Home Blog Page 8568

ప్రసిద్ధ కళాకారుడు సతీష్ గుజ్రాల్ కన్నుమూత

భారతదేశపు ప్రసిద్ధ కళాకారులలో ఒకరైన పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత సతీష్‌ గుజ్రాల్‌(94) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నాడు. గురువారం సాయంత్రం చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు. సతీష్ గుజ్రాల్ పలు కళల్లో ఆరితేరారు. ఆయన మురలిస్ట్ గా, చిత్రకారుడిగా, వాస్తుశిల్పి, డిజైనర్ గా, కవితా ప్రేమికుడిగా పేరు సంపాందించుకున్నారు. గుజ్రాల్ రచనలకుగాను కేంద్రం పద్మ విభూషణ్ అవార్డు అందజేసి సత్కరించింది. సతీష్ గుజ్రాల్ సోదరుడు దివంగత ఇందర్ కుమార్ గుజ్రాల్(ఐకే గుజ్రాల్) భారత ప్రధానిగా పని చేశారు.

సతీష్ గుజ్రాల్ దేశ రాజధాని ఢిల్లీలోని హైకోర్టు ముఖభాగాన్ని అలంకరించే వర్ణమాల కుడ్యాన్ని డిజైన్ చేశారు. అలాగే ఢిల్లీలోని బెల్జియన్ రాయబార కార్యాలయాన్ని రూపొందించడంలో సతీష్ గుజ్రాల్ సేవలను అందించారు. గుజ్రాల్ చిన్నతనం నుంచే కళలపై మక్కువ పెంచుకున్నారు. 1925లో లాహోర్లో జన్మించిన గుజ్రాల్ దేశ విభజన వంటి భయానక పరిస్థితులను చవిచూశారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సతీష్ గుజ్రాల్ తరచూ కవితల రూపంలో ప్రేమను చూపుతుండేవారు. ‘ఫైజ్ అహ్మద్ ఫైజ్’, ‘గాలిబ్’ వంటి కవితలను రాశారు. లాహోర్లో తన అన్నయ్య ఇందర్‌ గుజ్రాల్ తో కలిసి కవిత్వ పఠన సమావేశాలకు వెళ్లేవారు. సతీష్ గుజ్రాల్ మృతిపట్ల భారత ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

అల్లరి నరేష్ 50 మందికి ఆర్థిక సాయం

కరోనా వైరస్ ప్రభావితమైన తెలుగు సినిమాకి మరో యువ హీరో అండ దొరికింది. షూటింగ్స్ లేక ఇబ్బంది పడే సినీ కార్మికులకు తన వంతు సాయం చేయడానికి ఈదర నరేష్ అలియాస్ అల్లరి నరేష్ ముందుకొచ్చాడు. తాజాగా అల్లరి నరేశ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘నాంది’. కాగా ఈ చిత్ర యూనిట్ లో రోజువారీ వేతనంతో జీవనం సాగించే 50 మంది కార్మికులున్నారు . నాంది సినిమా పూర్తి అయ్యాక వీరంతా పనిలేని స్థితికి చేరుకోనున్నారు. ఈ విషయం తెలిసిన అల్లరి నరేష్ ఆ 50 మందికి ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిసింది.

ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడే వారిలో తమ ‘నాంది’ చిత్ర యూనిట్ ఉందని భావించిన అల్లరి నరేష్ ఆ చిత్ర నిర్మాత సతీశ్ వేగేశ్నతో కలిసి తమ చిత్ర యూనిట్ లోని యాభై మందికి ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ‘ఇది గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నం కాదు.. సాటి మనిషికి సాయం చెయ్యడం మన కర్తవ్యం.. ఈ సాయం కావాలి మరిన్ని సాయాలకు నాంది..అని అల్లరి నరేష్ అనడం విశేషం.

ఏపీలో 20,000 క్వారంటైన్‌ పడకలు సిద్ధం

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఏ రాష్ట్రంలో చేయని విధంగా క్వారంటైన్‌ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అతిపెద్ద నిర్ణయం తీసుకుంది.

మొత్తం 20 వేల క్వారంటైన్ పడకలను అధికారులు సిద్ధం చేశారు. నియోజకవర్గానికి 100 నుంచి 150 పడకలు చొప్పున ఏర్పాటు చేసి జిల్లాల వారీగా జాబితాను ఆరోగ్య శాఖకు కలెక్టర్ లు అందజేశారు. స్కూళ్లు, కళాశాలలు, ఆర్టీసీ భవనాలతో పాటు వివిధ చోట్ల ఈ క్వారంటైన్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి క్వారంటైన్‌కు ఇన్‌చార్జిగా ఒక మెడికల్‌ ఆఫీసర్‌ను నియమిచ్చారు. ఆ నియోజకవర్గంలోని నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్ల విధులు నిర్వహించనున్నారు.

ఈ క్వారంటైన్‌కు అనుబంధంగా 10 వెంటిలేటర్‌ వార్డులు సిద్ధం చేశారు. ఇప్పటికే 11 బోధనాస్పత్రులు,13 జిల్లా ఆస్పత్రుల్లో కరోనా బాధితుల కోసం ప్రత్యేక పడకలు సిద్ధంగా ఉంచారు.
అవసరమైతే మరికొన్ని ప్రైవేటు ఆస్పత్రులను తీసుకుంటామన్న ఆరోగ్యశ్రీ సీఈవో స్పష్టం చేశారు.

ప్రతి క్వారంటైన్‌కి ఇన్‌చార్జిగా మెడికల్‌ ఆఫీసర్‌ను నియమించారు.

ఆయా నియోజకవర్గాల్లో పనిచేస్తున్న స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తల విధులు క్వారంటైన్‌ కేంద్రంలోనే ఉంటాయి.

ఒక్కో కేంద్రంలో 100 పడకలకు తగ్గకుండా ఏర్పాటు పూర్తయ్యాయి. ఇందులో 10 పడకలు వెంటిలేటర్‌తో కూడినవి ఉంటాయి. ఇవి కాకుండా మరికొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌తో కూడిన పడకల ఏర్పాటుకు ఆదేశాలు వెళ్లాయి.
కరోనా అనుమానిత లక్షణాలుంటే వారిని తక్షణమే ఆ నియోజకవర్గాల పరిధిలో ఉన్న క్వారంటైన్‌కు తరలించాలని జిల్లా వైద్యాధికారులకు కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.

►తాజాగా 4 బోధనాస్పత్రులను కేవలం కరోనా ఆస్పత్రులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
►13 జిల్లా ఆస్పత్రులు, మరో 7 బోధనాస్పత్రుల్లోనూ కరోనా వైరస్‌ లక్షణాలున్న వారికి వైద్యమందిస్తారు.
►ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మరికొన్ని క్వారంటైన్‌ కేంద్రాలు పెంచేలా సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
►హై రిస్కు ప్రాంతాలు అంటే విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రాంతాల్లో మరికొన్ని ప్రత్యేక కేంద్రాలు పెంచాలని యోచిస్తున్నారు.

క్వారంటైన్‌ల వద్ద ఉండే వసతులు ఇవే..

►ఇన్‌ఫెక్షన్లు సోకకుండా రోగులకు, వైద్య సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజర్లు, పీపీఈ (పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌)లు ఉంటాయి.
►డాక్టర్లు, నర్సులు 24 గంటలూ అందుబాటులో ఉంటారు.
►ఆహారం, మంచినీటి వసతి ఎప్పటికప్పుడు అందిస్తారు.
►24 గంటలూ అంబులెన్సు సదుపాయం అందుబాటులో ఉంటుంది.
►తాత్కాలిక పద్ధతిలో టాయ్‌లెట్‌లను ఏర్పాటు చేస్తారు.
►సీసీ కెమేరాల పర్యవేక్షణ 24 గంటలూ ఉంటుంది. ఇంటర్నెట్‌ సదుపాయం కూడా కల్పిస్తారు.
►క్వారంటైన్‌లో ఉన్న వారి ఫోన్‌ నంబర్లు, చిరునామాలు ఇచ్చిన తర్వాత వాటిని పర్యవేక్షించేందుకు ఒక నోడల్‌ అధికారి ఉంటారు.
►క్వారంటైన్‌కు అనుబంధంగా ఒక రెఫరల్‌ ఆస్పత్రిని అందుబాటులో ఉంచుతారు.
►ప్రతి పడకకూ కనీసం 2 మీటర్ల దూరం పాటించేలా ఏర్పాటు ఉంటుంది.
►క్వారంటైన్‌ కేంద్రాల్లో ప్రతిరోజూ పారిశుధ్యం నిర్వహించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు.
►అనుమతి ఉన్న వారు మాత్రమే క్వారంటైన్‌కు వెళ్లేలా నిబంధనలు ఉంటాయి.

ప్రైవేటు యాజమాన్యాలు సిద్ధంగా ఉండాలి: డా.ఎ.మల్లికార్జున, సీఈవో, ఆరోగ్యశ్రీ

►పరిస్థితిని బట్టి క్వారంటైన్‌ కేంద్రాలు పెంచుకుంటూ వెళుతున్నాం.
►అవసరమైతే ప్రైవేటు ఆస్పత్రులను తీసుకుని క్వారంటైన్‌ లేదా చికిత్సా కేంద్రాలుగా మారుస్తాం.
►ప్రైవేటు ఆస్పత్రుల డాక్టర్లు, సిబ్బంది కూడా చికిత్సకు సిద్ధంగా ఉండాలి.

ఎవరికీ సెలవులు ఇవ్వలేదు: డా.కె.వెంకటేష్, వైద్య విద్యా సంచాలకులు

►ఇప్పటికే పీజీ వైద్య విద్యార్థులెవరికీ సెలవులు ఇవ్వలేదు. వాళ్లందరూ పనిచేస్తున్నారు
►అవసరమైతే ఎంబీబీఎస్‌ విద్యార్థులను రావాలని కోరతాం.
►ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు కూడా కరోనా నియంత్రణకు ముందుకు రావాలని చెప్పాం.

సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లోనూ చికిత్స: డా.రామకృష్ణారావు, కమిషనర్, వైద్య విధాన పరిషత్‌

►మనకు 195 సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి.
►ఎక్కడైతే సదుపాయాలు బాగున్నాయో అక్కడ క్వారంటైన్‌ ఏర్పాటుకు ఆదేశించాం.
►వెంటిలేటర్లు ఉన్న ప్రతి ఏరియా ఆస్పత్రిలోనూ చికిత్సకు ఏర్పాట్లు చేశాం.
►13 జిల్లా ఆస్పత్రుల్లోనూ కరోనా బాధితుల వైద్యానికి ప్రత్యేక పడకలు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

వంద రోజులు దాటిన అమరావతి రైతుల ఉద్యమం

రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా రైతులు ప్రారంభించిన ఉద్యమం వంద రోజులు దాటింది. పరిపాలనా రాజధానిగా అమరావతిని కొనసాగించా లంటూ రైతులు, రైతు కూలీలు, మహిళలు నెలల తరబడి చేస్తున్న ఉద్యమం గురువారం వందరోజులకు చేరుకొంది. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన కనిపించలేదు.

ప్రపంచ చరిత్రలోనే ఎరుగని విధంగా భవ్యమైన రాజధాని నిర్మాణం కోసం 33,000 ఎకరాల సారవంతమైన భూములను ఉచితంగా ఇచ్చిన రైతులు ఇప్పుడు ఆ రాజధానిని మూడు రాజధానుల పేరుతో తరలించే ప్రయత్నాలు జరుగుతూ ఉండడంతో దిగ్బ్రాంతికి గురై ఈ ఉద్యమం చేపట్టారు. అసమాన త్యాగాలు చేసిన రైతులను కనీసం చర్చలకు కూడా ప్రభుత్వం ఆహ్వానించకుండా, ఉద్యమకారులను `పైడ్ ఆర్టిస్ట్’లు అంటూ అధికార పక్షం వారే ఎగతాళి చేసే విధంగా వ్యవహరిస్తూ వచ్చారు.

మధ్యలో ఒకసారి నరసరావుపేట ఎంపీ ఎల్ కృష్ణదేవరాయలు ముఖ్యమంత్రి ప్రతినిధిగా అంటూ వచ్చి, వారి సమస్యలు విని, ముఖ్యమంత్రికి నివేదిస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. కానీ ఆ తర్వాత ఆయన ఆ ఉద్యయం వైపు చూడనే లేదు. అధికార పక్షానికి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు గాని, జిల్లా మంత్రులు గాని ఉద్యమిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో 100వ రోజున భారీఎత్తున నిరసన తెలపాలని అమరావతి జేఏసీ నాయకులు భావించారు.

తొలుత పోలీసులతో ఈ ఉద్యమాన్ని అణచి వేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయితే హై కోర్ట్ మొట్టికాయలు వేయడంతో పోలీసులు కొంచెం వెనుకడుగు వేశారు. కరోనా పేరుతో శిబిరాలు ఖాలీ చేయమని ఆరోగ్య శాఖతో నోటీసులు ఇప్పించారు. అది కూడా ఫలించలేదు. ఈ ఉద్యమంలో మహిళలు ముందుండి, నిరసనాలలోనే కాకుండా పోలీస్ దమననీతిని కూడా ఎదుర్కోవడం విశేషం. వంద రోజులలో అనేక రీతులలో ఉద్యమాలు జరిపి, దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.

అయితే కరోనా వైరస్ ఉదృతి కారణంగా ప్రస్తుతం చెప్పుకోదగిన రీతిలో ఉద్యమాన్ని ఉధృతం చేసే ప్రయత్నం చేయకపోయినా, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకొంటూనే నిరసనలను కొనసాగిస్తున్నారు. దీక్షాశిబిరాలలో పరిమితసంఖ్యలో, మనిషికి మనిషికి మద్య దూరం పాటిస్తూ రైతులు, మహిళలు ఆందోళనలు జరుపుతున్నారు.

ప్రతిపక్షాలు సహితం దీక్ష శిబిరాల వద్దకు వచ్చి మొక్కుబడిగా మద్దతులు తెలపడమే గాని, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు ఎటువంటి సహకారం అందించడం లేదు. కనీసం ఇతర ప్రాంతాలలో ఈ ఉద్యమానికి సంఘీభావంగా నిరసనలు తెలిపే ప్రయత్నం కూడా చేయడం లేదు. దానితో ఒంటరిగా ఒక వంక న్యాయపోరాటం, మరోవంక రాజకీయ పోరాటం జరుపుతున్నారు.

ఉద్యమం 100వ రోజుకు చేరిన సందర్భంగా అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులు, రైతుకూలీల మృతి పట్ల సంతాప సూచనగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. పలు గ్రామాల్లో ఇళ్ళల్లోనే ఉండి రైతులు నిరసనలు తెలిపారు. అమరావతి ఉద్యమంలో మృతి చెందినవారిని స్మరిస్తూ గురువారం రాత్రి ఇళ్ళ దగ్గర రైతులు 7.30 గంటల నుంచి 8వరకు కొవొత్తులు వెలిగించారు.

గుడ్ న్యూస్.. ఈఎంఐలు చెల్లించకర్లేదు

దేశంలో కరోనా మహమ్మరిని అరికట్టేందుకు కేంద్రం లాక్డౌన్ చేసిన సంగతి తెల్సిందే. 21రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయడంతోపాటు పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ 1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ‘గరీబ్ కల్యాణ్’ పేరుతో దేశంలో ఆకలి చావులు లేకుండా కేంద్రం అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. పలు కీలక నిర్ణయాలను ఆమె ప్రకటించిన సంగతి తెల్సిందే.

తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. దేశంలోని నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలు చెల్లించాల్సిన ప్రజలకు ఆర్బీఐ తీపి కబురు చెప్పింది. ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం విధిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. రుణాలు తీసుకున్న వారంతా మూడు నెలలు ఈఎంఐలు కట్టకుండా వెసులుబాటు కల్పించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి ఊరట లభించింది.

ఆర్బీఐ ప్రకటించిన ఈ నిర్ణయం క్రెడిట్ కార్డులకి కూడా ఈ మారటోరియం వర్తించనుందా లేనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే బ్యాంకు సేవలపై ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా నేపథ్యంలో బ్యాంకుల్లో కనీస నిల్వ పరిమితిని ఎత్తేసింది. అలాగే ఎటీఎం విత్ డ్రా పరిమితిని కూడా సడలించింది. బ్యాంకు సమయాల్లో మార్పులు చేసింది. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు ఉదయం 10నుంచి మధ్యాహ్నం 2గంటలు పని చేసేలా వెసులుబాటు కల్పింది. ఏదిఏమైనా ఆర్బీఐ ఈఐఎంలపై మూడునెలలపాటు మారిటోరియం విధించడంతో రుణాలు తీసుకున్న వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా దిగ్బంధనంలో బుల్లితెరపై రామాయణం

మూడు దశాబ్దాల క్రితం భారత దేశంలో టివి ప్రేక్షకుల విశేష ఆదరణ పొంది, ఒక విధంగా టివి రేటింగ్స్ లలో సంచలనం కలిగించిన రామానందసాగర్ సీరియల్ `రామాయణ’ను మరోసారి దూరదర్శన్ నేషనల్ లో ప్రసారం చేయనున్నారు. కోవిద్-19 మహమ్మారితో దిగ్బంధనంతో ఇళ్లకే పరిమితమైన ప్రజలను అక్డట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తగిన సమయం అని చూస్తున్నట్లుంది.

వాస్తవానికి 2014 ఎన్నికల ముందే 2013లో జీ టివిలో ఈ సీరియల్ ను వేయాలని బిజెపి నేతలు ప్రయత్నం చేశారు. అయితే అప్పటిలో కేంద్రంలో అధికారంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం ఆధీనంలోని దూరదర్శన్ అందుకు అనుమతి ఇవ్వలేదు. దానితో ఇప్పుడు దూరదర్శన్ ద్వారానే ప్రసారం చేయనున్నారు.

భారతీయ సంస్కృతిలో మూలాధారమైన గ్రంధాలలో ఒకటైన రామాయణం ఆధారంగా దీనిని చిత్రీకరించారు. వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరితమానస ల ఆధారంగా, చారిత్రాత్మక సంఘటనలను ఉదహరిస్తూ రామనాదసాగర్ ఈ సీరియల్ ను ఎంతో హృద్యంగా చిత్రీకరించారు.

ఈ సీరియల్ ప్రసారం విషయాన్ని కేంద్ర ప్రసారశాఖమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ‘ ఎంతో సంతోషంగా ఉంది.. ప్రజల డిమాండ్‌ మేరకు రామాయణాన్ని మరోసారి టీవీల్లో ప్రచారం చేస్తున్నాం. మార్చి 28 (శనివారం) నుంచి ఈ సీరియల్‌ ప్రారంభం కాబోతుంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 9 నుంచి 10 గంటల వరకు డీడీ నేషనల్‌ (దూరదర్శన్‌) చానల్‌లో ‍ప్రసారం కానుంది’ అని కేంద్రమంత్రి ప్రకటించారు.

ఈ సీరియ‌ల్‌ తొలిసారి 1987 నుంచి 1988 మ‌ధ్య కాలంలో దూర‌ద‌ర్శన్‌లో ప్రసారమైన విషయం తెలిసిందే. ఈ సీరియ‌ల్ భారతీయటెలివిజ‌న్ రేటింగ్స్‌లో ఓ సంచలనంగా నిలిచింది. ఎంతోమంది ఆదరాభిమానాలను సొంతం చేసుకుని టెలివిజన్‌ రంగంలో ఓ మైలురాయిగా నిలిచింది.

చరణ్ కు సారీ చెప్పిన ఎన్టీఆర్..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తున్న సంగతి తెల్సిందే. శుక్రవారం రాంచరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయం 10గంటలకు ఎన్టీఆర్ సర్ ప్రైజ్ ఇస్తానని ప్రకటించాడు. అయితే అనుకున్న సమయానికి రాంచరణ్ కు ఎన్టీఆర్ సర్ ప్రైజ్ ఇవ్వలేదు. దీంతో రాంచరణ్ సారీ అని చెబుతూనే జక్కన్న పనితీరుపై సెటైర్ వేయడం ఆకట్టుకుంది. ఇందుకు ప్రతీగా చెర్రీ కూడా సరదా స్పందించారు. వీరిద్దరి సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చెర్రీ జన్మదినం సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో చెర్రీ ఫస్ట్‌లుక్‌ను ఎన్టీయార్ విడుదల చేసి సర్ ప్రైజ్ ఇస్తాడని అందరు భావించారు. ఉదయ10గంటలకు చెర్రీకి గిప్ట్ ఇస్తానని గతంలోనే ఎన్టీఆర్ ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ నుంచి ఎలాంటి సర్ ప్రైజ్ రాలేదు. దీంతో ఎన్టీఆర్ ‘సారీ బ్రదర్ చరణ్.. రాజమౌళి అభిప్రాయం తెలుసుకుందామని నీ గిఫ్ట్‌ను నేను ఆయనకి పంపించాను.. జక్కన్న సంగతి నీకు తెలుసు కదా.. చిన్న ఆలస్యం’ అంటూ ఎన్టీయార్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు చరణ్ స్పందిస్తూ ‘ఏంటి ఆయనకి పంపించావా..? ఈ రోజుకి వస్తుందా’ అంటూ సరదాగా వ్యాఖ్యనించాడు. దీనికి స్పందించిన ఎన్టీయర్ ‘ఇప్పుడే రాజమౌళితో మాట్లాడాను.. సాయంత్రం 4గంటలకు కచ్చితంగా ఇస్తానని’ చెప్పినట్లు సమాధానమిచ్చాడు. దీంతో ఎన్టీఆర్ చరణ్ కు ఇచ్చే సర్ ప్రైజ్ గిప్ట్ కోసం మరికొంత సమయం వేచి చూడక తప్పేలా లేదు.

ఉగాది రోజున దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్లోనే ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ ‘రౌద్రం రణం రుధిరం’ అని ప్రకటించాడు. ఈ మోషన్ పోస్టర్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ కనువిందుగా ఉందని కామెంట్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ మోషన్ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీకి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీని 2021 జనవరి 8న విడుదల చేసేందుకు చిత్రబృదం సన్నహాలు చేస్తుంది.

కరోనా కేసులలో 2వ స్థానానికి చైనా

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్యా రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు 81,400 కేసులతో మొదటి స్థానంలో ఉన్న చైనా రెండొవ స్థానానికి పడిపోయింది. దీంతో చైనా చిన్న చిన్నగా కోలుకుంటోందని చెప్పొచ్చు. అదే సమయంలో అమెరికా కరోనా కేసుల సంఖ్య చైనాను దాటేసింది. 85,400 కేసులతో అమెరికా మొదటి స్థానానికి చేరింది.

కరోనా కేసుల సంఖ్యా అమెరికాలో పపెరుగుతున్నట్లు ప్రపంచంలో మరే ఇతర దేశంలో పెరగడం లేదు. మరి కొన్ని గంటల వ్యవధిలోనే ఇటలీ కూడా చైనా ని మూడో స్థానానికి నెట్టివేసి విధంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే, ఇటలీలో మరణాల సంఖ్యా సుమారు 8000 దాటగా.. చైనాలో 3500 అమెరికాలో 2000 గా నమోదయ్యాయి.

అమెరికాలో కరోనావైరస్ పరీక్షలు మొత్తం 50 రాష్ట్రాల్లోనూ అందుబాటులో ఉన్నాయని, 5.5 లక్షలకు పైగా ప్రజలకు పరీక్షలు చేశామని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపారు. బీజింగ్‌ లో ఏం జరుగుతోందనే దానిపై ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేశారు. చైనాలో అసలైన గణాంకాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు కదా అని వ్యాఖ్యానించారు.

కరోనాపై జీ20 దేశాల ఉమ్మడి పోరు

కరోనా(కోవిడ్-19) వైరస్ పేరు చెబితేనే ప్రపంచం గజగజలాడిపోతుంది. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ అన్ని దేశాలకు పాకింది. భారత్ లోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలో 21రోజులపాటు లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 5లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సమాచారం. దీంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇటలీ, స్పెయిన్, యూకే, అమెరికా లాంటి దేశాల్లో అత్యధిక ప్రభావం చూపుతోంది. దీంతో అన్ని దేశాలు కలిసికట్టుగా ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి.

కరోనా మహమ్మరిని కలిసి కట్టుగా ఎదుర్కొనేందుకు జి-20 దేశాలు ముందుకొచ్చాయి. గురువారం సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ అధ్యక్షతన అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, భారత ప్రధాని మోదీ తదితరులు పాల్గొన్నారు. కరోనాపై ఐక్య పోరాటానికి జీ20 దేశాలు కట్టుబడి ఉన్నామని ఆయా దేశాలు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి.

కరోనా దెబ్బతో ఆర్థిక మాద్యం పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని జీ20 దేశాలు భావించాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మాంద్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు సుమారు 5లక్షల కోట్ల డాలర్లను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించాలని జీ20దేశాల ప్రతినిధులు నిర్ణయించారు. కేవలం ఆర్థిక లక్ష్యాలను కాకుండా మానవాళి వికాసానికి ఉపయోగపడేలా జీ20 దేశాలు కలిసి పని చేయాలని ప్రధాని మోదీ సూచించారు. వైద్య పరిశోధన సేవలు ఉచితంగా అన్ని దేశాలకూ అందాలని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మరిని ఎదుర్కొనేందుకు జీ20 దేశాలు తీసుకుంటున్న చర్యలపై ఆయా దేశాల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.

సినీ సెలబెట్రీల విరాళాల్లో ప్రభాస్ టాప్

కరోనా పేరు చెబితే ప్రపంచం బెంబెలెత్తిపోతుంది. ఇండియాలోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మహమ్మరిని అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ చేపట్టింది. కరోనా నివారణకు పలువురు సీని రాజకీయ ప్రముఖులు విరాళాలను అందజేస్తూ తమవంతు సహకారం అందజేస్తున్నారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 4కోట్ల విరాళాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రభాస్ గురువారం రెండు తెలుగు రాష్ట్రాలకు 50లక్షల చొప్పున ఏపీ, తెలంగాణ సీఎం సహాయనిధికి కేటాయించనున్నట్లు ప్రకటించారు. తాజాగా పీఎం సహాయనిధికి 3కోట్లు రూపాయాలను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు పవన్ కల్యాణ్ ప్రకటించిన 2కోట్ల రూపాయాలను విరాళాన్ని బీట్ చేసి ప్రభాస్ టాప్ ప్లేస్ చేరుకున్నారు.

కరోనా నివారణ కోసం ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విరాళాలను ప్రకటించారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాన్ 2కోట్లు, మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు కోటి రూపాయలు, ఎన్టీఆర్ 75లక్షలు, రాంచరణ్ 70లక్షలు, బాలకృష్ణ 50లక్షలు, నితిన్ 20లక్షలు, సాయిధరమ్ తేజ్ 10లక్షలు, అల్లరి నరేష్ 5లక్షలు, అలీ 2లక్షల విరాళాలను ప్రకటించారు.

నిర్మాత దిల్ రాజు దేశంలోని ఒక్కో రాష్ట్రానికి 10లక్షల చొప్పున విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించి ఆయన దాతృత్వాన్ని చాటుకున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ 20లక్షలు, అనిల్ రావుపూడి 10లక్షలు, కొరటాల శివ 10లక్షలు కేటాయించారు. అలాగే జీవితా రాజశేఖర్ దంపతులు, మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా సీని కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా తమిళనాడులోని సీనీ ప్రముఖుల కోసం సూపర్ స్టార్ రజనీ 50లక్షలు, విజయ్ సేతుపతి 50లక్షలు, సూర్య, కార్తీ 10లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ ని “అన్నా..” అని పిలిచిన కేటీఆర్!

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెరో 50లక్షలు విరాళాలు ప్రకటించిన విషయం తెల్సిందే..ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ వేదికగా తెలంగాణ మంత్రి కేటీఆర్, పవన్ కళ్యాణ్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.

పవన్ కళ్యాణ్ కేటీఆర్ ని “సార్” అని సంభోదించగా.. “సార్’ ఎందుకులే అన్నా.. తమ్ముడు అను చాలు” అన్నాడు.పవన్ కళ్యాణ్ మళ్ళీ స్పందించి “సరే తమ్ముడు” అన్నాడు. ఈ విధంగా వారి మధ్య సంభాషణ జరగడంతో ట్విట్టర్ లో వారి పోస్టులకు అటు పవన్ ఫ్యాన్స్ , ఇటు కేటీఆర్ అభిమానులు ఆసక్తిగా కామెంట్స్ పెడుతున్నారు

కరోనావైరస్ భయంతో దేశం మొత్తం లాక్‌ డౌన్‌ అమలులో ఉంది. ఈ సమయంలో సహాయార్ధం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కు చెరో రూ. 50 లక్షలు ఇచ్చారు.

ఈ విషయాన్ని ట్వీట్‌ చేస్తే… తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పవన్‌ కు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత ‘‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్‌ నాయకత్వంలో సమర్థంగా మీ విధులు నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అంటూ కేటీఆర్‌ ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు పవన్‌. అందులో కేటీఆర్‌ ను సర్‌ అని పవన్‌ సంబోధించారు.

కరోనాతో ఆర్థికంగా కుంగిపోతున్న ఏపీ రైతులు

కరోనా వైరస్ తో దేశవ్యాప్త దిగ్బంధనం ప్రకటించినా వ్యవసాయ పనులకు మాత్రం అడ్డు ఉండబోదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా ఇస్తున్నా మొత్తం ఆర్ధిక కార్యకలాపాలు స్తంభించి పోవడంతో రైతులు ఆర్ధికంగా కుంగిపోతున్నారు. ఇప్పటికే పంటల కోతలు పూర్తయి సరైన ధరలేక అమ్మకాలు జరగని ఖరీఫ్‌ పంటలు ఒక వైపు, ఇప్పుడిప్పుడే కోతలకొస్తున్న రబీ పంటలు మరో వైపు వారిని వేధిస్తున్నాయి.

ఇటువంటి కీలక సమయంలో కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఎక్కడి పనులు అక్కడ ఉన్నపళంగా స్తంభించిపోయాయి. ఏప్రిల్‌ 1 నుంచి పంటల కొనుగోళ్లు ప్రారంభిస్తామని ప్రభుత్వం ఇంతకు ముందు ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ విషయమే అనుమానాలు తలెత్తుతున్నాయి.

మిగిలిన జిల్లాలతో పోల్చితే ఆలస్యంగా నెల్లూరులో ఖరీఫ్‌ వరి సాగవుతుంది. ఫిబ్రవరి నుంచి పంటలు చేతికొస్తాయి. లాక్‌డౌన్‌కు ముందే నెల్లూరులో ధాన్యం కొనుగోళ్లు సాఫీగా లేవు. అలాంటిది లాక్‌డౌన్‌ వేళ ఎక్కడికక్కడ కొనుగోళ్లు నిలిచిపోయాయి.

జిల్లాలో లక్షన్నర హెక్టార్లలో సన్నరకం వరి సాగైందని అంచనా. ఈ తడవ దిగుబడి ఆశాజనకంగా ఉంది. ఎంత లేదన్నా లక్షన్నర టన్నుల ధాన్యం రైతుల వద్ద పేరుకుపోయింది. కచ్చితంగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)పై ధాన్యం మొత్తాన్నీ కొంటామని ప్రభుత్వం పేర్కొన్నా అందుకు తగ్గ చర్యలు కనబడటం లేదు.

మరోవంక, విజయనగరం జిల్లాలో గోదాములు ఖాళీ లేవన్న పేరుతో రైతుల నుంచి ధాన్యం కొనట్లేదు. ఈ సమస్య నెల రోజుల ముందే ప్రభుత్వ దృష్టికి వచ్చినా పరిష్కారం కాలేదు. ఇదిలా ఉండగా రబీలో రాష్ట్ర వ్యాప్తంగా టార్గెట్‌కు మించి వరి సాగైంది. సాగు లక్ష్యం 7.40 లక్షల హెక్టార్లకు 8.07 లక్షల హెక్టార్లలో వరి సేద్యం జరిగిందని వ్యవసాయశాఖ చెబుతోంది.

ఏప్రిల్‌ నుంచి కోతలు మొదలవుతాయి. పెద్ద ఎత్తున ధాన్యం మార్కెట్‌కొస్తుంది. రైతులకు పడే ధరలపై కరోనా, లాక్‌డౌన్‌ల ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆవేదన రైతులను నిద్ర పోనీయట్లేదు.

ఇంకోవైపు, రబీలో సాగైన మొక్కజొన్న, పప్పుశనగ, మినుములు, పెసర, జొన్న కోతలు మొదలయ్యాయి. లాక్‌డౌన్‌కు ముందే అక్కడక్కడ మార్కెట్‌కు కూడా వచ్చాయి. ఎంఎస్‌పిపై రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మొక్కజొన్న, పప్పుశనగ రబీలో ఆశాజనకంగా సాగవగా, మినుములు, పెసలు సాధారణం కంటే తక్కువ పడ్డాయి.

ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఈ పంటలు ఎక్కువగా సాగయ్యాయి. రాయలసీమ జిల్లాల్లో ఖరీఫ్‌లో పండిన కందులను ప్రభుత్వం కొనలేదు. తెగుళ్లతో మిరప రైతు నష్టపోగా, చేతికొచ్చిన పంటకు ధర తొలుత బాగానే ఉందనిపించినా, ఇప్పుడు అమాంతం తగ్గిపోయింది. ఒకానొకదశలో క్వింటాలుకు గరిష్టంగా రూ.20 వేల వరకు పలకగా అనంతరం క్రమంగా రూ.ఏడెనిమిది వేలకు దిగజారింది. లాక్‌డౌన్‌తో అదీ లేదు.

కడప, అనంతపురం జిల్లాల్లో అరటి ధర బాగా దిగజారింది. టన్ను రూ.20 వేల నుంచి ఏడు వేలకు పడిపోయింది. ప్రభుత్వం రూ.8 వేలకు కొంటామన్నప్పటికీ ఆచరణ మొదలవలేదు. ఇంతలో లాక్‌డౌన్‌ రావడంతో అదీ ఆగిపోయింది. లాక్‌డౌన్‌తో టమాటా ధర ఒక్కసారిగా బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.45కు చేరగా ఇంతకుముందు కొనే దిక్కులేక రైతులు పొలాల్లోనే పంటను వదిలేశారు. ధర పెరిగిందని టమాటాను తీద్దామన్నా చేజారిపోయిందని రైతులు వాపోతున్నారు.

మామిడి సీజన్‌ ఆరంభంలోనే లాక్‌డౌన్‌లు వచ్చి, ఎగుమతులపై భరోసా లేక భవిష్యత్తులో భారీగా ధరల పతనం తప్పదన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. రవాణా సౌకర్యం లేక ములగ, ఇతర కూరగాయల ధరలు బహిరంగ మార్కెట్‌లో పెరగ్గా, రవాణ లేదన్న పేరుతో రైతులకు వ్యాపారులు, దళారీలు ధరలు దిగ్గొస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు సమస్య, ఎగుమతులు నిలిచిపోయాయన్న వదంతులతో ఆక్వా రైతులు, ఆ రంగంపై ఆధారపడ్డ మత్స్యకారులు, కూలీలు నష్టాలపాలవుతున్నారు.

భారీ అంకెలు తప్ప ఉపశమనం కలిగించని నిర్మల ప్యాకేజి

నిర్దుష్టంగా నిధులు కేటాయించకుండా ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ రూ 1.70 లక్షల కోట్లు అంటూ కరోనా సంబంధ దిగ్బంధానికి గురైన పేదలకు భారీ పధకాన్ని ప్రకటించారు. ప్రభుత్వంపై భారం పడకుండా, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు, ఇప్పటికే ఉన్న ఆయా సంస్థల ఆర్ధిక వనరుల నుండే వ్యయం చేయడానికే ఆమె ప్రతిపాదించారు.

ఉదాహరణకు భవన నిర్మాణ కారకులు, గనుల కార్మికులకు ఇప్పటికే ఉన్న సంక్షేమ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలను ఖర్చు పెట్టుకోమన్నారు. అదే విధంగా భవిష్యత్ నిధికి సంబంధించి ఉద్యోగులు తీసుకోనని నిధులు ఆ సంస్థ వద్ద వేల కొలది కోట్ల నిధులు మురుగుతున్నాయి. వాస్తవానికి అవి కార్మికులవే గాని, వాటికి – ప్రభుత్వానికి సంబంధం లేదు.

ఇక జాతీయ ఉపాధి హామీ పధకం క్రింద వేతనాలను రోజుకు రూ 20 పెంచడం కూడా గత వారమే వార్షిక పెంపుదలలో భాగంగా గ్రామీణ మంత్రిత్వ శాఖ పెంచిన నిధులు. గాని ఇప్పుడు కరోనా దృష్ట్యా ప్రత్యేకంగా పెంచుతున్నవి కావు. పైగా, సగటున 50 రోజులకు మించి ఈ పధకం క్రింద పనిచేయడం లేదు. అటువంటప్పుడు ఈ పెంపుదలతో రూ 2,000 అదనపు ప్రయోజనం అని ఏ విధంగా చెబుతారు? కాగా, పనితో నిమిత్తం లేకుండా వేతనాల చెల్లింపును ఉపాధి హామీ పథక కార్మికులు కోరుతున్నారు.

ఇక ఉజ్వల పధకం క్రింద ఇవ్వదలచిన ఉచిత గ్యాస్ సైలెండర్ల వ్యయాన్ని లాభదాయకమైన స్థితిలో ఉన్న ఆయా ప్రభుత్వ రంగ సంస్థలే భావించవలసి ఉంటుంది. ఈ పధకం క్రింద తీసుకున్న సిలెండర్ లలో సగంకు పైగా ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో వివిధ కారణాల చేత వినియోగంలో లేవని కొన్ని అనధికార సర్వేలు తెలపడం గమనార్హం.

రైతులకు వెంటనే జమ చేస్తామని అంటున్న రూ 2,000 సహితం వారికి సాలీనా రూ 6,000 ఇస్తామని భరోసా ఇచ్చిన మొత్తం నుండే గాని, అదనంగా ఇవ్వడం లేదు. పైగా, ఈ పధకం కౌలు రైతులకు, భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఎటువంటి ప్రయోజనం కలిగించదు. పలు రాష్ట్రాలలో రైతులకేనా వారి సంఖ్యే ఎక్కువగా ఉండడం గమనార్హం.

దిగ్బంధనం కారణంగా అసంఘటిత కార్మికులు పెద్ద సంఖ్యలో వివిధ రాష్ట్రాలలో చిక్కుకు పోయారు. వారి కోసం ఆమె ప్యాకేజీలో కొంత స్థానం ఇస్తే బాగుండెడిది. బీహార్, ఒడిశా ముఖ్యమంత్రులు వారిని ఇతర రాష్ట్రాల నుండి తమ రాష్ట్రంకు తరలించడానికి పూర్తి వ్యయం భరిస్తామని ప్రకటించడం గమనార్హం.

ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన అనేక మంది భారతీయులను మనం విమానాల ద్వారా ఇక్కడకు తరలించిన ప్రభుత్వం ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు తిరిగి తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సంబం ధించినటువంటి అంశం ఈ ప్యాకేజీలో చోటుచేసుకోలేదు.

ఆరోగ్య కార్యకర్తలకు ప్రకటించిన బీమా సౌకర్యం వలన ప్రభుత్వానికి ఎటువంటి ఖర్చు ఉండే అవకాశం లేదు. ఈ అంశం ప్రయివేటు రంగానికి కూడా వర్తిస్తుందా అన్న దానిపై స్పష్టత లేదు. వారికి అత్యవసరంగా కావాల్సిన రక్షణ పరికరాలు, మెడిసన్‌, పరీక్షా సదుపాయాలపై ప్రస్తావనే లేకపోవడం విస్మయం కలిగిస్తుంది.

కరోనాతో బ్యాంకులకు కొత్త చిక్కులు

ఇప్పటికే మొండి బకాయిల (ఎన్‌పీఏ లేదా నిరర్థక ఆస్తులు) సమస్య, మోసాలు-కుంభకోణాలతో వినియోగదారుల విశ్వాసాన్ని కోల్పోయిన దేశీయ బ్యాంకింగ్‌ రంగానికి కరోనా ఉధృతి కొత్త చిక్కుల్ని తెచ్చి పెడుతున్నదని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ హెచ్చరించింది. బ్యాంకులకు సంబంధించిన ఆపరేటింగ్‌ ఎన్విరాన్‌మెంట్‌ స్కోర్‌ను ‘బీబీప్లస్‌’ నుంచి ‘బీబీ’ స్థాయికి ఫిచ్‌ కుదించింది.

కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం, బ్యాంకింగ్‌ రంగానికి దానివల్ల కలిగే నష్టాలను బేరిజు వేసుకుని ఫిచ్‌ తమ రేటింగ్‌కు కోత పెట్టింది. లాక్‌డౌన్‌తో పారిశ్రామికోత్పత్తి, దేశీయ వినియోగ సామర్థ్యాలు కుంటుబడుతాయని ఫిచ్‌ పేర్కొన్నది. అంతిమంగా ఈ వ్యవస్థకు రుణాలిచ్చే బ్యాంకులే నష్టపోతాయని స్పష్టం చేసింది.

మరోవంక, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలు ముందుగా నిర్దేశించినట్లుగానే వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో విలీనాల అమలు వాయిదాపడే వీలుందా? అన్న ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అలాంటిదేమీ లేదన్నారు.

ఇలా ఉండగా, దేశ ఆర్థిక వ్యవస్థకు కరోనా కష్టాలు ఏర్పడిన నేపథ్యంలో ఉపశమన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)ను కోరింది. ఈ ఆపత్కాలంలో వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చేయూతనిచ్చేలా కొన్ని అత్యవసర నిర్ణయాలుంటే మంచిదని అభిప్రాయపడింది. ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి దేబాశిష్‌ పండా ఆర్బీఐకి ఈ మేరకు ఓ లేఖ రాసినట్లు తెలుస్తున్నది.

కొద్ది నెలలపాటు రుణాల నెలసరి చెల్లింపులను వాయిదా వేయాలంటూ బ్యాంకులకు సూచించాలని, వ్యవస్థలో నగదు కొరతను అధిగమించేలా చర్యలుండాలని, మొండి బకాయి (ఎన్‌పీఏ)ల వర్గీకరణలో సడలింపు అవసరమని సదరు లేఖలో పండా కోరారు. ఇవ్వన్నీ బ్యాంకులపై మరిన్ని భారాలను కలిగించే చర్యలే కాగలవు.

ఇలా ఉండగా, భారత్‌లో కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ ఒక్కటే సరిపోకపోవచ్చని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ స్పష్టం చేశారు. జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన భారత్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని బ్లూంబర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దేశంలో ఎంతోమంది పేదలున్నారని, ఇండ్లకే పరిమితం కావాలంటే సర్దుకుపోయే పరిస్థితి అందరికీ ఉండదని గుర్తుచేశారు.

సామాజిక దూరం తప్పనిసరిగా ఉన్న ఈ అంటువ్యాధి నిర్మూలనకు కలగలిసి ఉండే మురికివాడలు ఆటంకంగా ఉండే వీలుందని ఆయన పేర్కొన్నారు. మౌలిక రంగ సామర్థ్యం మెరుగుపడాలన్న ఆయన వైరస్‌ అంతానికి అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

వీళ్ళింతేనా? ఎప్పటికీ మారరా?

తెలుగు రాష్ట్రాలు ఎందుకనో ఎప్పుడూ కొన్ని విషయాల్లో వివాదాలు సృష్టిస్తూనే ఉంటాయి. మనం మారమా ? మనమింతేనా? ఎన్నాళ్లిలా? గత మూడు రోజులనుండీ జరుగుతున్న తతంగం చూస్తుంటే మనమింతేనేమో ననిపిస్తుంది. ప్రధానమంత్రి 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించి కొన్ని గంటలు కాకముందే సామాజిక దూరం అనేమాటకి అర్ధంలేకుండా చేయగలిగాము మనం. మొన్న ప్రధానమంత్రి మాట్లాడకముందే తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ మీరు సామాజిక దూరం పాటించకపోయినా , రోడ్లమీద తిరిగినా చాలా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఏం కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులివ్వాలా అని కూడా మాట్లాడాడు. అందరూ కెసిఆర్ మాట్లాడిన దానికి జేజేలు పలికారు. మరి ఆ తర్వాత ఏమైంది?

ఆంధ్ర విద్యార్థుల ప్రహసనం మొదలయ్యింది. అసలు ఎక్కడివాళ్ళక్కడ గప్ చిప్ అని ప్రభుత్వ ఉత్తర్వులుంటే అన్నివందలమంది పోలీస్ స్టేషన్ల ముందు గుమికూడటమేమిటి? దానికి ఎవరు కారణం? దీనికి ప్రధానంగా పోలీసులనే నిందించాల్సి ఉంటుంది. అసలు పోలీసులు పాసులు ఎందుకు ఇవ్వటం మొదలు పెట్టారో ఎవరికీ అర్ధం కావటంలేదు. హాస్టళ్లు ఖాళీ చేయిస్తే ప్రభుత్వం తోటి, హాస్టల్ యాజమాన్యం తోటి మాట్లాడాలి గానీ ఏకంగా పాసులు ఇవ్వటం నిబంధనలు అతిక్రమించటం కాదా? కంచె చేను మేస్తే ఎవరికి చెప్పుకోవాలి? లాక్ డౌన్ ని అమలు చేయాల్సిన యంత్రాంగమే దాన్ని అతిక్రమించటానికి దోహదపడే పరిస్థితుల్ని సృష్టిస్తే ఎలా? అంతమంది ఒకర్నొకరు రాసుకుంటూ అన్నిగంటలు పోలీస్ స్టేషన్ల ముందు గుంపులు గుంపులుగా గుమికూడటం సామాజిక దూరం నిబంధనల్ని అతిక్రమించటం కాదా? మరి దీనికి కారణమైన వారిమీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? అదే ఒక సామాన్యుడు అతిక్రమిస్తే లాఠీలతో బాదేవాళ్ళు వాళ్ళే తప్పుచేస్తే శిక్షలేదా? అన్ని శేష ప్రశ్నలే?

మోడీ గారు జనతా కర్ఫ్యూ పెట్టేముందు రెండురోజులు ముందుగా దేశ ప్రజలకు విజ్ఞాపన చేశాడు. కానీ ౩ వారాల లాక్ డౌన్ చేసేముందు ఎటువంటి ముందస్తు అవకాశం ఇవ్వలేదు. మనదేశంలో ఇతర రాష్ట్రాలనుంచి వలస వచ్చి పనిచేసే అసంఘటిత కార్మికుల సంఖ్య చాలా అధిక శాతం లో వుంది. అందులో చాలామంది రెక్కాడితే డొక్కాడని వాళ్ళు . అంతమంది వేరే వూళ్ళో తలదాచుకోవటం తలకుమించిన భారం. సామాజిక దూరం పాటించటం వీళ్ళకు కష్టం కూడా. ఎంతోమంది తాత్కాలిక వసతులలో తలదాచుకుంటారు. మరి తగినసమయం లేకుండా వున్నఫలాన ఎక్కడివాల్లక్కడ గప్ చిప్ అంటే ఎదురయ్యే ఇబ్బందుల్ని ఆలోచించి వుండ వలసిందని అనిపిస్తుంది. వీళ్ళకు ఇక్కడ రేషన్ కార్డులు కూడా వుండవు. దేశంలో ఎక్కడయినా రేషన్ కార్డులు వాడుకొనే సదుపాయం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఎందుకనో ఎక్కడో లోపం వుందనిపిస్తుంది. ఇంకొంచెం నిశిత పరిశీలన చేసి వుంటే బాగుండేదేమో. అయినా ఇప్పుడేమీ మాట్లాడవద్దు. అందరం ప్రభుత్వ ఆదేశాల్ని పాటిద్దాం.

విద్యార్థులు కూడా తక్కువేమీ తినలేదు. ఇంటికెళ్లాలని కోర్కె ఉండటం సహజమే. మామూలుగానే రెండు రోజులు సెలవులొస్తే ఇంటికెళ్ళేవాళ్ళు 3 వారాలు ఒట్టిగా గదిలో కూర్చోమని అంటే కష్టమే. వాళ్ళ బాధ అల్లా ఇన్నిరోజులు ఒకే చోట ఉండాల్సి వచ్చేటప్పుడు నేరుగా వూరికెళ్తే బాగుండేదనేది. అంతవరకూ తప్పులేదు. ఒకటి రెండురోజులు ముందుగా ప్రకటించి వుంటే అందరూ ఇళ్ళకు చేరే వాళ్ళే. వాళ్ళ బాధ అర్ధం చేసుకోగలం కానీ అందుకోసం హాస్టళ్ళు మూసివేశారనే సాకు కరెక్టుగా లేదు. ఏవో కొన్ని హాస్టళ్ళు మూసివేసినమాట నిజమే కానీ పోలీస్ స్టేషన్ ముందు కొచ్చిన వాళ్ళలో చాలామంది అటువంటిదేమీ లేకపోయినా ఎలాగోలాగా ఆంధ్ర చేరాలనేదే. ప్రభుత్వం ముందస్తు అవకాశం ఇవ్వకపోవటం ఎలా తప్పో నిబంధనలు అతిక్రమించి ఆంధ్ర వెళ్ళా లనుకోవటం కుడా అంటే తప్పు. వలస కార్మికుల్లో ఎక్కువమంది చదువుకోని వాళ్ళు , వాళ్ళ బాధల్ని కొంతమేర అర్ధం చేసుకోగలంకానీ విద్యార్ధులు ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించటం బాధాకరం.

అసలు మన దేశంలో ఎవరినీ ఏమీ అనటానికి లేదు. ఎవరూ చిన్న అసౌకర్యాన్ని కూడా భరించలేరు. అందరం పెద్ద పెద్ద మాటలే చెబుతాం. సినిమా హాల్లో జాతీయగీతం వస్తే లేచి నిలబడతాం. దేశభక్తి సినిమాలు వస్తే ఆదరిస్తాం. అదే వ్యక్తిగతంగా తన దగ్గర కొచ్చేసరికి మన సౌకర్యాలలో ఎక్కడా రాజీపడటానికి ఇష్టపడం. ఇప్పుడు వచ్చింది ఓ జాతీయ విపత్కర పరిస్థితి. ఇందులో అందరూ సహకరిస్తేనే ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడగలం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన కొంతమందికి అసౌకర్యం కలగవచ్చు. అంతమాత్రాన ఈ సమయంలో వాటిని అతిక్రమించటానికి ప్రయత్నించటం క్షంతవ్యం కాదు. విద్యార్ధులు ఊరికెళ్ళ గలిగితే మంచిదే. అదికుదరనప్పుడు దొడ్డి మార్గాలు వెతుక్కోవటం తప్పు. అదీ సామాజిక దూరం నియమాన్ని అతిక్రమించి. ఇందుకు కావాల్సిన భౌతిక పరిస్థితుల్ని సృష్టించిన పోలిసుల ప్రవర్తన గర్హనీయం.

ఇందులో రెండు రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కూడా గర్హనీయం. సామాజిక దూరం అమలులో వున్నప్పుడు, లాక్ డౌన్ అమలు లో వున్నప్పుడు సమస్య ఉత్పన్నం అయినప్పుడు యుద్ధ ప్రాతిపదికలో పరిష్కరించాలి కానీ అది అదుపుతప్పే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఇప్పుడు జరిగిన మొత్తం ప్రహసనం లో ఎక్కువ ఆందోళన చెందుతుంది సామాజిక దూరం విషయంలో జరిగిన ఉల్లంఘనల వలన ప్రమాదం జరిగిందా అనేదే? టీవీ లలో అంత పెద్ద ఎత్తున విద్యార్ధులు పోలీస్ స్టేషన్ ల ముందు గుమికూడితే యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించక పోవటం రెండు రాష్ట్రాల లోపం. అయినా ఇప్పుడా విషయం కూడా వదిలేద్దాం. ఇది సమయం కాదు. ఈ రోజు కూడా సరిహద్దుల దగ్గర మొహరించటాన్నిఏ కోణంలో చూడాలి? వీళ్ళ వైఖరిని ఖండించాలి. ప్రభుత్వాన్ని విమర్శించటానికి అందరం ముందుంటాం కానీ మనమే భాద్యతలేకుండా ప్రవర్తిస్తుంటే ఎలా? కరోనా మహమ్మారిని పారదోలాలంటే అందరం ప్రభుత్వ ఆదేశాల్ని పాటించాలి. ఇది యుద్ధం లాంటిదే. యుద్ధంలో కమాండర్ ఆదేశాల్ని తూచాతప్పకుండా పాటించాలి. అందులో యోగ్యతల్ని చర్చించరు. ఇదీ అంతే. ఈ ౩ వారాలు ప్రభుత్వ ఆజ్ఞల్ని ఎవరూ ఉల్లంఘించ రాదు. ప్రభుత్వ నిర్ణయం తప్పా ఒప్పాఅనేది యుద్ధం అయిపోయిన తర్వాత అంటే మహమ్మారిని జయించిన తర్వాత తీరికగా చర్చించుకుందాం. అప్పటిదాకా ప్రభుత్వ ఆజ్ఞల్ని శిరసావ హించుదాం . జై భారత్ , జయహో మన ఐక్యత.

మోహన్ బాబు, చెర్రీలపై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు

ఉగాది రోజున మెగాస్టార్ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. చిరు ఎంట్రీతో అభిమానులు ఆయనకు ‘వెల్ కమ్ టూ సోషల్ మీడియా’ అంటూ లక్షల్లో కామెంట్లు పెట్టారు. సెలబ్రెటీలు ఆయన ఘనంగా స్వాగతం పలికారు. మెగా కోడలు ఉపాసన ‘వెల్ కమ్ టూ మామయ్య’ అంటూ ట్వీట్ చేసి అందరినీ ఆకట్టుకుంది.

తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మెగాస్టార్ కు స్వాగతం పలుకుతూ ‘వెల్ కం మిత్రమా.. అని ట్వీట్ చేశారు. దీనికి మెగాస్టార్ స్పందిస్తూ ‘థాంక్యూ మిత్రమా.. రాననుకున్నవా.. రాలేననుకున్నవా’ అంటూ అంటూ ఇంద్ర సినిమాలోని డైలాగ్ ని పోస్ట్ చేశారు. ఈ కామెంట్ వీరిద్దరి మధ్య సాన్నిహిత్యానికి అద్ధం పడుతోంది. సినిమాల్లోనే కాకుండా వీరిద్దరు బయటకుండా చాలా సరదాగా ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకుంటూ అభిమానులు అలరిస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ కొనసాగడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

అదేవిధంగా చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన రోజునే రాంచరణ్ కూడా ట్వీటర్ ఖాతా తెరిచారు. దీంతో చిరంజీవి చరణ్‌కు స్వాగతం చెబుతూ ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. ‘ట్విట్టర్ ప్రపంచంలోకి రామ్ చరణ్‌కు స్వాగతం అంటూనే.. సింహాన్ని దాని పిల్ల ఫాలో అవుతుంది’ కామెంట్ చేశారు. ఈ కామెంట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో చిరంజీవి ట్వీట్‌ను మెగా అభిమానులు అందరికీ షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

ఇండోనేషియన్లకు కరోనా ఉందని తెలుసు

ఒక మత ప్రచారం కోసం కరీంనగర్ వచ్చిన పది మంది ఇండోనేషియన్ల బృందానికి తమలో కరోనా వైరస్ ఉన్నదన్న విషయం తెలుసట …ఇండోనేషియా నుంచి వీరు ఇండియా బయలు దేరే సమయానికే వీరికి కరోనా వైరస్ సోకిందట . అయితే ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి దొరికిపోతే, ఆసుపత్రిలో పెడతారని, తాము ఇండియా రాలేమన్న సందేహం తో పారాసిటమాల్ మాత్రలు వేసుకొని కరోనా ని కప్పిపుచ్చారట …

కరీంనగర్‌లో మత ప్రచారానికి వచ్చిన పదిమంది ఇండోనేషియన్ల బృందం ఇక్కడ దాదాపు 500 మందిని కలిసినట్టు తేలడం తో మన పోలీసులు వారి నుంచి పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో కరీంనగర్‌లో లాక్‌డౌన్ ప్రకటించి, రాకపోకలను పూర్తిగా మూసివేశారు. ఇండోనేషియన్లు కలిసిన వారిలో కొందరిని గుర్తించిన అధికారులు, వారిని ఇళ్లల్లో క్వారంటైన్ చేయగా, మరికొందరిని ఆసుపత్రులకు పంపించారు, అయితే ఇప్పటిదాకా సేకరించిన వివరాల ప్రకారం ఇండోనేషియా బృందంతో తిరిగిన వారిలో ఒక వ్యక్తి కి మాత్రమే కరోనా పాజిటివ్‌‌గా తేలింది . అదొక్కటే ఊరట కలిగించే విషయం.

అయితే మత ప్రచార కార్యక్రమం కోసం ఇండియా వచ్చిన ఇండోనేషియన్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఢిల్లీ లో నాలుగు రోజులు గడపడం తో పాటు రామగుండానికి యథేచ్ఛగా రైల్లో వచ్చారు. అక్కడి నుంచి కరీంనగర్‌కు వెళ్లి, మత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అలా కార్యక్రమం ముగిసిన తర్వాత బృందంలో ఒకరు తీవ్రమైన దగ్గుతో ఇబ్బందిపడుతుంటే, అసలు విషయం బయటికొచ్చింది.