
సిద్ధిపేటకు చెందిన ఆరుగురు వ్యక్తులు ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన సమావేశాలకు హాజరైనట్లు తెలుస్తోంది. వారందరినీ గుర్తించి క్వారంటైన్ లో ఉంచగా ఇద్దరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వారి నమూనాలను పరీక్షించారు. వారిలో 51 ఏళ్ల వ్యక్తికి కరోనా నిర్ధారణ అయినట్లు తెలిపారు. మరొకరి ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా సోకిన వ్యక్తిని హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో నిజాముద్దీన్ లో జరిగిన సమావేశాలకు హాజరైన వారి సంఖ్య మరింతగ పెరిగే అవకాశం ఉంది.
కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 98 మంది కరోనా బారిన పడ్డారు. మంగళవారం ఒక్కరోనే 15 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరంత కూడా ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చిన వారు, వారి బంధువులే కావడం గమనార్హం.