
ప్రముఖ కొరియాగ్రాఫర్ ప్రభుదేవా సైకోగా మారనున్నారు. దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైకో థిల్లర్ మూవీలో ప్రభుదేవా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో ప్రభుదేవా సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు ఖరారు కాగా మిగతా ముగ్గురి హీరోయిన్ల వేటలో చిత్రబృందం పడింది. తొలిసారి ప్రభుదేవా సైకో పాత్రలో నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సినీరంగంలోకి కొరియాగ్రాఫర్ గా ప్రభుదేవా అడుగుపెట్టారు. ప్రపంచంలోని ప్రముఖ డాన్సర్ మైకేల్ జాక్సన్ తర్వాత ఆ స్థాయిలో ఇండియన్ మైకేల్ జాక్సన్ గా ప్రభుదేవా గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆ తర్వాత దర్శకుడిగా మారి బాలీవుడ్లో బాక్సాఫీస్ హిట్టందుకున్నాడు. తెలుగులో హిట్టయిన ‘నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా’ మూవీని హిందీలో తెరకెక్కించి హిట్టందుకున్నాడు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తదితర హీరోలతో సినిమాలు తెరకెక్కించి బాక్సాఫీస్ విజయాలు అందుకున్నాడు.
కొరియోగ్రాఫర్, దర్శకుడిగా కొనసాగుతూనే ప్రభుదేవా హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుదేవా చేతిలో మూడు సినిమాలున్నాయి. ఎప్పుడూ కామెడీ, సెంటిమెట్ పాత్రలో కన్పించే ప్రభుదేవా తొలిసారి సైకో పాత్రలో నటిస్తుండటం ఆసక్తిని రేపుతోంది. ‘భగీర‘ మూవీలో ప్రభుదేవా సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. అమైరా దస్తూర్, గాయత్రిలను ‘భగీర’ మూవీ కోసం ఇప్పటికే ఎంపిక చేశారు. మరో ముగ్గురు హీరోయిన్ల పేర్లు త్వరలో వెల్లడించనున్నారు. ప్రభుదేవా సైకోగా మారి ఐదుగురి హీరోయిన్లతో రోమాన్స్ కు రెడీ అవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.