Home Blog Page 8575

మావోయిస్టుల దొంగదెబ్బతో చిక్కుకు పోయిన పోలీసులు

వరుస ఎన్‌కౌంటర్లలో తీవ్రంగా దెబ్బతింటూ నాయకత్వం ఉనికినే కోల్పోతున్న మావోయిస్టులు అదను కోసం ఎదురు చూస్తూ, కాపు కాచి, గాలింపు చర్యల అనంతరం తిరిగి వెడుతున్న సాయుధ దళాలలను చుట్టుముట్టి దండకారణ్యంలో చావుదెబ్బ తీశారు. పోలీస్ బలగాలను తమ ఉచ్చులోకి దింపి కాల్పులకు తెగబడినట్లు చత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

పోలీస్ దళాల రాకను ముందే పసిగట్టడంతో, వ్యూహాత్మకంగా వారి గాలింపు పూర్తయ్యేవరకు కనబడకుండా దాక్కొంటూ, ఇక్కడెవ్వరు మావోయిస్టులు లేరనికొని తిరిగి వెడుతున్న సమయంలో ఎత్తైన ప్రదేశాల నుండి మాటు వేసి కాల్పులు జరిపి దెబ్బ తీశారు. ఊహించని పరిణామం కావడం, దట్టమైన అడవి కావడంతో తేరుకొనే లోపే తీవ్ర నష్టం జరిగిపోయింది.

చింతగుఫా పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్మాగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టు కీలక నేత హిడ్మా ఆధ్వర్యంలో నగేష్, వినోద్, దేవా, తదితర నేతలతో పాటు 300మంది మావోయిస్టులు సమావేశమయ్యారని చత్తీస్‌గఢ్ ఇంటిలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. దాంతో డోర్నపాల్ పోలీసు స్టేషన్ నుంచి 200 మందిని, బూర్కాపాల్ క్యాంపు నుంచి 150 మందిని ఈ ప్రాంతానికి నేరుగా కూంబింగ్ ఆపరేషన్ కోసం పంపారు.

శనివారం మధ్యాహ్నం గాలింపు పూర్తి చేసుకొని బలగాలు తిరుగుముఖం పట్టాయి. అయితే మావోలు అంబూష్ చేయడంతో బలగాలు చిక్కుకుపోయాయి. బలగాలు తమను సమీపిస్తున్నాయన్న సమాచారం తెలుసుకున్న మావోలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు ధరించి సిద్ధమయ్యారని తెలుస్తున్నది.

భారీ అటవీ ప్రాంతానికి బలగాలు చేరుకోగానే అక్కడే దారికాచి ఉన్న సాయుధులైన మావోలు అన్నివైపుల నుంచి కాల్పులకు దిగారు. పక్కా ప్రణాళికతో ఉన్న మావోయిస్టులు గుట్టలపై అప్పటికే ఏర్పాటు చేసుకున్న సురక్షిత ప్రదేశాల నుంచి గ్రెనేడ్స్‌, రాకెట్‌ లాంచర్లు, అత్యాధునికి ఆయుధాలతో జవాన్లపై విరుచుకుపడ్డారు. దీంతో మావోయిస్టులదే పైచేయిగా మారింది. దాదాపు 2 గంటలపాటు ఇరుపక్షాల నడుమ హోరా హోరీ కాల్పులు జరిగినట్లు సమాచారం.

అప్పటికే కూంబింగ్ చేసి అలసిపోవడంతో ఈ దాడిని భద్రతా జవాన్లు అసలు ఊహించలేకపోయారు. ఆకస్మాత్తుగా కాల్పులు జరగడంతో వెంటనే అప్రమత్తమైనా ఫలితం లేకపోయింది. మావోలు తూటాల వర్షం కురిపించడంతో భద్రతా బలగాలు చెల్లాచెదురయ్యాయి. అనంతరం రెండున్నర గంటల తర్వాత కాల్పులు ఆగిపోగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బలగాలు క్యాంప్‌కు చేరుకున్నాయి.

మావోలు అపహరించిన జవాన్ల కోసం ఆదివారం డ్రోన్ల సాయంతో అన్వేషించారు. ఈ క్రమంలో కాల్పులు జరిగిన ప్రాంతానికి 7 కిలోమీటర్ల దూరంలో అదృశ్యమైన 17మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. వెంటనే మృతదేహాలను బలగాలు అడవి నుంచి బయటకు తీసుకొచ్చాయి. ఈ ఘటనలో 12మంది డీఆర్‌జీ, ఐదుగురు ఎస్టీఎఫ్ సిబ్బంది చనిపోయినట్లు నక్సల్స్ ఆపరేషన్ డీజీపీ అవస్థీ ప్రకటించారు.

ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వం ఇటీవల ‘ఆపరేషన్‌ ప్రహార్‌’తో మావోయిస్టులను అణచివేసే కార్యక్రమం చేపట్టింది. దీంతో జవాన్లు దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం జవాన్లు కూంబింగ్‌కు వెళ్లారు.

ఆపరేషన్‌ ప్రహార్‌కు ప్రతీకారంగా మావోయిస్టు కేంద్ర కమిటీ ఛత్తీ్‌సగఢ్‌లో ప్రత్యేక బెటాలియన్లను ఏర్పాటు చేసుకుంది. ఎప్పటికప్పుడు జవాన్ల సంచారాన్ని పసిగట్టి, పక్కా ప్రణాళికతో జవాన్లను దెబ్బ కొట్టడం బెటాలియన్‌ పని.

లాక్ డౌన్ మరింత ప్రమాదకరమా..?

విజ్రంభిస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు లాక్‌ డౌన్ నిర్ణయాన్ని తీసుకుంటున్నాయి. అయితే ఈ నిర్ణయం మరింత ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. తాజాగా భారత్‌ లో కూడా పలురాష్ట్రాలు లాక్‌ డౌన్ ప్రకటించాయి. ఈ జాబితాలో దేశరాజధాని ఢిల్లీతోపాటు రెండు తెలుగురాష్ట్రాలు కూడా చేరాయి. ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్ వంటి రాష్ట్రాలు లాక్‌ డౌన్ ప్రకటించాయి. అయితే ఇలా లాక్‌ డౌన్ చేయడం ద్వారా కరోనాను ఓడించలేమని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంటోంది. డబ్ల్యూహెచ్‌వో అత్యున్నత ఎమర్జెన్సీ నిపుణుడు మైక్ ర్యాన్..

ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌ కు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. నిజంగా కరోనాపై పోరాడాలంటే.. అనారోగ్యంతో ఉన్నవారిని, వైరస్ సోకిన వారిని గుర్తించాలని ఆయన చెప్పారు. ఆ తర్వాత వారందరినీ ఐసోలేషన్‌ లో ఉంచాలని, వారిని ఎవరెవరు కలిసారో వారిని కూడా ఐసోలేట్ చేయాలని సూచించారు. అంతేగానీ వట్టి లాక్‌ డౌన్లతో వైరస్‌ ను ఓడించడం మాత్రం జరగదని స్పష్టంచేశారు.అంతేకాకుండా లాక్ డౌన్ మరింత ప్రమాదకరమని ఆయన వెల్లడించారు.

లాక్ డౌన్లతో వైరస్‌ను అడ్డుకోలేం

ప్రపంచ వ్యాప్తంగా వరుసగా పెరగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో ఆందోళన చెందుతున్న ప్రపంచ దేశాలు వరుసగా లాక్ డౌన్ లను ప్రకటిస్తున్నాయి. భారత్ లో ఆదివారం అంతా జనతా కర్ఫ్యూ అమలు చేయగా, సోమవారం నుండి కనీసం 13 రాష్ట్రాలలో ఈ నెలాఖరు వరకు పూర్తిగా లోక్ డౌన్ ప్రకటించారు. మరో కొన్ని రాష్ట్రాలలో పాక్షికంగా ప్రకటించారు. రైళ్లు, అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు, మెట్రో రైళ్లు విమానాలు అన్ని మూతబడ్డాయి.

అయితే లాక్ డౌన్ లతో ఈ ప్రాణాంతక వైరస్ ను అడ్డుకోలేమని పంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్‌వో) నిపుణుడు మైక్‌ ర్యాన్‌ స్పష్టం చేశారు. వైరస్‌ తిరిగి పుంజుకోకుండా ఉండాలంటే కరోనా బాధిత దేశాలు వైరస్‌ సోకిన వాళ్లను కనిపెట్టి వాళ్లను ఐసోలేషన్‌ వార్డుకు తరలించడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఆయా దేశాలు చేపట్టే కట్టుదిట్టమైన ప్రజారోగ్య చర్యలు కీలకమని అన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర నిపుణుడు డాక్టర్ మైక్ ర్యాన్ బీబీసీ ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. ‘అనారోగ్యంతో ఉన్నవారిని, వైరస్ ఉన్నవారిని కనుగొనడం, వారిని వేరుచేయడం, వారి పరిచయాలను కనుగొని వారిని వేరుచేయడం పై నిజంగా దృష్టి పెట్టాలి. లాక్ డౌన్లతో ప్రస్తుతం ప్రమాదం.. లాక్‌డౌన్లు విధించినంత మాత్రాన వైరస్‌ను అడ్డుకోలేం. బలమైన ప్రజారోగ్య సంరక్షణ చర్యలు బలంగా లేకపోతే లాక్‌డౌన్లు ఎత్తివేసినప్పుడు, ప్రమాదం ముదిరి వ్యాధి తిరిగి మరింత ఎక్కువగా వ్యాపిస్తుంది.

చైనా, సింగపూర్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు వైరస్‌ బాధితులను వేగంగా గుర్తించిడంతో పాటు, కఠినమైన చర్యలతో వ్యాధిని కట్టడిచేశాయి. ఆ దేశాలను మిగతా దేశాలు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైరస్ పై పోరుకు తీవ్రమైన ఆంక్షలను ప్రవేశపెట్టాయి. వర్క్ ఫ్రం హోం, పాఠశాలలు, బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు మూసివేత లాంటిచర్యలు చేపట్టాయి.

కరోనా మొత్తం 184 దేశాలకు విస్తరించింది.ఆదివారం మధ్యాహ్నానికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,99,391 కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో 66,907 మంది కోలుకోగా.. 12,888 మంది మరణించారు. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌, దక్షిణకొరియా, స్విట్జర్లాండ్‌, యూకేల్లో 5 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాలో 81,054 కేసులు నమోదుకాగా.. 3,261 మంది మృతిచెందారు.

ప్రముఖ తమిళ దర్శక ,రచయిత విసు కన్నుమూత

తమిళ చిత్ర రంగంలోఒక విప్లవం తెచ్చి తమిళ సినిమాలను జాతీయ స్థాయిలో నిలబెట్టిన దర్శక మేధావి కె బాలచందర్ గారికి ప్రియతమ శిష్యుడైన దర్శక , రచయిత విసు నేటి మధ్యాహ్నం (మార్చ్ 22 ) తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయాడు. గత కొన్నేళ్లుగా కిడ్నీసంబంధిత వ్యాధితో బాధ పడుతున్న” విసు” చివరకు ఇవాళ్టితో విముక్తం చెందాడు. ఒక పక్షం రోజుల ముందు 1981 లో తన రచనలో రూపుదిద్దు కొన్న రజనీకాంత్ చిత్రం ” నెట్రిక్కాన్ ” ( తెలుగులో ముసలోడికి దసరా పండుగ ) సినిమాని రజనీకాంత్ అల్లుడు ధనుష్ రీమేక్ చేస్తున్నాడని తెలిసి దానిపై తన అభ్యంతరం తెలిపే క్రమంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు
చేయడం జరిగింది. అదే విసు పబ్లిక్ తో చివరిసారి మాట్లాడిన మాటలు …

గురువు కె బాలచందర్ నిర్మించిన ‘కుటుంబం ఒరు కదంబం ‘ చిత్రం ద్వారా 1981 లో దర్శకుడిగా మారిన విసు ఆ తరవాత ఎన్నో హిట్ చిత్రాలు డైరెక్ట్ చేయడం జరిగింది. విసు దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాలు తెలుగులో రీమేక్ కావడమే గాక సూపర్ హిట్ అయ్యాయి కూడా ….వాటిలో సంసారం ఒక చదరంగం ,రామాయణం లో పిడకల వేట, పుణ్యస్త్రీ , శ్రీమతి ఒక బహుమతి , ఆడదే ఆధారం, మనిషికో చరిత్ర వంటివి నేటికీ ప్రేక్షకులకి గుర్తుండి పోయాయి స్త్రీ సమస్యల ఆధారం గా మరపురాని చిత్రాలను నిర్మించిన ” విసు ” దక్షిణ భారత చిత్ర సీమలో ఒక అరుదైన మేధావి అందులో ఎటువంటి సందేహం అక్కర లేదు ..

A creator lives forever

బన్నీ రిలీజ్ డేట్ పై కన్నేసిన వైష్ణవ్ తేజ్

మెగా ఫ్యామిలీకి చెందిన వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ఉప్పెన. ఈ చిత్రాన్ని తొలుత ఏప్రిల్ 2న రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేశాయి. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఈ రిలీజ్ తేదిని వాయిదా వేసుకున్నారు. తాజాగా ‘ఉప్పెన’ మూవీని మే7 రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. మే7న అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. దీంతో ఉప్పెన మూవీని కూడా ఆ తేదినే రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తుంది.

‘ఉప్పెన‌’ మూవీని నూతన దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించాడు. గతంలో సుకుమార్ దగ్గర బుచ్చిబాబుసాన అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. వైష్ణవ్ తేజ్ కు జోడీగా కృతిశెట్టి నటిస్తుంది. ఈ మూవీలో విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.

‘ఆర్య’ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించగా ‘ఉప్పెన’ చిత్రాన్ని ఆయ‌న శిష్యుడు బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేశారు. దీంతో బన్నీకి కలిసొచ్చిన తేదినే వైష్ణవ్ తేజ్‌ మూవీని విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ సోదరుడు సాయిధరమ్ తేజ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి విజయాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ హీరోగా మారి ‘ఉప్పెన’లా రాబోతున్నాడు. ఈ సినిమాకు వైష్ణవ్ తేజ్ కు ఎలాంటి విజయం అందిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సర్వత్రా చప్పట్లు.. సమిష్టిగా స్పందించిన ప్రజలు

కరోనా వైరస్ కట్టడి చేసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు కరోనా నియంత్రణకు పనిచేస్తున్న వైద్యులు, అత్యవసర సేవలు అందిస్తున్న యంత్రాంగానికి యావత్‌ భారతావని చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలిపింది.

ప్రధాని చెప్పినట్లు సాయంత్రం 5 గంటలకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో నిలబడి.. దేశానికి విశేష సేవలు అందిస్తున్న వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతగా చప్పట్లు కొట్టారు. కరతాళ ధ్వనులతో మాత్రమే కాదు… చిన్నా పెద్దా తేడా లేకుండా ఇళ్ల పైకి ఎక్కి ప్లేట్లు, డ్రమ్స్, గిటార్లు వాయిస్తూ సంఘీభావం తెలిపారు.

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. కుటుంబ సమేతంగా తన ఇంటి ఆవరణలో నిలబడి చప్పట్లు కొడుతూ, గంటలు మోగిస్తూ సంఘీభావం తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కుటుంబ సభ్యులతో కలిసి గంట కొడుతూ.. జనతా కర్ఫ్యూకు సంఘీభావం తెలిపారు. ముంబయిలో ప్రజలు భారీ ఎత్తున ఇంటి వరండాల్లో నిలబడి చప్పట్లు కొడుతూ.. వైద్య సిబ్బందిని అభినందించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుటుంబసమేతంగా ప్రగతి భవన్‌లో సాయంత్ర 5 గంటలకు చప్పట్లు కొట్టి, జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంతో పాటు మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, మల్లారెడ్డి, తదితరులు ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గంట మోగించి, జనతా కర్ఫ్యూకు సంఘీభావం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం క్యాంపు ఆఫీసులో అధికారులతో కలిసి సరిగ్గా 5 గంటలకు చప్పట్లు కొట్టి జనతా కర్ఫ్యూకు తన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌’ మహమ్మారి తరిమికొట్టేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని కొనియాడారు.

ఎన్సీపీ అధ్యక్షులు శరద్‌ పవార్‌, తన కుమార్తె.. ఎంపీ సుప్రియా సూలే, కుటుంబ సభ్యులతో కలిసి దేశానికి సేవ చేస్తున్న వైద్య, పారిశుద్ద్య, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రకాశ్‌ జవడేకర్‌, ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తదితరులు జనతా కర్ఫ్యూకు చప్పట్లతో మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేశ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ ఇంటి బాల్కనీల్లో నిల్చొని చప్పట్లు, గిన్నెలు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సామాన్య ప్రజలే కాకుండా రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు సైతం చప్పట్లు కొట్టి తమ దేశభక్తి చాటుకున్నారు.

అత్యవసర సేవలు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను కొనియాడుతూ ఇవాళ దేశం మొత్తం ఏకతాటిపైకి రావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌కు ఎదురొడ్డి పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ దేశం కృతజ్ఞతలు తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విటర్లో స్పందిస్తూ…

‘‘కరోనా వైరస్ మహమ్మారికి ఎదురొడ్డి పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ దేశం యావత్తూ కృతజ్ఞతలు చెప్పింది. ఇందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు. మీ హృదయాల నుంచి ఉప్పొంగిన కృతజ్ఞతా నాదం ఇది. అయితే మనం చేయాల్సిన సుదీర్ఘ యుద్ధంలో ఇది తొలి విజయం మాత్రమే. ఇదే దృఢ సంకల్పంతో మనల్ని మనం కట్టడి చేసుకుని సామాజిక దూరాన్ని పాటిద్దాం. సుదీర్ఘ యుద్ధం ముగిసే వరకు ఇదే నిగ్రహాన్ని పాటిద్దాం..’’ అని పిలుపునిచ్చారు.

Sandeepa Dhar Latest Photo Stills

అది చేస్తే.. కరోనా రాదంటున్న బోల్డ్ బ్యూటీ

కరోనా వైరస్ వింటేనే ప్రజలు బెంబేలెత్తిపోతుంటే వివాదాస్పద నటి శ్రీరెడ్డి తనదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందిస్తుంది. ప్రస్తుతం ఆమె కరోనా నివారణకు చెప్పిన జాగ్రత్తల్లో ఒక విషయం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. కరోనా నివారణకు-శృంగారానికి లింకు పెట్టి మాట్లాడటంతో ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

నిత్యం సోషల్ మీడియాలో వివాదస్పద పోస్టులు పెడుతూ అందరిని తనవైపు తిప్పుకోవడం శ్రీరెడ్డికి కొత్తేమీకాదు. ‘స్థిరమైన శృంగారం చేయడం వల్ల కరోనా నివారణ నిరూపితమయిందని.. అలాగే మాస్కులు, హెల్మెట్లు, కండోమ్ లను ధరించండి.. దేవుడి ముందు మాత్రం నగ్నంగా ఉండండి.. అంటూ సెన్సషల్ కామెంట్ చేసింది. అయితే ఆమె వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు శ్రీరెడ్డి వ్యాఖ్యలు లైట్ తీసుకుంటున్నారు.

నేడు భారత ప్రధాని మోడీ ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ పిలుపు మేరకు ప్రజలంతా స్వచ్ఛంధంగా బంద్ లో పాల్గొంటున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాయి. బస్సులు, ట్రైన్లు, విమానాలన్నీ బంద్ పాటిస్తున్నాయి. పోలీస్, వైద్య, ఫైర్, వాటర్ డిపార్ట్ మెంట్ మినహా అందరూ బంద్ లో పాల్గొంటున్నారు.

Amy Jackson Hot Pictures

మార్చ్ 31 దాకా 71 జిలాల్లో లాక్ డౌన్, రైళ్లు సేవలు బంద్

దేశం వ్యాప్తంగా కరోనా కేసులున్న 75 జిల్లాల్లో జనతా కర్ఫ్యూను మార్చ్ 31 వరకు పొడిగించమని ప్రధాన మంత్రి కార్యాలయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ జిల్లాల్లో అత్యవసర సేవలు తప్ప మిగిలినవన్నీ బంద్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రైళ్లు, అంతర్ రాష్ట్ర బస్సులు, మెట్రో రైల్ సేవలు కూడా స్థంబింప చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్సులతో కేంద్ర కాబినెట్ కార్యదర్శి కరోనా పరిస్థితిపై జరిపిన సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తిని సమర్థంగా నియంత్రించడానికి కరోనా ప్రభావిత జిల్లాలను మూసేయడం మేలని ఈ సమావేశంలో ఏకాభ్రిప్రాయానికి వచ్చినట్లు ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్నిన పిలుపుతో ఆదివారం జనతా కర్ఫ్యూకు ప్రజలు బయటకు రాకుండా సహకరించడంతో దీనిని కొనసాగించాలని నిర్ణయించారు. కాగా, ఆయా రాష్ట్రాలలో నెలకొన్న పరిస్థితులను బట్టి ఈ జిల్లాల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా పెంచే అవకాశం ఉంది.

ఈ నిర్ణయం ప్రకారం తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలు లాక్ డౌన్ చేసే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో జనతా కర్ఫ్యూ కొనసాగే అవకాశం ఉంది.

మరో వంక రైల్వే శాఖ ప్యాసింజర్ సర్వీసులను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు రద్దెన రైళ్లన్నింటిని మార్చి 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే, కొంకణ్‌రైల్వే సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.

దూర ప్రాంతాలకు నడిచే ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, ఇంటర్‌ సిటీ రైళ్లు, ప్యాసింజర్‌ రైళ్లు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అన్ని సబర్బన్‌ రైళ్లు, కోల్‌కతా మెట్రో రైళ్లు, పూర్తిగా క్యాన్సల్‌ చేసింది. 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు రైళ్ల రాకపోకలపై నిషేధం విధించినట్లు పేర్కొంది. సరుకులు రవాణా చేసే గూడ్స్‌ రైళ్లు యథావిధిగా నడుస్తాయి.

మావోయిస్టులతో పోరు.. 17 మంది పోలీసులు మృతి

చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కసల్పాడ్-ఎల్మాగూడ వద్ద గత అర్థరాత్రి దాటిన తర్వాత మావోయిస్టులతో జరిగిన భీకర పోరులో 17 మంది సాయుధ దళాలు మృతి చెందాయి. గత రాత్రి నుండి ఆచూకీ దొరకకుండా పోయిన వారి మృతదేహాలను వారి ఆచూకీ వెతుకుతూ వెళ్లిన దళాలు చివరకు కనుగొన్నట్లు డిఐజి డిఎమ్ అవస్థి తెలిపారు.

మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు చింతగుఫ, బుర్‌కాపాల్‌, టైమ్‌లావాడ క్యాంప్‌ ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌(డీఆర్‌జీ), స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, కమాండో బెటాలియన్‌ ఫర్‌ రెసల్యూట్‌ యాక్షన్‌(కోబ్రా)కు చెందిన భద్రతా సిబ్బంది సుమారు 150 మంది సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య భీకర ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో 14 మంది గాయపడగా, వారిని విమానంలో రాయపూర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు చెబుతున్నారు. శనివారం మధ్యాహ్నం నుండి పలు సార్లు రెండు వైపులా నుండి కాల్పులు జరిగాయి.

మొత్తం 17 మంది తప్పిపోగా, వారిలో నలుగురు రాత్రి ఫోన్ చేసారని, అయితే ఆ తర్వాత వారి ఆచూకీ కూడా తెలవలేదని డిజిపి చెప్పారు. 1917లో ఏప్రిల్ 24న సుకుమా జిల్లాలో 25 మంది సి ఆర్ పి ఎఫ్ దళాలు చనిపోయిన సంఘటన తర్వాత ఇదే పెద్ద సంఘటన అని తెలిపారు.

సాయుధ బలగాలు తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో 250 మందికి పైగా మావోయిస్టు దళాలు చుట్టుముట్టు కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నది. 10 ఏకే 45 తుపాకులతో సహా సాయుధ దళాలకు చెందిన 15 ఆటోమేటిక్ తుపాకులు సహితం కనిపించడం లేదు.

ఈ సంఘటనలో డజన్ మందికి పైగా మావోయిస్టులకు తుపాకి గాయాలు జరిగిన్నట్లు భావిస్తున్నారు. ఆదివారం ఉదయం అదనపు దళాలను పంపి గాలింపు చర్యలు చేపట్టినా వారెవ్వరిని కనిపిట్ట్టలేక పోయారు.

Nia Sharma Sizzling Pictures

‘ఆచార్య’ నటించే హీరోయిన్లు ఎవరంటే?

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లలో చిరు-152మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సింది. ఈ మూవీకి ‘ఆచార్య’ టైటిల్ ఫిక్స్ చేశారు. చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. పవర్ ఫుల్ ఎండోన్మెంట్ అధికారికంగా రఫ్ఫాడించనున్నాడు. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఓ పాత్రలో నటిస్తాడని సమాచారం. అదేవిధంగా రాంచరణ్ ఈ మూవీలో ఓ కీలక రోల్స్ చేస్తున్నాడు. దాదాపు ఆయన 30నిమిషాల సినిమాలో నటించనున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా కరోనా ఎఫెక్ట్ షూటింగ్ వాయిదా పడింది.

ఈ మూవీలో తొలుత చిరుకు జోడీగా త్రిషను ఖరారు చేశారు. అయితే త్రిష ఈ మూవీని తప్పుకోవడంతో హీరోయిన్ వేటలో చిత్రబృందం పడింది. చిరుపక్కన జోడీగా కాజల్ అగర్వాల్, అనుష్క పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ చిత్రంలో నటించేందుకు అనుష్క భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని కాజల్ అగర్వాల్ ను చిత్రబృందం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాంచరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. అయితే తాజాగా రాంచరణ్ సరసన రష్మిక మందన్న ఎంపికైందని ప్రచారం జరిగింది. అయితే దీనిపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇప్పటికే ఈ మూవీలో రెజీనా కసండ్రా ఓ స్పెషల్ సాంగ్లో చిరుతో ఆడిపాడనుంది. అలాగే తెలుగమ్మాయి ఈషా రెబ్బా, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ప్రధాన హీరోయిన్లుగా కాజల్ అగర్వాల్, అనుష్క పేర్లు విన్పిస్తున్నాయి. వీరిద్దరిలో కాజల్ వైపే చిత్రబృందం మొగ్గుచూపుతోంది. అలాగే చెర్రీకి జోడీగా కియారా అడ్వాణీ, రష్మిక పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో కియారా పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. ఇప్పటికే చిరంజీవి, చరణ్ వంటి స్టార్లతో క్రేజీగా మారిన ‘ఆచార్య’ మూవీకి గ్లామర్ అద్దేపనిలో కొరటాల బీజీగా ఉన్నారు. రాంచరణ్ మ్యాట్నీ ఎంటటైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ ‘ఆచార్య’కు అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నారు

విక్రమ్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు

తమిళ నటుడు విక్రమ్ ప్రభు తాజా చిత్రం ద్వారా ఇద్దరు ముద్దుగమ్మలు రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో శ్రీవిద్య, లక్ష్మీమీనన్ నటించి మెప్పించారు. పక్కింటి అమ్మాయిలా కన్పించే ఈ ముద్దుగుమ్మలు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా శివాజీ గణేషణ్ మననువడు విక్రమ్ ప్రభు తాజాగా నటించే మూవీలో వీరిద్దరు ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ మూవీని సుశీంద్రన్‌ తెరకెక్కిస్తున్నాడు. కుటుంబ కథతో తెరకెక్కనున్న ఈ మూవీని నల్లుసామి పిక్చర్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తుంది

శ్రీవిద్య, లక్ష్మీమీనన్ తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించారు. లక్ష్మీమీనన్ అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. తెలుగులో ‘గజరాజు2, ‘ఇంద్రుడు’ వంటి మూవీల్లో నటించింది. అలాగే ఆమె నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయి విజయంతంగా ప్రదర్శించబడ్డాయి. అలాగే తెలుగమ్మాయి శ్రీవిద్య తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళం, కన్నడంతోపాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. శ్రీవిద్యకు కుర్రకారులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

లక్ష్మీమేనన్‌ చివరగా ‘రెక్క’ చిత్రంలో నటించింది. ఈ మూవీ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. శ్రీదివ్య ‘సంగిలి బుంగిలి కదవ తొర’ చిత్రంలో కనిపించింది. పక్కింటి అమ్మాయి, హోమ్లీ పాత్రలతోనే తమిళ, తెలుగు ప్రేక్షకుల దగగ్గరైన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తాజాగా గ్లామర్ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే మూవీతో రీ ఎంట్రీ ఇస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

జనతా కర్ఫ్యూతో బోసిపోతున్న దేశంలోని రహదారులు

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కు దేశ వ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా దేశం మొత్తం స్తంభించిపోనుంది. దేశ చరిత్రలో తొలిసారిగా కొనసాగుతున్న ప్రజా కర్ఫ్యూ ఇదే కావడం గమనార్హం.

భారతావని కరోనాపై జరుపుతున్న సమరంలో అన్ని రాష్ట్రాలూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటిస్తుండగా తెలంగాణ, పంజాబ్ వంటి రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల పిలుపుమేరకు ప్రజలు 24 గంటల పాటు జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు.

ఈ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన జనతా కర్ఫ్యూ రేపు ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. అత్యవసర సేవలు అందించే సిబ్బందితో పాటు వైద్యులకు సంఘీభావంగా ప్రజలంతా సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టాల్సిందిగా పీఎం, సీఎంలు సూచించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో దేశంలో అన్ని నగారాలు, పట్టణాలలో జనమే లేక రహదారువులు అన్ని బోసి పోతున్నాయి.

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్డు రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కోదాడవద్ద ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ సరిహద్దు (హైదరాబాద్‌-విజయవాడ హైవే)ను సైతం ఆదివారం ఉదయం మూసేశారు.

మరోవంక మహారాష్త్రతో అన్ని సరిహద్దులను తెలంగాణ ప్రభుత్వం మూసివేసింది. మహారాష్ట్రతో ఐదారు వంద కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో 63 ఏళ్ల వృద్ధుడు చనిపోగా.. పాట్నాలో 38 ఏళ్ల వ్యక్తి చికిత్స తీసుకుంటుండగా శనివారం(21)రాత్రి చనిపోయాడు. బీహార్ లో ఇది తొలి కరోనా మరణం .

వీరి మరణంతో దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య ఆరుకు చేరింది. మహారాష్ట్రలో కరోనా మృతుల సంఖ్య 2కు పెరిగింది. గత 24 గంటల్లో 10 కేసులు నమోదవ్వగా మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 74కు చేరింది.

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 341కు చేరింది. మహారాష్ట్ర(74), కేరళ (40), ఢిల్లీ (26), ఉత్తరప్రదేశ్‌ (24), తెలంగాణ (21)లో కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కాగా, రాజస్థాన్, పంజాబ్ ప్రభుత్వాలు ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించాయి.

కేంద్ర నిధులలో భారీ కోతతో జగన్ ఇరకాటం!

అసలుకే తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగన్ ప్రభుత్వం కేంద్రం రాష్ట్రాలకు అందించే ప్రాయోజిత పధకాలకు సంబంధించిన నిధులను సహితం భారీగా కోత విధిస్తూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడుతున్నది. ఈ విషయమై కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలదీయలేక పోవడంతో ప్రభుత్వానికి దిక్కు తోచడంలేదు.

కొన్ని పథకాల్లో నిధులను పెంచినట్లు చూపిస్తున్న కేంద్రం మరికొన్ని పథకాల్లో దారుణంగా కోతలు పెడుతోంది. దాంతో మొత్తం నిధుల్లో భారీగా గండి పడుతోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తయారుచేసిన నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి.

రాష్ట్ర అభివృద్ధి పథకాలకు కేంద్ర సాయం చేసే నిధుల్లో ఇంకా రు.4,392 కోట్లు రావాల్సి ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రు.13,925 కోట్లు వస్తాయని అంచనా వేయగా, ఇప్పటివరకు రు.9,533 కోట్లు మాత్రమే వచ్చినట్లు చెబుతున్నారు. మరో ఏడెనిమిది రోజులలో ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తి కావస్తు ఉండడంతో కేంద్రం ఈ నిధుల గురించి మాట్లాడక పోవడంతో రాష్ట్ర ప్రభుతానికి పాలుపోవడం లేదు.

ఇదే సమయంలో కీలకమైన 17 పథకాలకు సంబందించి వచ్చిన నిధులపైనా లెక్కలు తేల్చారు. అందులో తొమ్మిది పథకాల్లో భారీగా కోతలు పడగా, ఎనిమిది పథకాల్లో స్వల్పంగా నిధులు పెరిగాయి. అయితే పెరిగిన నిధుల కన్నా… కోతలు పడిందే ఎక్కువగా ఉన్నాయి. తొమ్మిది పథకాలకు గత ఏడాది రు.5,138 కోట్లు రాగా, ఈ ఏడాది రు.2,948 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే మొత్తం మీద రు.2,165 కోట్లు తగ్గాయి.

ఇందిరా ఆవాస్‌ యోజన, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనల కింద రు.977 కోట్లు తగ్గగా, స్మార్ట్‌ సిటీలకు రూ.372 కోట్లు, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ) విభాగంలో రు.315 కోట్లు, ఉపాధి హామీ పథకంలో రు.304 కోట్లు కోతలు పడ్డాయి. రూసా, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (అర్బన్‌), విద్య, ఎస్‌ఎబిఎల్‌ఎ వంటి పథకాల్లో కూడా కొంతవరకు కోతలు పడ్డాయి.

రూసా, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం, స్వచ్ఛభారత్‌ మిషన్‌ (అర్బన్‌), విద్య, ఎస్‌ఎబిఎల్‌ఎ వంటి పథకాల్లో కూడా కొంత వరకు కోతలు పడ్డాయి. అయితే మరో ఎనిమిది పథకాల్లో మాత్రం స్వల్పంగా నిధులు పెంచారు. ఈ పథకాలకు సంబంధిరచి గత ఏడాది రూ1,785 కోట్లు రాగా, ఈ ఏడాది రు.2,432 కోట్లు వచ్చాయి.
అంటే రు.647 కోట్లు అదనంగా వచ్చాయి.

మొత్తం రావాల్సిన రు.13,925 కోట్లలో ఎక్కువ స్థానిక సంస్థలకు సంబందించినవి కాగా, ఆరోగ్యం, సంక్షేమం, విద్య, గృహనిర్మాణం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోతలు తీవ్రంగా వున్నాయి.

నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న యంగ్ టైగర్

నందమూరి హీరోలు బాలకృష్ణ, కల్యాణ్ రామ్ నటిస్తూనే సొంత బ్యానర్లు ఏర్పాటు చేసుకున్నారు. తమ సొంత బ్యానర్లో సినిమాలను నిర్మిస్తూ నిర్మాణరంగంలోనూ రాణిస్తున్నారు. బాలకృష్ణ ‘ఎన్బీకే’ సంస్థను ఏర్పాటు చేయగా కల్యాణ్ రామ్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ ఏర్పాటు చేసి మూవీలను నిర్మిస్తున్నారు. తన తండ్రి గుర్తుగా త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ ఓ బ్యానర్ ఏర్పాటు చేసేందుకు సన్నహాలను చేస్తున్నట్లు సమాచారం.

‘నందమూరి హరికృష్ణ ఆర్ట్స్ బ్యానర్’ ఏర్పాటు చేసి సినిమాలను నిర్మించేందుకు యంగ్ టైగర్ ప్లాన్ చేస్తున్నాడు. తన తండ్రి పేరు చిరకాలం నిలిచి ఉండేలా సొంత బ్యానర్ ఏర్పాటు దిశగా సన్నహాలు చేస్తున్నాడు. ఈ బ్యానర్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను నిర్మించనునున్నాడు. ఈ బ్యానర్లోనే తన మూవీలను నిర్మించడంతోపాటు కొత్త టాలెంట్ వెలుగులోకి తెచ్చేందుకు నిర్మాతగా మారనున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు, ప్రభాస్, రాంచరణ్ సొంతంగా బ్యానర్లు ఏర్పాటు చేసుకొని మూవీలను నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. వీరంతా చిత్ర నిర్మాణంలో భాగస్వాములై లాభాల్లో వాటాను తీసుకుంటున్నారు.

యంగ్ టైగర్ ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నాడు. కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నాడు. అలాగే కల్యాణ్ నిర్మించబోయే మూవీలో నటించనున్నాడు. వీటి తర్వాత ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి మూవీలను నిర్మించున్నట్లు తెలుస్తోంది.