Home Blog Page 8557

వారం రోజుల లిక్కర్ బంద్ కే ఆర్ధిక లోటా కేసీఆర్!

కరోనాను కట్టడి చేసేందుకు ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు పెడుతానన్నసీఎం కేసీఆర్… ఇప్పుడు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను కట్ చేస్తున్నారని బిజెపి సీనియర్ నేత, మాజీ మంత్రి డి కె అరుణ ప్రశ్నించారు.

ధనిక రాష్ట్రం అని పదే పదే చెప్పుకునే కేసీఆర్ ఇప్పుడు ఆర్థిక లోటు అనటం విడ్డురంగా ఉందని అరుణ ధ్వజమెత్తారు. కేవలం వారం రోజులు లిక్కర్ షాపులు బంద్ చేస్తే రాష్ట్రంలో ఆర్థిక లోటు వచ్చిందా అని ప్రశ్నించారు. వారం రోజుల లాక్ డౌన్ కే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలా…ఇక ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదని, మరి వాటిని ఎలా ఎదుర్కొంటారని ఆమె దుయ్యబట్టారు.

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సగం మేర కొత్త విధించాలని కేసీర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు భయబ్రాంతులకు గురవుతున్నారని అరుణ విమర్శించారు. అసలు రాష్ట్రంలో ఇలాంటి ఆర్ధిక పరిస్థితి రావడానికి మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని ఆరోపించారు.

ప్రతి రోజు పోరాడుతున్న ఉద్యోగులకు మీరిచ్చే బహుమానం ఇదేనా అని ఆమె నిలదీశారు. నెల జీతంపై ఆధారపడి బతికే ఉద్యోగుల వేతనాల్లో ఏక పక్షంగా 50 శాతం కోత విధిస్తే కుటుంబాల జీవన పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

చిన్న ఎన్టీఆర్ తో చిన్న శ్రీదేవి

ఒకప్పుడు పెద్ద ఎన్ టి ఆర్ , శ్రీదేవి ల జోడికి విపరీతమైన క్రేజ్ ఉండేది. వాళ్లిద్దరూ కలిసి నటించిన వేటగాడు , కొండవీటి సింహం , సర్దార్ పాపారాయుడు , బొబ్బిలి సింహం వంటి చిత్రాలు తెలుగు సినీ చరిత్రలో తిరుగులేని విజయాలు నమోదు చేశాయి. మళ్ళీ ఇన్నాళ్లకు వాళ్ళ వారసులు కలిసి నటించే సమయం రాబోతుంది.

దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ “ధఢక్ ” చిత్రం తో తెరంగేట్రం చేసి సూపర్ సక్సెస్ అందుకొంది. నటించింది ఒకటి రెండు హిందీ సినిమాలే. అయినా బాలీవుడ్ లో జాన్వీ కపూర్ కున్న క్రేజ్ పీక్స్ అని చెప్పాలి. దేశ వ్యాప్తంగా సత్తాచాటిన శ్రీదేవి కుమార్తె కావడంతో ఆమెను తెలుగులో నటింపజేయాలని చాలామంది తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో అనేక ఆఫర్స్ జాన్వీ కపూర్ వద్దకు వెళ్లినా తిరస్కరించింది. కాగా మరో భారీ ఆఫర్ జాన్వీ వద్దకు వెళ్ళింది .

ఆర్ ఆర్ ఆర్ మూవీ తరవాత ఎన్టీఆర్ చేస్తున్న 30వ చిత్రం ఇపుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతిలో పడింది. కాగా ఈ చిత్రం లో ఎన్టీఆర్ కి జంటగా జాన్వి కపూర్ ని తీసుకోవాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ పెట్టుబడు తున్నాడట …

ఎన్టీఆర్ తో తాను చేయబోయే రెండో చిత్రం పాన్ ఇండియా మూవీ గా మార్చాలని భావిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ అందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ అయితే మంచి అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నాడట కాకపొతే ప్రస్తుతం మూడు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న జాన్వీ కపూర్ కాల్షీట్స్ ఎడ్జస్ట్ అవుతాయో లేదో అని చిన్న డౌట్ మాత్రం ఉంది . . craze comes out of combination
Also Read: కరోనా.. నాలో మార్పు తీసుకు వచ్చిందంటున్న బ్యూటీ

కరోనాపై ఆర్జీవీ పాట వైరల్..

దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తుంది. కరోనా నివారణకు కేంద్రం ఇప్పటికే లాక్డౌన్ చేపట్టింది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్లు, సినిమా థియేటర్లు మూతపడటంతో సినీ స్టార్లు ఇంటికే పరిమితమయ్యారు. పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియాలో కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ స్టార్లు కరోనాపై ఓ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి నటించారు. ఈ పాటకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది.

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా తాజాగా ‘స్టూడెంట్ నెంబర్ 1’ మూవీలోని ‘ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి’ సాంగ్ తరహాలోనే ‘కరోనా సాంగ్’ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ వీడియోకు కూడా మంచి స్పందన లభించింది. తాజాగా కరోనాపై రాంగోపాల్ వర్శ కరోనా పాటకు సంబంధించి ఓ ప్రొమో రిలీజ్ చేశారు. పూర్తి సాంగ్ సాయంత్రం 5.30కు విడుదల చేయనునున్నట్లు ఆర్జీవీ ట్వీటర్లో ప్రకటించాడు. కనిపించని పురుగు’ పేరుతో ఆర్జీవీ ఈ పాటకు సంబంధించిన ప్రోమోను ట్వీటర్లో విడుదల చేశారు. చేతులు కడుక్కుని మరీ ఈ పాట వినాలని.. చెవులకి మాస్క్ తొడుక్కొని వినాలని వర్మ నెటిజన్లను కోరాడు.

ఈ ప్రోమో విన్న నెటిజన్లు మాత్రం ఆర్జీవీపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సాంగ్ విన్నవారు తమ చెవులను శానిటైజర్లతో కడుక్కోవాలని ట్రోల్ చేస్తున్నారు. ఈ పాటలో ఆర్జీవీ వాయిస్ విన్న చెవులు.. తట్టుకోవడం కష్టమని వ్యగ్యంగా కామెంట్స్ పెడుతున్నారు. కొందరైతే ఈ పాట వింటే కరోనా వైరస్ సైతం సూసైడ్ చేసుకుంటుందని కామెంట్ చేసారు. దర్శకుడు ఆర్జీవీ ఈ పాటను స్వయంగా రాసి పాడారు. ప్రొమోతోనే హల్చల్ చేస్తున్న ఆర్జీవీ పూర్తి వీడియో విడుదల చేశాకే నెటిజన్లు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సైకోగా మారి.. ఐదుగురితో రోమాన్స్..

ప్రముఖ కొరియాగ్రాఫర్ ప్రభుదేవా సైకోగా మారనున్నారు. దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైకో థిల్లర్ మూవీలో ప్రభుదేవా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో ప్రభుదేవా సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు ఖరారు కాగా మిగతా ముగ్గురి హీరోయిన్ల వేటలో చిత్రబృందం పడింది. తొలిసారి ప్రభుదేవా సైకో పాత్రలో నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సినీరంగంలోకి కొరియాగ్రాఫర్ గా ప్రభుదేవా అడుగుపెట్టారు. ప్రపంచంలోని ప్రముఖ డాన్సర్ మైకేల్ జాక్సన్ తర్వాత ఆ స్థాయిలో ఇండియన్ మైకేల్ జాక్సన్ గా ప్రభుదేవా గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆ తర్వాత దర్శకుడిగా మారి బాలీవుడ్లో బాక్సాఫీస్ హిట్టందుకున్నాడు. తెలుగులో హిట్టయిన ‘నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా’ మూవీని హిందీలో తెరకెక్కించి హిట్టందుకున్నాడు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తదితర హీరోలతో సినిమాలు తెరకెక్కించి బాక్సాఫీస్ విజయాలు అందుకున్నాడు.

కొరియోగ్రాఫర్, దర్శకుడిగా కొనసాగుతూనే ప్రభుదేవా హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుదేవా చేతిలో మూడు సినిమాలున్నాయి. ఎప్పుడూ కామెడీ, సెంటిమెట్ పాత్రలో కన్పించే ప్రభుదేవా తొలిసారి సైకో పాత్రలో నటిస్తుండటం ఆసక్తిని రేపుతోంది. ‘భగీర‘ మూవీలో ప్రభుదేవా సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. అమైరా దస్తూర్, గాయత్రిలను ‘భగీర’ మూవీ కోసం ఇప్పటికే ఎంపిక చేశారు. మరో ముగ్గురు హీరోయిన్ల పేర్లు త్వరలో వెల్లడించనున్నారు. ప్రభుదేవా సైకోగా మారి ఐదుగురి హీరోయిన్లతో రోమాన్స్ కు రెడీ అవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కనుమరుగైన ఆంధ్రా బ్యాంక్….!

బ్యాంకింగ్‌ రంగంలో తెలుగువారికో గుర్తింపు, గౌరవం అన్నట్లు ఇన్నాళ్లు కొనసాగిన ఆంధ్రాబాంక్‌ అధ్యాయం ఇక ముగిసినట్టే. 98 ఏళ్ళుగా సేవలందిస్తున్న ఈ ఆర్థిక రంగ సంస్ధ నేటి నుంచి కనుమరుగయ్యింది. బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాబ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంకులను యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రావడంతో ఇకపై ఆంధ్రాబ్యాంక్‌ లోగోకు బదులు యూనియన్‌ బ్యాంకు లోగో లేదా కొత్త లోగో దర్శనమిస్తుంది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923 నవంబరులో ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారు. 1980 ఏప్రిల్‌లో జాతీయ బ్యాంకుగా అవతరించింది. 2019 మార్చి నాటికి 26 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2,885 శాఖలు, 3,798 ఏటీఎంలకు ఆంధ్రాబ్యాంకు విస్తరించింది. 1981లో దేశంలో తొలిసారిగా క్రెడిట్‌ కార్డుల వ్యాపారాన్ని ప్రారంభించింది ఆంధ్రాబాంకే. అంతటి చరిత్ర ఉన్న బ్యాంకు విలీనాన్ని వ్యతిరేకిస్తూ చాలారోజులపాటు ఉద్యోగులు ఆందోళనలు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. తననుకున్నట్టే విలీన ప్రక్రియను పూర్తిచేసింది. అయితే లోగో మారినా బ్యాంక్‌ జోనల్‌ కార్యాలయాలు, లీడ్‌ బ్యాంకు కార్యాలయాలు యథావిధిగా అదే భవనాల్లో కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు.

రెండో అతి పెద్ద బ్యాంకుగా అవతరించిన పీఎన్బీ:
భారత్ లో మరోసారి నేడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లోకి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీలీనం అయ్యాయి. ఈ క్రమంలో మన దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా పీఎన్బీ అవతరించింది.

ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంకుల బ్రాంచులన్నీ నేటి నుంచి పీఎన్బీ బ్రాంచులుగా కార్యకలాపాలను నిర్వహించనున్నాయి. ఈ బ్యాంకుల వినియోగదారులందరూ ఇకపై పీఎన్బీ కస్టమర్లుగానే చలామణి కానున్నారు. ఈ విలీనం తర్వాత పీఎన్బీకి మొత్తం 11 వేలకు పైగా బ్రాంచులు, 13 వేలకు పైగా ఏటీఎంలు, దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉన్నారు. బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు రూ. 18 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

సిద్ధిపేటలో తొలి కరోనా కేసు నమోదు!

సిద్ధిపేటకు చెందిన ఆరుగురు వ్యక్తులు ఢిల్లీలోని నిజాముద్దీన్‌ లో జరిగిన సమావేశాలకు హాజరైనట్లు తెలుస్తోంది. వారందరినీ గుర్తించి క్వారంటైన్‌ లో ఉంచగా ఇద్దరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వారి నమూనాలను పరీక్షించారు. వారిలో 51 ఏళ్ల వ్యక్తికి కరోనా నిర్ధారణ అయినట్లు తెలిపారు. మరొకరి ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా సోకిన వ్యక్తిని హైదరాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో నిజాముద్దీన్‌ లో జరిగిన సమావేశాలకు హాజరైన వారి సంఖ్య మరింతగ పెరిగే అవకాశం ఉంది.

కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 98 మంది కరోనా బారిన పడ్డారు. మంగళవారం ఒక్కరోనే 15 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరంత కూడా ఢిల్లీ మర్కజ్‌ నుంచి వచ్చిన వారు, వారి బంధువులే కావడం గమనార్హం.

కరోనా బారిన పడి హాలీవుడ్ నటుడు మృతి

కరోనా వైరస్ ఎప్పుడు ఎవరి మీద పంజా విసురుతుందో తెలియట్లేదు. టాప్ సెలెబ్రిటీల మొదలు సామాన్యులు దాకా గొప్ప బీదా అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తోంది ప్రపంచ వ్యాప్తంగా సినీ రంగానికి చెందిన అనేక మంది ఇప్పటికే దీని బారిన పడ్డారు. ఇక ఇండియాలో ప్రముఖ సింగర్ కనికా కపూర్ కరోనా బారిన పడి చికిత్స పొందుతోంది. కొన్ని రోజుల క్రితం హాలీవుడ్ స్టార్ హీరో టామ్ హాంక్స్ అతని భార్య షూటింగ్ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లి కరోనా పాజిటివ్ గా మారారు ఆ తరవాత వైద్యం చేయించుకొని కోలుకున్నారు. కాగా మరో హాలీవుడ్ నటుడు కరోనా కారణంగా చనిపోవడం జరిగింది.

హాలీవుడ్ లో ఎందరో టాప్ స్టార్స్ కి డైలాగ్ డిక్షన్ ( వివిధ రకాల యాసలు పలకడం ) కోచ్ గా పాపులర్ అయిన ఆండ్రూ జాక్ మార్చ్ 31 న కరోనా వైరస్ కారణంగా చనిపోయాడు. `ది లార్డ్ అఫ్ ది రింగ్స్` వంటి విభిన్న చిత్రాలకు ఆయన నేర్పిన భాష ( యాస ) ఆ చిత్ర విజయాలకు ఎంతగానో తోడ్పడింది. అలాగే జేమ్స్ బాండ్ గా నటించిన పియర్సన్ బ్రాన్సన్ వంటి స్టార్స్ కి కూడా డైలాగ్ పలకడం లో శిక్షణ ఇవ్వడం ద్వారా పేరు తెచ్చుకొన్నాడు. ఇక ఆండ్రూ జాక్ నటించిన చిత్రాల్లో “స్టార్ వార్స్” సిరీస్ అతనికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది.

ఆండ్రూ జాక్ మరణ వార్త ఆయన భార్య గాబ్రియేల్ రోజర్స్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆండ్రూ జాక్ కొద్దిరోజులుగా కరోనా వైరస్ కారణంగా బాధపడుతున్నాడు. కాగా ఆండ్రూ జాక్ వయసు 76ఏళ్లుగా తెలుస్తోంది.

ఇక నుంచి సినిమాల్ని ఆన్ లైన్ లోనే చూడాలా .?

కరోనా లాక్ డౌన్ అంటూ సినీ పరిశ్రమకి థియేటర్ లు దూరమయ్యాయి. అనూహ్య పరిణామాలతో దేశ వ్యాప్తంగా సినీ ఇండస్ట్రీకి కూడా కోలుకోలేని దెబ్బ తగిలింది . కరోనా దెబ్బకు సినిమాని ప్రేక్షకులకి చేరవేసే దారులన్నీ మూసుకు పోయాయి. సింగల్ థియేటర్స్ దగ్గర నుంచి మల్టీప్లెక్స్ థియేటర్స్ దాకా అన్నీ క్లోజ్ చేసేశారు. టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ మల్లువుడ్ , శాండల్ వుడ్ ఇలా అన్ని భాషాల చిత్రాలు విడుదలకు నోచుకోక విముక్తికోసం ఎదురు చూస్తున్నాయి.

ఇక మన తెలుగు సినిమాల విషయానికి వస్తే అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం తో పాటు మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ నటించిన ‘ఉప్పెన’ చిత్రాలు ముందు ప్రకటించిన ప్రకారమైతే ఏప్రిల్ రెండవ తారీకు విడుదల కావాల్సివుంది. అయినా విడుదలకు నోచుకోవట్లేదు వీటితో పాటు నాని – సుధీర్ బాబు నటించిన ప్రిస్టేజ్ మూవీ “వి” చిత్రం , యాంకర్ ప్రదీప్ హీరో గా నటించిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా? `, యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ లాంటి సినిమాల విడుదలలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో నిర్మాతలు ఎక్జిబ్యూటర్లు పంపిణీదారులు మార్చ్ నెలాఖరుకు అన్నీ సర్దుకుంటాయని మొదట భావించారు . కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా ప్రజలు థియేటర్లకు వచ్చేపరిస్థితి కనిపించడం లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు చిత్ర నిర్మాతలు సమావేశమై ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో విడుదలకు నోచుకోని చిత్రాలను థియేటర్స్ లో కాకుండా డైరెక్టుగా ” అమెజాన్ ప్రైమ్” ,” నెట్ ఫ్లిక్స్” ,” సన్ నెక్స్ట్” , ” ఆహా ” లాంటి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. better late than never

గత 24 గంటలలో.. గంటకి 8 కేసులు నమోదు!

భారత్ లో గడిచిన 24 గంటలలో గంటకి 8 కేసుల లెక్క కొత్తగా 200 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దింతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య1600 దాటాయి, అందులో మరణించిన వారి సంఖ్య 38 కి పెరిగింది.

మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశంలో మొత్తం కరోనావైరస్ కేసులు 1,637 కు చేరుకున్నాయని ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

అత్యధికంగా మహారాష్ట్రలో 302 కి పైగా పాజిటివ్ కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అందులో 11 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా1,466 క్రియాశీల కరోనా రోగులు ఉన్నారు. ఈ వ్యాధి నుండి ఇప్పటివరకు మొత్తం 133 మంది రోగులు కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నిన్న ఒక్కరోజే 43 కరోనా కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 87గా గుర్తించారు.

దక్షిణాఫ్రికాలో కరోనాకు బలైన భారతీయ మహిళా సైంటిస్ట్

దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ బారిన పడి భారత సంతతి చెందిన వైరాలజీ శాస్త్రవేత్త మృతి చెందారు. గీతా రాంజీ (64) హెచ్ఐవీ ప్రివెన్షన్ రీసర్చ్ టీమ్ కు లీడర్ గా ఉన్నారు. వ్యాక్సిన్ సైంటిస్ట్ అయిన ఆమె… వారం క్రితమే లండన్ నుంచి డర్బన్ కు తిరిగొచ్చారు. ఆమెలో కరోనా లక్షణాలు కనపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలను కోల్పోయారు. ఆమె మృతి పట్ల సౌతాఫ్రికా మెడికల్ రీసర్చ్ కౌన్సిల్ ప్రెసిడెంట్, సీఈవో గ్లెండా గ్రే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 2018లో యూరోపియన్ డెవలప్ మెంట్ క్లినికల్ ట్రయల్స్ పార్ట్ నర్ షిప్ ఆమెకు ఔట్ స్టాండింగ్ ఫిమేల్ సైంటిస్ట్ అవార్డును అందజేయడం గమనార్హం. గీతా రాంజీ అంత్యక్రియలకు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. దక్షిణాఫ్రికాలో 21 రోజుల లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో అంత్యక్రియలకు హాజరయ్యే జనాల సంఖ్యపై తీవ్ర ఆంక్షలు ఉన్నాయి. అంత్యక్రియల కోసం ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సి ఉంది.

హెచ్‌1బీ వీసా భారతీయుల్లో గుబులు

కరోనా వైరస్ కారణంగా అమెరికా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై దేశం ఆర్ధికమాంద్యంలోకి నెట్టుకుపోయే ప్రమాదం కనిపిస్తూ ఉండడంతో పెద్ద ఎత్తున లే ఆఫ్‌లు ప్రకటిస్తారని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో హెచ్‌-1బి వీసాలు కలిగివున్న విదేశీ సాంకేతిక నిపుణుల ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడింది. ఉద్యోగాలు కోల్పోతే ఇంటి బాట పట్టవలసిందేనా అన్న బెంగ ఏర్పడుతున్నది.ఈ వీసాపై ఉన్నవారిలో అత్యధికులు భారతీయులు కావడంతో ఆందోళన కలిగిస్తున్నది. వీరు ఉద్యోగం లేకుండా 60 రోజులకు మించి అమెరికాలో ఉండడానికి వీలుండదు.

ఒకవేళ తాము ఉద్యోగం కోల్పోయిన పక్షంలో అమెరికాలో ఉండేందుకు అనుమతించిన కాలపరిమితిని 60 రోజులనుంచి 180 రోజులకు పెంచాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు హెచ్‌1బీ వీసాదారులు ట్రంప్‌ సర్కారుకు లేఖ రాసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇప్పటికే 20 వేలమంది సంతకాలు చేశారు. ఒక ఫిర్యాదుపై వైట్‌ హౌస్‌నుంచి స్పందన రావాలంటే ఆ పిటిషన్‌పై కనీసం లక్ష సంతకాలు సేకరించాల్సి ఉంటుంది.

దీంతో మరో 80 వేల సంతకాలకోసం హెచ్‌1బీ వీసాదారులు ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తూ గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూసే భారతీయుల కల ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదు. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డ్‌ బ్యాక్‌లాగ్‌ సంఖ్య 2030 నాటికి రెట్టింపు అవుతుందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. దీనివల్ల భారతీయులైతే గ్రీన్‌ కార్డు కోసం దశాబ్దాలపాటు ఎదురుచూడక తప్పదని పేర్కొంది.

మార్చి 21తో ముగిసిన వారానికి రికార్డు స్థాయిలో 33లక్షల మంది అమెరికన్లు ఉద్యోగం పోయిందని దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా రెండు వారాల్లో కరోనా సంక్షోభం మరింత ముదిరే అవకాశం వుండగానే ఇప్పుడే లక్షలాదిమంది నిరుద్యోగులయ్యారు. దాదాపు 47 లక్షల మందికి నిరుద్యోగులుగా మారే అవకాశం వుందని భావిస్తున్నారు.

హెచ్‌-1బి వీసాలు కలిగివున్నవారు నిరుద్యోగ భృతికి, సామాజిక భద్రతా ప్రయోజనాలకు అర్హులు కారు. ఇప్పటికే కొంతమంది హెచ్‌-1బి ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. మరికొంతమందికి త్వరలో తీసివేసే అవకాశాలు వున్నాయని ఇప్పటికే యాజమాన్యాలు తెలియచేశాయి.

పీఎం ప్యాకేజీని సక్రమంగా అందించండి

కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నందున ప్రజలను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ప్యాకేజీని అన్ని రాష్ట్రాల్లో సక్రమంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సిఎస్ లను ఆదేశించారు. కరోనా వైరస్ పై ఢిల్లీ నుండి ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డిజిపిలతో వీడియో సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గౌబ మాట్లాడుతూ లాక్ డౌన్ ను దేశ వ్యాప్తంగా పటిష్టంగా అమలు చేస్తున్నందుకు అన్ని రాష్ట్రాల సిఎస్ లను,డిజిపి లను కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ లను అభినందించారు.

మరో రెండు వారాలు ఇదే విధంగా లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.ప్రజలకు అన్ని రకాల నిత్యావసర సేవలు, సరుకులు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు.లాక్ డౌన్ అమలులో ఏమాత్రం రాజీ పడవద్దని స్పష్టం చేశారు.ఎట్టి పరిస్థితుల్లోను కోవిద్ వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రధాన మంత్రి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని పటిష్టంగా అమలు చేసేందుకు ఆన్ని రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ప్రజలకు బియ్యం, గోధుమలు, కందిపప్పు తదితర ఆహార పదార్థాలను ఉచితంగా పంపిణీ చేయాలని రాజీవ్ గౌబ చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు ఎటియంలు సక్రమంగా పనిచేస్తున్నాయని తెలిపారు. వెంటనే రాష్ట్ర స్థాయి బ్యాంకులు కమిటీ సమావేశం (SLBC) సమావేశాన్ని నిర్వహించాలని సిఎస్ లకు చెప్పారు. అదే విధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బ్యాంకరుల సలహా కమిటీ(DCC) సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు.

ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్ళి వచ్చినవారిలో ఇప్పటికే సుమారు 400 మందిని గుర్తించి వారు కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే ప్రక్రియ జరుగుతోందని 1086 మందిని హోం ఐసోలేషన్ లో ఉంచేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. రాష్ట్రానికి మరిన్ని టెస్టింగ్ కిట్లు అవుసరం ఉందని చెప్పారు.విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించే ప్రక్రియ పూర్తి కావచ్చిందని గ్రామ,వార్డు వాలంటీర్లు ద్వారా ఇంటింటా సర్వే నిర్వహించినట్లు చెప్పారు.ఆదే విధంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య వ్యవస్థను అన్నివిధాలా మెరుగు పరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగుతోందని ఇందుకై వార్డుల వారీగా ఎఎన్ఎం,మెడికల్ అధికారి,వార్డు కార్యదర్శి తదితరులుతో కూడిన బృందాలను ఇంటికి సర్వే నిర్వహించడం జరుగుతోందని సిఎస్ నీలం సాహ్ని చెప్పారు. ఈ వీడియో సమావేశంలో డిజిపి గౌతం సవాంగ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, గిరిజా శంకర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఏపీలో ఇసుక తవ్వకాలకు అనుమతి

రాష్ట్రంలో నేటి నుంచి పరిమితులతో కూడిన ఇసుక తవ్వకాలను చేపడుతున్నట్లు ఎపిఎండిసి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.మదుసూధన్ రెడ్డి తెలిపారు. కరోనా నియంత్రణలో భాగంగా అమలవుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర హోం అఫైర్స్ డిపార్ట్ మెంట్ నుంచి గనులు, ఖనిజ రవాణా నిర్వహణపై వచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఇసుక తవ్వకాలను నిర్వహిస్తామని వెల్లడించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని తగినన్ని ఇసుక నిల్వలను సమకూర్చుకోవడం కోసం ఎపిఎండిసి పనిచేస్తుందని తెలిపారు. కరోనా నియంత్రణ చర్యలకు విఘాతం కలగకుండా, అతితక్కువ సిబ్బందితో, యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించడం ద్వారా ఇసుక తవ్వకాలు సాగిస్తామని తెలిపారు. అలాగే ఈ పనుల్లో వుండే కార్మికులు, టెక్నీషియన్ల రక్షణార్థం సామాజికదూరం పాటించేలాగున, ముఖానికి మాస్క్ లు, చేతులు శుభ్రపరచుకునేందుకు శానిటైజర్లు అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రధానంగా రానున్న వర్షాకాలంను దృష్టిలో పెట్టుకుని నిర్మాణరంగ పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా వుండేందుకు గాను రాష్ట్రంలో దాదాపు అరవై లక్షల టన్నుల ఇసుకను స్టాక్ పాయింట్ లలో నిల్వ చేయాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి అనుగుణంగా ఎపిఎండిసి లాక్ డౌన్ సమయంలో స్టాక్ యార్డ్ లకు ఇసుకను అందిస్తుందని తెలిపారు. ఈ సమయంలో స్టాక్ యార్డులకు తప్ప మరేవిధమైన అమ్మకాలు చేపట్టబడవని తెలిపారు.

ఏపీలో 87 చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 87కి చేరాయని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. దీంతో ప్రభుత్వం వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలను మరింత బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులు సీఎం క్యాంపు కార్యాలయంలో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 43 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న వారు, వారి కుటుంబ సభ్యులు అధికంగా ఉన్నారు. గడిచిన 12 గంటల్లో మొత్తం 373 శాపిళ్లను పరీక్షించగా 43 పాజిటివ్‌గా, 330 నెగిటివ్‌గా నమోదయ్యాయి. ఈ ఒక్క రోజే తొలిసారిగా కడప జిల్లాలో 15, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 2, కృష్ణ 1, విశాఖ జిల్లాలో 1 కొత్త కేసు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఇద్దరు కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన నివేదికలో వెల్లడించారు.

తాగుబోతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

మద్యంప్రియులకు కేరళ గవర్నమెంట్ గుడ్ న్యూస్ తెలిపింది. మందుబాబులకు ఆన్ లైన్లో మద్యం సరఫరాకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా కేంద్రం లాక్డౌన్ అమలు చేయడంతో వ్యాపార, వాణిజ్య సంస్థలతోపాటు మద్యంషాపులు బంద్ అయ్యాయి. దీంతో మద్యానికి అలవాటుపడిన మద్యంప్రియులు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో మద్యం దొరకక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఒక్క కేరళలో మద్యం దొరకక ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకోగా ఒకరు గుండెపోటుతో చనిపోయినట్లు సమాచారం.

ఈనేపథ్యంలో కేరళ ప్రభుత్వం మద్యం సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేరళలోని ఎక్సైజ్ శాఖకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. మద్యానికి బానిసైన వారికి మద్యం అందేలా చూడాలని ఎక్సైజ్ శాఖను సీఎం పినరయి విజయన్ ఆదేశించారు. ఈమేరకు అవసరమైతే ఆన్ లైన్ ద్వారా ఇంటింటికీ మద్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తుంది.

దీంతో ఇప్పటివరకు మద్యం దొరకక అల్లాడిపోతున్న మద్యంప్రియులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కేరళ ప్రభుత్వం నిర్ణయంపై మద్యంప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేరళ ప్రభుత్వం నిర్ణయంపై విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. ఇదిలా ఉంటే కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్ణయాన్ని మరికొన్ని రాష్ట్రాలు అవలంబించేందుకు సిద్ధమవుతున్నాయి.

చైనా లో కరోనా మళ్ళీ మొదటికే వస్తోందా ?

చైనా లో కరోనా వైరస్ భూతం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు భయాందోళనలకు దారి తీస్తున్నాయి .. అయితే కరోనా నుంచి కోలుకుంటున్న చైనాలో కొత్తగా 1,541 మందిలో ఈ వైరస్ తాలూకు లక్షణాలు బయటపడడం ఇప్పుడు చైనీయుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ న్యూస్ వింటే ఇండియాలో లాక్ డౌన్ ఏమవుతుందో అనిపించకమానదు.

అలాగే భారత్‌లోనే కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నిజాముద్దీన్ మర్కజ్‌ ప్రార్ధన ల్లో పాల్గొన్న 300 మందిలో కరోనా లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా ఇక ప్రార్థనల్లో పాల్గొన్న 800 మందిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచారు. ఈ ప్రార్థనల్లో దాదాపు 2 వేల మంది పాల్గొన్నట్టు తెలియడంతో దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. మన దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. దయ చేసి ఇంట్లోనే ఉంది పరిశుభ్రత పాటించండి చాలు అంటున్నారు Beware of carona

భారత్ ను కుదిపేస్తున్న ‘మర్కజ్‌’ ప్రకంపనలు

మూడు వరాల పాటు లాక్ డౌన్ ను ప్రకటించడంతో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్నదని దేశ ప్రజలు ఊపిరి పీల్చుకొంటున్న సమయంలో భారత్ ను ఇప్పుడు ‘మర్కజ్‌’ ప్రకంపనలు కుదిపివేస్తున్నాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతం.. దేశంలో కరోనా వ్యాప్తికి తాజా కేంద్రంగా మారింది.

ఈ నెల ప్రారంభంలో ఇక్కడ జరిగిన మతసంబంధ కార్యక్రమాలలో దేశ, విదేశాల నుండి భారీ సంఖ్యలో పాల్గొనడంతో వారిలో కొందరి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందినదని, వారి ద్వారా దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నదని కధనాలు వెలువడుతున్నాయి. దానితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కంటి మీద కునుకు కరువవుతుంది.

కాశ్మీర్ నుండి కేరళ వరకు దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఇక్కడి నుండి తిరిగి వచ్చిన వారిలో పలువురు కరోనా పాజిటివ్ గా తేలడం, కొందరు మృత్యువాత కూడా బడడంతో వారందరిని జల్లెడ వేసి వెతకడం కోసం అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకే రోజు అకస్మాత్తుగా పోస్జిటివ్ కేసులు 48 పెరగడం, వారిలో అత్యధికులు వీరే కావడంతో ప్రభుత్వాలు ఖంగారు పడుతున్నాయి.

తబ్లిగీ జమాత్‌ సంస్థకు చెందిన అంతర్జాతీయ ప్రధాన కార్యాలయమైన ‘నిజాముద్దీన్‌ మర్కజ్‌’లో ఈ నెల 1-15 మధ్య మతపరమైన కార్యక్రమం జరిగింది. విదేశీయులతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో దీనికి హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న 24 మందికి కరోనా సోకినట్లు ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దానితో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. గత నెల రోజుల్లో దాదాపు 8,000 మంది ఈ మర్కజ్‌ను సందర్శించినట్లు అంచనా వేస్తున్నారు.

ఇలా ఉండగా, ‘తబ్లిగీ జమాత్‌ అనేది ముస్లిం మతవాద ఉద్యమం అని ప్రముఖ బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ తెలిపారు. 1926లో హర్యానాలోని మేవాట్‌లో ఇది ప్రారంభమైంది. 150 దేశాల నుంచి 1.2 కోట్ల నుంచి 8 కోట్ల మంది ముస్లింలు ఈ జమాత్‌కు హాజరవుతుంటారు. ఉజ్బెకిస్థాన్‌, తజికిస్థాన్‌, కజకిస్థాన్‌ దేశాలు దీనిని నిషేధించాయి. ఉగ్రవాదులతో జమాత్‌కు పరోక్ష సంబంధాలున్నాయని పేర్కొన్నారు.

నిజాముద్దీన్‌ మర్కజ్‌లో గత రెండురోజులుగా ఢిల్లీ పోలీసులు 1,830 మందిని గుర్తించగా, వారిలో 281 మంది విదేశీయులు ఉన్నట్లు తేలింది. లాక్‌డౌన్‌ ప్రకటన తర్వాత కూడా వీరు మర్కజ్‌లోనే ఉన్నారు. విదేశీయుల్లో ఇండోనేషియా (74 మంది), శ్రీలంక (34), మయన్మార్‌ (33), కిర్గిస్థాన్‌ (28), మలేసియా (20), నేపాల్‌ (9), బంగ్లాదేశ్‌ (9), థాయ్‌లాండ్‌ (7), ఫిజి (4), బ్రిటన్‌ (3), ఆఫ్ఘనిస్థాన్‌, అల్జీరియా, జిబౌతి, సింగపూర్‌, ఫ్రాన్స్‌, కువైట్‌ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

మిగిలిన 1549 మందిలో తమిళనాడు (501), అసోం (216), ఉత్తరప్రదేశ్‌ (156), మహారాష్ట్ర (109), మధ్యప్రదేశ్‌ (107), బీహార్‌ (86), బెంగాల్‌ (73), తెలంగాణ (55), జార్ఖండ్‌ (46), కర్ణాటక (45), ఉత్తరాఖండ్‌ (34), హర్యానా (22), అండమాన్‌ నికోబార్‌ (21), రాజస్థాన్‌(19), హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ, ఒడిశా నుంచి 15 చొప్పున, పంజాబ్‌ (9), మేఘాలయకు చెందినవారు ఐదుగురు ఉన్నారు.

ఢిల్లీ కార్యక్రమానికి వెళ్లివచ్చినవారు స్వయంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజ్ఞప్తి చేశారు. తబ్లిగీ కార్యకలాపాల కోసం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 2,100 మంది విదేశీయులు భారత్‌కు వచ్చినట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది.

మార్చి 21 నాటికి 821 మంది దేశంలోని వివిధ మర్కజ్‌లకు తరలివెళ్లగా, 216 మంది నిజాముద్దీన్‌ మర్కజ్‌లో ఉండిపోయినట్లు తెలిపింది. మిగిలిన వారు లాక్‌డౌన్‌కు ముందే దేశం విడిచి వెళ్లిపోయి ఉండొచ్చని పేర్కొంది. 824 మంది విదేశీయుల వివరాలును ఈ నెల 21న అన్నిరాష్ట్రాల పోలీసులకు పంపామని, వారిని గుర్తించి క్వారంటైన్‌ చేయాల్సిందిగా సూచించామని తెలిపింది.

అలాగే భారత్‌కు చెందిన కార్యకర్తలను గుర్తించాల్సిందిగా ఈ నెల 28న రాష్ట్రాలను కోరామని, ఇప్పటివరకు 2,137 మందిని గుర్తించినట్లు తెలిపింది. తబ్లిగీ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చే విదేశీయులకు వీసాలు మంజూరు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దాదాపు 2100 మంది విదేశీయులు టూరిస్ట్‌ వీసాపై వచ్చి మత కార్యక్రమంలో పాల్గొన్నట్లు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. కాగా, మత కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 300 మంది విదేశీయులను బ్లాక్‌లిస్ట్‌ చేర్చనున్నట్లు ఓ అధికారి తెలిపారు.