Homeఎంటర్టైన్మెంట్చిన్న ఎన్టీఆర్ తో చిన్న శ్రీదేవి

చిన్న ఎన్టీఆర్ తో చిన్న శ్రీదేవి

ఒకప్పుడు పెద్ద ఎన్ టి ఆర్ , శ్రీదేవి ల జోడికి విపరీతమైన క్రేజ్ ఉండేది. వాళ్లిద్దరూ కలిసి నటించిన వేటగాడు , కొండవీటి సింహం , సర్దార్ పాపారాయుడు , బొబ్బిలి సింహం వంటి చిత్రాలు తెలుగు సినీ చరిత్రలో తిరుగులేని విజయాలు నమోదు చేశాయి. మళ్ళీ ఇన్నాళ్లకు వాళ్ళ వారసులు కలిసి నటించే సమయం రాబోతుంది. దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ “ధఢక్ ” చిత్రం తో తెరంగేట్రం చేసి సూపర్ […]

ఒకప్పుడు పెద్ద ఎన్ టి ఆర్ , శ్రీదేవి ల జోడికి విపరీతమైన క్రేజ్ ఉండేది. వాళ్లిద్దరూ కలిసి నటించిన వేటగాడు , కొండవీటి సింహం , సర్దార్ పాపారాయుడు , బొబ్బిలి సింహం వంటి చిత్రాలు తెలుగు సినీ చరిత్రలో తిరుగులేని విజయాలు నమోదు చేశాయి. మళ్ళీ ఇన్నాళ్లకు వాళ్ళ వారసులు కలిసి నటించే సమయం రాబోతుంది.

దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ “ధఢక్ ” చిత్రం తో తెరంగేట్రం చేసి సూపర్ సక్సెస్ అందుకొంది. నటించింది ఒకటి రెండు హిందీ సినిమాలే. అయినా బాలీవుడ్ లో జాన్వీ కపూర్ కున్న క్రేజ్ పీక్స్ అని చెప్పాలి. దేశ వ్యాప్తంగా సత్తాచాటిన శ్రీదేవి కుమార్తె కావడంతో ఆమెను తెలుగులో నటింపజేయాలని చాలామంది తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో అనేక ఆఫర్స్ జాన్వీ కపూర్ వద్దకు వెళ్లినా తిరస్కరించింది. కాగా మరో భారీ ఆఫర్ జాన్వీ వద్దకు వెళ్ళింది .

ఆర్ ఆర్ ఆర్ మూవీ తరవాత ఎన్టీఆర్ చేస్తున్న 30వ చిత్రం ఇపుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతిలో పడింది. కాగా ఈ చిత్రం లో ఎన్టీఆర్ కి జంటగా జాన్వి కపూర్ ని తీసుకోవాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ పెట్టుబడు తున్నాడట …

ఎన్టీఆర్ తో తాను చేయబోయే రెండో చిత్రం పాన్ ఇండియా మూవీ గా మార్చాలని భావిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ అందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ అయితే మంచి అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నాడట కాకపొతే ప్రస్తుతం మూడు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న జాన్వీ కపూర్ కాల్షీట్స్ ఎడ్జస్ట్ అవుతాయో లేదో అని చిన్న డౌట్ మాత్రం ఉంది . . craze comes out of combination
Also Read: కరోనా.. నాలో మార్పు తీసుకు వచ్చిందంటున్న బ్యూటీ

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper