Home Blog Page 8587

అనుష్క బాటలో పూజా హెగ్డే

ఇపుడు తెలుగు చిత్రాల ట్రెండ్ మారింది. పెద్ద, చిన్న అన్న తేడా లేదు. సినిమా బాగుంటే ఎవరు హీరో, ఎవరు హీరోయిన్ అన్న పట్టింపు లేకుండా ప్రేక్షకులు సినిమాల్ని ఆదరిస్తున్నారు. ఆ క్రమంలో హీరోయిన్ లు గ్లామరస్ పాత్రలతో పాటు , తమలోని నటిని సంతృప్తి పరిచే పాత్రల్లో కనిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

గత కొంత కాలం గా అనుష్క, నయనతార, సమంత, కీర్తి సురేష్ వంటి అగ్రతారలు కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఓటు వేస్తున్నారు. కొత్త హీరోయిన్లు ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా వీరి జాబితాలో గ్లామర్ తార పూజా హెగ్డే కూడా చేరబోతుంది. అంటే బుట్ట బొమ్మ ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.

ఇటీవల `అల వైకుంఠపురములో` చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇప్పుడు ప్రభాస్ సరసన ” ఓ డియర్ ” చిత్రంలో నటిస్తోంది. . దీంతోపాటు అఖిల్ హీరోగా చేస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” చిత్రం లో కూడా నటిస్తోంది.. అలాగే త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోయే నూతన చిత్రంలోనూ నటిస్తోంది. ఇదిలా ఉండగా గ్లామరస్ పాత్రలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మకి ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించేందుకు ఆఫర్ వచ్చిందట.

“అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, లై, పడి పడి లేచే మనసు ” వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు హను రాఘవపూడి ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని రూపొందించేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ క్రమము లో పూజా హెగ్డే ని సంప్రదించగా.. ప్రాథమికంగా ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఇదే నిజమైనట్టయితే తొలిసారి పూజాహెగ్డే ని ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో చూడ బోతున్నాం అన్నమాట… లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కలిసొస్తే ఓకే కానీ.. ఫెయిలైతే మాత్రం ఆ హీరోయిన్ పరిస్థితి గ్లామర్ పాత్రలకు పనికి రాకుండా పోతుంది. దాంతో ఆ హీరోయిన్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారు అవుతుంది.

అందుకే పూజా హెగ్డే ఒకటికి రెండు సార్లు అలోచించి నిర్ణయం తీసుకొంటే బాగుంటుంది అని సన్నిహితులు సూచిస్తున్నారట. .think before while you leap

జగన్ పై జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా తెలివైన వ్యక్తని టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్ కుమార్ ను కలిసేందుకు ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చిన జేసీ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ చాలా తెలివైనవారని.. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ తగ్గిందని.. ప్రతిపక్షం అయినంత మాత్రాన అన్నీ విమర్శించాలని లేదన్నారు.

ఒకవైపు జగన్‌ ని పొగుడుతూనే మరోవైపు ప్రభుత్వ పని తీరుపై జేసీ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఈసీ, గవర్నర్ ఎవరూ ఉండకూడదని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఒక్కరే ఉండి.. పోలీసులు ఉంటే సరిపోతుందంటూ జగన్ తీరును జేసీ ఎండగట్టారు. రాష్ట్రంలో ఓ భస్మాసురుడు ఉన్నాడని, తన నెత్తిమీద తానే చేయి పెట్టుకుంటున్నాడని, ఆ భస్మాసురుడు ఎవరో ప్రజలకు తెలుసని జేసీ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో పోలీసుల పనితీరు బాగోలేదని, వారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాబట్టి ప్రతి పోలింగ్ బూత్‌ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు జేసీ తెలిపారు. అందుకే రమేష్‌ కుమార్‌ ను కలిశానని.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఎన్నికల సంఘం దగ్గర డబ్బులు లేకపోతే తమ పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయి.. ఇస్తామన్నారు. ఇక కోర్టులు ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవని జేసీ వ్యాఖ్యానించారు.

యస్‌ బ్యాంక్‌ సంక్షోభంలో అనిల్ అంబానీకి ఈడీ షాక్

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తొలిసారి హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలోకి అడుగు పెట్టినప్పుడు చాలా దూకుడుగా కనిపించారు. గతంలో అధ్యక్షులుగా పనిచేసిన జి కిషన్ రెడ్డి, డా కె లక్ష్మణ్ వలెనే కేసీఆర్, ఎంఐఎం లపైననే గురి పెట్టారు. పైగా వాళ్ళను తుక్డేగాళ్ళంటూ వారి సంగతేదో తెలుస్తా అని సంబధం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు ఇక చరమగీతం పాడిన్నట్లే అంటూ భరోసా వ్యక్తం చేశారు.

తెలంగాణలో కేసీఆర్ కు ప్రత్యామ్న్యాయం బీజేపీయే అంటూ ఇతర పార్టీ నాయకుల వలే పాట పాడారు. అయితే మునిసిపల్ ఎన్నికల సందర్భంగా భైంసాలో అల్లర్ల పట్ల ఒక విధంగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మాటలకు పరిమితమై బాధితులకు అండగా నిలబడలేదన్న అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.

అల్లర్లు సృష్టించిన తుక్డేగాళ్ల సంగతేంటో తేలుస్తానని అంటూ పసిపిల్లల్ని చేతిలో పట్టుకుని తమపై పెట్రోల్ పోసి చంపేస్తున్నారంటూ ఆడపడుచులు ఆర్తనాదాలు చేసే పరిస్థితి అక్కడ తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లందరినీ పరామర్శించేందుకు భైంసా వస్తానని చెప్పారు.

ఆ అల్లర్లలో నిలువ నీడ లేకుండా పోయి చెట్ల కింద బతుకుతున్న నిరుపేదల్ని, అక్రమ కేసులతో జైళ్లలో పెట్టిన తమ్ముళ్లను కలిసి అండగా ఉంటామని భరోసా ఇస్తానని తెలిపారు.  భరోసా బాధితులకు గతంలో ప్రకటించిన రూ 5 లక్షల విరాళాన్ని ఈ సందర్భంగా నిజామాబాదు ఎంపీ డి అరవింద్ సంజయ్ కు అందజేయడం ద్వారా తెలంగాణలో బిజెపికి నూతన వైభవం తీసుకు రావడంతో తాము తోడు, నీడగా ఉంటామనే సంకేతం ఇచ్చారు.

ఒక విధంగా నిన్న, మొన్నటి వరకు కరీంనగర్ నగరానికి పరిమితమైన నాయకుడు, గత ఏడాది లోక్ సభకు ఎన్నిక కావడం, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కావడం ఇతర సీనియర్ నేతలకు మింగుడు పడటం లేదని కలవికాలంగా కనిపించిన వారి ముఖాలే స్పష్టం చేస్తున్నాయి. జాతీయ వాదమే ఊపిరిగా బీజేపీలో సామాన్య కార్యకర్తగా పని చేస్తున్న తనకు రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించడం పార్టీ గొప్పదనమని, ప్రతి కార్యకర్తకు దక్కిన గౌరవమని చెప్పడం ద్వారా పార్టీలో కార్యకర్తలకు గౌరవం కలిగిస్తామని సంకేతం ఇచ్చారు.

అయితే ప్రజలలో ఎటువంటి పలుకుబడి లేకుండా, పార్టీ రాష్త్ర అధ్యక్షుల చుట్టూ తిరుగుతూ గతం దశాబ్ద కాలంగా కీలక పదవులను కైవసం చేసుకొంటున్న వారే ఎక్కువగా వేదిక అంత అనింది ఉండడం జరిగింది. సంస్థాగతంగా బలంగా ఉండడంతో పాటు నాయకత్వ లోటు ఎదుర్కొంటున్న పార్టీని రాష్ట్రంలో ఏ విధంగా గాడిలో పెట్టదలిచానో అనే అంశంపై ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు.

అదే విధంగా రాష్ట్రంలో పార్టీకి వైభవం తీసుకు రావడానికి కూడా తన ముందున్న ఎజెండాను సహితం సూచించే ప్రయత్నం చేయలేదు. సంస్థాగతంగా రాష్ట్రంలో పార్టీకి భారీ శస్త్ర చికిత్స చేయవలసి ఉంది. అందుకు ఆయనకు స్వతంత్రం లభిస్తుందా? అలంకారపు బొమ్మగా మిగిలిపోతారా అన్నది ముందు, ముందు గాని తెలియదు.

దూకుడుగా బండి సంజయ్… కేసీఆర్, ఎంఐఎం లపైనే గురి!

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తొలిసారి హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలోకి అడుగు పెట్టినప్పుడు చాలా దూకుడుగా కనిపించారు. గతంలో అధ్యక్షులుగా పనిచేసిన జి కిషన్ రెడ్డి, డా కె లక్ష్మణ్ వలెనే కేసీఆర్, ఎంఐఎం లపైననే గురి పెట్టారు. పైగా వాళ్ళను తుక్డేగాళ్ళంటూ వారి సంగతేదో తెలుస్తా అని సంబధం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు ఇక చరమగీతం పాడిన్నట్లే అంటూ భరోసా వ్యక్తం చేశారు.

తెలంగాణలో కేసీఆర్ కు ప్రత్యామ్న్యాయం బీజేపీయే అంటూ ఇతర పార్టీ నాయకుల వలే పాట పాడారు. అయితే మునిసిపల్ ఎన్నికల సందర్భంగా భైంసాలో అల్లర్ల పట్ల ఒక విధంగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మాటలకు పరిమితమై బాధితులకు అండగా నిలబడలేదన్న అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.

అల్లర్లు సృష్టించిన తుక్డేగాళ్ల సంగతేంటో తేలుస్తానని అంటూ పసిపిల్లల్ని చేతిలో పట్టుకుని తమపై పెట్రోల్ పోసి చంపేస్తున్నారంటూ ఆడపడుచులు ఆర్తనాదాలు చేసే పరిస్థితి అక్కడ తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లందరినీ పరామర్శించేందుకు భైంసా వస్తానని చెప్పారు.

ఆ అల్లర్లలో నిలువ నీడ లేకుండా పోయి చెట్ల కింద బతుకుతున్న నిరుపేదల్ని, అక్రమ కేసులతో జైళ్లలో పెట్టిన తమ్ముళ్లను కలిసి అండగా ఉంటామని భరోసా ఇస్తానని తెలిపారు.  భరోసా బాధితులకు గతంలో ప్రకటించిన రూ 5 లక్షల విరాళాన్ని ఈ సందర్భంగా నిజామాబాదు ఎంపీ డి అరవింద్ సంజయ్ కు అందజేయడం ద్వారా తెలంగాణలో బిజెపికి నూతన వైభవం తీసుకు రావడంతో తాము తోడు, నీడగా ఉంటామనే సంకేతం ఇచ్చారు.

ఒక విధంగా నిన్న, మొన్నటి వరకు కరీంనగర్ నగరానికి పరిమితమైన నాయకుడు, గత ఏడాది లోక్ సభకు ఎన్నిక కావడం, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కావడం ఇతర సీనియర్ నేతలకు మింగుడు పడటం లేదని కలవికాలంగా కనిపించిన వారి ముఖాలే స్పష్టం చేస్తున్నాయి. జాతీయ వాదమే ఊపిరిగా బీజేపీలో సామాన్య కార్యకర్తగా పని చేస్తున్న తనకు రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించడం పార్టీ గొప్పదనమని, ప్రతి కార్యకర్తకు దక్కిన గౌరవమని చెప్పడం ద్వారా పార్టీలో కార్యకర్తలకు గౌరవం కలిగిస్తామని సంకేతం ఇచ్చారు.

అయితే ప్రజలలో ఎటువంటి పలుకుబడి లేకుండా, పార్టీ రాష్త్ర అధ్యక్షుల చుట్టూ తిరుగుతూ గతం దశాబ్ద కాలంగా కీలక పదవులను కైవసం చేసుకొంటున్న వారే ఎక్కువగా వేదిక అంత అనింది ఉండడం జరిగింది. సంస్థాగతంగా బలంగా ఉండడంతో పాటు నాయకత్వ లోటు ఎదుర్కొంటున్న పార్టీని రాష్ట్రంలో ఏ విధంగా గాడిలో పెట్టదలిచానో అనే అంశంపై ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు.

అదే విధంగా రాష్ట్రంలో పార్టీకి వైభవం తీసుకు రావడానికి కూడా తన ముందున్న ఎజెండాను సహితం సూచించే ప్రయత్నం చేయలేదు. సంస్థాగతంగా రాష్ట్రంలో పార్టీకి భారీ శస్త్ర చికిత్స చేయవలసి ఉంది. అందుకు ఆయనకు స్వతంత్రం లభిస్తుందా? అలంకారపు బొమ్మగా మిగిలిపోతారా అన్నది ముందు, ముందు గాని తెలియదు.

 

దిగజారిన జగన్ సర్కార్!

గత కొంతకాలంగా ప్రజల్లో కరోనా వైరస్ భయాలు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో 2020 ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. దీంతో వైసీపీ నేతలు ఈసీ రమేష్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా పలువురు వైసీపీ నేతలు ఆయనను వ్యక్తిగతంగా దూషించడం అనేది వారి దిగజారిన రాజకీయాలకు సూచనగా ఉందని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు.

“నమ్మగడ్డ రమేష్ కుమార్ కి చంద్రబాబు వైరస్ సోకందని” మంత్రి పేర్ని నాని విమర్శించగా, “ఆయనకు కుల పిచ్చి ఉందని, ఆయనను చూసి సిగ్గుపడాలని, ఆయనను నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని పిలవొద్దని, నారావారి గబ్బిలం అని” పిలవాలని మంత్రి విజయ్ సాయి రెడ్డి విమర్శించాడు. అంతేకాకుండా సీఎం జగన్ కూడా ఈసీ ని పలు విధాలుగా విమర్శించారు. “ఆయనని మేము నియమించలేదని, చంద్రబాబు ఏరికోరి తెచ్చుకున్న అధికారని, ఆయన విచక్షణను కోల్పోయి (పిచ్చిపట్టి) ప్రవర్తిస్తున్నారని సీఎం జగన్ విమర్శించడం గమనార్హం.

అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనే ఒక రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలో ఉన్న వ్యక్తిపట్ల వ్యక్తిగత విమర్శలు చేయడంపై జగన్ సర్కార్ పై వ్యతిరేకత గళం వినిపిస్తోంది. రాజకీయాలలో ప్రతిపక్ష,పాలక పక్ష నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఉండటం సహజం. కానీ, చట్ట బద్ధమైన వ్యవస్థలో ఉన్న వ్యక్తిపట్ల, అదే విధంగా “రైట్ టు రిప్లై” ని అమలపరచలేని వ్యక్తిపట్ల, వైసీపీ నేతలు ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం ఎంతవరకు సబబు?. ఈసీ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు చేయొచ్చు కానీ ఆయనను వ్యక్తిగతంగా విమర్శించడం న్యాయం కాదనేది అనేకమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

భారతీయ చట్ట పరిధిలో ఉన్న వ్యక్తిపై రాజకీయ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల వారి స్థాయిని వారే తగ్గించుకుంటున్నారని, అందులో సీఎం జగన్ కూడా ఉండటం గమనార్హం అని, దీంతో ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకుంటున్నారని పలువురు వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

ఈసీ ఆదేశాలను జగన్ ప్రభుత్వం పాటిస్తుందా!

కరోనా వైరస్ కారణం చూపి ఒక వంక స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ వాయిదా వేయడంతో తీవ్ర అసహనం, ఆగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ .జగన్మోహన్‌రెడ్డి వ్యక్తం చేస్తూ ఉండడంతో కమీషన్ ఆదేశాలను ప్రభుత్వం ఏమేరకు పాటిస్తుందనే అంశం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నది. 
 
ఒక వంక కమీషన్ ఆదేశాలను సుప్రీం కోర్ట్ లో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవంక వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ కమీషన్ కు లేఖ వ్రాసారు. 
 
ఇలా ఉండగా, రెండు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రెండు సబ్‌డివిజన్ల డీఎస్పీలు, నలుగురు సీఐలపై వేటుకు కమీషన్ సిఫారసు చేయడం ఇప్పటికి అధికార వర్గాలలో దిగ్బ్రాంతి కలిగిస్తున్నది. తాము అధికార పక్షం, కమీషన్ ల మధ్య నలిగిపోతున్నామనే అభిప్రాయం వారిలో వ్యక్తం అవుతున్నది. ఈ అధికారులపై చర్యలు తీసుకొనే అంశమై కమీషన్ ఆదేశాలను ప్రభుత్వం ఏ మేరకు అమలు పరుస్తుందని చర్చ జరుగుతున్నది. అమలు పరచని పక్షంలో రాజ్యాంగ సంక్షోభకార పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నది. 
 
సుప్రీం కోర్ట్ మరో విధంగా ఆదేశం ఇస్తే మినహా ఎన్నికలు ఆరు నెలలు వాయిదా పడడంతో కనీసం మరో రెండు నెలల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. దానితో ఎన్నికల విధులతో సంబంధం గల అధికారుల పనితీరుపై కమీషన్ దృష్టి ఉంటుందనే సంకేతం ఇప్పుడు వ్యక్తమయింది. మొన్నటి వరకు వలే అధికారపక్షపు ప్రయోజనాలకోసం ఏకపక్షంగా వ్యవహరించలేని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. 
 
పోలీస్, రెవిన్యూ యంత్రాంగం తమకు వ్యతిరేకంగా వ్యవహరించక పోయినా `ఏకపక్షంగా’  ఎన్నికలు జరిగేటట్లు సహకరించని పక్షంలో ఇబ్బందులు తప్పవనే జంకు ఇప్పటికే అధికార పక్ష నేతలలో వ్యక్తం అవుతున్నది. తమ ఆగడాలపై కమీషన్ జోక్యం చేసుకొని కేసుల నమోదు వరకు వెడితే భవిష్యత్లో సమస్యలు తలెత్తగలవని ఆందోళన చెందుతున్నారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పెచ్చుమీరిన హింసను కట్టడి చేయాల్సిన పోలీసులు చాలాచోట్ల అధికార పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. హింసాత్మక ఘటనలు తీవ్రంగా పరిగణిస్తున్నామని, అన్నింటినీ పరిశీలిస్తామని ఈసీ చేసిన వ్యాఖ్యలు పోలీసుల్ని కలవారానికి గురిచేస్తున్నాయి. దానితో రాబోయే రెండు నెలల వరకు అధికార యంత్రాంగం ఇప్పటి వలే అధికార పక్షానికి పూర్తిగా సహకరించక పోవచ్చనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. 

Telugu Film Chamber Press meet

మరో కోణంలో వేడెక్కిన ఏపీ స్థానిక ఎన్నికలు!

ఆంధ్రప్రదేశ్ లో స్థానిరమేష్ కుమార్ వెల్లడించారు. కరోనా కారణంగా ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఏపీ ఈసీ రమేష్ కుమార్.

దీనిపై వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రమేష్ కుమాక ఎన్నికల పోరు మరో కోణంలో వెడ్డెక్కాయి. 2020 స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఎన్నికల కమిషనర్ ర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారని జగన్ ఫైర్ అయ్యారు. విచక్షణాధికారం అనే పదం వాడటం ప్రతిఒక్కరికి అలవాటైపోయిందని మండిపడ్డారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకతీతంగా వ్యవహరించాల్సిన అధికారి..ఇలా టీడీపీకి వత్తాసు పలకడం దారుణం అని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు వైరస్ ఉందని పేర్ని నాని, నారావారి గబ్బిలం అని విజయ సాయి రెడ్డి రమేష్ కుమార్ ని వ్యక్తిగతంగా విమర్శలు చేశారు.

ఎన్నికల వాయిదా వివాదాన్ని సీఎం జగన్, గవర్నర్ విశ్వభూషణ్ కు ఫిర్యాదు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. దీంతో స్థానిక ఎన్నికల వాయిదా పంచాయతీ గవర్నర్ దగ్గరకు చేరింది.

రమేష్ కుమార్ గవర్నర్ కు ఎలాంటి రిపోర్టు ఇస్తారు? తన నిర్ణయాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? అనేది పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సీఎం జగన్ తీవ్ర ఆరోపణల తర్వాత రమేష్ కుమార్ గవర్నర్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల కమిషనర్ వివరణ తర్వాత గవర్నర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఆసక్తి నెలకొంది.

రాష్ట్రపతికి నిర్భయ దోషుల కుటుంబసభ్యుల లేఖ

నిర్భయ దోషులకు ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన నాలుగో డెత్ వారెంట్ ప్రకారం మార్చి 20,2020 ఉదయం 5గంటల 30నిమిషాలకు నలుగరు నిందితులను ఒకేసారి ఉరితీయనున్నారు. అయితే ఈ విషయంపై దోషుల కుటుంబసభ్యులు రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు. దోషులను యుథనేసియా (నొప్పిలేకుండా) పద్దతిలో ఉరి తీయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

నలుగురు దోషుల కుటుంబసభ్యుల నుంచి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు 13లెటర్లు వచ్చాయి. ఇందులో రెండు లెటర్లను నిందితుల్లో బకడైన ముఖేష్ కుటుంబసభ్యులు పంపించినవి కాగా,మరో నిందుతుడైన అక్షయ్ కుటుంబస్యభులు పంపినవి 3లెటర్లు ఉన్నాయి. ఇక మిగిలిని ఇద్దరు నిందితులు పవన్,వినయ్ ల కుటుంబసభ్యులు ఒక్కొక్కరు నాలుగేసి చొప్పున రాష్ట్రపతికి లేఖలు పంపారు. ఆ లేఖలలో దోషులను మెర్సీ కిల్లింగ్ (దయతో నొప్పి లేకుండా చంపే) పద్దతిలో శిక్షను అమలు చేయని పేర్కొన్నారు.

Neha Sharma New Glamourous Pics

Meera Chopra Latest Photo Stills

దేశంలో 107 కరోనా పాజిటివ్ కేసులు


భారత్‌లో కోవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య 107కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వారిలో విదేశీయులు 17 మంది ఉన్నారు. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఇప్పటి వరకు దేశంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. కాగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజు రోజుకూ విస్తరిస్తుండడంతో… కేంద్ర ప్రభుత్వం దీనిపై ‘‘అధికారిక విపత్తు’’ తరహాలో స్పందించాలని నిర్ణయించింది.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. అందులో తొలి కరోనా పేషెంట్ గాంధీ ఆస్పత్రిలో చికిత్ప పొందిన తర్వాత పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. అయితే రాష్ట్రంలో రెండో కరోనా కేసు నమోదైనట్లు శనివారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు.

మరో రెండు శాంపిల్స్ విషయంలో అనుమానం ఉండడంతో పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. వాటిలో ఓ శాంపిల్ పాజిటివ్ వచ్చింది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య మూడుకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా అన్ని రాష్టాల్లో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి నమోదైన కరోనా కేసులను కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 33 మంది, కేరళలో 22 మంది కరోనా బారినపడినట్లు తెలిపింది. హర్యానాలో 14 మందికి కరోనా వైరస్ సోకగా.. వారంతా విదేశీయులేని పేర్కొంది.

ఉత్తరప్రదేశ్‌లో 11, ఢిల్లీలో 7, కర్ణాటకలో 6, తెలంగాణలో 3, లఢఖ్‌లో 3, జమ్ము కశ్మీర్‌లో 2, రాజస్థాన్‌లో 2 కరోనా కేసులు నమోదైనట్టు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక తమిళనాడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్కో కరోనా పేషెంట్ చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది.

మధ రివ్యూ: థ్రిల్లర్ చిత్రాల్లో కొత్త అడుగు

నటీనటులు : త్రిష్నా ముఖర్జీ, రాహుల్
దర్శకత్వం : శ్రీవిద్య బ‌స‌వ
నిర్మాత‌లు : ఇందిరా బ‌స‌వ‌
సంగీతం : న‌రేశ్ కుమ‌ర‌న్‌

కొత్తగా చిత్రాలు నిర్మించే వారు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే వాళ్లకి దగ్గర దారి థ్రిల్లర్ జానర్. ఇలాంటి చిత్రాలయితే ఖర్చు తక్కువ ప్రేక్షకుల రీచ్ ఎక్కువ. ఒకవేళ చిత్రం అటూ ఇటూ అయినా నిర్మాతలకు పెద్ద ఎఫెక్ట్ పడదు. అలాంటి ఫార్ములాని నమ్ముకొని నూతన దర్శకురాలు శ్రీ విద్య బసవ నిర్మించిన చిత్రం “మధ”. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని చూడక ముందే విశ్వ వ్యాప్తంగా ఉన్న పలు దేశాలు ఈ సినిమాని ఫెస్టివల్స్ లో చూసి 26 అవార్డులు ఇచ్చాయి.

కథ :
అనాధ అయిన నిషా (త్రిష్ణా ముఖర్జీ ) ఒక యాడ్ ఏజెన్సీ లో ప్రూఫ్ రీడర్ గా పని చేస్తుంటుంది.పబ్ లు ఫ్రెండ్స్ అంటూ హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తుంటుంది. ఆ సమయంలో అర్జున్ అనే ఒక వీడియో జర్నలిస్ట్ పరిచయమౌతాడు.వారిద్దరి పరిచయం ప్రేమకు దారి తీస్తుంది. అంతలో ఊహించని రీతిలో నిషా విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటుంది. దాంతో అందరూ ఆమెను పిచ్చిదానిగా ముద్ర వేసి మెంటల్ అసైలం కు పంపుతారు. అక్కడ రకరకాల చిత్రహింసలు చవి చూసిన నిషా చివరకు ఎలా బయటికి వచ్చింది అన్నదే చిత్ర కథ.

దర్శకత్వం:
గత అనుభవం లేక పోయినా తాను వ్రాసుకొన్న కథని తెర కెక్కించడం లో దర్శకురాలు శ్రీవిద్య బసవ చూపిన ప్రతిభ మెచ్చుకో తగిన రీతిలో ఉంది. చిన్న , చిన్న పొరబాట్లు ఉన్నప్పటికీ మొత్తం మీద సినిమాని ఆసక్తిగానే మలిచింది. సినిమా కధకు తగ్గ వాతావరణం ఎంచుకోవడంలో దర్శకురాలు తీసుకొన్న శ్రద్ద శ్లాఘనీయం. సాధారణ థ్రిల్లర్ కధకి సైన్స్ జోడించడమే చిత్రం లో ఉన్న కొత్త పాయింట్. ఆ పనిని శ్రీవిద్య బసవ బాగా నిర్వర్తించింది. కానీ హీరో పాత్రని మౌల్డ్ చేయడంలో కొంచెం పాత రూటులోనే వెళ్ళింది.గతంలో కృష్ణ నటించిన గూడుపుఠాణి, చిరంజీవి నటించిన రాజా విక్రమార్క ఫార్ములానే ఈ చిత్రం లో కూడా ఫాలో అవ్వడం జరిగింది. అదొక్కటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక మిగతా సినిమాలో టెంపో బాగానే మెయింటైన్ చేసింది. దర్శకురాలిగా మంచి మార్కులు కొట్టేసింది.

నటీ నటులు :
మధ చిత్రం లోని నటీనటుల గురించి చెప్పుకోవాలంటే ముందుగా హీరోయినే త్రిష్ణా ముఖర్జీ గురించి చెప్పుకోవాలి. ఈమె తన అసాధారణ ప్రతిభ తో సినిమా మొత్తం రక్తి కట్టించింది. హిందీ లో క్రైమ్ పెట్రోల్ వంటి సీరియల్స్ , జాంగో వంటి థ్రిల్లర్ మూవీస్ చేసిన అనుభవం త్రిష్ణ ముఖేర్జీ కి బాగానే పనికొచ్చింది. సినిమా మూడ్ కి తగట్టు నటించి మెప్పించింది. ఇక హీరో పాత్రలో నటించిన వెంకట్ రాహుల్ ఉన్నంతలో బాగానే చేసాడు.మెగా స్టార్ చిరంజీవి సొంత మేనమామ (అంజనీ దేవి గారి తమ్ముడు ) కొడుకు అయిన వెంకట్ రాహుల్ కి ఇంతకు ముందు అలియాస్ జానకి (2013 ) , బిల్లా రంగ ( 2014 ) వంటి చిత్రాల్లో నటించిన అనుభవం వుంది. వాటితో పోల్చుకుంటే ఈ సినిమా లో బెటర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఇక శేఖర్ కమ్ముల స్కూల్ నుంచి వచ్చిన అనీష్ కురువిల్ల విలన్గా బాగా రాణించాడు.

సాంకేతిక నిపుణులు :
మధ సినిమా చూస్తునంత సేపు ప్రేక్షకులు ఒకే మూడ్ లో ఉండటానికి ప్రధాన కారణం సినిమాకి డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ చేసిన అభిరాజ్ నాయర్ అని చెప్పక తప్పదు. ముఖ్యంగా మెంటల్ అసైలం సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా అంతర్జాతీయం గా పలు ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు గెలుచు కొన్నదంటే అందుకు కెమెరా మాన్ నాయర్ ప్రతిభ కూడా ఒక కారణం అని చెప్పక తప్పదు. ఇక సినిమాకి సంగీత అందించిన నరేష్ కుమరన్ కూడా తన శాఖ కి న్యాయం చేకూర్చాడు. ఇక ఎడిటర్ రంజిత్ టచ్ రివర్ కూడా సినిమాని బాగా ఎడిట్ చేసాడు.

విశ్లేషణ :
ఒక డ్రగ్ మాఫియా కధకి సైన్స్, సస్పెన్సు జోడించి దర్శకురాలు సినిమా తీయడం ఒక ఎత్తు. అయితే దాన్ని తెరపై నటీనటులు, సాంకేతిక నిపుణులు రక్తి కట్టించడం మరో ఎత్తు. అవి రెండూ రైలు పట్టాల్లా సమాంతరంగా వెళ్లడం తో సినిమా కి నిండుతనం వచ్చింది. ఆసక్తిని రేపి మనం సినిమా చూసేలా చేసింది. మొత్తం మీద శ్రీ విద్య బసవ తన తొలి ప్రయత్నం లో విజేత అయ్యింది. .
Well begin is half done

ఎపిలో స్థానిక సంస్థ‌ల‌ ఎన్నిక‌ల వాయిదా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో స్థానిక‌ ఎన్నిక‌ల ప్రక్రియ వాయిదా ప‌డింది. క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్న కార‌ణంగా ఎన్నిక‌లను ఆరు వారాల‌పాటు వాయిదా వేస్తున్న‌ట్టు ఆదివారం ఎపి ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ర‌మేష్ కుమార్ ప్ర‌క‌టించారు. పైగా ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడవలు, అవకతవకలపై స్పందించిన ఎన్నికల కమిషన్‌ పలువురి ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంది. అందిన ఫిర్యాదుల మేరకు పలువురి అధికారులను సస్పెండ్‌ చేస్తూ పలువురిని బదిలీ చేస్తూ నిర్ణయం వెలువరించింది.

దానితో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసేముందు ఎవరినైనా అడిగారా?.. చంద్రబాబు పదవి ఇచ్చినంత మాత్రాన ఇంత వివక్షా? అని మీడియా సమావేశంలో సీఎం జగన్‌ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. పైగా చంద్రబాబు సామజిక వర్గానికి చెందిన ఈసీ రమేష్‌ కుమార్‌ విచక్షణ కోల్పోయారని ధ్వజమెత్తారు.

అధికారులను బదిలీ చేసే అధికారం ఈసీకి ఎక్కడిది. అధికారం 151 సీట్లున్న జగన్‌దా..? ఈసీదా..? ఇష్టం వచ్చినట్లు ఎన్నికలను వాయిదా వేస్తారా? ఎస్పీలను మార్చుతారు, కలెక్టర్లను మార్చుతారు. ఇండ్ల పట్టాలు ఇవ్వొద్దంటారు. ఇక సీఎంలు ఎందుకు..? ప్రభుత్వాలు ఎందుకు..? అన్ని ఈసీయే చేసుకోవచ్చుగా. అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఎన్నికల వాయిదా ఆర్డర్‌ తయారవుతున్నట్లు ఈసీ సెక్రటరీకి కూడా తెలియదు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం ఎవరినైనా అడగాలి కదా? కాగా, చిత్తూరు జిల్లా, గుంటూరు జిల్లా కలెక్టర్లను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ అదేవిధంగా ఇరు జిల్లాల ఎస్పీలను బదిలీ చేయాలని ఆదేశాలు జారీచేసింది.

గుంటూరు జిల్లా మాచర్ల సీఐను సస్పెండ్‌ చేసిన ఈసీ శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలపై, తిరుపతి, రాయదుర్గం, తాడిపత్రి సీఐలపై బదిలీ వేటు వేసింది. తిరుపతి, మాచర్ల, పుంగనూరులో అవసరం అయితే కొత్త షెడ్యూల్‌ విడుదల చేస్తామని ఈ అంశం పరిశీలనలో ఉందని ఈసీ పేర్కొంది.

దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యా‌ప్తిచెందుతున్న కార‌ణంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు, ప్ర‌జా ఆరోగ్యం దృష్ట్యా ఎన్నిక‌లు వాయిదా వేసిన‌ట్లు ఇసి తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌క్రియ ర‌ద్దు కాద‌ని, ఏక‌గ్రీవంగా ఎన్నికైన వారు కొన‌సాగుతార‌ని స్ప‌ష్టం చేశారు. అత్యున్న‌త స‌మీక్ష త‌ర్వాతే వాయిదా నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు.

కొన్ని చోట్ల ప‌లువురు బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌ని, ఇందులో భాగంగా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హరించిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇసి వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘర్షణలను కమిషనర్ తప్పుబట్టారు. గుంటూరు, చిత్తూరులో జరిగిన అత్యంత హింసాత్మక ఘటనలు తమ దృష్టికి వచ్చాయని ఆయన తెలిపారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్పీలపై బదిలీ వేటుకు సిఫారసు చేశారు.

తిరుపతి, మాచర్ల, పుంగనూరులో ఘర్షణలపై విచారణకు హెచ్చరించారు. మహిళలు, బలహీనవర్గాలపై దాడులు అత్యంత శోచనీయమన ఇవిచారం వ్యక్తం చేశారు. వలంటీర్లపై ఆరోణల ఆదేశించారు. ఆ మూడు చోట్ల కొత్త షెడ్యూల్‌కు వెనకాడబోమని విషయంలో కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కరోనా ఉపద్రవం లో సరిగమ పదనిసలు

అందరికి నమస్కారాలు. వారాంతం చాలా చాలా తొందరగా వచ్చేస్తుంది. ఈ వారం ప్రపంచం మొత్తం ఒకే వార్త. కోవిద్ 19 అనబడే కరోనా వైరస్ ఇంకా విజృంభించి దాదాపు 145 దేశాలకు పాకింది. చనిపోయినవాళ్లు 5 వేలకు పైమాటే. ఇది సోకిన వాళ్ళు ఒకటిన్నర లక్షదాటింది. చైనాలో కొంతమేర తగ్గుముఖం పట్టుందనుకుంటే మిగతా ప్రపంచం లో భయంకరంగా విస్తరిస్తుంది. కరోనా వైరస్ సోకిన మొదటి పదిహేను దేశాల్లో పది దేశాలు యూరప్ దేశాలే. అలాగే అమెరికా లో కూడా ఇది చాలా వేగంగా విస్తరిస్తుంది. అదృష్టవశాత్తు మనదేశం ప్రపంచ దేశాల్లో చూస్తే 42 వ స్థానం లో వుంది. అయితే ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం మనం రెండో దశలో వున్నాం. ఇది మూడో దశకు వెళ్లకుండా చూసుకోగలిగితే బతికి బట్ట కట్టినట్లే. అందుకే ప్రభుత్వాలు అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైనది ఇతరదేశాలనుంచి వచ్చే వాళ్ళ వీసాలు రద్దుచేయటం. దీనితో సగం ప్రమాదం తప్పినట్లే. ఇక రెండోది ఇప్పటికే సోకినవాళ్లను , వాళ్ళు ఎవరెవరితో తిరిగారో , ఎక్కడెక్కడికి వెళ్లారో గుర్తించి వాళ్ళను పరిశీలనలో ఉంచటం. మూడోది, ఎక్కువమంది ఒకచోట చేరే అన్ని కార్యక్రమాలను రద్దుచేయటం, స్కూళ్ళు, కాలేజీలు, సినిమా హాళ్లు బంద్ చేయటం. అంటే ఇది ఇప్పటికే సోకినవాళ్ళనుంచి మిగతా వాళ్లకు అంటకుండా జాగ్రత్తలు తీసుకున్నారన్నమాట. ఇక మన ముచ్చట్లలోకి వెళ్దామా.

ఈ ఆదివారం చాలావరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారనుకుంటా. ఇదీ ఒకందుకు మంచిదే. ఈ మధ్య ఆదివారాలు, సెలవు రోజులొస్తే ఎవరూ విశ్రాంతి తీసుకోవడంలేదు అందరూ రోడ్లమీదే వుంటున్నారు. కరోనా వైరస్ కొన్ని మంచి పనులు కూడా చేస్తుందన్నమాట. అందర్నీ సెలవురోజున ఇంటిపట్టున ఉంచింది. దానితో మనకు విశ్రాంతితో పాటు మన జీవిత భాగస్వామి, పిల్లలు సంతోషంగా వుంటారు. అయితే ప్రభుత్వం ఓ పనిచేయాలి. అందరూ ఇంటిపట్టున ఉంటే ఆడుకోవటానికి కేరమ్ బోర్డులు, చెస్ బోర్డులు లాంటివి సప్లై చేస్తే బాగుణ్ణు. లేకపోతే అందరూ టీవీ కే అతుక్కుపోతారు. దీనివలన ఇంకో మంచికూడా జరిగిందండోయ్. వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం తగ్గాయంట. ఇప్పటికే పూర్తిగా దిగ్బంధనం చేసిన చైనా, ఇటలీ నగరాల్లో ఈ ఫలితాలు అద్భుతంగా వున్నాయంట. అలాగే ట్రాఫిక్ ఝాముల జంఝాటం లేదంట. కాబట్టి కరోనా వైరస్ పర్యావరణానికి పరోక్షంగా మేలుచేసిందన్నమాట. పోనీలే మన పాలకులు ఎటూ చర్యలు తీసుకోవడంలేదు, కరోనా అన్నా ప్రకృతికి మేలు చేసింది. అలాగే ఎక్కువ కంపెనీలు ఇంటిదగ్గర్నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాయి. ఇది కూడా పర్యావరణానికి ఎంతో మేలుచేస్తుంది. కాకపోతే చిక్కల్లా ఇంటిదగ్గర వాళ్ళను టీలని, కాఫీలని విసిగిస్తున్నారంట. ఆఫీసు లో ఉన్నట్లు ఇంట్లోనూ ఆ వాతావరణం ఉండాలంటే ఎలాకుదురుతుంది చెప్మా. అంతవరకైతే పర్వాలేదు. కొంతమంది సతీమణినో, పిల్లలనో వర్క్ షేర్ చేసుకోమని అడుగుతున్నారంట. ఇంకొంతమంది ఇంటిదగ్గర్నుంచి పనిచేసినా టంచనుగా 10 గంటలకు టిప్ టాప్ గా రెడీ అయి కంప్ట్యూటర్ ముందు కూర్చుంటున్నారంట. అలా అయితేనే వాళ్లకు పనిచేయటానికి మూడ్ వస్తుందంట. కరోనాతో మారిన పని అలవాట్లతో ఎన్నో విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయన్నమాట.

ఇక అమెరికా అధ్యక్షుడిమీద ఎన్నో జోకులు పేలుతున్నాయి. మొదట్లో ట్రంప్ తన సహజ రీతిలో అందర్నీ తిట్టిపోశాడు. అనవసరంగా భయాందోళనలు మీడియా రెచ్చగొడుతుందని ట్వీట్లు చేసాడు. మొదటగా నమోదయిన వాషింగ్టన్, ముఖ్యంగా సియాటిల్ చుట్టుపక్కల ప్రజలు ట్రంప్ నిర్వాకం వలన రెండు వారాలు ఆలస్యంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం వలన జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిందని వాపోతున్నారు. చివరకి తనదాకా వస్తేగానీ అర్ధంకాలేదు. విశేషమేమంటే ఇప్పటికీ టెస్ట్ లాబులు సరిపడా లేకపోవటం వలన అనుమానితుల్ని వెంటనే పరీక్ష చేయలేకపోతున్నారు. అమెరికా లాంటి అధునాతన సాంకేతికత కల్గిన దేశం కేవలం పాలకుల తప్పిదాలకు బలైపోతున్నారంటే ఆశ్చర్యంగా వుందికదూ. కానీ ఇదిమాత్రం నిజం. అంతేకాదు కరోనా వైరస్ సోకినా వాళ్ళు ట్రంప్ కి దగ్గరగా రావటం అందరికీ ఆందోళనగా ఉంటే నేను పరీక్ష చేయించుకోనని మారాం చేయటం ఇంకో ప్రహసనం. చివరకి ఎట్టకేలకు పరీక్ష చేయించుకున్నాడు. అమెరికా అంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడే అందినవార్త పరీక్ష నెగటివ్ అని వచ్చిందంట. ట్రంప్ సంగతి వదిలిపెడదాం. మన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఏం మాట్లాడాడు? అసలది పెద్ద సమస్యేకాదు. లేని పోని ప్రచారం చేస్తున్నరు , పారాసెటమాల్ ఒక గోలి వేసుకుంటే తగ్గిపోతుందని ఒక సైన్టిస్టు చెప్పిండు, పనికిమాలిన ప్రచారాలు చేయొద్దు. నిజంగా అది మన గడప దగ్గరికి వస్తే మా ఎమ్మెల్యేలందరూ వురుకుతారు , మాస్కులు లేకుండా పనిచేస్తారు. ఎన్నికోట్లయినా ఖర్చుపెడతాం. అదేందో ఆయన చెప్పిన మరసటి రోజే కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్ లో చనిపోయాడు. దేశం మొత్తం మీద కరోనా వైరస్ తో చనిపోయిన మొదటి కేసు హైదరాబాద్ లోనే నమోదయ్యింది. అయినా వురికి ఆపలే. అదేమంటే పొరుగు రాష్ట్రం వాడుకదా మనవాడు కాదు కదా అని సమర్ధించుకుంటారేమో. మరి అదే నోటితో నిన్న జనం భయపడకుండా ఉండటానికి అలా అన్నానని చెప్పాడు. అన్ని స్కూళ్ళు, కాలేజీలు, సినిమా హాళ్లు మూయించేయటంతో భయాందోళనలు నిజమో కాదో ఎరకయ్యింది . రామాయణం లో పిడకల వేట లాగ పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ పెద్ద ప్రకటనే ఇచ్చాడు. అసలీ చైనా వాళ్ళు గబ్బిలాలు, కుక్కలు, పిల్లులు తినటమేంటి? ఇటువంటి అలవాట్లతో అందర్నీ ఇబ్బంది పెట్టటమేంటి? అయ్యా , షోయబ్ అక్తర్ మీ దేశం లో చైనా వాళ్ళను ఇంకొక్కమాట అంటే మీ ప్రభుత్వం ముందు మిమ్మల్ని బొక్కలో తోస్తుంది సాబ్, జర జాగ్రత్త. చూసారా ఎన్ని వింతలూ, విశేషాలో ? ఒకవైపు ఈ మహమ్మారి ఏ ఉపద్రవం తీసుకొస్తుందోనని అందరూ టెన్షన్ టెన్షన్ లో ఉంటే నాయకులు మాత్రం వాళ్ళ పద్ధతుల్లో జనాన్ని ఆనందపరుస్తున్నారు. పోనీలే ఎటూ వేరే వినోదం లేదు కదా , వీళ్ళ మూలానన్నా సరదాగా నవ్వుకుంటున్నారు.

ఇంత టెన్షన్ లో కూడా కొన్ని మంచి వార్తలు వింటున్నాం. నిన్న వచ్చిన వార్తప్రకారం చిన్న పిల్లల పై ఇది దయ చూపిస్తుందని తెలిసింది. ఇప్పటివరకూ చిన్నపిల్లలెవరూ దీనివలన చనిపోయినట్లు నిర్ధారణ కాకపోవటం ఊరట కల్గించే అంశం. పిల్లలవలన ఇతరులకు సోకేదికూడా తక్కువేనని తెలిసింది. ఈ వార్త నిజంగా ఎంతో మంది తల్లులకు పెద్ద రిలీఫ్ నిచ్చింది. అలాగే ఇంకో విషయంకూడా బయటపడింది. మనకు జలుబు రాగానే భయపడాల్సిన పని లేదు. ముక్కు చీదటం అసలు ఈ వైరస్ లక్షణమే కాదట. అలాగే ఒకటే కారటం( Running Nose ) కూడా అరుదుగా వస్తుందంట. ఈ రెండు లక్షణాలు ఎక్కువగా సాధారణ జలుబు వలనో, ఎలర్జీ వలనో వస్తాయి. కాబట్టి జలుబు, ముక్కు చీదటం రాగానే భయపడిపోయి ఆసుపత్రికి పరుగెత్తొద్దు. జ్వరం, పొడి దగ్గు, ఆయాసం ( గాలి పీల్చుకోలేకపోవటం) ఈ వైరస్ లో ఎక్కువగా వుండే లక్షణాలు. తలనొప్పి, గొంతు నొప్పి, అలసట కూడా కొన్ని సందర్భాల్లో వుండే అవకాశం వుంది. కాకపోతే వయోవృద్దులు మాత్రం జాగ్రత్తలు పాటించాలి. చనిపోయిన వాళ్లలో ఎక్కువమంది వాళ్ళే. ముఖ్యంగా గుండె జబ్బులు, బిపి , షుగర్ వ్యాధులు వున్న వయో వృద్దులు ఇంటికే పరిమితమైతే మంచిది. ఇంకో మంచి వార్త విన్నాం. అమెరికా లో చదువుతున్న మన విద్యార్థులకు తానా ఆధ్వర్యాన ప్రవాస భారతీయ ఇళ్లల్లో ఆశ్రయం కల్పించారని పత్రికల్లో చూసాను. ఈ స్పూర్తితో అన్ని అమెరికా ప్రవాస భారతీయ సంఘాలు కృషిచేసి ఈ పరిస్థితుల వలన ఇబ్బందులు పడుతున్న మన విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తారని ఆశిద్దాం.

ఇక ఆంధ్ర లో ఈ వైరస్ పుణ్యమా అని స్థానిక ఎన్నికలు వాయిదా వేయటం మంచి పరిణామం. ఎన్నికలకోసం ఎక్కువమంది గుమికూడే వాతావరణం మంచిది కాదు. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని హర్షిద్దాం. ఇదీ ఒకందుకు మంచిదే. ఆంధ్రాలో ఇప్పుడున్న ఉద్రిక్తతలకు తాత్కాలిక బ్రేక్ పడటం సామాన్య ప్రజలకు మంచిదే. అలాగే ప్రార్ధనా మందిరాల్లో ఎక్కువమంది గుమికూడటాన్ని కూడా నిషేధించాలి. మసీదుల్లో శుక్రవారపు ప్రార్ధనలు, ఆదివారాలు చర్చిల్లో ప్రార్ధనలూ, తిరుమలలో రోజువారీ దర్శనాలు కొన్నాళ్ళు రద్దుచేయటం మంచిది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన కూడా ఈ పరిస్థితుల్లో మంచిది కాదు. గంటకు నాలుగువేలమంది అంటే చాలా ఎక్కువ. దయచేసి 200 పైన వుండే ఎటువంటి కార్యక్రమాలు రద్దు చేయటం మంచిది. ఎందుకంటే మనదేశంలో పరిస్థితి ని రెండో దశ నుంచి మూడో దశకు వెళ్లనియ్యకుండా చూడాలంటే అన్ని మార్గాలు మూసివేయటమొక్కటే మార్గం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనముండదు. ఒకసారి మూడో దశలోకి వెళ్ళామంటే నాలుగో దశలోకి వెళ్లి మన చేతులు దాటి పోవటం ఖాయం. మనదేశం లో ఆ దశలో కంట్రోల్ చేయటం సాధ్యమయ్యే పనికాదు. ముందుగానే కఠినమైనా కొన్ని గట్టి షరతులు విధించుకుందాం. మనం ఈ మహమ్మారిని రెండో దశలోనే ఆపగలిగితే మానవాళికి మేలు చేసిన వాళ్లమవుతాం. ఆ దిశగా అందరం ముందుకెళ్దాం.

కొసమెరుపు : పోయినవారం మనం ముచ్చట్లలో రైళ్లలో ఉలెన్ దుప్పట్లు తీసేయాలని మాట్లాడుకున్నాం గుర్తుందా . మన సణుగుడు రైల్వే వాళ్లకు వినబడినట్లుంది రెండు రోజుల క్రితం ఉలెన్ దుప్పట్లు సరఫరా చేయమని ప్రకటించారు. హమ్మయ్య రైళ్లలో ఇప్పుడు కొంత వరకు శుభ్రంగా ప్రయాణం చేయొచ్చు. కావాలంటే మీరే మందపాటి దుప్పట్లు తీసికెళ్ళండి. అయినా అవసరముండదు లెండి, ఎసి 23, 24 డిగ్రీలకు పైనే ఉండేటట్లు సరిచేస్తారంట. ఏమైనా ఉలెన్ దుప్పట్లు, కర్టెన్లు తీసేయటానికి దోహదపడిన కరోనా కి ధన్యవాదాలు! అవును మరి చెడుని తెగనాడుదాం , మంచి ని పొగుడుదాం . ఈ పేరుతోనైనా రైల్వే వాళ్ళు మన మొర ఆలకించినందుకు ధన్యవాదాలు.

ఇవీ ఈవారం ముచ్చట్లు, వచ్చేవారం మళ్లీ కలుద్దాం. మధ్యలో సెటైర్లు ఎవర్నీ కించపరచటానికి కాదు సుమా కేవలం టెన్షన్ నుంచి జనానికి విరామం కోసమే , అన్యధా భావించవద్దు.

……. మీ రామ్

Anupama Parameswaran New Photo Shoot Stills

Shubra Aiyappa Hot Photos