ఇపుడు తెలుగు చిత్రాల ట్రెండ్ మారింది. పెద్ద, చిన్న అన్న తేడా లేదు. సినిమా బాగుంటే ఎవరు హీరో, ఎవరు హీరోయిన్ అన్న పట్టింపు లేకుండా ప్రేక్షకులు సినిమాల్ని ఆదరిస్తున్నారు. ఆ క్రమంలో హీరోయిన్ లు గ్లామరస్ పాత్రలతో పాటు , తమలోని నటిని సంతృప్తి పరిచే పాత్రల్లో కనిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
గత కొంత కాలం గా అనుష్క, నయనతార, సమంత, కీర్తి సురేష్ వంటి అగ్రతారలు కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఓటు వేస్తున్నారు. కొత్త హీరోయిన్లు ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా వీరి జాబితాలో గ్లామర్ తార పూజా హెగ్డే కూడా చేరబోతుంది. అంటే బుట్ట బొమ్మ ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.
ఇటీవల `అల వైకుంఠపురములో` చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇప్పుడు ప్రభాస్ సరసన ” ఓ డియర్ ” చిత్రంలో నటిస్తోంది. . దీంతోపాటు అఖిల్ హీరోగా చేస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” చిత్రం లో కూడా నటిస్తోంది.. అలాగే త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోయే నూతన చిత్రంలోనూ నటిస్తోంది. ఇదిలా ఉండగా గ్లామరస్ పాత్రలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మకి ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించేందుకు ఆఫర్ వచ్చిందట.
“అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, లై, పడి పడి లేచే మనసు ” వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు హను రాఘవపూడి ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని రూపొందించేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ క్రమము లో పూజా హెగ్డే ని సంప్రదించగా.. ప్రాథమికంగా ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఇదే నిజమైనట్టయితే తొలిసారి పూజాహెగ్డే ని ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో చూడ బోతున్నాం అన్నమాట… లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కలిసొస్తే ఓకే కానీ.. ఫెయిలైతే మాత్రం ఆ హీరోయిన్ పరిస్థితి గ్లామర్ పాత్రలకు పనికి రాకుండా పోతుంది. దాంతో ఆ హీరోయిన్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారు అవుతుంది.
అందుకే పూజా హెగ్డే ఒకటికి రెండు సార్లు అలోచించి నిర్ణయం తీసుకొంటే బాగుంటుంది అని సన్నిహితులు సూచిస్తున్నారట. .think before while you leap
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Is pooja hegde follow anushkas path
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com