మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లలో చిరు-152మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సింది. ఈ మూవీకి ‘ఆచార్య’ టైటిల్ ఫిక్స్ చేశారు. చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. పవర్ ఫుల్ ఎండోన్మెంట్ అధికారికంగా రఫ్ఫాడించనున్నాడు. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఓ పాత్రలో నటిస్తాడని సమాచారం. అదేవిధంగా రాంచరణ్ ఈ మూవీలో ఓ కీలక రోల్స్ చేస్తున్నాడు. దాదాపు ఆయన 30నిమిషాల సినిమాలో నటించనున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా కరోనా ఎఫెక్ట్ షూటింగ్ వాయిదా పడింది.
ఈ మూవీలో తొలుత చిరుకు జోడీగా త్రిషను ఖరారు చేశారు. అయితే త్రిష ఈ మూవీని తప్పుకోవడంతో హీరోయిన్ వేటలో చిత్రబృందం పడింది. చిరుపక్కన జోడీగా కాజల్ అగర్వాల్, అనుష్క పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ చిత్రంలో నటించేందుకు అనుష్క భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని కాజల్ అగర్వాల్ ను చిత్రబృందం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాంచరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. అయితే తాజాగా రాంచరణ్ సరసన రష్మిక మందన్న ఎంపికైందని ప్రచారం జరిగింది. అయితే దీనిపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఇప్పటికే ఈ మూవీలో రెజీనా కసండ్రా ఓ స్పెషల్ సాంగ్లో చిరుతో ఆడిపాడనుంది. అలాగే తెలుగమ్మాయి ఈషా రెబ్బా, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ప్రధాన హీరోయిన్లుగా కాజల్ అగర్వాల్, అనుష్క పేర్లు విన్పిస్తున్నాయి. వీరిద్దరిలో కాజల్ వైపే చిత్రబృందం మొగ్గుచూపుతోంది. అలాగే చెర్రీకి జోడీగా కియారా అడ్వాణీ, రష్మిక పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో కియారా పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. ఇప్పటికే చిరంజీవి, చరణ్ వంటి స్టార్లతో క్రేజీగా మారిన ‘ఆచార్య’ మూవీకి గ్లామర్ అద్దేపనిలో కొరటాల బీజీగా ఉన్నారు. రాంచరణ్ మ్యాట్నీ ఎంటటైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ ‘ఆచార్య’కు అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నారు