Home Blog Page 8558

నిజాముద్దీన్‌ కార్యక్రమ నిర్వాహకుల పై పోలీసు కేసులు!

దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన తబ్లిగి జమాత్‌ కార్యక్రమ నిర్వాహకుల పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ లేఖ రాశారు. వెంటనే స్పందించిన అధికారులు కార్యక్రమ నిర్వాహకులైన మౌలానా సాద్‌ తదితరులపై ‘అంటువ్యాధుల చట్టం 1897’ ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

మార్చి 13,14,15 తేదీలలో నిజాముద్దీన్‌ కార్యక్రమానికి హాజరైన వారిలో 24 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని తేలింది. ఈ నేపథ్యంలో నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఈ మర్కాజ్‌ కు హాజరైన 12 మంది విదేశీయులు సమాచారాన్ని దాచి ఉంచినందుకు  జామా మసీదు వజీరాబాద్‌ ఇమామ్‌ పై కూడా కేసు నమోదు చేశారు.

అక్కడి ఉన్నవారిని తరలించేందుకు తొలుత నిర్వాహకుడు మౌలాన సాద్‌ సహకరించకపోవడంతో నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ అజిత్‌ డొభాల్‌ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆయన మార్చి 28వ తేదీ అర్ధరాత్రి రంగంలోకి దిగి అక్కడి మౌలానను ఒప్పించారు. దీంతో అక్కడి వారి తరలింపు మొదలైంది. వీరిలో చాలా మంది వీసా నిబంధనలను ఉల్లంఘించి ఇక్కడకు వచ్చినట్లు తేలింది.

ఈ సమావేశానికి  భారీ సంఖ్యలో భక్తులు హాజరై ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఒక్క మంగళవారమే 146 కొత్త కేసుల నమోదుతో భారత్‌ లో కరోనా కేసులు 1397కు ఎగబాకాయి. ఇప్పటి వరకు 35 మంది కొవిడ్‌-19 సోకి మరణించగా.. 123 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయినట్టు అధికారులు తెలిపారు.

మారుతి తో కలుస్తున్న `రామ్` డు

2019 లో వన్ అఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఎనర్జీ స్టార్ రామ్ పోతినేని కెరీర్ లో ఇదే హైయెస్ట్ పెయిడ్ మూవీ కావడం విశేషం. కాగా ఇస్మార్ట్ శంకర్ వంటి భారీ హిట్ సినిమా తర్వాత తన సొంత బ్యానర్ లో `రెడ్` అనే తమిళ రీమేక్ చిత్రంలో రామ్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయ్యింది.నిజానికి ఏప్రిల్ 9న ` రెడ్ ` సినిమా విడుదల కావాల్సింది. కానీ కరోనా ప్రభావంతో సినిమా విడుదల వాయిదా పడుతోంది. ఇక ఈ సినిమా తరవాత రామ్ హిట్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. దేశంలో లాక్ డౌన్ ఎత్తేయగానే మారుతి దర్శకత్వంలో సినిమా చేయడానికి రామ్ రెడీ అవుతాడని కూడా తెలుస్తోంది.

`ఈ రోజుల్లో ` వంటి చాలా చిన్నచిత్రం తో కెరీర్ స్టార్ట్ చేసిన దర్శకుడు మారుతి ఇపుడు మినిమమ్ గ్యారంటీ ఉన్న దర్శకుడిగా మారాడు. మారుతి కెరీర్ స్టార్ట్ అయిన ప్రారంభంలో ఉన్నప్పటి స్థితి కి ఇప్పటి స్థితి కి చాలా మార్పు కనపడుతోంది. మినిమమ్ బడ్జెట్తో హిట్ సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా మారుతి పేరు సంపాదించుకున్నాడు. మారుతి కెరీర్లో “భలేభలేమగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజూ పండగే ” వంటి చిత్రాలు భారీ హిట్ చిత్రాలుగా నిలిచాయి ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఒక భిన్నమైన సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. confidence gives strength

ఏపీలో 12 గంటల్లోనే 43 కరోనా పాజిటివ్ కేసులు!

ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మంగళవారం) రాత్రి 9 గంటల తర్వాత నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 373 మంది కి కరోనా టెస్టులు చేయగా అందులో 43 పాజిటివ్‌ గా, 330 నెగిటివ్‌గా నమోదయ్యాయి.  వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 87 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కడప జిల్లాలో 10కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు సమాచారం. పాజిటివ్‌ కేసులను అధికారులు ఇంకా నిర్ధారించలేదు. బాధితులంతా ఢిల్లీ నుంచి వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో 15మందికి కరోనా పాజిటివ్ రావడంతో వారిని ఐసోలాషన్ వార్డ్స్ కి పంపించారు.

కరోనాకు కేరాఫ్ గా మారిన ఢిల్లీ మర్కజ్

దేశంలో కరోనా మహమ్మరిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లాక్డౌన్ అమలు చేస్తోంది. దీని ద్వారా కరోనా కట్టడికి కేంద్రం శాయశక్తులా కృషి చేస్తోంది. అయినప్పటికీ దేశంలో ఇప్పటివరకు 1,500వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదుగా 40మంది మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగానే కరోనాకు కేరాఫ్ గా ఢిల్లీ మర్కజ్ తెరపైకి రావడంతో దేశం మొత్తం ఉలిక్కి పడింది.

తాజాగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 97కు చేరింది. మంగళవారం ఒక్కరోజే 15కొత్త కేసులు నమోదయ్యాయి. వీరంతా ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారే కావడం గమనార్హం. ఈ 15మందిలో ఎక్కువగా జీహెచ్ఎంసీకి చెందిన వారితోపాటు నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన వాళ్లున్నట్లు తెలుస్తోంది. మర్కజ్ వెళ్లిచ్చొన వాళ్లలో ఆరుగురి చనిపోయినట్లు ప్రభుత్వం చెబుతోంది. అక్కడికి వెళ్లిచ్చొన వాళ్ల కరోనా టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వం కోరుతుంది.

కరోనాకు కేరాఫ్ గా మర్కజ్ లింకు బయటపడటంతో అక్కడికి వెళ్లొచ్చని వాళ్లందరు భయాందోళనకు గురవుతుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన పిలుపు స్పందించిన సుమారు 400మంది వరకు మంగళవారం గాంధీ ఆస్పత్రికి పొటెత్తారు. వీరికి వైద్యులు కరోనా టెస్టులు నిర్వహించింది. వీరిలో 15మందికి పాజిటివ్ వచ్చింది. పలువురికి కరోనా లక్షణాలు ఉండటంతో మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని వైద్యులు ప్రకటిస్తున్నారు. దీంతో మర్కజ్ వెళ్లొచ్చిన వారిపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కరోనాకు మర్కజ్ లింక్ బయపడటంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. దీనిపై ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు విచారణ చేపడుతున్నారు.

సిసిసి కి విరాళాలు 6 కోట్లు దాటాయి …

సినీ కార్మిక రంగం లో రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి లో ఎందరో ఉన్నారు వాళ్లకు . షూటింగ్ ఉంటేనే నాలుగు వేళ్ళు లోపలికి వెళతాయి. లేదంటే ఆ రోజు పస్తు పడుకోవాల్సిందే. రోజువారీ బేటాలే వారి సంపాదన. నెలవారీ జీతం లాంటివి ఏమీ వుండవు. ఇది నూటికి తొంబై మంది సినీ కార్మికుల దైనందిన జీవిత చక్రభ్రమణం అందులో ఎపుడైనా గతి తప్పిందా వారి భాదలు చెప్ప నలవి కాదు. షూటింగ్ ఉంటేనే కడుపు నిండుతుంది. లేదంటే ఆకలితో అలమటించాల్సిందే … అలాంటి కార్మికులు కరోనా తో ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి భరోసా ఇవ్వడానికి మెగా స్టార్ చిరంజీవి ఆధ్వర్యం లో సి .సి . సి(కరోనా క్రైసిస్ చారిటీ ) ఏర్పాటైంది.దీనికి తెలుగు సినీ పరిశ్రమ ఎంతగానో స్పందించి భారీగా విరాళాలు ఇస్తున్నారు.

ఇపుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇంతవరకు విరాళాలు ఇచ్చిన వారికి అదనంగా కొంతమంది తెలుగు హీరోలు , కెమెరా మాన్ లు కూడా జత కలిశారు. వివరాల్లోకి వెళ్తే హీరో నాని 30 లక్షలు ,ఇవ్వగా నాగార్జున మేనల్లుడు ఆల వైకుంఠపురంలో ఫేమ్ సుశాంత్ 2 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇక కమెడియన్ కం హీరో సప్తగిరి 2 లక్షలు ఇవ్వగా , సీనియర్ నటుడు మరియు హీరో అయినా శ్రీకాంత్ 5 లక్షలు ఇచ్చి తన వంతు ఉదారత చాటుకున్నాడు.

ఇక వర్ధమాన హీరో , కెమెరా మాన్ చోటా కె నాయుడుకి మేనల్లుడు అయిన సందీప్ కిషన్ 3 లక్షలు ఇవ్వడమే గాక తన వద్ద రెస్టారెంట్ లో వాటిల్లో పనిచేసే 500 మంది కార్మికులకు ఉచిత ఆహార సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాడు. ఇక చోటా హీరో సంపూర్ణేష్ బాబు 1 లక్ష రూపాయలు ఇవ్వగా , నటుడు బ్రహ్మాజీ 75,000 ఇవ్వడం జరిగింది.

ఇక తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కెమెరా మాన్ స్థానం లో ఉన్న సమీర్ రెడ్డి మరియు మూరెళ్ళ ప్రసాద్ చెరో 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ వారు అక్షరాలా 10 లక్షలు ఇచ్చారు. కాగా ఇంతవరకు సి సి సి కి విరాళాల రూపంలో అందిన మొత్తం 6 కోట్ల 2 లక్షలు అని తెలుస్తోంది charity never has an end

మోదీపై నోరు జారిన పాక్ ప్రధానికి మీడియా చివాట్లు

అవకాశం వచ్చినప్పుడల్లా భారత్ పై, ముఖ్యమంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఎగతాళిగా విసురు విసురుతూ ఉండే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు తాజాగా చేసిన అటువంటి ప్రయత్నం వికటించింది. మోదీ వ్యాఖ్యలకు తప్పుడు భాష్యం చెప్పడంతో ఆ దేశంలోని పత్రికలే ఆయనకు సున్నితంగా చివాట్లు పెట్టాయి.

క‌రోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత ప్రధానై మోదీ మూడు వారల పాటు లాక్‌డౌన్ అమలుచేస్తుండ‌గా, పాక్‌లో మాత్రం ఆంక్ష‌ల‌తో స‌రిపెట్టుకొంటూ విమర్శలకు గురవుతున్నారు.

పాకిస్థాన్‌లో ఇప్ప‌టికి 1,740 క‌రోనా పాజిటివ్ కేసులు, 18 మంది మృతి చెందినా కూడా అక్క‌డ పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌లేదు. ఈ పరిస్థితుల్లో పాక్‌లోని అనేక రాష్ట్రాలు.. భారత్ తరహాలో దేశాన్ని లాక్ డౌన్ చేయాలనే యోచనలో ఉన్నాయి. ఈ యోచనను పాక్‌ మీడియా కూడా సమర్థిస్తోంది.

ఈ విషయమై పాక్ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ఇమ్రాన్‌ఖాన్ చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న అవ‌గాహ‌నా రాహిత్యాన్నిమ‌రోసారి బ‌ట్ట‌బ‌య‌లు చేశాయి. భార‌త్‌లో లాక్‌డౌన్ విష‌యంలో మోదీ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ని, లాక్‌డౌన్ విధిస్తే ఎంత‌టి త‌ప్పు నిర్ణ‌య‌మో త‌న‌కు తెలుసున‌ని ఇమ్రాన్ తన గురించి గొప్పగా చెప్పుకోవడం చూసి ఆ దేశ ప్రజలు విస్తు పోయారు. ఇమ్రాన్ వ్యాఖ్య‌ల‌ను ఆ దేశ మీడియానే త‌ప్పుబట్టింది.

భారత ప్రధాని మాట్లాడింది పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడ‌టం స‌రికాద‌ని హితవు చెప్పింది. మోదీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారా అంటూ ఇమ్రాన్ ఖాన్‌పై దుమ్మెత్తిపోసింది. లాక్ డౌన్ చేసినందుకు మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పలేదని, దీని వల్ల వారు ఇబ్బందులు పడుతున్నందుకు మాత్రమే క్షమాపణలు చెప్పారని ఆధారాలతో సహా చూపించింది.

మోదీ వ్యాఖ్య‌ల‌ను పూర్తిగా అర్థం తెలుసుకుని మాట్లాడితే బాగుండేద‌ని హిత‌వు ప‌లికింది. దానితో ఇమ్రాన్ కు ఇక మాటలు వచ్చిన్నట్లు లేదు.

విశాఖలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నాలుగు వైజాగ్ నగరంలోనే నమోదయ్యాయి. వీరందరూ ఢిల్లీలో జరిగిన మతపరమైన సమ్మేళనంలో పాల్గొన్నారు. వీటితో కలిపి ఏపీలో మొత్తం 44 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దేశ రాజధాని మార్చి 13,14, 15 తేదీలలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో అంతర్జాతీయ స్థాయిలో రెండున్నర రోజులపాటు ఓ సదస్సు జరిగింది. ఈ ప్రార్ధనలకు దేశ, విదేశాలకు చెందిన వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. థాయ్‌ లాండ్, ఇండోనేసియా, మలేసియా, కిరిగిస్థాన్, ఇరాన్, ఉజ్ బెకిస్తాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారు పాల్గొనగా, ఈ ప్రార్థనలకు ఇతర దేశాల నుంచి మత పెద్దలు సైతం వచ్చినట్టుగా అధికారుల విచారణలో తెలిసింది. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 వేల మంది హాజరుకాగా, వీరిలో అత్యధికులు మార్చి 14-,15వ తేదీల్లో తమ తమ ప్రాంతాల నుంచి రైళ్లలో వెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారంతా కలిసే ప్రయాణించడంతో పాటు ఢిల్లీలో ఉన్నన్నీ రోజులు కలిసే బస చేశారు. తిరుగు ప్రయాణంలో వీరంతా దురంతో ఎక్స్‌ప్రెస్, ఏపీ ఎక్స్‌ప్రెస్‌ లలో ప్రయాణించినట్టుగా అధికారులు గుర్తించారు.

ప్రధాన మంత్రి సహాయ నిధితో వ్యాపారమా!

కరోనా వైరస్ కు గురైన వారికి సహకారం అందించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా `పిఎం కెర్స్’ పేరుతో నిధి ఏర్పాటు చేయడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి విపత్తు సమయంలో బాధితులను ప్రధాన మంత్రి/ముఖ్యమంత్రి సహాయ నిధుల నుండి సహకారం అందిస్తుంటాయి.

ముఖ్యమంత్రులు అందరు కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు తీసుకొంటున్నారు గాని, ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేయలేదు. ఈ విషయమై ఎకనామిక్స్ టైమ్స్ దిగ్బ్రాంతి కలిగించే అంశాన్ని వెల్లడించింది.

ప్రధాన మంత్రి సహాయానిధిలో ఉన్న నిధులలో కేవలం 15 శాతం మంత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన నిధులను పెట్టుబడులుగా పెట్టడంతో, అంటే వాటితో వ్యాపారం చేస్తూ ఉండడంతో అవి ప్రస్తుతం అందుబాటులో లేవు. ప్రస్తుతం పేరుకు రూ 3,800 కోట్ల నిధులు ఉన్నప్పటికీ, అందుబాటులో నగదుగా రూ 486.79 కోట్లు మాత్రమే ఉన్నాయి.

రూ 250 కోట్లను యూనియన్ బ్యాంకు లో పెర్ఫెట్వల్ బాండ్స్ లో పెట్టుబడిగా పెట్టారు. వాటిపై వడ్డీ పొందడం తప్ప, ఆ మొత్తంన్ని తీసుకోవడానికి వీలు లేదు. బ్యాంకు లో ఉన్న మరో రూ 1,000 కోట్ల పెట్టుబడిపై 6 శాతం వడ్డీ వస్తుంది. ఒక సంవత్సరం తర్వాతనే తీసుకొనే వీలుంది.

2018-19లో ఈ నిధిలో రూ 1,301 కోట్లను రాష్ట్ర అభివృద్ధి రుణాలకు ఇచ్చిన్నట్లు పేర్కొన్నారు. కానీ ఏ రాష్ట్రానికి తెలుపలేదు. 2018లో రూ 2,750 కోట్లను బ్యాంకు లలో ఫిక్సెడ్ డిపాజిట్ లుగా పెట్టుబడులు పెట్టారు.

2017-18లో పకృతి విపత్తులు, మత ఘర్షణలతో బాధితులకు రూ 180 కోట్లు సహాయంగా ఇవ్వగా, 2016-17లో రూ 104 కోట్లు ఇచ్చారు. కానీ 2018-19లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అయితే వ్యక్తులకు లేదా ఆసుపత్రులకు వైద్య సహాయం కోసం రూ 160 కోట్లు ఇచ్చారు.

పీఎం సహయ నిధికి విరాళం ఇస్తే ఆదాయపన్ను రాయితీ పొందడం కోసం రసీదు ఇస్తారు. కానీ ప్రస్తుతం పిఎం కేర్స్ విరాళం ఇస్తే అటువంటిది ఏమీ లేదు. ప్రధాని అధ్యక్షతన పబ్లిక్ హరిటబుల్ ట్రస్ట్ గా ఏర్పాటు చేసారు.

వారిపై క్రిమినల్ కేసులకు కేటీఆర్ ఆదేశం

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తెలంగాణలో 97పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. నిన్న ఒక్కరోజులోనే 15పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరికి ఢిల్లీలోని మర్కజ్ ప్రాంతానికి వెళ్లొచ్చిన వారికి లింకు ఉండటంతో వీరి సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తుంది. ప్రార్థనలకు వెళ్లిచ్చొన వారికి కరోనా టెస్టులను నిర్వహించి క్వారంటైన్ కు తరలిస్తుంది.

కరీంనగర్లో ఇండినేషియా, మర్కజ్ ప్రార్థనల లింకు బయటపడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. కరోనా లక్షణాలు వ్యక్తుల బయట తిరగకుండా క్వారంటైన్లోనే ఉంచాలని సూచించారు. వీరు బయట తిరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. క్వారంటైన్లో ఉన్న 1,032మందిని ఏప్రిల్ 7వరకు బయటికి రాకుండా చూడాలని ఆదేశించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారి పాస్ పోర్టులను రద్దు చేయాలన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వలస కార్మికులకు అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. లాక్డౌన్ అమలులో ఉన్న రోజులు ప్రభుత్వం వీరిందరికీ ఆదుకుంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కోనుగోలు చేస్తుందని, రైతులు వ్యవసాయ మార్కెట్లకు ధాన్యాన్ని తీసుకురావద్దని సూచించారు.

మర్కజ్ మసీదు మౌలాపై కేసు

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులకు ఢిల్లీ మర్కజ్ కు లింకు బయటపడంతో కేంద్రం అలర్ట్ అయింది. ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారాన్ని అందించింది. ఢిల్లీలోని మర్కజ్ లో ప్రార్థనల కోసం వెళ్లిన వివరాలను సేకరించి వారికి టెస్టులను చేయాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లు కూడా భారీ సంఖ్యలో ప్రార్థనలకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాలు తగు చర్యలు చేపడుతున్నాయి. కాగా దేశంలో వెలువడుతున్న కరోనా కేసులకు ఢిల్లీ మర్కజ్ కు లింకు ఉండటంతో మసీదు మౌలాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

మార్చి 10న మర్కజ్ మసీదులో ప్రార్థనల కోసం దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశీయులు భారీగా హాజరయ్యారు. చైనా, ఇటలీ, ఇండోనేషియా, అమెరికా తదితరుల దేశాలకు చెందిన మతబోధకులు పెద్ద సంఖ్యలో హాజరైనట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరి సమాచారాన్ని ఇవ్వకుండా గోప్యంగా ఉంచడంతో ఆగ్రహించిన ఢిల్లీ ప్రభుత్వం నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో మసీదు మౌలాపై కేసు నమోదు చేశారు.

పార్థనల్లో పాలొన్న 1200మందిని క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ, కశ్మీర్లో ఇప్పటివరకు కరోనా చనిపోయిన వారంతా మర్కజ్ లో ప్రార్థనలు వెళ్లిన వారీగా నిఘా వర్గాలు గుర్తించాయి. ఈమేరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాలతో ఢిల్లీ పోలీసులు పహారా చేస్తున్నారు. మర్కజ్ కు వెళ్లిచ్చిన వారి వివరాలను సేకరించే పనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాయి. వీలైనంత త్వరగా వీరిని ఐసోలేషన్ తరలించేందుకు సన్నహాలు చేస్తున్నాయి.

ఆ ప్రార్ధనల వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం..!

దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో మార్చి 13,14, 15 తేదీలలో నిర్వహించిన ప్రార్ధనల వెనుక కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చిన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచమంతా కరోనా భయంతో అతలాకుతలం అవుతున్న సమయంలో.. అన్ని వేల మంది ఒక చోట చేరి ప్రార్ధనలు చేసుకోవడానికి అనుమతులు ఎలా లభించాయి? అధికారుల ఉదాసీనత, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దేశ, విదేశాలకు చెందిన వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. థాయ్‌ లాండ్, ఇండోనేసియా, మలేసియా, కిరిగిస్థాన్, ఇరాన్, ఉజ్ బెకిస్తాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారిని భారత్ లోకి అనుమతించారు. ఈ సంఘటన వల్ల క్లిష్ట సమయంలో ప్రభుత్వ బాధ్యతాలేమికి తార్కాణంగా కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశమంతా ఈ ప్రార్ధనల్లో పాల్గొన్న వారిలో పలువురు కరోనా బారిన పడుతుండటం, కొందరు మరణిస్తుండటం కలకలం రేపుతోంది. గడిచిన రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో ఆరుగురు మృతి చెందగా, వారందరూ ఢిల్లీ ప్రార్ధనలకు హాజరైన వారేనని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, కర్ణాటక ఢిల్లీ, కాశ్మీర్‌, అండమాన్‌ దీవులతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఈ సమావేశాల్లో పొల్గొని సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్లారు. వీరిలో అనేకమంది తాజాగా కరోనా పాజిటివ్‌ గా తేలుతున్నారు. దీంతో వీరికోసం దేశంలోని అన్ని రాష్ట్రాలు వీరి కోసం గాలింపు చర్యలు ప్రారంభించాయి.

ఆంధ్రప్రదేశ్‌ నుండి ఈ ప్రార్థనలకు 369 మంది హాజరైనట్లు అధికారులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. వీరిలో 256 మందికి పరీక్షలు నిర్వహించగా మంగళవారం ఒక్క రోజే 21 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 44కి చేరాయి. అత్య ధికంగా ప్రకాశం జిల్లాల్లో 11, విశాఖలో 10, గుంటూరులో 9 కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీలో ప్రార్థనలకు హాజరైన వారు, వారితో సన్నిహితంగా ఉన్న వారు స్వఛ్చందంగా ముందుకు వచ్చి వైద్యపరీక్షలు నిర్వహించుకోవాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. భయపడాల్సిన అవసరం లేదని సకాలంలో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యపరిస్థితి మెరుగుపడుతుందని ఆయన అన్నారు.

తెలంగాణలో కూడా మంగళవారం 15 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరందరూ ఢిల్లీ ప్రార్ధనలకు వెళ్లి వచ్చినవారే కావడం గమనార్హం. దీంతో తెలంగాణలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 97కు చేరింది.

తమి

మోడీ ప్రభుత్వం పై విమర్శల్లో నిజమెంత?

లాక్ డౌన్ ప్రకటించి 7 రోజులు గడిచింది. అంటే మూడు వారాల్లో ఒక వారం అయ్యింది. మోడీ ఇచ్చిన పిలుపు కి దేశ ప్రజలు బాగా స్పందించారని చెప్పాలి. 130 కోట్ల మంది ప్రజలు ఒకే మాటమీద, బాట మీద నడవటం అంత సులువైన పనికాదు. సమస్య అటువంటిది. ఇంట్లో నుంచి కదిలితే ప్రాణానికి ముప్పొస్తుందనే విషయం అందరికీ అర్ధమయ్యే రీతిలో చెప్పటం లో మోడీ కృతకృత్యుడయ్యాడని చెప్పొచ్చు. ఇది మనమే కాదు ప్రపంచం మొత్తం చూసింది. అమెరికా, ఇటలీ , స్పెయిన్ , ఫ్రాన్స్ మిగతా ప్రజాస్వామ్య దేశాలతో పోలిస్తే భారత్ అమలుచేసిన తీరు అద్భుతం, అమోఘం. చైనా లాగా ముందుగా దాచిపెట్టి తర్వాత కఠినంగా వ్యవహరించినా మాట్లాడలేని నిరంకుశ వ్యవస్థ మన దగ్గరలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థ లోనే పారదర్శకంగానే కఠినమైనా నచ్చచెప్పుకొని అమలుచేయాలి. ఇక్కడే యూరప్ , అమెరికా చేయలేని పని భారత్ చేసి చూపించింది. దీనికి మోడీ పై దేశ ప్రజల్లో వున్న చరిష్మా ఉపయోగపడింది. ముందుగా స్వచ్చందంగా జనతా కర్ఫ్యూ పెట్టటం తర్వాత ప్రజలూ , రాష్ట్ర ప్రభుత్వాలే దీన్ని పొడిగించాలనే కోరిక వెలిబుచ్చటం ఆ ఆవకాశాన్ని ఉపయోగించుకొని 21 రోజుల లాక్ డౌన్ ని పెట్టటం చక చకా జరిగిపోయాయి. లాక్ డౌన్ ఎందుకు అవసరమో ప్రజలకు వెలిబుచ్చిన తీరు అమితంగా ఆకట్టుకుంది. చేతులు జోడించి మీ కుటుంబ సభ్యుడిగా అభ్యర్ధిస్తున్నానని చెప్పిన పద్దతికి జనం ఫిదా అయ్యారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక వారం గడిచింది. దీనితో కొంతవరకు వైరస్ గొలుసు కట్టు ని కట్టడి చేయగలుగుతామనే ఆత్మవిశ్వాసం ప్రభుత్వంలో, ప్రజల్లో వస్తూ వుంది. అయితే మధ్యలో రెండు అపశ్రుతులు ఈ ఆత్మవిశ్వాసం పై దెబ్బతీశాయి.

ఈ వారం లో అడ్డువచ్చిన అపశ్రుతులు

ముందుగా చెప్పాల్సింది ఢిల్లీలోని వలస కార్మికుల ప్రహసనం. గత రెండు దశాబ్దాల వేగవంతమైన ఆర్థికాభివృద్ధి లో భాగంగా కార్మికుల వలసలు గణనీయంగా జరిగాయి. బాగా వెనుకబడిన తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుండి పశ్చిమ, దక్షిణ భారతానికి విరివిగా వలసలు జరిగాయి. అలాగే ఉత్తరాన ఢిల్లీ కేంద్రీకృతంగా వలసలు జరిగాయి. అందులోభాగంగానే హైదరాబాద్ లో కూడా ఏ మూల చూసినా , ఏ రంగం లో చూసినా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ , మిగతా ఉత్తరాది కార్మికులు పనిచేయటం చూస్తున్నాం. 21 రోజుల లాక్ డౌన్ ప్రకటనతో ఈ వలస కార్మికుల్లో ఆందోళన నెలకొంది. అన్నిచోట్లా ఎంతో కొంత అశాంతి చెలరేగింది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళను బుజ్జగించటం లో సఫలీకృతమయ్యాయి. కానీ ఢిల్లీ లో పెద్దఎత్తున తిరుగు వలసలు జరగటం అందరినీ ఆశ్చర్య పరిచింది. దీనికి మూలాలు ఎక్కడున్నాయనే దానిలోకి వెళ్లి పరిశోధించే సందర్భం ఇది కాదు కాబట్టి ప్రస్తుతం దాన్ని అరికట్టటం పైనే అందరి దృష్టీ వుంది. దాదాపు ఈ వారం అంతా జరిగిన ఈ ప్రహసనం లో “సామాజిక దూరం” అనే పవిత్రకార్యం దెబ్బతింది. వేలమంది ఒకచోట గుమికూడటం తో ఈ వైరస్ ఎంతమేర విస్తరించిందో కొన్ని రోజులు పోతే గానీ అర్ధం కాదు. దీనితోనే అందరూ 21 రోజుల లక్ష్యం ఎంతమేరకు గండిపడిందనే ఆలోచనతో ఉద్విగ్నంగా ఉంటే నిన్న బయటపడ్డ సంఘటన మరింత ఆందోళన కి గురిచేస్తుంది.

ఢిల్లీ లోని మర్కాజ్ మసీదు లో జరిగిన తబ్లీఘి జమాత్ సభల సందర్భంగా జరిగిన ఉల్లంఘనలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. అయోధ్య రామనవమి ఉత్సవాలు, తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలు లాంటి కార్యక్రమాలు రద్దు చేయటం ఆలస్యమైనప్పుడు ఒకింత ఆందోళనతో మా సంపాదకీయాల్లో వాటిని వెంటనే రద్దు చేయాలని కోరటం జరిగింది. లాక్ డౌన్ ప్రకటించిన రాత్రి షహీన్ బాగ్ ప్రదర్శనలకు శుభం పలకటం తో హమ్మయ్య అని దేశమంతా ఊపిరి పీల్చుకుంది. ఈ నేపధ్యం లో ‘ సామాజిక దూరం’ ప్రయోగం లాక్ డౌన్ తో విజయవంతమవుతుందని దానితో కరోనా మహమ్మారిని 21 రోజుల్లో తన్ని తరిమేయొచ్చని అందరూ భావించారు. మధ్యలో ఢిల్లీ వలస కార్మికుల సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించటంతో వచ్చే రెండు వారాల తర్వాత హాయిగా ఉండొచ్చని భావించిన ప్రజానీకానికి మర్కాజ్ జమాత్ ఉదంతం పెద్ద షాక్ నిచ్చింది. దీని ప్రభావం ఒక ప్రాంతం మీదో, ఒక రాష్ట్రం మీదో కాకుండా మొత్తం దేశం మీద ఉండటం తో జనంలో మళ్ళా భయం మొదలయ్యింది. మన తెలుగు రాష్ట్రాల్లోనే దీని ప్రభావం ఎంతవుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రాలో అధికార పార్టీ ఎం ఎల్ ఏ జనతా కర్ఫ్యూ రోజు రాత్రి ఇచ్చిన విందుకి వందలాది మంది హాజరవ్వటం తో ఈ వైరస్ మూలాలు ఎంత లోతుగా విస్తరించినాయోనని ఆందోళనలో వున్నారు. తెలంగాణాలో ఇప్పటికే ఆరు మంది ఈ జమాత్ కి హాజరైన వాళ్ళు చనిపోవటంతో పరిస్థితులు ఉద్విగ్నంగా మారాయి. అయినా ప్రభుత్వాల, ప్రజల పట్టుదల ముందు ఇవేమీ నిలబడవు. తాత్కాలికంగా దీనివలన అవరోధాలేర్పడినా వాళ్ళు ఎక్కడ తిరిగింది, ఎవరెవర్ని కలిసింది కనిపెట్టగలిగితే గొలుసుకట్టు ను ఛేదించిన వాళ్లమవుతాము. ఈ ప్రయత్నంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలీకృతమవుతాయని ఆశిద్దాం.

మీడియా సన్నాయి నొక్కుల వెనక ఆంతర్యమేంటి?

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు బయటపడిన కేసులను పరిశీలిస్తే కొంతమేరకు మన దేశం కర్వ్ ని వంచటం లో సఫలీకృతం అయ్యిందనే చెప్పొచ్చు. ఇది చిన్న విజయం కాదు. మిగతా అన్ని దేశాలతో పోలిస్తే వైరస్ బాధిత కేసుల సంఖ్యను అదుపు లో వుంచగలగటం ఇప్పటివరకు మనం సాధించిన గొప్ప విజయం. అయితే ఈ వారం లో జరిగిన ఈ రెండు అపశ్రుతులు వల్ల ఎంత నష్టం జరిగిందో వచ్చే వారానికి గాని మనకొక అంచనాకు రాలేము. జరిగిన డామేజ్ ని నియంత్రించగలిగేటట్లయితే ఈ యుద్ధం లో మనం సక్సెస్ అయినట్లే. లేకపోతే విలువ కట్టలేనంత దెబ్బ ని ఎదుర్కోవలసి ఉంటుంది. అదే జరిగితే మనం దీర్ఘ కాలిక లాక్ డౌన్ కి సిద్ధంగా ఉండాల్సి వుంది. ఇంత పెద్ద దేశం లో ఈ ఎదురుదెబ్బలు సహజం. ఇప్పుడు కావాల్సిందల్లా మనలో ఐక్యత. అది లేకపోతే అమెరికా లో పరిస్థితే మనకూ పునరావృతమవుతుంది. ఇప్పటివరకూ పార్టీలను పక్కన పెడితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం కలిసికట్టుగా పనిచేస్తున్నాయని చెప్పాలి. ఇది అభినందించ దగ్గ విషయం. అమెరికా లో ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా అధ్యక్షుడు గవర్నర్లు తన్నుకు చేస్తున్నారు. దానితో ప్రజలు చస్తున్నారు. వాళ్ళతో పోలిస్తే మనం చాలా విజ్ఞతతో , సంయమనం తో ముందుకెళ్తున్నామని ఘంటాపధంగా చెప్పగలం. జయహో భారత్. అయితే మధ్య మధ్య లో కొన్ని మీడియా సంస్థలూ , కాంగ్రెస్ పార్టీ చికాకు కలిగిస్తున్నాయి.

ముఖ్యంగా కొన్ని ఆన్ లైన్ వార్తా సంస్థలు తమ ఎప్పటి సహజ మోడీ వ్యతిరేక ధోరణి లోనే ఇప్పుడూ ప్రవర్తిస్తున్నాయి. ప్రపంచం మొత్తం భారత ప్రభుత్వాన్ని , మోడీ ని అభినందిస్తుంటే దాన్ని భరించలేని ఈ సంస్థలు సన్నాయి నొక్కులు నొక్కుతూనే వున్నాయి. ఇందులో ప్రధానంగా ” వైర్ , ప్రింట్, క్విన్ట్ , స్క్రోల్, క్యారవాన్ ” లాంటి సంస్థలు ముందు వరసలో వున్నాయి. ఇందులో స్వయం ప్రకటిత వామపక్ష మేధావులు, ఉదారవాదులు, హిందుత్వ వ్యతిరేకులు, మోడీ వ్యతిరేకులు తమ తమ పద్ధతుల్లో ప్రచారం చేస్తూ వుంటారు. అందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు. నిజమైన ఉదారవాదులైతే అన్ని రకాల భావాల్ని ఆహ్వానిస్తారు. కానీ చిక్కల్లా ప్రస్తుతం మనమొక యుద్ధం లో వున్నాం. ఆ యుద్ధం లో ప్రజలకి విశ్వాసం కలిగించాలి , ఆత్మవిశ్వాసం సడలకుండా ఉండేవిధంగా నిర్మాణాత్మక విమర్శలు ఉండాలి. కానీ ఈ పత్రికల వ్యాసాలు ఆ కోవలో లేవు. ఎక్కడ ప్రభుత్వానికి పేరొస్తుందోనని అసహనంతో రాస్తున్నట్లుగా వున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వ చర్యలు ప్రోత్సాహకారంగానే , ముందుచూపుతోనే ఉన్నాయనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర అంతర్జాతీయ సంస్థల అంచనా. కానీ వీళ్లకు అవేమీ కనిపించటంలేదు. వీళ్ళ వాదనల్లో పస ఎంతో ఒక్కసారి పరిశీలిద్దాం.

అంతర్జాతీయ ప్రయాణీకుల్ని మార్చ్ 22వ తేదీ కాకుండా ఎప్పుడో నిషేధించి వుండాల్సింది. నిజమే అయ్యుండొచ్చు. 22వ తేదీకి ప్రామాణికత ఏమీ లేదు. ప్రభుత్వం జనవరి 30వ తేదీ మొట్టమొదటి కరోనా వైరస్ బాధితుడిని గుర్తించినప్పటినుంచి ప్రభుత్వం ఆంతరంగిక సమావేశాలు నిర్వహిస్తూనే వుంది. స్వయంగా ప్రధానే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వచ్చాడు. అంటే ముందునుంచే ప్రభుత్వం దీని తీవ్రతని గుర్తించిందన్నమాట. ట్రంప్ లాగానో, చైనా లో లాగానో నిర్లక్ష్యంగానో, రహస్యంగానో వుండలేదు. మార్చ్ 22వ తేదీన అంతర్జాతీయ విమానాలు రద్దు చేయటానికి ముందే మెల్లి మెల్లిగా ఒక్కొక్క నిర్బంధాన్ని అమలుచేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఎప్పటికప్పుడు నిపుణులతో సమీక్ష చేసుకుంటూ నియంత్రణా చర్యలు అమలుచేసుకుంటూ వచ్చారు. మరీ ముందు తీసుకోకపోవటానికి వాళ్లకున్న కారణాలు పూర్తిగా తెలియదు. వ్యాసాలు రాసిన వాళ్ళు అధికారులతో మాట్లాడి వివరణ తీసుకొని సంతృప్తి చెందకపోతే అది వేరే విషయం. అటువంటిదేమీ ఉన్నట్లు లేదు.

ఇక రెండో ఆరోపణ: వచ్చిన అంతర్జాతీయ ప్రయాణీకులనందరినీ ప్రభుత్వ క్వారంటైన్ లోకి పంపించకపోవటం మోడీ చేసిన పెద్ద తప్పు. అంటే 15 లక్షలపైగా అంతర్జాతీయ ప్రయాణీకుల్ని ప్రభుత్వ శిబిరాల్లో ఉంచటం. ఇది ఆచరణ సాధ్యమేనా? ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమైనా చేయగలిగిందా ? ప్రపంచం మొత్తానికి ఈ వార్త ఎప్పుడు బయటకు పొక్కిందో మనకీ అప్పుడే కదా తెలిసింది. మనకు అదనపు సమయం ఎక్కడుంది? జనవరి 21వ తేదీనే ప్రపంచం మొత్తానికి తెలిసింది. ప్రభుత్వ వనరులూ , పరిమితులు, సామర్ధ్యం, అవసరం అన్నీ పరిగణన లోకి తీసుకొని వ్యూహాలు రచించుకుంటారు. అంతర్జాతీయ ప్రయాణీకులపైకూడా విమానాశ్రయాల్లో థర్మల్ పరీక్షలు జరపటం, కరోనా బాధితులు ఎక్కువున్న దేశాలపై నిషేధం విధించటం, కొన్ని దేశాలనుంచి వచ్చే వాళ్ళను విధిగా ప్రభుత్వ క్వారంటైన్ లో ఉంచటం చేస్తూ వస్తూ చివరగా మొత్తం సర్వీసుల్ని నిషేధించారు. అలాగే దేశీయంగా రైళ్లను, విమాన సర్వీసుల్ని నిషేదించారు. దాని కొనసాగింపుగా లాక్ డౌన్ ప్రకటించారు. వున్న పరిమితుల్లో భారత ప్రభుత్వ చర్యలు వైరస్ గొలుసు కట్టు ను బద్దలుకొట్టటానికి ఉపకరించాయనేది ప్రపంచ సంస్థల అభిప్రాయం.
మూడోది: ఎక్కువమందికి టెస్టులు చేయలేదనేది. దీనిపై ఆరోగ్యశాఖ ఎన్నోసార్లు వివరణ ఇచ్చింది. ఇంతవరకు ” సమూహ విస్తరణ ” జరగలేదనేది వాళ్ళ అభిప్రాయం. కాబట్టి రోగ లక్షణాలు కనబడకుండా రెండో దశలో అవసరం లేదనేది వాళ్ళ అభిప్రాయం. దాన్ని ఇప్పుడు విస్తరించారు. శ్వాస కోశ సంబంధిత బాధితులందరికీ పరీక్షలను విస్తరించారు. అయితే పైన చెప్పిన అపశ్రుతులు జరిగిన నేపథ్యంలో టెస్టింగ్ ని ఇంకా విస్తరిస్తారేమో చూడాలి.
నాలుగోది: ఆరోగ్య సిబ్బందికి కావాల్సిన వ్యక్తిగత రక్షణాత్మక వస్తువులు సరిపడా స్థాయిలో లేవనేది. దీనిలో కొంత వాస్తవమున్నా ప్రపంచం మొత్తం ఈ సమస్యను ఎదుర్కొంటుంది. మనకు దిగుమతిచేసుకుందామనుకున్నా ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా. ఇప్పటివరకు మనం ప్రమాదకర పరిస్థితుల్లో లేము. ఈ సమస్యను అధిగమిస్తామని నమ్మకముంది. భారతీయ కంపెనీలు వెంటిలేటర్ల తయారీని చేపట్టాయి. దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తాయని ఆశిద్దాం.

ఈ ఆరోపణలు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి, దాని పరిష్కారానికి ఉపయోగపడితే మంచిదే. కానీ చెప్పే వ్యక్తులు ఎవరూ అనేది కూడా ముఖ్యమే. ఇందులో ఎవరో ఒకరిద్దరు తప్పిస్తే ఎక్కువమంది మోడీ గుడ్డి వ్యతిరేకతతో పని చేస్తున్న వారే. అటువంటప్పుడు వీరి లక్ష్యాలు సరైనవేనని చెప్పటం కష్టమవుతుంది.

కాంగ్రెస్ నాయకుల నిర్వాకం వెగటు పుట్టిస్తుంది

రాహుల్ గాంధీ ఎప్పటిలాగే అనవసర వివాదాల్లోకి చొరబడుతుండటం జాలి వేస్తుంది. రామాయణం సీరియల్ తిరిగి ప్రసారం చేస్తామంటే దాన్ని వ్యతిరేకించటం తన అపరిపక్వతని తెలియజేస్తుంది. ఆ ప్రకటన తో మెజారిటీ హిందువుల్లో వ్యతిరేకతని కొనితెచ్చుకున్నట్లయ్యింది. ఆ ప్రకటన ఈ సందర్భం లో అవసరమా? అంతటితో ఆగకుండా కాంగ్రెస్ నాయకులందరూ ప్రధానమంత్రి నిధి కోసం కొత్తగా పెట్టిన ఖాతా పై విమర్శించటం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. ఏదో సాంకేతికత అంశాల్ని పట్టుకొని అదేదో మోడీ స్వంతానికి వసూలు చేస్తున్నట్లు మాట్లాడటం ఈ సమయం లో రోత పుట్టిస్తుంది. ఇటువంటి చర్యలు చూసిన తర్వాత కాంగ్రెస్ చరిత్ర నుంచి పాఠాలు నేర్వక పోవటం చూస్తుంటే తన భవిష్యత్తుని తానే నాశనం చేసుకుంటుందని అనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ సమయం లో నోరు మెదపక పోతేనే ప్రజలు హర్షిస్తారు. ముందు ఈ లోపల వాళ్ళ అంతర్గత సమస్యల్ని పరిష్కరించుకుంటే మంచిది.

భారత్ నిరక్షరాస్యులు ఎక్కువగా వున్న దేశం కావొచ్చు. పేదరికం ఎక్కువ వున్న దేశం కావొచ్చు. రక రకాల సంస్కృతులు, భాషలు కల దేశం కావొచ్చు. కానీ సమస్యలొచ్చినప్పుడు అందరూ ఒక్కటే అనే భావన బలంగా వున్న దేశం కూడా. ఇంత పెద్ద దేశం మలేరియా ని రూపుమాపింది. ఇంత జనాభా వున్న దేశం పోలియో ని సమూలంగా నిర్మూలించగలిగింది. అదే స్పూర్తితో కరోనా వైరస్ ని కూడా తరిమి తరిమి కొట్టటంలో కూడా విజయం సాధిస్తుందని గట్టిగా నమ్ముదాం. ప్రభుత్వాలు తీసుకొనే కార్యక్రమంలో మనందరం భుజం భుజం కలిపి సహకరిద్దాం. విజయం సాధిద్దాం.

ఒక్కరోజులోనే 227 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలోనూ కరోనా(కోవిడ్-19) కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఇవాళ ఒక్కరోజు దేశంలో 227కేసులు పాజిటివ్ కేసులు నమోదవడంతో భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం మరింత కఠిన నిర్ణయాలు చేసేందుకు సిద్ధమవుతుంది.

దేశంలో ఇప్పటికే 1,410కరోనా పాజిటివ్ కేసులు నమోదుగా 40మంది మృత్యువాత పడ్డారు. కేవలం 24గంటల వ్యవధిలోనే దేశంలో 227కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు కావడం గమనార్హం. దేశంలో కరోనాను నిర్ధారించడానికి 123పరీక్షా కేంద్రాలు పని చేస్తున్నాయని ఇప్పటివరకు 40వేల మందికి పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాను నియంత్రించడానికి ఎయిమ్స్ వైద్య బృందం తో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపింది.

ముందు జాగ్రత్తగా 15వేల మంది నర్సులకు ఆన్ లైన్లో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొంది. కరోనా నివారణకు అవసరమైన అన్ని పరిరకాలను దక్షిణ కొరియా, వియత్నాం, టర్కీ నుంచి తెప్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆయా రాష్ట్రాలు కూడా కరోనా నివారణకు సహకారం అందించడంపై కేంద్రం ప్రశంసించింది. ఇప్పటివరకు తెలంగాణలో 77 కరోనా పాజిటివ్ కేసులు నమోదుగా ఆరుగురు మృతిచెందారు. ఏపీలో 40కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలు కట్టడికి శాయశక్తుల కృషి చేస్తున్న కరోనా కేసులు పెరగకుండా నిరోధించలేకపోతున్నారు. మున్మందు కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆందోళనలు నెలకొన్నాయి.

వాహన యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్

దేశంలో కరోనా ఎఫెక్ట్ తో కేంద్రం లాక్డౌన్ చేపట్టింది. 21రోజులపాటు లాక్డౌన్ అమలుతో రవాణా వ్యవస్థ స్తంభించింది. వ్యాపార, వాణిజ్యం అన్ని బంద్ అవడంతో ప్రతీఒక్కరు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్ కారణంగా లైసెన్సులు, పర్మిట్లు, ఇతర రవాణా పత్రాలను రెన్యువల్ చేయించుకోవడంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ ఇతర రవాణా పత్రాల కాలపరిమితిని జూన్ 30 వరకూ కేంద్రం పొడిగిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా నిత్యావసర సరుకులు రవాణా చేస్తున్న వాహనదారులు సంబంధిత పత్రాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. వీరిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని పలువురు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఫిబ్రవరి 1, 2020నాటికి గడువు ముగిసిన పత్రాలను జూన్ 30, 2020వరకు చెల్లుబాటయ్యేలా చూడాలని కేంద్రం ఈమేరకు ఎన్ ఫోర్స్ మెంట్ శాఖకు సూచించింది. ఇందుకు సంబంధించి ఆన్ లైన్లో ఎన్ఐసీ ఇస్తుంది. కేంద్రం నిర్ణయం వల్ల 23కోట్ల మంది వాహన యజమానులు, 1.2కోట్ల వాహనాలకు ఊరట లభించనుందని సమాచారం.

మారువేషంలో జేసీ.. అవాక్కైన వ్యాపారులు

సినిమాల్లోనే ఇప్పటి వరకూ మోసాలను వెలుగులోకి తెచ్చేందుకు అధికారులు మారు వేషం వెయ్యడాన్ని చూశాం. కానీ ఇప్పుడు నిజ జీవితంలోనూ అలాంటి అధికారులు కనిపిస్తున్నారు. విజయనగరానికి చెందిన జాయింట్ కలెక్టర్.. మారు వేషంలో కూరగాయల మార్కెట్లను తనిఖీ చేశారు. జిల్లాలో లాక్‌డౌన్, 144 సెక్షన్ కారణంగా నిత్యావసర వస్తువులు, కొరగాయలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాకుండా అధిక ధరలకు అమ్ముతున్నారని ఫిర్యాదులు రావటంతో.. జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్.. దీనిపై దృష్టి సారించారు. మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు కూరగాయల మార్కెట్‌లలో సామాన్య వ్యక్తిలా మారువేషంలో వెళ్లి ధరలను తెలుసుకున్నారు. ఇతర కొనుగోలు దారుల నుంచి ధరలకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల రూ.5 ఎక్కువ అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో ఎక్కడ తప్పు జరుగుతోందో అధికారులతో సమావేశమై ధరలు నియంత్రణ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మారువేషంలో వచ్చింది జాయింట్ కలెక్టర్ అని తెలుసుకొని కొంత మంది వ్యాపారులు అవాక్కయ్యారు.

బూతులు తిట్టేందుకే నానిని మంత్రిగా పెట్టుకున్నారా ?

బూతులు తిట్టేందుకే కొడాలి నానిని మంత్రిగా పెట్టుకున్నారా అనే విషయంపై సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడిలోని కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మాట్లాడుతూ, బాధ్యతలు మరచి సంస్కార హీనులుగా అసహనంతో పశువులు కూడా మాట్లాడని బాష ముఖ్యమంత్రి జగన్ కేబినేట్ లోని మంత్రులు మాట్లాడుతున్నారని, మంత్రి కొడాలి నానిని వెంటనే కేబినేట్ నుండి బర్తరఫ్ చేయాలని దేవినేని ఉమా డిమాండ్ చేసారు. రైతు వద్ద బస్తా ధాన్యం రూ.900లకే దళారీలు దోపిడి చేస్తుంటే, సీఎం జగన్ మంత్రి కొడాలి నాని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ధాన్యం ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయటం లేదో ప్రజలకు సమాధానం చెప్పకపోతే పంటలు పండించిన రైతులే తగిన బుద్ధి చెప్తారన్నారు. సంచులు లేక బియ్యాన్ని పంపిణీ చేయలేకపోతున్నామని మంత్రులు చెప్పటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. కొడాలి నాని.. చంద్రబాబు వద్ద చేతులు కట్టుకుని, కంచికచర్ల నా కార్యాలయంలో ఎన్నిసార్లు వచ్చి కూర్చున్నావో మర్చిపోయావా ? అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పక్క రాష్ట్రాల్లో రెండు నెలలకు సరిపోయే విధంగా నిత్యవసరాలు అందజేస్తుంటే, ఏపీలో గంటల కొద్దీ మహిళలను, వృద్ధులను క్యూలైన్లలో నిలబెడుతున్నారని, ఆ దృశ్యాలను ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా చూపించటం తప్పెలా అవుతుదన్నారు. వాస్తవాలను చూపెడుతున్న మీడియా కోరలు పీకుతామనటం ఎంత వరకు సమంజసమన్నారు. మెట్ట ప్రాంతాల్లో మల్లె రైతులు నష్టపోతున్నారని, వారిని ఏ విధంగా ఆదుకుంటారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. వేలకోట్లు వాలంటీర్లకు జీతాలు చెల్లిస్తూ, ఈ రోజు ఈ సంక్షోభ పరిస్థితుల్లో ఎందుకు వైఫల్యం చెందుతున్నామోనని, వాలంటీర్ల వ్యవస్థ పనితీరు పట్ల ప్రజల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నరాని తెలిపారు. విజయసాయి రెడ్డి చాలా బాధ్యతరాహిత్యంగా ట్వీట్లు పెడుతుంటే, సీఎం జగన్ తాడేపల్లి రాజప్రసాదం పబ్జీ గేమ్ లు ఆడుకుంటూ పరిపాలన పట్ల బాధ్యత రహితంగా వ్యవహిరిస్తున్నారని, ఢిల్లీకి ఏ జిల్లా నుండి ఎంత మంది వెళ్లారో ఇప్పటి వరకు ప్రభుత్వం వివరాలు చెప్పలేకపోయిందని దేవినేని ఉమా ఆవేదిక వ్యక్తం చేసారు.

కరోనాపై పోరుకు క్రీడాకారుల విరాళాలు

దేశంలో కరోనా మహమ్మరిని ఎదుర్కొనేందుకు పలువురు సెలబ్రెటీలు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. క్రికెటర్లు, బ్మాడ్మింటన్, ఫుల్ బాల్, టెన్నిస్, అథ్లెటిక్స్ తదితర క్రీడాకారులు కరోనా పోరుకు సిద్ధమవుతున్నారు. తమవంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలను ప్రకటిస్తూ అండగా నిలుస్తున్నారు. సినీ స్టార్లకు తోడుగా క్రీడాకారులు విరాళాలు ప్రకటిస్తుండటంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా(కోవిడ్-19)వైరస్ కట్టడికి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సాయమందించేందుకు ముందుకొచ్చింది. దేశంలో లాక్డౌన్ కారణంగా తినడానికి తిండి లేకుండా రోడ్డునపడ్డ వారి కోసం ఏమన్న చేయాలన్న తపనతో కొందరం కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి రూ.1.25కోట్లను విరాళంలో సేకరించినట్లు తెలిపారు. యూత్ఫీడ్ ఇండియా సఫా ఇండియా ఇందులో భాగస్వామ్యమయ్యాయని పేర్కొన్నారు. రూ.1.25కోట్ల విరాళాలతో అన్నార్థులకు సాయం చేయనున్నట్లు సానియా సోమవారం తన ట్విటర్లో పేర్కొన్నారు.

ఇండియన్ క్రికెట్ రోహిత్ శర్మ 80లక్షల విరాళాలను ప్రకటించారు. పీఎం కేర్ ఫండ్స్‌కు రూ.45లక్షలు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25లక్షలు, ఫీడింగ్ ఇండియాకు రూ.5 లక్షలు, వీధి శునకాల సంక్షేమ నిధికి రూ.5 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు ట్వీటర్లో పేర్కొన్నారు. అలాగే మహిళా క్రీడాకారులు మిథాలీ రాజ్ రూ. 10లక్షలు, స్పిన్నర్ పూనం యాదవ్ రూ. 2లక్షలు, ఎంపీ మేరీకోమ్ తన నెల జీతం, దీప్తి శర్మ రూ. 1.5లక్షలు, షూటర్ మనుబాకర్ లక్ష రూపాయలు, స్ప్రింటర్ హిమదాస్ తన నెల జీతం విరాళాలను తాజాగా ప్రకటించారు. గతంలోనూ కొందరు క్రీడాకారులను విరాళాలను ప్రకటించారు. కరోనాపై పోరాటానికి క్రీడాకారులు ముందుకొస్తుండటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.