ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్‌ను జపాన్ ఒక సంవత్సరం పాటు వాయిదా వేసింది. రోజురోజుకూ కరోనా కేసులను పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి చెందినప్పటి నుండి ఒలింపిక్స్ జరపేందుకు మొగ్గు చూపింది
కానీ ప్రపంచం వ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసులు పెరిగి జనం మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ ను సంవత్సరం పాటు జపాన్ ప్రభుత్వం వాయిదా వేయక తప్పలేదు.ఒలింపిక్స్ మళ్లీ ఎప్పుడు మొదలు అవుతాయో మాత్రం తెలపలేదు.
మరోవంక టోక్యో ఒలింపిక్స్ 2020ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుడు డిక్ పౌండ్ కూడా ప్రకటించారు. ఈ ఏడాది జూలైలో జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ క్రీడలు జరగాల్సి ఉంది. అయితే, మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ఒలింపిక్స్ క్రీడలను ఏడాదిపాటు వాయిదా వేయాలని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
అయితే, ఈ క్రీడలను తిరిగి ఎప్పడు నిర్వహించాలనే దానిని ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, బహుశా 2021లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు చెప్పారు. కరోనా తీవ్రం రూపం దాల్చిన ప్రస్తుత స్థితిలో పలు దేశాలు ఒలింపిక్స్ నుంచి వైదొలగాలని నిర్ణయించాయి. ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఒలింపిక్స్‌లో పాల్గొనే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.