
రాజమండ్రిలో జరిగిన జనసేన పార్టీ 6వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న అధినేత పవన్ కళ్యాణ్ అద్భుమైన స్పీచ్ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జనసేన పార్టీ పెట్టటానికి గల కారణాన్ని వివరించారు. రాష్ట్రం విడిపోతున్న సమయంలో ఒక రాష్ట్రము ప్రజలను మరో రాష్ట్రం ప్రజలు తిడుతుంటే చలించిపోయాయని అందుకే ప్రశ్నించే గొంతుగా ఉండాలనే పార్టీ పెట్టటానని పవన్ తెలిపారు. అటు సినీ ఇండస్ట్రీలో ఇటు రాజకీయాల్లో అనేక ఓటములను చవిచూసానని అన్నారు.
ఈ ఆరేళ్ళ జనసేన ప్రయాణంలో అనేక వ్యక్తిగత విమర్శలను ఎదుర్కొని నిలబడ్డాడని, ప్రజలు క్షేమం కోసం తాను ఎన్ని అవమానాలైన భరిస్తానని పవన్ తెలిపారు. భావితరాలకు కుల,మత ప్రాంతీయతత్వం లేని రాజకీయాలను పరిచయం చేయడమే తన లక్ష్యమని పవన్ తెలిపారు. అన్యాయానికి, అవినీతికి ఎదురు నిలబడి, నిస్సహాయులకు అండగా ఉండటంకోసమే తన ముందున్న లక్ష్యమని పవన్ వివరించారు.
ఉత్తరాంధ్రలో తుఫాన్ వస్తే నాలుగు రోజులపాటు చీకటి రాత్రులను గడిపామన్నారు. పక్కనే పర్యటిస్తున్న జగన్ ఆ జిల్లా వైపు కూడా చూడలేదని పవన్ వెల్లడించారు. కానీ ఓట్లు మాత్రం రౌడీలకు వేశారన్నారు. అలాంటి వాళ్ళను గెలిపించారంటే తప్పు ఎవరిదని పవన్ ప్రశ్నించారు. తనని గెలిపించిన, గెలిపించకపోయినా తాను మాత్రం ప్రజల కోసం నిలబడతానని పవన్ వ్యాఖ్యానించారు.