ఈ మధ్య తెలుగు సినిమాకి శాండల్ వుడ్ పరిమళం ఎక్కువై పోతోంది. పూజా హెగ్డే , రష్మిక మందన్న వంటి కన్నడ భామలు తెలుగు లో తమ సత్తా చాటు తున్నారు. ఇంకా చెప్పాలంటే అగ్ర తారలుగా వెలుగుతున్నారు అంతకు ముందు స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క టాలీవుడ్ కి మకుటం లేని మహారాణి గా పేరు తెచ్చుకొంది. ఇపుడా వరసలో మరో కన్నడ హుడిగి తెలుగు తెర ఫై తన అదృష్టాన్ని పరీక్షించుకో బోతోంది .
ఉప్పెన చిత్రం లో హీరోయిన్ గా పరిచయం అవుతున్న క్రితి శెట్టికి తెలుగు లో అవకాశాలు వెల్తువెత్తుతున్నాయి. 2009లో కన్నడ చిత్రం ‘సరిగమ’ చిత్రంతో కెరీర్ ని ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత తమిళంలోనూ సినిమాలు చేసింది. ఇపుడు మెగా మేనల్లుడు సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టింది. ఉప్పెన చిత్రం ఏప్రిల్ 2న విడుదల కావాల్సింది. కానీ కరోనా ప్రభావంతో సినిమా వాయిదా పడింది. కాగా ఈ సినిమా టీజర్ కి వస్తున్న హైప్ వల్ల రితిక శెట్టి కి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఆ క్రమంలో సుకుమార్ నిర్మిస్తోన్న” 18 పేజెస్ ” చిత్రంలోనూ క్రితిశెట్టికి అవకాశం వచ్చింది.
తాజాగా క్రితిశెట్టికి మరో అవకాశం రావడం జరిగింది. ‘ హిట్’ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో ఇటీవల పాగల్ అనే సినిమా ప్రారంభమైంది .ఇక ఈ సినిమాలోనూ క్రితి శెట్టినే హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. అలా తెలుగులో తొలి చిత్రం “ఉప్పెన” విడుదల కాకుండానే రెండు సినిమాల్లో అవకాశం దక్కించు కొన్న క్రితి శెట్టి తన లక్ ని చెక్ చేసుకొంటూ ముందుకి వెళుతోంది . t
Talent never loose it`s identity