రం ఇపుడు మరో సీక్వెల్ కి రెడీ అవుతోంది.

2014 లో సల్మాన్ ఖాన్ నటించిన చిత్రాల్లో కిక్ సినిమా ఒక ప్రత్యేకమయిన చిత్రం అనక తప్పదు. 2009లో తెలుగులో వచ్చిన రవితేజ కిక్ సినిమా కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. అందుకే ఘన విజయం సాధించింది.అందుకే తెలుగు వచ్చిన అయిదు సంవత్సరాల తరవాత హిందీలో రీమేక్ అయ్యి అక్కడ కూడా ఘన విజయం సాధించింది. సల్మాన్ ఖాన్ కెరీర్ లో ఒక సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచి పోయింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ నిర్మిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో సల్మాన్ ఖాన్ ఇపుడు చిత్ర నిర్మాణానికి సిద్దమౌతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ జరుపుకొంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఫై రెండు చిత్రాలే గాక సల్మాన్ ఖాన్ మదిలో మరో సీక్వెల్ చేసే ఆలోచన ఉంది. 2010 లో తన స్వీయ నిర్మాణ సంస్థ లో నిర్మించబడి ఘన విజయం సాధించిన దబాంగ్ చిత్రానికి మూడో సీక్వెల్ నిర్మించడానికి సిద్దమౌతున్నాడు. దబాంగ్ 4 పేరుతొ నిర్మించబడే ఈ చిత్రం కూడా త్వరలోనే ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆ గన్ తో గురి చూసి కరోనాను కనిపెట్టొచ్చు

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 26 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చేవారికి వైద్య పరీక్షలు నిర్వహించడం వల్ల కేసులు మరింత పెరగకుండా నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా, నోయిడాలో కరోనా వైరస్ ప్రభావం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

ఆగ్రాలో పర్యాటకులకు వైద్య పరీక్షలు నిర్వహిసున్నారు. తాజ్‌మహల్‌కు వచ్చే పర్యాటకులను థర్మల్ గన్ తో చెక్ చేస్తున్నారు. దేశంలో అనుమానాస్పద కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. తాజ్ మహల్ సమీపంలో థర్మల్ గన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇదేవిధంగా దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులలో థర్మల్ ఇంటర్నేషనల్ ఇమేజరీ పరికరాల తో పరీక్షిస్తున్నారు.

ముఖ్యంగా చైనా, ఇంగ్లాండ్, హాంకాంగ్, సింగపూర్, జపాన్, కొరియా వంటి దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ జరుగుతోంది. నిపుణుల తెలిపినదాని ప్రకారం, కరోనా వైరస్ లేదా ఇలాంటి ఇతర వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని థర్మల్ గన్ తో పరీక్షించడం ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. థర్మల్ స్క్రీనింగ్ సమయంలో ఆరోగ్యకరమైన వ్యక్తి కి వైరస్ తో బాధపడుతున్న వ్యక్తి మధ్య స్పష్టమైన వ్యత్యాసం తెలుసుకోవచ్చు.

థర్మల్ గన్ లు ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి, దీని ప్రారంభ ధర రూ .3 వేల నుండి రూ .50 వేల వరకు ఉంటుంది. దీన్ని ఇంటి నుండి ఆర్డర్ చేయవచ్చు. అయితే స్క్రీనింగ్ సమయంలో నిపుణుల సహాయం అవసరమని ఉత్పత్తిదారులు చెబుతున్నారు.

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: రాహుల్ డిమాండ్‌


బుధవారం అర్థరాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్‌ పబ్‌ లో జరిగిన గొడవపై బిగ్‌ బాస్‌ 3 విజేత, రాహుల్ సిప్లిగంజ్‌ పోలీసులను ఆశ్రయించాడు. తనపై దాడి చేసిన తెరాస తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువు రితేష్ రెడ్డి, అతడి గ్రూప్ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని గచ్చిబౌలి పోలీసులను కోరాడు. గురువారం తన స్నేహితులతో కలిసి పోలీస్‌ స్టేషన్‌ కి వచ్చి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు.

రాహుల్‌ సిప్లిగంజ్‌ తన స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్‌ పబ్‌ కు వెళ్లాడు. అక్కడ ఒక అమ్మాయి విషయంలో రితేష్ రెడ్డి స్నేహితులకు, రాహుల్‌ కు మధ్య వాగ్వాదం జరిగింది. దింతో రాహుల్‌ పై రితేష్ రెడ్డి, అతడి స్నేహితులు కలిసి మూకుమ్మడిగా బీరు సీసాలతో దాడి చేశారు. పబ్‌ నిర్వాహకులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగకుండా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రాహుల్‌ ముఖానికి గాయమైంది.

పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జరిగిన ఘటనలో తన తప్పు ఏమిలేదని స్పష్టం చేశారు. తన స్నేహితురాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తనను విచక్షణారహితంగా కొట్టారని వెల్లడించారు. రాజకీయ పలుబడి ఉందన్న గర్వంతో తనపై దాడి చేశారని ఆరోపించారు. తనపై అకారణంగా దాడి చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని రాహుల్ డిమాండ్‌ చేశారు.

చిత్ర పరిశ్రమకు వైరస్ కాటు..

కరోనా వైరస్ ప్రభావం అంతకంతకు పెరుగుతోంది. దాదాపు ప్రపంచం మొత్తాన్ని కబళించి వేస్తోంది. చివరికి చిత్ర పరిశ్రమపై కూడా ప్రభావం చూపుతుంది. ఒక అధ్యయనం ప్రకారం ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చిత్ర పరిశ్రమకు 2020లో సుమారు 3700 కోట్ల రూపాయల నష్టం ఎదురుకానుంది. ఇంతే కాదు కరోనా కారణంగా పెద్ద తారల చిత్రాల తేదీలు వాయిదా పడ్డాయి. జేమ్స్ బాండ్ చిత్రం కూడా 7 నెలల తర్వాత విడుదల కానుందని సమాచారం.

కరోనా వైరస్ భయం ప్రజలలో అణువణువునా నిండిపోయింది. చైనా, దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఇటలీలలో ఇప్పటికే బహిరంగ సభలను, పార్టీలను నిషేధించారు. ఇలాంటి పరిస్థితుల్లో సినీ పరిశ్రమ షాక్ నకు గురయ్యింది. మరోవైపు, కొరోనా వైరస్ వ్యాప్తి ఇంకా పెరిగితే తద్వారా చిత్ర పరిశ్రమకు ఎక్కువ నష్టం కలుగుతుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. దక్షిణ కొరియా ఫిల్మ్ అసోసియేషన్ ప్రస్తుత పరిస్థితిని దుర్దశగా పేర్కొంది. 2015 లో దక్షిణ కొరియాలో ఇలాంటి ఒక వైరస్ కారణంగా పరిశ్రమ నష్టాలకు గురయ్యింది.

అయితే, ఆ సమయంలో పరిస్థితి ఇంత భయంకరంగా లేదు. ఆ సమయంలో థియేటర్లు ఓపెన్ అయ్యాయి.. మార్కెట్లు మూతపడలేదు. కానీ ప్రస్తుతమున్న కరోనా వైరస్ సినిమా వ్యాపారాన్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది. దక్షిణ కొరియాలోని అతిపెద్ద థియేటర్లలో ఒకటైన సిజివి పేర్కొన్న ప్రకారం చిత్రపరిశ్రమ గడ్డురోజులు ఎదుర్కోనుంది. మరోవైపు, ఇటలీలో ఇదే పరిస్థితి ఏర్పడింది. సగానికి పైగా థియేటర్లు అక్కడ మూతపడ్డాయి.కరోనా వైరస్‌ కారణంగా 100 మందికి పైగా మరణించారు. దింతో ప్రజలు భయపడుతున్నారు ఇంటినుండి బయటకు రావడం లేదు.

మరోవైపు, హాలీవుడ్ చిత్రాలు కూడా కరోనా బారిన పడ్డాయి. జేమ్స్ బాండ్ సిరీస్ ఫిల్మ్ డేట్ మరింత ముందుకు వెళ్ళింది. జేమ్స్ బాండ్ సిరీస్ గత ఆదాయాల రికార్డులను బద్దలు కొడుతుందని నిర్మాతలు నమ్ముతున్నారు. అయితే ఈ చిత్రం చైనాలో విడుదల కాకపోతే, పెద్ద నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు వారి ఆశలు అడియాసలయ్యాయి.

కరోనా జన్యుక్రమాన్ని గుర్తించిన డబ్ల్యూహెచ్‌వో

కరోనా వైరస్‌ లేదా కోవిడ్‌ 19 వ్యాధికి ఎనిమిది వారాలు నిండాయి. ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్‌ సిటీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో… ఈ వైరస్‌కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ కీలక ప్రకటన చేసింది.

కరోనా వైరస్‌కు సంబంధించిన జన్యు క్రమాన్ని (జెనటిక సీక్వెన్స్‌) గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్‌లో టెక్నికల్‌ లీడ్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ మారియా వాన్‌ కెర్కోవ్‌ తెలిపారు. నేడు ఈ అంశంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ… వైరస్‌కు సంబంధించిన జెనటిక్‌ విశ్లేషణ జరుగుతోందని పేర్కొన్నారు.

పాలీమిరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (పీసీఆర్‌) తో పాటు సీరాలిజికల్‌ విశ్లేషణను పరిశోధనశాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కొత్త వ్యాధిగా రూపాంతరం చెందిన కరోనా వైరస్‌కు సంబంధించి కావాల్సినంత సమాచారం తమ దగ్గర ఉందని కెర్కోవ్‌ చెప్పారు. వైరస్‌ను అతి తక్కువ సమయంలో గుర్తించడం అసాధారణమైన విషయమని తెలిపారు.

వైరస్‌కు చెందిన జన్యు క్రమాన్ని కొన్ని రోజుల క్రితమే షేర్‌ చేసినట్లు తెలిపారు. ఇక ఇప్పుడు సిరాలాజికల్‌ అధ్యయనం సాగుతుందన్నారు. చైనాతో పాటు బాధిత ప్రపంచ దేశాలు కరోనా పాజిటివ్‌ వ్యక్తుల సీరమ్‌ను పరీక్ష చేయవచ్చునని పేర్కొన్నారు.

కరోనా వైరస్‌పై గురువారం నిర్వహించిన రాజ్యసభలో ప్రకటన చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేయకముందే.. కేంద్ర ప్రభుత్వం వైరస్‌ నియంత్రణకు అన్ని ఏర్పాటు చేసిన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ రాజ్యసభలో తెలిపారు. మార్చి 4 వ తేదీ వరకు దేశంలో 29 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు మంత్రి వెల్లడించారు.

ప్రతి రోజూ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు మంత్రి చెప్పారు. మంత్రుల బృందం కూడా ఎప్పటికప్పుడు కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్‌ ఇక నుంచి కచ్చితంగా చేపట్టనున్నట్లు తెలిపారు. సుమారు 29 వేల మందిని మానిటర్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Trishna Mukherjee Photo Stills

Anasuya Latest Photoshoot Stills

అలీకి గుడ్ న్యూస్ చెప్పనున్న జగన్?

ప్రముఖ సినీనటుడు అలీకి ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తుంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన అలీకి నిరాశే మిగిలింది. దింతో ఈ సారి ఆయనకు ఒక రాజ్యసభ సీటు ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం.

రాజ్యసభ సీటు దక్కించుకోబోయే వైసీపీ నేతలు ఎవరనే దానిపై ఆ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో… ఆశావాహుల్లోనే టెన్షన్ పెరిగిపోతోంది. నాలుగు సీట్లను నాలుగు సామాజికవర్గాలకు కేటాయించాలని భావించిన సీఎం జగన్… తాజాగా ఒక సీటుని సిట్టింగ్ ఎంపీకి, మరో సీట్ అలీకి కేటాయించాలని నిర్ణయించుకున్నారనే వార్తలు ఆ పార్టీలో మరింత టెన్షన్ వాతావరణాన్ని పెంచింది.

అయితే మైనార్టీ కోటాలో ఒకరికి కచ్చితంగా ఛాన్స్ ఉంటుందనే ప్రచారం వైసీపీలోని ఆ వర్గం నేతల్లో ఆశలు పెంచుతోంది. అదే సమయంలో మైనార్టీ కోటా పరంగా చూసుకున్నా.. అలీకి ఒక సీట్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం వైసీపీలో అనేక మంది మైనార్టీ నాయకులు ఉన్నారు. కొందరు ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు.కాబట్టి మైనార్టీ కోటాలో అలీకి పెద్దల సభ సీటు దక్కుతుందో లేదో తెలియాలంటే ఇంకొంత సమయం వేచిచూడాలి.

అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే కు శుభం కార్డు

రాజధాని ప్రాంతంగా అమరావతి ప్రాధాన్యతను క్రమంగా కుదించుకొంటూ వస్తున్న వై ఎస్ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తాజాగా అత్యంత ప్రధానమైన రాయలసీమతో అనుసంధానం కావించే అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నుంచి అమరావతిని తొలగించడానికి రంగం చేసింది.

భూసేకరణ భారంగా మారిందని, రహదారిని అమరావతి వరకూ తీసుకెళ్లలేమని, గుంటూరు జిల్లా చిలకలూరిపేట వరకే పరిమితం చేయాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. అదే జరిగితే, అప్పుడది అనంతపురం-చిలుకలూరిపేట ఎక్స్‌ప్రె్‌సవే అవుతుంది.

మారిన అలైన్‌మెంట్‌ ఆధారంగా భూసేకరణకు సంబంధించి 3డీ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. రాజధాని పరిరక్షణ పేరిట రైతాంగం ఉద్యమాన్ని కొనసాగిస్తూ దాన్ని తీవ్రదశకు తీసుకెళ్తున్న తరుణంలో, రహదారి ప్రాజెక్టులో అమరావతి అన్నదే లేకుండా ప్రయత్నాలు జరుగుతుండటం గమనార్హం.

రాయలసీమను అమరావతికి అనుసంధానించాలని గత ప్రభుత్వం అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రె్‌సవేను ప్రతిపాదించింది. రాజధానిను దృష్టిలో పెట్టుకొనే కేంద్ర ప్రభుత్వం అందుకు అనుమతి ఇచ్చింది. రూ.25వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును డిజైన్‌ చే శారు. దీనికి సంబంధించిన రైట్‌ ఆఫ్‌ వే (ఆర్‌ఓడబ్ల్యూ)కు కేంద్ర రోడ్డురవాణా, జాతీయ రహదారుల శాఖ (ఎంఓఆర్‌టీహెచ్‌) అనుమతిచ్చింది.

భూసేకరణ వ్యయంలో సగం కేంద్రం, మిగతాది రాష్ట్రం భరించేలా విధివిధానాలు ఖరారయ్యాయి. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)ను ఎంఓఆర్‌టీహెచ్‌ ఆమోదించింది. రహదారి నిర్మాణ బాధ్యతలను ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించింది. భూ సేకరణ పనులు మొదలయ్యాయి. ఇప్పటికే రెండు రకాల నోటిఫికేషన్లు వెలువడ్డాయి.

అనంతపురం-అమరావతి రహదారి ప్రాజెక్టు పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష సందర్భంగా… గుంటూరు జిల్లాలో భూసేకరణ కష్టంగా ఉందని, ప్రభుత్వంపై మరింత భారం పడుతుందని అధికారులు నివేదించారు. దీంతో అలైన్‌మెంట్‌ మార్చాలని, చిలకలూరిపేట వరకే రహదారి అనుసంధానం చేయాలని, ఆపై వద్దని స్పష్టంగా ఆదేశించినట్లు తెలిసింది.

చిలకలూరిపేట మీదుగా ఎన్‌హెచ్‌-16 వెళ్తోంది. ప్రతిపాదిత ఎక్స్‌ప్రె్‌సవేను అక్కడ నిర్మిస్తున్న బైపా్‌సకు కలుపాలని ఆదేశించారు. అక్కడినుంచి గుంటూరు, విజయవాడకు హైవే ఉంది కాబట్టి, దానికి సమాంతంగా మరో పెద్ద రహదారి నిర్మించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించినట్లు తెలిసింది.

అనంతపురం ఎక్స్‌ప్రె్‌సవేను చిలకలూరిపేట బైపా్‌సకు కలిపితే, సీమ నుంచి వచ్చే వాహనాలు అక్కడినుంచి నేరుగా ఎన్‌హెచ్‌ 16 ద్వారా విశాఖ వెళ్లవచ్చన్న అంశంపైనా చర్చ సాగినట్లు తె లిసింది. కేంద్రం ఆమోదించిన ఆర్‌ఓడబ్ల్యూ ప్ర కారం అనంతపురం జిల్లా మర్రూరు నుంచి చిలకలూరిపేట, ప్రత్తిపాడు, ఫిరంగిపురం ప్రాంతాల నుంచి తాడికొండ మండలం పెద్దపరిమి దాకా రహదారిని ప్రతిపాదించారు.

కేటీఆర్ నెక్స్ట్ సీఎం..! సూచనగా కెసిఆర్ ఏమిచేసాడంటే…

ఇప్పటివరకు తెరాసకి సంబంధించిన కీలక నిర్ణయాలన్ని సీఎం కెసిఆర్ తీసుకునేవాడు కానీ ఇక నుంచి ఆ బాధ్యత మంత్రి కేటీఆర్‌ తీసుకోనున్నారు. అందుకు సూచనగా త్వరలోనే జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల ఎంపికను కేటీఆర్‌ కి అప్పంగించారు కెసిఆర్.

త్వరలోనే కేటీఆర్‌ ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ సన్నాహాలు కూడా చేస్తున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో… రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ కేటీఆర్ ఛాయిస్ ఇవ్వడం వెనుక రాజకీయ మతలబు చాలానే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

గతంలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల భాధ్యత, అంతకు ముందు హుజుర్ నగర్ ఉపఎన్నిక బాధ్యతలను కేటీఆర్ కి అప్పగించడం, వాటిల్లో తెరాస అఖండ మెజారిటీ సాధించడం వల్ల తెరాసలో కేటీఆర్ క్రెడిట్ అంతకంత పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికని కూడా కేటీఆర్ కి అప్పగించడం వెనుక కూడా కెసిఆర్ ఆలోచన వేరే ఉందటున్నారు.

రాజ్యసభ సీటు ఆశిస్తున్న వారిలో పలువురు కేటీఆర్‌ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఆయన అపాయింట్మెంట్ కోసం సదరు అభ్యర్థులు పడిగాపులు కాస్తున్నారు. దింతో కేటీఆర్ ఇమేజ్, తెరాసలో మరింతగా పెరుగుతుంది. కెసిఆర్ వ్యూహం కూడా అదే అయ్యిఉండొచ్చు అనేది అనేకమంది అభిప్రాయం.

Sindura Raut Hot Photos

Pooja Hegde The Magazine Cover Photoshoot Stills

హైపర్ ఆది స్కిట్ లో దొరబాబు స్థానం ఎవరికి?


బుల్లితెర జబర్దస్త్ కామెడీ షోలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దొరబాబు, పరదేశీ.. వ్యభిచారం చేస్తూ పట్టుబడటంతో జబర్దస్త్ ఫ్యామిలీ షాక్ కి గురైంది. స్కిట్ లో నటించే సందర్భంలో హైదర్ ఆది వీరి పై ద్వందార్థం (డబల్ మీనింగ్) పదాలు వాడే వారు. దొరబాబూ యూట్యూబ్ లో బాగా పాపులర్ అని, ఆయన అసభ్యకర దృశ్యాలు చూస్తారని, అవే చేస్తారని సరదాగా హైపర్ ఆది అనేవాడు అయితే వాళ్ళు నిజంగానే అలాంటి పని చేసి దొరకటం అందర్నీ షాక్ కి గురిచేసింది. ఈ నేపథ్యంలో కామెడీ షో నుంచి దొరబాబు, పరదేశీలను తొలగించే విధంగా జబర్దస్త్ యాజమాన్యం ఆలోచిస్తుంది. అయితే హైపర్ ఆది స్కిట్ లో వీరిద్దరి స్థానంలో ఎవరని తీసుకుంటుంది ఇంకా తెలియాల్సి ఉంది.

హైపర్ ఆది స్కిట్ లో నటించే దొరబాబును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలోని ఒక వ్యభిచార గృహంలో పోలీసులు దొరబాబును, మరో నటుడు పరదేశీ అదుపులోకి తీసుకున్నారు. మాధవదారిలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దొరబాబు, పరదేశీతో పాటు ఒక మహిళ, నలుగురు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా దొరబాబు, పరదేశీ నుంచి 20 వేల నగదును కూడా పోలీసులు సీజ్ చేశారు.

పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

ప్రముఖ పాత్రికేయుడు, సీనియర్‌ జర్నలిస్టు, సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

1934 ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లా పుత్తూరులో జన్మించిన పొత్తూరి.. పత్రికా రంగంలో 5 దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. 1957లో ఆంధ్ర జనతా పత్రికతో పాత్రికేయ వృత్తిలో ప్రవేశించిన ఆయన ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్తలలో పని చేశారు.

ఈనాడు ప్రారంభ సమయంలో ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. తెలుగులో తాత్విక పాదాల నిఘంటువు `ఆధ్యాత్మిక పదకోశం’ రచించారు. 2000లో ‘నాటి పత్రికల మేటి విలువలు’ పేరిట పుస్తకం రచించారు.

అదే విధంగా 2001లో చింతన, చిరస్మరణీయులు పుస్తకాలను రచించిన పొత్తూరి వెంకటేశ్వరరావు.. పీవీ గురించి రాసిన ‘ఇయర్‌ ఆఫ్‌ పవర్‌’కు సహ రచయితగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా ఆయన విధులు నిర్వర్తించారు.

2004లో ఏపీ ప్రభుత్వం, నక్సలైట్ల మధ్య జరిగిన చర్యలలో ఆయన కూడా కీలక భూమిక వహించారు. తన స్వగ్రామాన్ని దత్తత తీసుకొని, అభివృద్ధి కోసం కృషి చేశారు.

సీనియర్‌ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వర రావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పొత్తూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు జర్నలిజంలో పొత్తూరి పాత్ర మరువరానిదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వేంకటేశ్వర రావు మృతిపట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పత్రికా, సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన కృషిని, అందించిన సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పొత్తూరి వేంకటేశ్వర రావు అందించిన నైతిక మద్దతును కెసిఆర్ గుర్తుచేసుకున్నారు

కాంగ్రెస్ కుమ్ములాటలతోనే ఎంపీలో రాజకీయ సంక్షోభం!

మధ్య ప్రదేశ్ లో బొటాబొటి ఆధిక్యతతో నెగ్గుకు వస్తున్న తమ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం బిజెపి డబ్బు వెదజల్లుతున్నదని అంటూ కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అందుకోసం రూ 100 కోట్లతో ఒక పధకం సిద్ధం చేశారని అంటూ ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. అయితే ఆ వీడియో నకిలీదని బిజెపి కొట్టిపారవేసింది.

ఇంతలో సుమారు 10 మంది ఎమ్యెల్యేలు కనిపించకుండా పోవడంతో కాంగ్రెస్ లో ఖంగారు బయలుదేరింది. కాంగ్రెస్ కు చెందిన ఆరుగురితో పాటు, మద్దతు ఇస్తున్న ఒకరు స్వతంత్ర, ఒకరు ఎస్పీ, ఇద్దరు బీఎస్పీ సభ్యులు ఉన్నట్లు చెబుతున్నారు.

ఆరుగురిని ఎమ్మెల్యేలను హరియాణాలోని ఓ హోటల్‌కు, మిగిలిన నలుగురిని బెంగళూరుకు బీజేపీ నేతలు తరలించినట్లు ప్రచారం జరిగింది. వీరిలో ఆరుగురిని కాంగ్రెస్‌ నేతలు తిరిగి రప్పించారు. మిగిలిన నలుగురు కర్ణాటకలోని చిక్కమగళూరు సమీపంలో ఓ రిసార్టులో వీరు ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీ నేత ఒకరు రెండు చార్టర్డ్‌ విమానాలు అద్దెకు తీసుకుని.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను రాష్ట్రం దాటించారని మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్‌ ఆరోపించారు.

అయితే ఇదంతా రాజ్యసభ సీట్ కోసం కాంగ్రెస్ లో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు ఫలితం అని తెలుస్తున్నది. ప్రస్తుతం ఎంపీ నుండి మూడు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రెండు సీట్లు గెల్చుకొనే అవకాశం ఉన్న కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి వ్యతిరేక వర్గంగా పేరొందిన దిగివజాయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా పోటీ పడుతున్నారు.

వారిద్దరూ మొన్నటి లోక్ సభ ఎన్నికలలో ఓటమి చెందగా, దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ సభ్యత్వం ఈ నెలలోని ముగియనున్నది. అయితే ఒకరికి మాత్రమే సీట్ ఇచ్చి, మరొకరు కొత్తవారికి ఇవ్వాలని ముఖ్యమంత్రి పట్టుబడుతున్నారు.

కాంగ్రెస్ లో గల కుమ్ములాటలు ఆసరాగా తీసుకొని, రెండు అభ్యర్థిని కూడా గెలిపించుకోవాలని బిజెపి ప్రయత్నం చేస్తున్నది. అప్పుడు కాంగ్రెస్ నుండి ఒక్కరు మాత్రమే గెలుపొందగలరు.

కాంగ్రెస్ ఎమ్యెల్యేలు `అపహరణ’కు గురవుతున్నట్లు దిగివిజయ్ సింగ్ చెప్పడమే గాని ముఖ్యమంత్రి నోరు మెదపక పోవడం గమనార్హం. ఇదంతా రాజ్యసభ సీట్ల కోసం జరుగుతున్న నాటకంగా పలువురు భావిస్తున్నారు.

‘నమస్తే’ పాటించండి… ఇజ్రాయెల్ ప్రధాని హితవు

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కలకలం రేపెడుతున్న కరోనా వైరస్ మహమ్మారిని తట్టుకోవడానికి భారతీయ ఆచార వ్యవహారాలను అనుసరించాలని ఇప్పుడు ప్రపంచం గుర్తిస్తున్నది. తాజాగా, ఇతరులను కలిసినప్పుడు కరచాలనం చేయడాన్ని కొన్ని రోజులపాటు విడిచిపెట్టాలని.. భారత ప్రజలు పలకరింపులకు వాడే ‘నమస్తే’ విధానాన్ని పాటించాలని తమ దేశ ప్రజలకు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెత న్యాహూ సలహానిచ్చారు.

కరోనా వైరస్ దెబ్బతో మన పార్లమెంట్ సభ్యులు సహితం ఒకరికొకరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం మానేశారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఎంపీలు ‘‘షేక్ హ్యాండ్ వద్దు.. నమస్తే ముద్దు” అంటూ రెండు చేతులు జోడించి పలుకరించు కోవడం కనిపిస్తున్నది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు సహితం లాబీల్లో కలుసుకున్నాప్పుడు ఇతర ఎంపీలకు, మీడియా ప్రతినిధులకు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు. రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకుందామని సూచించారు.

కరోనా వైరస్ కారణంగా షేక్ హ్యాండ్స్‌ను కొంత కాలం మానేయడమే మంచిదని చెబుతున్నారు. చైనాలో కాళ్లతో పలకరించుకునే పరిస్థితి వచ్చిందని, మనకు అలాంటి పనిలేదని తెలిపారు. సంప్రదాయం ప్రకారం నమస్కారం (చేతులు జోడించి ) చెప్పుకుంటే సరిపోతుందని, అదే ఆరోగ్యానికి గొప్ప కానుకని సూచించారు.

మాస్క్ ధరించి వచ్చిన ఎంపీ నవనీత్ టాలీవుడ్ మాజీ నటి, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ముఖానికి మాస్క్ ధరంచి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. కరోనాపై అవగాహన కల్పించేందుకే తాను ఇలా వచ్చినట్లు ఆమె మీడియాకు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఏ చిన్న పొరపాటు చేసినా వైరస్ విజృంభించే అవకాశం ఉందని, సాధ్యమైనంత వరకు ప్రజలు నివారణ చర్యలు పాటించాలని ఆమె హితవు చెప్పారు. పార్లమెంట్ సభ్యులందరికీ స్క్రీనింగ్ చేయాలని, ప్రజలకు సబ్సిడీపై మాస్కులు అందజేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.