సూపర్ స్టార్ రజనీ కాంత్ రియల్ లైఫ్ లో చేసిన సాహసం నేటి రాత్రి 8గంటలకు ప్రసారం కానుంది. రజనీకాంత్ ఇటీవల ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’పేరిట తీసిన డాక్యమెంటరీలో నటించారు. ఈ సాహస యాత్ర ప్రసారాన్ని డిస్కవరీ ఛానల్ ఈ రోజు రాత్రి 8గంటలకు ప్రసారం చేయనుంది. దీంతో అభిమానులు రజనీ సాహసయాత్ర చూసేందుకు అత్రుతగా ఎదురు చూస్తున్నారు.
గతంలో ప్రధాని నరేంద్ర మోదీతో సాహస యాత్రికుడు బేర్‌గ్రిల్స్ ఓ డాక్యుమెంటరీ తీసిన సంగతి తెల్సిందే. ‘మ్యాన్ వర్సస్ వరల్డ్’ ప్రొగ్రాంకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ప్రధాని మోదీతో బేర్స్ గిల్స్ చేసిన సాహస యాత్ర ఇండియాలో అత్యంత ఆదరణ పొందించింది. ఈ తరహాలోనే సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కూడా ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ పేరిట ఓ డాక్సుమెంటరినీ చిత్రీకరించారు.
‘మ్యాన్ వర్సస్ వరల్డ్’ ప్రోగ్రాం హోస్ట్ బేర్‌గ్రిల్స్‌తో కలిసి రజనీకాంత్ కర్ణాటకలోని బండిపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సాహసయాత్ర చేశారు. ఈ సందర్భంగా వీరుచేసిన సాహసయాత్రను చిత్రీకరించారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రొమో వీడియోను డిస్కవరీ చానెల్ ప్రోమో విడుదల చేసింది. సుమారు 30సెకన్ల నిడివిగా ఉన్న ఈ ప్రొమోలో రజనీ అడవిలో జీపు నడుపుతూ, కొండలెక్కడం లాంటి సాహసాలు చేస్తూ రజనీ కనిపించారు. 60ఏళ్ల పైబడిన రజనీ కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా సాహసయాత్ర చేయడం ఆకట్టుకుంటోంది.