మన తెలుగు హీరోలకు ముందు చూపు ఎక్కువ అవుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలన్న ఆలోచన వారిలో బాగా పెరిగింది. ఆ క్రమంలో రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ భాగస్వామిగా ‘ ట్రూ జెట్ ‘ అనే విమాన సంస్థలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా సెలబ్రిటీ లకు కార్లను లీజ్ కి ఇచ్చే ఒక బడా కంపెనీ లో పార్టనర్ గా జాయిన్ అయ్యాడు .
ఇక మహేష్ బాబు అయితే మల్టీప్లెక్స్ నిర్మాణం లో ఆల్రెడీ దిగాడు. సూళ్లూరుపేట లో ఒక ప్రెస్టీజియస్ మల్టీప్లెక్స్ కట్టి ప్రభాస్ కూడా తానేమి తక్కువ కాదని నిరూపించు కొన్నాడు. ఇక సందీప్ కిషన్ లాంటి యువ హీరో కూడా బ్యూటీ సెలూన్లు ,రెస్టారెంట్ లు అంటూ వ్యాపారాలు చేస్తున్నాడు. అక్కినేని నాగార్జున ఎన్ గ్రిల్ రెస్టారెంట్ , కన్వెన్షన్ సెంటర్ లాంటి వాటి నిర్వహణలో బిజీ బిజీ గా గడుపు తుంటాడు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు శ్రీ విద్య నికేతన్ అనే సంస్థ స్థాపించి తన ప్రత్యేకతను చూపిస్తున్నాడు .
అలా బిజినెస్ లు చేస్తూనే మన హీరోలు నిర్మాతలుగా మారి సినిమాలు కూడా చేస్తున్నారు. ఆ క్రమంలో విక్టరీ వెంకటేష్ తండ్రి స్థాపించిన సురేష్ సంస్థని మ్ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక అక్కినేని నాగార్జున కి అన్నపూర్ణ సంస్థ ఉండనే ఉంది. మోహన్ బాబు కి సొంత సంస్థ శ్రీ లక్ష్మి ప్రసన్న తో బాటు కొడుకులు స్థాపిస్తున్న అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి.
మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ కూడా సొంతంగా కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించి తన సత్తా చాటుతున్నాడు. ఆ క్రమంలో మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ల నుంచి మొదలుపెడితే నాని లాంటి యూత్ స్టార్ హీరోలవరకూ సినీ నిర్మాణంలో అడుగుపెట్టినవారే. అయితే వీరిలో కొందరు స్వయంగా కాకుండా పరోక్షంగా నిర్మాతలుగా మారుతుంటారు. ప్రభాస్.. బన్నీ లాంటి వాళ్ళు పరోక్షంగా తమా హోమ్ బ్యానర్ల ద్వారా సినిమాల్లో పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా అదే బాటలో ఉన్నాడని తెలుస్తోంది .
వరుణ్ తేజ్ ప్రస్తుతం ఒక బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాను వరుణ్ తేజ్ కజిన్ అయిన సిద్దు ముద్దా స్థాపించిన రినసాన్స్ బ్యానర్ లో అల్లు వెంకటేష్ తో కలిసి నిర్మిస్తున్నాడు. అయితే పేరు కి మాత్రమే అతను నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నిజానికి వరుణ్ తేజ్ ఈ సినిమాకు పెట్టుబడి పెడుతున్నాడని తెలుస్తోంది
ఈ సినిమానే కాకుండా ఇతర హీరోలతో కూడా సినిమాలను నిర్మించాలనే ఆలోచన వరుణ్ తేజ్ కి ఉందట. అందులో భాగంగా మొదట యంగ్ హీరో రాజ్ తరుణ్ తో ఒక సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాను కూడా సిద్దు ముద్దా స్థాపించిన రినసాన్స్ బ్యానర్ పైనే నిర్మిస్తారని.. వరుణ్ తేజ్ మాత్రం బ్యాక్ ఎండ్ లో ఉంటాడని తెలుస్తోంది . కాగా ఈ సినిమాతో మోహన్ అనే నూతన దర్శకుడిని టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది .
Prevention is better than cure